Home » » Ghani Pre Release Event Held Grandly

Ghani Pre Release Event Held Grandly

 "గ‌ని" చిత్రాన్ని ప్రేమించి ప్రాణం పెట్టి చేశాము

-- ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ లో మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు, ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఏప్రిల్ 2న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు.


మెగాప్రిన్స్‌ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ' ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ముఖ్య అతిథులందరికీ థాంక్స్. ద‌ర్శ‌కుడు కిర‌ణ్ నాతో 4 ఇయ‌ర్స్ నుండి ట్రావెల్ అయ్యాడు. ఈరోజు గ‌ని సినిమా చూసిని త‌రువాత నా న‌మ్మాకం నిజ‌మయ్యింద‌ని న‌మ్ముతున్నాను. కిర‌ణ్ బాగా చేశాడు. నేను నిజంగా క‌రెక్ట్ ఛాయిస్ తీసుకున్నాను. కిర‌ణ్ కి చాలా మంచ‌యి ఫ్యూచ‌ర్ వుంటుంది. జార్జ్ కెమెరామెన్ చాలా బాగా చేశాడు. ర‌వింద‌ర్ ఆర్ట్‌, అబ్బూరి ర‌వి గారు మాట‌లు ఇలా అన్ని డిపార్ట్‌మెంట్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. ఈ సినిమా లో ప‌నిచేసిన ప్ర‌తిఒక్క‌రు నేను ఎంత ప్రాణం పెట్టి చేశానొ అదేవిధంగా ప్రేమించి చేశారు. నిర్మాత‌లు సిద్దు, బాబి ఇద్ద‌రూ సినిమా అంటే పిచ్చి ఇలాంటి ప్రోడ్యూస‌ర్స్ ఇండ‌స్ట్రిలొ వుండాలి అందుకే వీళ్ళ‌కి సినిమా చేశాను. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ప్రోడ్యూస‌ర్ పెట్ట‌నంత బ‌డ్జెట్ ఈ సినిమా కొసం పెట్టారు. వాళ్ళ మ‌నీ పైసాతో స‌హ వెన‌క్కి వ‌చ్చే సినిమా మా గ‌ని.. సాయి మంజ్రేక‌ర్ చాలా క్యూట్ గా వుంటుంది. న‌వీన్ చంద్ర , ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌రేష్ గారు, జ‌గ‌ప‌తిబాబు గారు అంద‌రూ చాలా బాగా చేశారు. అస‌లు గని సినిమా కోసం కరోనా సమయంలో కూడా మూడు సంవత్సరాలకు పైగా కష్టపడి ఈ సినిమా చేశాము. కచ్చితంగా ఇది మనల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను. తెలుగులో అన్ని రకాల సినిమాలు వస్తున్నాయి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఎందుకు రావడం లేదని.. అప్పుడు కళ్యాణ్ గారు తమ్ముడు సినిమా చేశారు. ఆ రోజు సినిమా చేశారు కాబట్టే ఈ రోజు గని వచ్చింది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. వినాయక్, హరీష్ శంకర్ ఇలాంటి పెద్ద దర్శకులతో పనిచేసాడు. ఆ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అని సినిమా చేసిన తర్వాత నాకు అర్థం అయింది. రేపు విడుదల అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాను దాని కోసం చరణ్ అన్న ఒక ట్రైనర్ ని ఇచ్చారు. బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. రేపొద్దున సినిమా చూస్తున్నపుడు ఎవరికీ ఫేక్ గా కనిపించకూడదు అని ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత సినిమా మొదలు పెట్టాను. నిర్మాతలు అల్లు బాబి, సిద్దు ముద్ద సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఖర్చుకు వెనకాడకుండా సినిమాని నిర్మించారు. ఇందులో పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ థాంక్స్. అలాగే ఉపేంద్ర గారు, సునీల్ శెట్టి గారు, జగపతి బాబు గారు, నదియా గారి ఇలాంటి సీనియర్లతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా మళ్లీ అలరిస్తుందని నమ్ముతున్నాను..' అని తెలిపారు.


Share this article :