Home » » Tremendous Response for 18Pages Anupama Parameswaran First Look

Tremendous Response for 18Pages Anupama Parameswaran First Look

 అనుపమ పరమేశ్వరన్ పుట్టిన రోజు సందర్భంగా ‘18 పేజెస్’ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్‌కు అనూహ్య స్పందన.. 



వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పెజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా వస్తుంది. కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇందులో నందిని పాత్రలో నటిస్తున్నారు ఈమె. ఇప్పటికే విడుదలైన అనుపమ పరమేశ్వరన్ కారెక్టర్ మోషన్ పోస్టర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఒక అందమైన అడవి.. పచ్చని చెట్లు.. ప్రశాంతమైన వాతావరణం.. అందులో నుంచి ఒక సీతాకోకచిలుక ఎగురుకుంటూ వచ్చి.. అనుపమ పరమేశ్వరన్ చేతిపై వాలుతుంది. అలా ఆమె నందిని పాత్రను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. ఏ వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్. త్వరలోనే థియేటర్స్ లో సినిమా విడుదల కానుంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనున్నారు.


నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు


టెక్నికల్ టీం: 

దర్శకుడు: పల్నాటి సూర్య ప్రతాప్

కథ, స్క్రీన్ ప్లే: సుకుమార్

నిర్మాతలు: బన్నీ వాసు, సుకుమార్

సమర్పణ: అల్లు అరవింద్

నిర్మాణ సంస్థలు: గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్

సినిమాటోగ్రఫర్: ఏ వసంత్

ఎడిటర్: నవీన్ నూలి

సంగీతం: గోపీ సుందర్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, , మేఘ శ్యామ్, మడూరిమధు


Share this article :