Latest Post

Jetti movie Lyrical Song Launched by Lyricist Chandrabose

 *గీత రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా "జెట్టి" సినిమాలోని 'గంగమ్మ గంగమ్మ మాయమ్మ..' లిరికల్ సాంగ్ విడుదల*



నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "జెట్టి". తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించిన "జెట్టి" సినిమాలోని ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు చిత్ర బృందం.


తాజాగా ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా "జెట్టి" సినిమా నుంచి 'గంగమ్మ గంగమ్మ మాయమ్మ..' అనే పాట లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. *చంద్రబోస్ రాసిన ఈ పాట ఎలా ఉందో చూస్తే.....గంగమ్మ గంగమ్మ మాయమ్మ...మమ్ము సల్లంగ సూడాలమ్మా.. సుడి గుండాలు, గండాలు రాకుండా సెయ్యమ్మా...ఆటుపోటుల్లోనే ఆటుపోటుల్లోనే ఆట పాటలంట హైలెస్స...అలల కౌగిట్లోనే అలల కౌగిట్లోనే అలుపు తీరెనంట హైలెస్స...ఉప్పొంగి పోయేటి ఉప్పెనలో మేము ఊయలూగేమంట హైలెస్సో, ఉబికి వచ్చె మా సెమటనీటి తోటి ఉప్పు నీరు ఇంకా ఇంకా ఉప్పయిందట...గంగమ్మ గంగమ్మ మాయమ్మ...మమ్ము సల్లంగ సూడాలమ్మా*..అని సాగుతుంది. ఈ పాటను కార్తీక్ కొడకండ్ల మ్యూజిక్ కంపోజిషన్ లో అనురాగ్ కులకర్ణి ఆలపించారు. గంగపుత్రుల జీవన విధానాన్ని, గంగమ్మ తల్లి ఆదరణకు సజీవ శిల్పమీ పాట.


*ఈ సందర్భంగా గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ*...ఇటీవల పుష్ప సినిమాలో అడవి మీద పాట రాశాను. ఇప్పుడు "జెట్టి" మూవీలో సముద్రం గురించి, గంగపుత్రుల జీవితం గురించి 'గంగమ్మ గంగమ్మ మాయమ్మ...' అనే పాట రాశాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకుడికి కృతజ్ఞతలు. చాలా చక్కటి పాట ఇది. సముద్ర ఘోష ఈ పాటలో వినిపించేలా కంపోజిషన్ చేశారు సంగీత దర్శకుడు కార్తీక్. గీత రచయితగా ఈ పాట రాయడం నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. అనురాగ్ కులకర్ణి అంతే చక్కగా పాడాడు. త్వరలో విడుదల కానున్న "జెట్టి" సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.


ఓ మత్య్సకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని "జెట్టి" సినిమాను తెరకెక్కించారు. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటి వరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను తెరమీద హృద్యంగా తీసుకురాబోతున్నాడు దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక. 


*నటీ నటులు* : నందిత శ్వేత‌, కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి,  ఎమ్ య‌స్ చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ షెట్టి తదితరులు


*సాంకేతిక నిపుణులు* : బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్, మ్యూజిక్ :  కార్తిక్ కొండ‌కండ్ల‌, డిఓపి:  వీర‌మ‌ణి, ఆర్ట్ ః ఉపేంద్ర రెడ్డి, ఎడిటర్:  శ్రీనివాస్ తోట‌, స్టంట్స్: దేవరాజ్ నునె, కోరియోగ్రాఫర్ : అనీష్, పబ్లిసిటీ డిజైనర్:  సుధీర్, డైలాగ్స్ ః శ‌శిధ‌ర్, పిఆర్ ఓ : జియస్ కె మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః పండ్రాజు శంక‌ర్రావు , నిర్మాత ః వేణు మాధ‌వ్,  క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ ః సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక.

Tuck Jagadish Trailer Launched

 టక్ జగదీష్ మన ఇంటి సినిమా.. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి :  నేచుర‌ల్ స్టార్ నాని



నేచురల్ స్టార్ నాని  హీరోగా నటించిన 'టక్ జగదీష్' చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్‌ను విడుద‌ల‌చేశారు. ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో నాని, రీతూ వ‌ర్మ‌, శివ నిర్వాణ, ప్రవీణ్, తిరువీర్, సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది పాల్గొన్నారు.


నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ - ``ఫ్యామిలీ ఎమోషన్సే శివ నిర్వాణ బలం. నిన్నుకోరి, మజిలి సినిమాలను చూస్తే ఆ విషయం తెలుస్తుంది. ఆ రెండు సినిమాల్లో ఇద్దరి ముగ్గురు మధ్యే ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం చాలా మంది మధ్య ఎమోషన్స్ చూపించేశారు. ఇప్పటికే చాలా మందికి ట్రైలర్ చూపించాం. అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. అదే శివ నిర్వాణ బలం. అలా ఏడిపిస్తామని కాదు.. అందరిలోనూ ఆనంద భాష్పాలు వస్తాయి. థియేటర్లో కాకుండా సినిమాను ఓటీటీ విడుదల చేయడంపై కొంత మంది కొన్ని రకాల కామెంట్లు చేశారు. వారంతా నాకంటే పెద్దవాళ్లు. వారున్న పరిస్థితుల్లో అలా మాట్లాడటంలో తప్పు లేదు. ఆ కాసేపు వాళ్లు నన్ను బయటి వాడిలా చేసేశారు. అదే నాకు బాధ. నేను వారి బాధను అర్థం చేసుకుంటాను. టక్ జగదీష్‌లో అన్నదమ్ముల రిలేషన్ మధ్య ఉండే ఆ కాంప్లెక్సిటీని దర్శకుడు  మొదటగా చెప్పాడు. కథ చెప్పినప్పుడు నచ్చిన పాయింట్ అదే. రిలేషన్ షిప్‌లో ఉన్న కాంప్లెక్సిటీని మనం ఈ మధ్య మిస్ అవుతున్నాం. శివ నిర్వాణ తాను నిజ జీవితంలో చూసిన పాత్రలన్నీ కూడా ఇందులో పెట్టేశారు. అందుకే ట్రైలర్ ఇంత యూనిక్‌గా ఉంది. సినిమా కూడా అలానే ఉంది. తెలుగు తెరపై అన్నదమ్ముల మధ్య వచ్చే గొడవలు, రిలేషన్స్ హ్యాండిల్ చేసి చాలా రోజులైంది. చిన్నతనంలో మనం చూసిన సినిమాలెన్నో ఉన్నాయి. కానీ గత కొన్నేళ్లుగా వాటిని మనం చూడలేదు. ఇదేమీ కొత్త సినిమా, ట్విస్ట్‌‌లు, కాన్సెప్ట్‌‌లు ఉండవు. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సినిమానే. మళ్లీ మన పాత రోజుల్లోకి తీసుకెళ్లేలా ఉంటుంది. ఏదైనా సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది.. కానీ మన ఇంట్లో మాత్రం అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. టక్ జగదీష్ కూడా మన ఇంటి సినిమా. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి.


నిన్నుకోరితో ఇది వరకే శివ నిర్వాణతో కలిసి పని చేశాను. రీతూ వర్మతో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కలిసి చేశాను. ప్రవీణ్ అయితే నా కెరీర్ ప్రారంభం నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నాం. సినిమాలు చేయకపోయినా కూడా టచ్‌లోనే ఉంటారు. తిరువూర్ అయితే అద్భుతమైన నటుడు. ఇంత వరకు ఆయన నటించిన సినిమాలు చూడలేదు. ఆయన చూడటానికి ఎంతో సింపుల్, స్వీట్‌గా ఉన్నారు. కానీ ఆయన పాత్ర మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన నటనను చూసి నాకు భయం వేసింది. సినిమాను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడం లేదనే సమస్యే ఉండదు. ఒక్కో సినిమా ఒక్కో లెక్క ఉంటుంది.. అన్ని కోణాల్లో సినిమా గురించి ఆలోచించాలి. నిర్మాత, దర్శకులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమిది. థియేటర్లో అందరితో కలిసి చూడాలని ఎంతో అనుకున్నాను. కానీ బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నాం. బయటి పరిస్థితులు త్వరగా చక్కబడాలి. మళ్లీ ఆ పూర్వ వైభవం రావాలి. బ్రేకుల్లేకుండా ఇకపై మీ (అభిమానులు, మీడియా) అందరినీ కలుసుకోవాలని అనుకుంటున్నాను’  అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు శివనిర్వాణ మాట్లాడుతూ - ``చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. టక్ జగదీష్ కథ నానికి చెప్పినప్పటి నుంచి.. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. రెండేళ్ల శ్రమ ఇది. ఏప్రిల్ 16న విడుదల చేద్దామని అనుకున్నాం. ఆ తరువాత మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇలా అన్ని అనుకున్నాం. థియేటర్లో ఆ సీన్‌కు అలా ఉంటుంది.. ఈ సీన్‌కు విజిల్స్ పడతాయి.. ఇంటర్వెల్ ఇలా ఉంటుంది అని ఎన్నో అనుకున్నాం. థియేటర్లో సినిమా విడుదల కావడం లేదు అని తెలిసినప్పుడు బాధ కలిగింది. అది నాకు, నానికి మాత్రమే తెలుసు. సినిమాను నాని థియేటర్ డోర్ వద్ద రెండున్నర గంటలు వెయిట్ చేసి నిల్చుని చూస్తాడు. అక్కడి నుంచి అయితే అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుస్తుంది అని నాని ఎప్పుడూ కూడా తన సినిమాలను అలానే చూస్తాడు. థియేటర్లో సినిమా చూడటం నానికి అంత పిచ్చి. షైన్ స్క్రీన్‌తో రెండో సినిమా చేస్తున్నాను. నా డబ్బులే పెట్టి సినిమా తీస్తున్నాను అనేంత ఫ్రీడం నాకు ఉంటుంది. రెండేళ్లు సినిమాను తీశాం. ఐదు నెలలు రిలీజ్ కోసం వెయిట్ చేశారు నిర్మాతలు. పరిస్థితులు ఇంకా మారడం లేదు. ఇలాంటి సందర్భంలో చిన్నా పెద్దా అందరూ థియేటర్లోకి వస్తారా? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏమైనా తేడా వస్తే మా (నాని, శివ నిర్వాణ) రెమ్యూనరేషన్‌లోంచి కట్ చేసుకోమ్మని చెప్పాం. మా సినిమా అమెజాన్ ద్వారా ప్రతీ ఊర్లోకి వెళ్తోంది. వినాయక చవితి నాడు మా సినిమాను ఊర్లో వాళ్లు కూడా చూస్తారు. ఒక్కో నిర్మాత, ప్రొడక్షన్ కంపెనీ పరిస్థితులు వేరు. ఎవరికి వీలున్నట్టు వారు సినిమాలను రిలీజ్ చేస్తారు. అందరినీ ఒకే గాడిన కట్టేయకండి. వినాయకచవితి నాడు టక్ జగదీష్ అదిరిపోతుంది’ అని అన్నారు.


కమెడియన్ ప్రవీణ్  మాట్లాడుతూ - ‘ప్రభుత్వ అధికారి పాత్రలో నేను నటిస్తున్నాను. ఆ పాత్ర గురించి దర్శకుడు అన్ని క్లియర్‌గా చెప్పారు. ఆయనే ఎన్నో ఇన్ పుట్స్ ఇచ్చారు` అన్నారు.


హీరోయిన్ రీతు వ‌ర్మ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో గుమ్మ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది ‘థియేటర్లో విడుదల కావడం లేదనే బాధ నాకు కూడా ఉంది. పండుగ రోజు కుటుంబం అంతా కలిసి చూడటానికి కరెక్ట్ సినిమా`` అన్నారు


నటుడు  తిరువీర్ మాట్లాడుతూ - ``శివ నిర్వాణ టీంను చూస్తేనే పండుగలా ఉంటుంది. తెలుగు కుటుంబాలు అందరూ కూడా చూసేందుకు సరైన సినిమా’ అని  అన్నారు.

Vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Launched

 Vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Launched, Regular Shooting Commences



Action hero Vishal joins hands with director A Vinoth Kumar for a high-octane action entertainer. The film was launched with a pooja ceremony on Vishal’s birthday in a popular Sai Baba Temple in Chennai and regular shooting commenced from the very next day.


Ramana and Nandha are jointly producing the movie under Rana Productions. Sunaina is roped in to play the leading lady opposite Vishal in the Pan India project.


The makers have locked a powerful title for the film which will be revealed soon. An object that influences bringing big change in the society is the title. The movie will have the same title for all the languages.


Vishal has starred in numerous high-octane action entertainers. But this movie will have some breath-taking action sequences, much to the delight of action movie lovers. Guess what, second half of the movie will have 45 minutes of action blocks. Dhilip Subbarayan will supervise stunts.


Sam CS is the music director, while Balasubramanian cranks the camera. Pon Parthiban is the writer.


Cast: Vishal, Sunaina


Technical Crew:

Director: A Vinoth Kumar

Producers: Ramana and Nandha

Banner: Rana Productions

Writer: Pon Parthiban

Music: Sam CS

DOP: Balasubramanian

Stunt Director: Dhilip Subbarayan

Ex-Producer: Bala Gopi

PRO: Vamsi-Shekar

Heroine Rushika Raj About Aasi

 అశ్మీ సినిమా ప్రతి మహిళా గర్వ పడే సినిమా అవుతుంది -హీరోయిన్  రుషికా రాజ్, 



సాచీ క్రియేష‌న్స్ ప‌తాకం పై స్నేహా రాకేశ్ నిర్మాత‌గా, నూత‌న ద‌ర్శకుడు శేష్ కార్తీకేయ తెర‌కెక్కిస్తున్న చిత్ర అశ్మీ. పూర్తిగా వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో థ్లిల‌ర్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రుషికా రాజ్, రాజా నరేంద్ర‌, కేశ‌వ్ దీపిక లీడ్ రోల్స్ చేస్తున్నారు.

ఈ సినిమా లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసిన రుషికా రాజ్ మీడియా తో ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు, నేను ఒక కన్నడ అమ్మాయిని నేను కన్నడ లో మూడు   సినిమాలు చేసాను, తగరు అనే మూవీ నాకు మంచి పేరు తీసుకువచ్చింది,ఈ మూవీ పేరు అశ్మీ అంటేనే సంస్కృత పదం, నేను హీరోఇన్ గా చేయటానికి చాలా సంవత్సరాలు ఆగాను ఒక మంచి రోల్ చేయటానికి, అందరిలాగా చేయకూడదు చేస్తే సొసైటీ కి మంచి మెసేజీ వుండే క్యారెక్టర్ చేయాలి అనుకున్నాను, ప్రతి ఒక్క అమ్మాయి ఈ సినిమా నుంచి మెసేజ్ ఇవ్వాలి అని ఈ సినిమా చేశాను, ఈ సినిమా నేను మొదట ఒప్పుకునే అప్పుడు చాలా భయపడ్డాను ఈ సినిమా ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా భయం వేసింది, ఈ సినిమా లో మహిళలు ఈ రోజుల్లో చాలా మంది పేస్ చేస్తున్న సమస్యలు ని ఈ సినిమా  లో చూపించటం జరిగింది, ఈ పాయింట్ నేను సినిమా చేయటానికి దోహద పడ్డది, ఈ సినిమా లో యాక్టింగ్ కి చాలా స్కోప్ వున్న పాత్ర ఇది,నేను తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాను అని అందరు చెప్తున్నారు నేను తెలుగు నేర్చుకోవాటినికి రెండు సంవత్సరాలు పట్టింది, ఫస్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన డైరెక్టర్ గారు అయినా సినిమా ని ఓటిటి కోసం అని తీసి సినిమా బాగా వచ్చింది అని ఈ సినిమా ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు, ఈ సినిమా రిలీజ్ అవ్వటానికి మా పి. ఆర్.వో ఏలూరు శ్రీను గారు బాగా హెల్ప్ చేశారు, ఈ సినిమా లో ఎటువంటి అసభ్యకరమయిన సన్నివేశాలు లేవు కుటుంబం అంత  కలిసి చూడదగిన సినిమా ఇది,డైరెక్టర్ శేష్ కార్తికేయ గారు చాలా మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు,నా క్యారెక్టర్ కి ఫస్ట్ వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసి తరువాత ఆ ప్లేస్ లో నన్ను తీసుకున్నారు,ఈ సినిమా శివ,ప్రొఫిసర్, అశ్మీ మూడు క్యారెక్టర్ లు చుట్టూ తిరుగుతుంది,సినిమా లో ఒక సాంగ్ ఉంటుంది అండి శాండీ అద్దంకి మంచి మ్యూజిక్ ఇచ్చారు,ఫైనల్ గా ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ఇది ప్రస్తుతం సమాజం లో ప్రతి మహిళా పేస్ చేస్తున్న క్యారక్టర్ ప్రతి మహిళా కి మెసేజీ రీచ్ అవ్వాలి అనేదే మా ఈ ప్రయత్నం.


న‌టీన‌టులు

రుషికా రాజ్, రాజా న‌రేంద్ర‌, కేశవ్ దీప‌క్


సాంకేతిక వ‌ర్గం


బ్యాన‌ర్ - సాచీ క్రియేష‌న్స్

నిర్మాత - స్నేహా రాకేశ్

ర‌చ‌న - ద‌ర్శ‌కత్వం, సినిమాటోగ్ర‌ఫి - శేష్ కార్తీకేయ‌

ఎడిటింగ్ - ప్ర‌వీణ్ పూడి

మ్యూజిక్ - శాండీ అద్దంకి

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Jayaho Indians First Look Poster Launched

 ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ 'జయహో ఇండియన్స్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..



ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా జయహో ఇండియన్స్. ఆర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదెవరు.. నాయకులా..? అమాయకులా..? దేశమా..? ఈ కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అది స్పష్టంగా పోస్టర్లో కనిపించేలా డిజైన్ చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జైపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. 


నటీనటులు: 

రాజ్ భీమ్ రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, ముమైత్ ఖాన్, CVL నరసింహా రావు, రామరాజు, చిత్రం శ్రీను, అనంత్, టార్జాన్, గగన్ విహారి.. 


టెక్నికల్ టీం:

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు: ఆర్ రాజశేఖర్ రెడ్డి

నిర్మాణ సంస్థ: ది భీమ్ రెడ్డి క్రియేషన్స్

నిర్మాత: రాజ్ భీమ్ రెడ్డి

సంగీతం: సురేష్ బొబ్బిలి

సౌండ్ డిజైన్: నాగార్జున తల్లపల్లి

సినిమాటోగ్రఫీ: జైపాల్ రెడ్డి నిమ్మల

ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి

లిరిక్స్: కాసర్ల శ్యామ్

VFX: విరించి ప్రొడక్షన్స్

ఆర్ట్: మోహన్, మగేశ్వర రావు

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే

Glimpse of Prem Kumar is Out

 Will PK get married? Or will he be content with matchmaking?



Glimpse of Santosh Shoban's 'Prem Kumar' is out


Sharanga Entertainments Pvt. Ltd. and producer P Shiva Prasad are currently doing a film with Santosh Shobhan as the hero. Titled 'Prem Kumar', the film marks the directorial debut of Abhishek Maharshi. Rashi Singh is its female lead. Krishna Chaitanya, Ruchitha Sadineni, Krishna Teja, Sudarshan, Ashok Kumar, Prabhavathi, Raj Madiraju, Madhu, Abhishek Maharshi, Sri Vidya, Sai Swetha, Akula Shiva, and others have been roped in to play other roles. On Wednesday, its First Glimpse was released.


The Glimpse introduces us to the key characters in the life of the male protagonist in a funny way: సునందగారికి సింగిల్ సుపుత్రుడు, సుందర లింగానికి సోలో స్నేహితుడు, రోషన్ గాడికి రంకు మొగుడు, వరుడు చిరంజీవి చిం ప్రేమ్ కుమార్. Rashi Singh is seen as a bride. What is suspenseful is the fact that the wedding gets canceled. Why did the bride elope?


Speaking about the premise of 'Prem Kumar', director Abhishek Maharshi said, "Prem Kumar's marriage gets canceled, but you have to watch the movie to know why his wedding got canceled, because of whom, with whom and how. Will PK ever get married? Or will he remain a bachelor for the rest of his life? When is his marriage going to be held? These are going to be answered in the movie." The makers also introduced us to the wedding card.


Producer Panneeru Shiva Prasad said, "Our movie is a hilarious comedy entertainer. The director and his fellow writer Anirudh Krishnamurthy came up with a unique story. The screenplay is exciting. Santosh Shoban's character will be a special attraction. The production works have come to an end. Currently, post-production works are on. We will announce the rest of the details soon."


Cast:: Santosh Sobhan, Rashi Singh, Krishna Chaitanya, Ruchitha Sadineni, Krishna Teja, Prabhavathi, Sudharshan, Raj Madiraju, Ashok Kumar, Madhoo, Abhishek Maharshi, Sri Vidya, Sai Swetha, and Akula Siva.


Crew: Director: Abhishek Maharshi, Producer: Shiva Prasad Panneeru, Writers: Abhishek Maharshi, Anirudh Krishnamurthy, Editor:  Garry BH, Director of Photography: Rampy, Music Director: Anant Srikar, Additional Dialogues: Charan Tej, PRO: Naidu Surendra Kumar - Phani Kandukuri (Beyond Media), Digital Media: Ticket Factory


Vijay Anthony's Vijaya Raghavan Grand release on September 17

 సెప్టెంబర్ 17న విజ‌య్‌ ఆంటోని `విజ‌య రాఘ‌వ‌న్‌` గ్రాండ్ రిలీజ్



`న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌` వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. `మెట్రో` వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కించిన చిత్రం 'విజయ రాఘవన్‌'.  ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  కోడియిల్ ఒరువ‌న్‌` పేరుతో త‌మిళంలో.. `విజ‌య రాఘ‌వ‌న్‌`పేరుతో తెలుగులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 


‘‘ఇది వ‌రకే విడుద‌లైన ఈ సినిమా ట్రైలర్, పాటలకు, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఓ మాస్ ఏరియాలో పిల్ల‌లు ప‌క్క దారులు ప‌ట్ట‌కుండా ... చ‌దువు గొప్ప‌త‌నాన్ని వారికి వివ‌రించి, వారి ఉన్న‌తికి పాటు ప‌డే యువ‌కుడి క‌థే విజ‌య్ రాఘ‌వ‌న్‌. ప్ర‌స్తుత ట్రెండ్‌కు అనుగుణంగా తెర‌కెక్కించాం. డిఫరెంట్ పాత్ర. కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమా ఉంటుంది. డైరెక్ట‌ర్ ఆనంద కృష్ణ‌న్ సినిమాను అద్భుతంగా అన్ని ఎలిమెంట్స్‌ను క‌వ‌ర్ చేస్తూ తెర‌కెక్కించారు.ఎప్పుడో విడుద‌ల కావాల్సిన సినిమా కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయి. ఇప్పుడు సినిమాను సెప్టెంబర్ 17న ప్రేకకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది ’’ అని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 


న‌టీన‌టులు:

విజయ్‌ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు 


సాంకేతిక వ‌ర్గం:

రచన, దర్శకత్వం: ఆనంద కృష్ణన్‌

నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌

 సహ నిర్మాతలు: కమల్ బోరా, లలిత ధనంజయన్‌, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా, ఎస్‌.విక్రమ్‌ కుమార్‌

సినిమాటోగ్రఫీ: ఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌

మ్యూజిక్‌: నివాస్‌ కె.ప్రసన్న

ఎడిటర్‌: లియో జాన్‌ పాల్‌


Jaathiya Rahadhari Trailer Launched by RGV

 జాతీయ రహదారి ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శక సంచలనం 

-RGV



దర్శకుడు రాంగోపాల్ వర్మ గారు మాట్లాడుతూ జాతీయ రహదారి ట్రయిలర్ చూసాను చాలా హర్ట్ టచింగ్ గా వుంది,కరోనా పాండమిక్ లో జరిగిన 2 ప్రేమ కధలు కి ఈ మూవీ డైరెక్టర్ నరసింహ నంది మంచి ముగింపు ఇచ్చాడు..ఇదీ నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను..నరసింహ నంది  కి అలాగే  ఇంత రిస్కీ తీసుకుని మంచి సినిమా తీయాలి అనుకునే మా ప్రొడ్యూసర్ రామ సత్య నారాయణ గారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని మాట్లాడారు.

 

ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ ఆర్.జి. వి గారి దయవల్లే నేను ఈ రోజు ఇలా వైట్ బట్టలు వేసుకుని  ఈ స్థానం లో వున్నాను, ఆయన కి నచ్చనిదే ఏ పని చేయరు అలాంటిది ఈ మూవీ ట్రైలర్ చూసి బావుంది అని చెప్పారు..డైరెక్టర్ ని ఒకసారి పిలువు అన్నారు. ఈ మూవీ డైరెక్టర్ నరసింహ నంది కి శుభాకాంక్షలు తెలిపిన మా గురువు గారికి రుణపడి వుంటాను అని మాట్లాడారు.ఈ నెల 10 వతేదీన వినాయక చవితి కానుకగా రెండు తెలుగు రాష్ట్రాలలో 200 థియేటర్స్ లో విడుదల అవుతుంది..అని అన్నారు.


డైరెక్టర్ నరసింహ నంది మాట్లాడుతూ నేను ఎప్పుడు ఆర్.జి.వి గారిని కలుస్తానా అని అనుకునే వాడిని అది ఈ జాతీయ రహదారి వల్ల తీరింది, ఆయన శివ సినిమా చూసి చెన్నై కి ట్రైన్ ఎక్కిన వాళ్లలో నేను ఒకడిని,RGV గారు ఎప్పుడు ఎవరిని మెచ్చుకోరు అలాంటిది మా ట్రైలర్ చూసి మా జాతీయ రహదారి ట్రైలర్  బావుంది అని మెచ్చుకున్నందుకు..రేలీజ్ చేసి నందుకు ధన్యవాదములు  అని చెప్పారు.

[

నటి నటులు:

మధు చిట్టె ,సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్  నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, అభి, తెల్జెరు మల్లెష్, తరని,గొవిందరాజు, ఘర్షణ శ్రీనివాస్., విజయ భాస్కర్, సిద్దిపెట రవి 

సాంకెతిక వర్గం :

సినిమాటొగ్రఫి :- యస్ మురలి మొహన్ రెడ్డి,

సంగీతం :- సుక్కు,

పాటలు :;- మౌన శ్రీ మల్లిక్, 

ఎడీటర్ :; వి నాగిరెడ్డి, 

నిర్మాత :- తుమ్మలపల్లి రామసత్యనారాయణ.,

రచన దర్శ కత్వం :; నరసింహ నంది...

సమర్పణ.:- సంధ్య స్టూడియోస్ రవి కనగల.

పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్

Suryasthamayam Movie Review

Check out the review of Suryasthamayam movie Starring Himansee Katragadda, Daniel Balaji, Kavya Suresh and Prawin Reddy directed by Bandi Saroj Kumar Produced by Krathi Thota 

We have seen many films on Friendship concept in which most of them are Super hit But in this Suryasthamayam movie the two friends are on opposite sides poles 

 One is the police and the other is the most wanted criminal Now coming to the detail story Chegewara (Bandi Saroj Kumar) is a police officer who is the most particular in keeping the society clean by killing Criminals in this process his next Target will be Praveen Reddy who is his childhood best friend now how he reacts on it forms the Story 

Prawin Reddy had done ultimate Performance 

 he has good screen presence Daniel Balaji As usual mesmerized with his work Himanshi performed well. Others performed well in their respective roles.

Director has taken new concept and narrated it very well The screenplay is very new. The story is also very new. The story consists of three parts. The story of their childhood, college life and a police officer. The director combines these three parts with the new kind of  screenplay.

Dialogues are impressive Camera work is great Music is perfect Locations are Natural

This  movie is very new to Telugu audience and it is very engaging.


VERDICT 

On whole Suryasthamayam is a perfect film with all the Requirements Elements Surely this film will Entertain you don't miss 

Rating: 3/5


 

'Seetimaarr' to release for Vinayaka Chavithi on September 10

 Aggressive Star Gopichand, Sampath Nandi, Srinivasaa Silver Screen's 'Seetimaarr' to release for Vinayaka Chavithi on September 10... Trailer launched




'South ka satta maar ke nai.. Seeti maar ke dikhayenge', says the Aggressive Hero Gopichand in the trailer for 'Seetimaarr'. If you want to know why the protagonist is challenging the other side so aggressively, you have to watch Mass Director Sampath Nandi-directed and Srinivasaa Chitturi-produced 'Seetimaarr'. The huge action-driven sports drama will arrive in theatres on September 10 to 'play' Kabaddi with box office collections. 



Made on a huge budget and boasting of high technical values, 'Seetimaarr' stars Gopichand and Milky Beauty Tamannaah Bhatia as the lead pair, and has the backdrop of the national sport Kabaddi. Presented by Pawan Kumar, it is produced by Srinivasaa Chitturi on Srinivasaa Silver Screen. The film will release in theatres for Vinayaka Chavithi on September 10. The pakka mass and commercial film's trailer was released today.



In the trailer, Gopichand's powerful lines stand out. When a sports selector questions Gopichand's character over selecting eight players from a single village, the hero retorts that going by the rules will ensure that the players would merely play the sport. But if there is determination, they will hog the headlines. In another moment, the hero says that the whole country will turn its attention to the problems of the village if the team wins the national Kabaddi tournament. 



Somewhere, we also see a villainous police officer played by actor Tarun Arora aggressively say, "Someone is arriving in order to lord over us. Let him come." We see a stretch of action moments in the trailer besides such dialogues. 



Rao Ramesh's character cynically says that the character of the women is decided by the length of the dress they wear. Gopichand is seen emotionally telling the villagers that both men and women live up to the age of 60 years at the minimum, but women virtually die at the age of 20. Tamannaah is heard telling the hero that Abdul Kalam had asked people to dream, not daydream. 



In keeping with the genre, Rao Ramesh says that the hero seems to have a lot of bad cholesterol in him. And the icing on the cake comes in the form of Tamannaah saying that there is no going back without winning the cup. 



The trailer is rich with powerful dialogues. The action and kabaddi scenes stand out. The title track heard in the background, the action scenes, the women empowerment theme... they all deliver impact. 



Besides Gopichand's heroism, the film also has Tamannaah's glamour and performance as highlights. Sampath Nandi is back with yet another huge movie of his kind. It's clear that the film is going to be many times more powerful than the trailer. 



Cast:



Gopichand, Tamannaah Bhatia, Bhumika Chawla, Digangana Suryavanshi, Posani Krishna Murali, Rao Ramesh, Rahman, Bollywood actor Tarun Arora and others. Apsara Rani features in a special song. 



Crew:



Story, Dialogues, Screenplay, Direction: Sampath Nandi


Producer: Srinivasaa Chitturi


Banner: Srinivasaa Silver Screen


Presenter: Pawan Kumar


Cinematographer: S Soundara Rajan


Music Director: Mani Sharma


Editor: Tammiraju


Art Director: Satyanarayana DY


Ruhani Sharma Interview About 101 Jillala Andagadu

 `101 జిల్లాల అంద‌గాడు`లో నా పాత్ర చాలా కీల‌కం: రుహానీ శ‌ర్మ‌



అవ‌స‌రాల శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘101 జిల్లాల అంద‌గాడు’. హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ రుహానీ శ‌ర్మ ఇంట‌ర్వ్యూ విశేషాలు...


- `చి.ల‌.సౌ` సాధించిన స‌క్సెస్‌తో హీరోయిన్‌గా మంచి గుర్తింపు ద‌క్కింది. అప్పుడు `101 జిల్లాల అంద‌గాడు`, `హిట్` సినిమాల‌తో పాటు మ‌రో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పాను. వాటిలో హిట్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు 101 జిల్లాల అంద‌గాడు విడుద‌ల‌వుతుంది. త్వ‌ర‌లోనే మ‌రో సినిమా కూడా విడుద‌ల‌వుతుంది. 


- అవ‌స‌రాల శ్రీనివాస్ నటుడిగా, డైరెక్ట‌ర్‌గానే కాదు, మంచి రైట‌ర్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాకు క‌లిసి ప‌నిచేయ‌క ముందే కొన్నిసార్లు క‌లిసి మాట్లాడాను. ఆ క్ర‌మంలో ఈ సినిమా క‌థ‌ను ఆయ‌న నాకు నెరేట్ చేశారు. నా క్యారెక్ట‌ర్‌తో పాటు, అవ‌స‌రాల క్యారెక్ట‌ర్‌తోనూ బాగా క‌నెక్ట్ అయ్యాను. 


- నాకు తెలిసి అంద‌మంటే మ‌నం అంత‌ర్గ‌తంగా ఎలా ఉంటామో అదే. మ‌నం చూడటానికి ఎంత గొప్ప‌గా ఉన్నామ‌ని అది అందం కాద‌నేది నా అభిప్రాయం. మ‌న‌ల్ని మ‌నంగా ఒప్పుకునే త‌త్వ‌మే అందం. 


- బ‌ట్ట‌త‌ల ఉండే ఓ యువ‌కుడు, అలా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌డు. అయితే దాని వ‌ల్ల అత‌నెలాంటి ప‌నులు చేశాడు. చివ‌ర‌కు అత‌నికి ఏం తెలిసింది. త‌న‌ను తాను ఎలా ప్రేమించుకున్నాడ‌నేదే క‌థ‌. 


- సినిమాను తెర‌కెక్కించే సంద‌ర్భంలో డైరెక్ట‌ర్ రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌, అవ‌స‌రాల శ్రీనివాస్ బాగా చ‌ర్చించుకునేవారు. ఏది బెట‌ర్‌గా ఉంటుందో దానిపై ఓ క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. 


- సినిమాలో అవ‌స‌రాల శ్రీనివాస్‌, నా పాత్ర చుట్టూనే సినిమా ఎక్కువ‌గా ర‌న్ అవుతుంది. నా పాత్ర ఏంట‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నాకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ‌గా ఉంటుంది. హీరో జర్నీలో హీరోయిన్ పాత్ర ఏంటి? ఆమె కోసం హీరో ఎలా మారాడు? అనేది క‌థ‌. ఈ సినిమాకు నా పాత్రే ఆత్మ అనుకోవ‌చ్చు. 


- స్క్రిప్ట్, నా పాత్ర న‌చ్చితే చాలు.. స్క్రీన్ స్పేస్ గురించి ఆలోచించ‌ను. నా పాత్ర‌కు న్యాయం చేయ‌డ‌మే ఆర్టిస్ట్‌గా నా క‌ర్త‌వ్యం. న‌టిగా న‌న్ను నేను ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుక‌ని మంచి స్క్రిప్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాను. ఏదో పాట‌లు, కొన్ని సీన్స్ లో న‌టిస్తే చాలనుకోవ‌డం లేదు. 


- తెలుగులో అనే కాదు.. ఇత‌ర భాష‌ల్లోనూ న‌టిస్తున్నాను. హిందీలో ఓ వెబ్ సిరీస్‌లో కూడా యాక్ట్ చేశాను. క‌రోనా కార‌ణంగా ఆ ఫ్లో క‌నిపించ‌లేదు. విప‌రీత‌మైన బోల్డ్ పాత్ర‌లు చేయ‌డాన్ని కంఫ‌ర్ట్‌గా ఫీల్ కాలేను. 


- హిందీలో ఇలాంటి కాన్సెప్ట్‌తో వ‌చ్చిన బాలా..101 జిల్లాల అంద‌గాడు సినిమాల థీమ్ ఒక‌టే. నేను బాలా చూడ‌లేదు. కాబ‌ట్టి పోలిక చెప్ప‌లేను. అయితే, రెండు సినిమాలు చూసిన వాళ్లు ఈ రెండింటికీ సంబంధం లేద‌ని చెబుతున్నారు. 


- అవ‌స‌రాల శ్రీనివాస్ మంచి స్నేహితుడు. త‌న‌తో చేసిన ఈ జ‌ర్నీలో త‌ను నా ఫ్యామిలీలో ఓ స‌భ్యుడ‌య్యాడ‌నే చెప్పాలి. త‌న‌ను నా సినిమాల ప‌రంగా స‌ల‌హాలు కూడా అడిగేంత స్నేహం ఏర్ప‌డింది. మంచి కోస్టార్‌. మంచి న‌టుడు, రైట‌ర్‌, డైరెక్ట‌ర్‌. 


- తెలుగులో నేను నాలుగు సినిమాలే చేశాను. అయినా తెలుగు ప్రేక్ష‌కులు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. 


- ప‌ర్స‌న‌ల్‌గా సైకో థ్రిల్ల‌ర్ మూవీస్‌, ల‌వ్‌స్టోరీస్ అంటే ఇష్టం. మ‌ల‌యాళంలో డార్క్ క్యారెక్ట‌ర్ చేశాను. త‌ప్పకుండా ఆ సినిమా అంద‌రినీ మెప్పిస్తుంది. 


- మంచి స్క్రిప్ట్ వ‌స్తే భాష‌తో సంబంధం లేకుండా న‌టించ‌డానికి సిద్ధ‌మే. 


- నాని ప్రొడ‌క్ష‌న్ మీట్ క్యూట్‌లో యాక్ట్ చేశాను. అలాగే తెలుగులో మ‌రో అంథాలజీలో యాక్ట్ చేశాను.  

Star Director Bobby unveils First Look of Vijay Sethupathi's 'Laabam'

 Star Director Bobby unveils First Look of Vijay Sethupathi's 'Laabam'




'Laabam', starring Vijay Sethupathi and Shruti Haasan, is being made in Telugu and Tamil. On Tuesday, well-known star director Bobby released its First Look. Cine writer Kona Venkat, Mythri Movie Makers' Naveen Yerneni and Ravi Shankar Y were also present on the occasion. The film will release in theatres on September 9. This is the first Vijay Sethupathi movie to release simultaneously in Telugu and Tamil. 



Jagapathi Babu has played a crucial role. Sai Dhansika has also got a crucial role. The SP Jaganathan directorial has been produced by Sri Gayatri Devi Films' Battula Satyanarayana (Vizag Satish) in Telugu. Presented by Lawyer Sriram, the film's Executive Producer is Harash Babu. 'Laabam' is Vijay Sethupathi's first Telugu release since 'Master' and 'Uppena'. He has played the role of a crusader fighting for the farmers' community. 



Releasing the First Look, director Bobby said, "Vijay Sethupathi garu is a pan-India actor. His films are gaining a lot of craze in Telugu as well. His characters and performance in 'Sye Raa' and 'Uppena', the straight Telugu films, received so much applause. I am confident that his performance in 'Laabam' will be loved by the audience. It seems his character in this film is quite different from his previous ones. Going by the First Look, Vijay Sethupathi garu is so unique. As a leader fighting for the farmers, I hope he will impress the audience a lot. I wish the producers of the Telugu version all the best. I hope 'Laabam' fetches huge profits. Since it's releasing on Vinayaka Chavithi, may the God's blessings be with them."



Cast:



Vijay Sethupathi, Shruti Haasan, Jagapathi Babu, Sai Dhansika, Kalaiyarasan, Ramesh Thilak, Prudhvirajan, Daniel Annie Pope, Nitish Veera, Jai Varman and others. 



Crew: 



Writer, Director: SP Jaganathan


Screenplay Writer: N Kalyan Krishnan


Music Director: D Imman


Cinematographer: Ramji


Editor: N Ganesh Kumar


Art Director: V Selva Kumar


Stunts: Dhana Ashok


PRO: SreeMari 

Victory Venkatesh Graced Sai Lakshmi Bhanu Rajeev Marriage

 సాయిలక్ష్మీ, భాను రాజీవ్‌ జంటను ఆశీర్వదించిన వెంకటేశ్‌..



లండన్‌లో దాదాపు రెండు రోజుల పదమూడు గంటల పాటు సంగీతంలోని ఎంతో విశిష్టమైన 72 మేళకర్త రాగాలను పలికించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు వంటి అత్యున్నతమైన అవార్డును అందుకున్న ప్రముఖ సంగీత దర్శకులు స్వర వీణాపాణి. ‘పట్టుకోండి చూద్దాం’, ‘ దేవస్థానం’, ‘మిథునం’ వంటి చక్కని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన పెద్ద కుమార్తె చి.ల.సౌ మారుతీ సాయిలక్ష్మీ వివాహం చి. భాను రాజీవ్‌తో సోమవారం రాత్రి  హైదరాబాద్‌లోని క్రౌన్‌ విల్లా గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో ప్రముఖ హీరో దగ్గుబాటి వెంకటేశ్‌ పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. నటులు, దర్శకులు, రచయితలు తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్,  జనార్థన మహర్షి, సింగర్‌ రేవంత్, కమెడియన్‌ శివారెడ్డి దంపతులు పాల్గొని వివాహ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా స్వర వీణాపాణి దంపతులు, వోగోటి వెంకట మారుతీ రామకృష్ణ దంపతులు  తమ పిల్లల వివాహ కార్యక్రమానికి హాజరై ఆశీస్సులు అందించిన ప్రముఖులందరికి పేరు,పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు.

MP Bala Shouri Son Engagement Photos





















 

GST MOVIE Theatrical Trailer Launched by Minister Talasani Srinivas Yadav

 GST"మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 



     "తోలు బొమ్మల సిత్రాలు" బ్యానర్ పై కొమారి జానకి రామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం"GST"( గాడ్ సైతాన్ టెక్నాలజీ). ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ని సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేశారు.

     ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ.. ఈ చిత్రం యొక్క టైటిల్ చాలా బాగుంది .డైరెక్టర్ గారు ఈ చిత్రం యొక్క కాన్సెప్ట్ చెప్పాకా,చాలా బాగా అనిపించింది.అలాగే ఈ సినిమా ద్వారా మంచి సందేశం కూడా ఇస్తున్నారు.కాబట్టి ఈ చిత్రం మంచి విజయం సాధించాలని,డైరెక్టర్ కొమారి జానకిరామ్ మంచి దర్శకుడిగా ఎదగాలని,చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు.

    జూనియర్ సంపు మాట్లాడుతూ.. మాచిత్రం యొక్క ట్రైలర్ ని లాంచ్ చేసినందుకు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు.అలాగే సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామని డైరెక్టర్ గారిని ఓటీటీలో రిలీజ్ చేయమని చాలా రిక్వెస్ట్ చేశాము. కానీ డైరెక్టర్ గారు ఈ సినిమా క్వాలిటీ గాని, కంటెంట్ గాని, సౌండ్ ఎఫెక్ట్స్ గాని బ్యాగ్రౌండ్ మ్యూజిక్...ఇలాయెన్నో, హంగులున్నటువంటి మనసినిమా థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ ఉంటుందని,ఇది థియోటర్స్ లోనే చూడాల్సిన సినిమా అని,థియేటర్లలోనే రిలీజ్ చేస్తానని ఇన్నాళ్లు థియోటర్స్ కోసం వెయిట్ చేశారు.ఖచ్చితంగా అతి త్వరలో ఈ సినిమా  థియేటర్ లో రిలీజ్ కాబోతుంది.

    అలాగే జనరల్ గా ఈ కరోనా టైంలో...ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..ఫస్ట్ సినిమా థియేటర్స్ ని మూసి వేస్తున్నారు.తర్వాత లేటుగా సినిమా థియేటర్స్ ని స్టార్ట్ చేస్తున్నారు కానీ... మిగతా ప్లేస్ లకన్నా..సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది థియేటర్స్ మాత్రమే. ఖచ్చితంగా మీరు థియేటర్ కి రండి.థియేటర్లోనే మా సినిమాని చూడండి.డోంట్ ఎంకరేజ్ పైరసీ.

   అలాగే మా డైరెక్టర్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బెస్ట్ డైరెక్టర్ అనడం కంటే బెస్ట్ రీసెర్చ్ కాలర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ సినిమా గురించి ఒక స్మశానం లో ఆయన చేసిన రీసెర్చ్ కానీ,అన్ని మతాల దేవాలయాలలో దేవుళ్ల గురించి ఆయన చేసిన రీసెర్చ్ గానీ,సైన్స్ గురించి ఆయన ఒక సైంటిస్టులా చేసిన రీసెర్చ్ గాని..ఈ మూడింటిని కలిపి అద్భుతమైన పాయింట్ ని తీసుకొని సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమా ప్రివ్యూ చూశాక ఈ సినిమాలో నటించిన మేమే షాక్ అయ్యాము.ఎందుకంటే సినిమా అంత అద్భుతంగా వచ్చింది.ఈ సినిమాలో కామెడీ కూడా ఏదో అతికించినట్టుగా కాకుండా కథలో భాగంగా కామెడీ ఈ కథలో పండించిన విధానం చూస్తే ఐ యాం వెరీ బ్లెస్డ్. ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వస్తుందనీ,నాకు ఈ చిత్రం లో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా చిత్రాన్ని అతి త్వరలో థియేటర్లో చూసి  అభినందించి, ఆశీర్వదిస్తారని కోరుతున్నానని చెప్పారు.

    స్వాతి మండల్ మాట్లాడుతూ..మా చిత్రం ట్రైలర్ ని సినిమాటోగ్రఫీ మంత్రి గారు ట్రైలర్ లాంచ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ట్రైలర్ ని చూశాకా మీకు చాలా ఇంట్రెస్ట్ కలిగి చాలా క్యూరాసిటీగా ఉంటారు.ఈ మూవీ లో ఏం చెప్పబోతున్నారని మీకు చాలా ఆత్రుత కలుగుతుంది.గాడ్ సైతాన్ టెక్నాలజీ పోస్టర్ ని చూస్తే.. మీరు హార్రర్ మూవీ అనుకుంటారు. కానీ..ఇందులో లవ్,కామెడీ, రొమాన్స్,హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ తో పాటు అన్నీ వుంటూ...ఫస్ట్ టైం కొత్త పాయింట్ తో మా చిత్రం రాబోతుంది. నేను హీరోయిన్ గా చేస్తూ,ఇంపార్టెంట్ పాత్రలో పోషించి,ఈ చిత్రంలో ఒక పార్ట్ అయినందున నేను చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను.ఈ ట్రైలర్ చూశాక మీకు ఖచ్చితంగా నచ్చి,చాలా ఎగ్జైట్ ఫీలై ఈ మూవీని థియోటర్స్ లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈచిత్రంలో నాకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మాట్లాడారు.

     అశోక్ మాట్లాడుతూ.. మా చిత్రం "GST"(గాడ్ సైతాన్ టెక్నాలజీ)చిత్రం యొక్క ట్రైలర్ ని సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది.మా మూవీ" జిఎస్టి" జి అంటే గాడ్.అంటే దేవుళ్లకు సంబంధించి గానీ సైతాన్...దయ్యాల కు సంబంధించి గానీ,టెక్నాలజీ అంటే సైన్స్ లో ఒక కొత్త పాయింట్ ని తీసుకొని ఈ మూడింటిని కంపారిజన్ చేస్తూ..సృష్టిలో ఏది నిజం? దేవుడా, దయ్యమా, సైన్స్ వీటన్నిటిలో ఏది నిజం అని చెప్పాలని మా దర్శకులు శ్రీ కొమారి జానకిరామ్ గారు తనకున్న ఎక్స్పీరియన్స్ తో దాదాపు ఇండస్ట్రీలో మంచి దర్శకుల దగ్గర వర్క్ చేసి,ఎన్నో సంవత్సరాల అనుభవంతో ఒక కొత్త  పాయింట్ ని తీసుకొని, ఒక మంచి ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్స్ తో సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు.

     మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి చాలామందికి చాలా చాలా అపోహలున్నాయి.అసలు దేవుడు దెయ్యం సైన్స్ ఈ మూడింటిలో ఏది నిజం ? ఎవరు గొప్ప అనేది ? .

    నేను 100% ప్రామిస్ చేసి చెబుతున్నాను దానికి సమాధానం కావాలంటే మా మాత్రం"GST" సినిమాని చూడండి.100% యూ విల్ గెట్ ద క్లారిఫికేషన్ .మా మూవీ చాలా బాగుంది. ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చుతుంది.కామెడీ,రొమాన్స్ ,ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి సోషల్ మెసేజ్ తో మీ ముందుకు రాబోతున్నాం అని చెప్పారు.

     దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ.. మా "తోలు బొమ్మల సిత్రాలు"బ్యానర్ పై నిర్మించినటువంటి "గాడ్ సైతాన్ టెక్నాలజీ " చిత్రం ట్రైలర్ ని సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ముఖ్యంగా.. మంత్రిగారు టైటిల్ గురించి,మా చిత్రం గురించి,ఈ చిత్రం లో ఏ సందేశం ఇస్తున్నారని అడిగారు .మా సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నామో, ఏం సందేశం ఇస్తున్నామో చెప్పిన తర్వాత అది విని ,మంత్రిగారు ఎగ్జైట్గా ఫీలై చాలా మంచి కంటెంట్ చెప్పబోతున్నారని అభినందించి నందుకు మంత్రి గారికి మా చిత్ర యూనిట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

    ఇక కంటెంట్ విషయానికి వస్తే అసలు ఈ సమాజంలో దేవుడు, దయ్యము,సైన్స్ పైన చాలా అనుమానాలు, అపోహలున్నాయి.  వాటిని నిగ్గు తేల్చడానికే మేం దమ్మున్న కథతో మీ ముందుకు వస్తున్నాము.

ఎందుకంటే.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎన్నో హర్రర్ సినిమాలు,దేవుళ్ళ సినిమాలు, సైన్స్ సినిమాలు చాలా వచ్చాయి. కానీ...ఈ మూడింటిని కలకలిపి వీటిలో అసలు ఏది వాస్తవం?ఏది అబద్దం అనే విషయాన్ని మేం చెప్పబోతున్నాము. హర్రర్ సినిమా అంటే ఒక వర్గానికి పరిమితమైన ప్రేక్షకులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా లవ్, సెంటిమెంట్ ,కామెడీ ,హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది.

    కాలేజీ లో ఉండే ప్రతి సీన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి లవ్ సీన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి హర్రర్ సీన్స్ కూడా అలాగే ఉంటాయి సినిమాలో ప్రతి సీన్ చాలా కొత్తగా ఉంటాయి .

  ఇలా డిఫరెంట్ గా ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి అని చాలా సినిమాల్లో ఏదో రిలీజ్ ముందు చాలా డిఫరెంట్ గా ఉంటుందని,మా సినిమా చాలా కొత్తగా ఉంటుందని  చెప్పినట్టుగా...మీలో ఎక్స్పెక్టేషన్ పెంచుకోవడానికో,నేను ఆవేశంతో చెబుతున్న మాటలు కావు. వాస్తవంగా చెబుతున్నాను ,బల్ల గుద్ది చెబుతున్నాను.ప్రతి సీన్ మాత్రం ఎక్సలెంట్ గా చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంటాయి.రేపు మీరు మా సినిమా చూసిన తర్వాత కూడా ఇదే మాట చెబుతూ డిఫరెంట్ గా ఉందంటూ మీరంతా మంచి రివ్యూ కూడా ఇస్తారు. 

   సినిమాలో ప్రతి సీన్ చూస్తున్నప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఫీలవుతూ..నెక్స్ట్ ఏంటి ,నెక్స్ట్ ఏంటి అంటూ చివరి క్షణం వరకు చాలా ఉత్కంఠ భరితంగా సాగే మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.సమాజానికి అసలు ఇన్నాళ్లు ఏది వాస్తవం అని తెలియకుండా...ఒక ప్రశ్నగా మిగిలిపోయిన దానికి అసలు వాస్తవం చెప్పబోతున్నాను.మంచి సందేశంతో వస్తున్న ఈ సినిమాకి కథే హీరో. కథే కథానాయకుడు అయినటువంటి మా చిత్రం ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుందని చెప్పబోతున్నాను.ఎందుకంటే ఒక సీనియర్ సినిమా విశ్లేషకులు ఒక మాట చెప్పారు ఈ సినిమా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుందని. ఎందుకంటే హర్రర్ సినిమాలు అంటే ఒక బిల్డింగ్ లోనో, ఒక అడవిలోనో ఇంకా ఏదేదో చేస్తుంటారు.కానీ మీరు తీసిన హర్రర్ సినిమాలో లవ్ ని, సెంటిమెంట్ ని, కామెడీని ని యాక్షన్ ని సస్పెన్స్ ని హర్రర్ ని థ్రిల్లర్ ని దాంతోపాటు మంచి మెసేజ్ ను మిక్స్ చేసి చేయడమనేది అసాధ్యం కానీ మీరు అలాంటి చిత్రం తీశారు అంటే ఇప్పటివరకు తీసిన హర్రర్ సినిమాలకు మించి డిఫరెంట్ గా కొత్తగా వస్తున్న చిత్రం అని ప్రశంసించారు.వారు ప్రశంసించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ,వారు ఎవరనేది ముందు ముందు ప్రెస్మీట్లో చెబుతాను.రేపు మా చిత్రం రిలీజ్ తర్వాత కూడా ప్రేక్షకుల ప్రశంసలు పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతుందని భావిస్తున్నాను.మరొక్కసారి మా చిత్రం ట్రైలర్ ని  లాంచ్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ...కథే కథానాయకుడు అయినటువంటి మా చిత్రం సెప్టెంబర్ 10న థియోటర్స్ లో చూసి ఆదరిస్తారని భావిస్తూ ప్రేక్షక దేవుళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని దర్శకుడు మాట్లాడారు.


ఈ చిత్రంలో హీరోలు: ఆనంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు

హీరోయిన్లు: స్వాతిమండల్, యాంకర్ ఇందు, పూజా సుహాసిని,వాణి

కామెడీ పాత్రలో..జూనియర్ సంపు

ఇతర తారాగణం: స్వప్న,శ్రష్టి వర్మ,"వేదం"నాగయ్య, గోవింద్,నల్లి సుదర్శన రావు,"జానపదం"అశోక్, సూర్య,సంతోష్,రమణ.

ఎడిటింగ్: సునీల్ మహారాణ

డి.ఓ.పి: డి.యాదగిరి

సంగీతం: యు.వి.నిరంజన్

లైన్ ప్రొడ్యూసర్: కె.బాలకృష్ణ

నిర్మాత: కొమారి జానయ్య నాయుడు

కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కొమారి జానకిరామ్

పి.ఆర్.ఓ: మధు.వి ఆర్

Teaser release of Naga Shaurya and Ritu Varma “VARUDUKAVALENU” Released

 Teaser release of Naga Shaurya and Ritu Varma “VARUDUKAVALENU”



Young Hero Naga Shaurya and Heroine Ritu Varma starer Varudu Kaavalenu under the direction of Lakshmi Sowjanya in the production of prestigious banner Sitara Entertainments.

 

Today(31-08-2021) morning at 10:08 Sitara Entertainments released the teaser of Varudu Kaavalenu wishing Happy Birthday to S. RadhaKrishna (Chinababu) owner of Haarika Hassine Creations.


Story and dialogues strength is clearly known in the teaser. Characteristics,thought process, mindset of lead actors and fun, music are felt in every second of the teaser and definitely makes Varudu Kaavalenu stand out in the genre of love stories. Teaser gives the vibe of a feel good movie is in store for us.At the end Producer Suryadevara Nagavamsi wished Happy Birthday to S.Radhakrishna (Chinababu) and also mentioned the October release in theatres.


Already the songs “Kola Kale ilaa” and “Digu Digu Naga” which got released won the hearts of audience and also the First glimpse and posters also garnered positive response and appreciation from audience and in the social media. Currently movie post production works in the last phase of completion. Producers are pretty confident that Varudu Kaavalenu story, dialogues, songs,emotions and artistes performances will surely connect with the audience.


Varudu Kaavalenu is starring Naga Shaurya, Ritu Varma along with Nadiya, Murali Sharma, Vennela Kishore, Praveen, Ananth, Pammi Sai, Kireeri Daamaraju, Rangasthalam Mahesh, Arjun Kalyan, Vaishnavi Chaitanya, Sidduque sha.


Dialogues are penned by Ganesh Kumar Ravuri,Cinematography by Vamsi Patchipulusu, Music by Vishal Chandrashekhar, Editing by Navin Nooli, Art by A.S.Prakash, P.R.O. LakshmiVenuGopal.

Presented by:P.D.V Prasad

Producer:Suryadevara Naga Vamsi

Story-Direction:Lakshmi Sowjanya

MP Bala Shouri Son Engagement Held Grandly in the Presence of Top Celebrities and Leaders

 ఘనంగా యంపి బాలశౌరి కుమారుని నిశ్చితార్థం....



మచిలీపట్నం యం.పి బాలశౌరి కుమారుడు అనుదీప్‌ నిశ్చితార్థం స్నికితతో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హైటెక్‌సిటీలోని హైటెక్స్‌ కన్వెన్షన్‌లో వేసిన  భారీ సెట్‌లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలు పాల్గొని కాబోయో నూతన వధువరులను ఆశీర్వదించారు. ప్రముఖ నటుడు చిరంజీవి దంపతులు నూతన దంపతులకు ఉంగరాలను అందించి వారి జీవితంలోని తొలి అడుగులకు సాక్షిగా నిలిచారు.  రెండు తెలుగు రాష్ట్రాలనుండి దాదాపు 20మంది యంపీలు, 100మంది యంఎల్‌ఏలు పాల్గోని వేడుకని రెట్టింపు చేశారు. ఈ కార్యక్రమంలో అనేకమంది ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు పాల్గొని నూతన జంటకు అభినందలనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనా«ద్‌ రెడ్డి, మేకతోటి సుచరిత తదితర మంత్రులు పాల్గొన్నారు. నటులు కైకాల సత్యనారయణ, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి,  బి.గోపాల్, ఎస్‌.గోపాల్‌రెడ్డి, రమేశ్‌వర్మ, త్రినాధరావు నక్కినలు పాట్గొనగా నిర్మాతలు కోనేరు సత్యనారయణ , మహేశ్‌ రెడ్డి, లగడపాటి శ్రీధర్, దాసరి కిరణ్‌కుమార్, విసు, సంగీత దర్శకులు కోటి, టాలీవుడ్‌ అగ్ర రచయిత బుర్రా సాయిమాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Nithiin, Merlapaka Gandhi, Shreshth Movies Maestro Sneak Peek Out

 Nithiin, Merlapaka Gandhi, Shreshth Movies Maestro Sneak Peek Out



Hero Nithiin will be seen in an atypical role as a blind piano player in his milestone 30th film Maestro directed by talented director Merlapaka Gandhi. Due to the COVID-19 pandemic, the film skipped a theatrical release and opted for a direct-to-streaming release on Disney+ Hotstar on 17 September 2021.


The film’s trailer was released recently to overwhelming response and today they have released a sneak peek video. Nithhin is seen composing a mellifluous tune on his Piano and on top of the musical instrument we can see the ‘Maestro’ Ilayaraja’s picture. However, like earlier, the Piano stops working. Nithiin expresses his discontentment, as he couldn’t complete the composition.


Mahati Swara Sagar has come up with some captivating tunes for the film that has cinematography handled by J Yuvaraj.


Nabha Natesh is the female lead, while Tamannaah Bhatia will be seen in a negative shaded role.


N Sudhakar Reddy and Nikitha Reddy are producing the film under Shreshth Movies Banner, while Rajkumar Akella is presenting it.


Cast: Nithin, Nabha Natesh, Tamannaah, Naresh, Jisshu Sengupta, Sreemukhi, Ananya, Harshavardhan, Rachha Ravi, Mangli, Srinivas Reddy


Technical Crew:


Dialogues, Direction: Merlapaka Gandhi

Producers: N Sudhakar Reddy, Nikitha Reddy

Banner: Sreshth Movies

Presents: Rajkumar Akella

Music Director: Mahati Swara Sagar

DOP: J Yuvraj

Editor: SR Shekhar

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar

Naga Shaurya's 'LAKSHYA' Shooting Wrapped Up

 Naga Shaurya's 'LAKSHYA' Shooting Wrapped Up



Promising young hero Naga Shaurya’s landmark 20th film ‘LAKSHYA’ has wrapped up its entire shooting part. The working still shows director Dheerendra Santhossh Jagarlapudi explaining the scene to Naga Shaurya who in another picture can be seen watching the monitor along with his heroine Ketika Sharma. There is contentment in the faces of the hero and director which tells the kind of rapport both shared while shooting for the film.


Lakshya is India’s first movie based on ancient sport archery and it will be narrated in engaging manner with adequate entertaining and exciting elements. Sports two different looks, Naga Shaurya underwent a remarkable transformation for the role.


Director Santhossh Jagarlapudi came up with first of its kind story and Naga Shaurya underwent training to understand the nuances of the sport. Now, the team shifted their focus to post-production works which are currently underway.


Presented by Sonali Narang, the film is produced by Narayan Das K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sree Venkateswara Cinemas LLP, and Northstar Entertainment Pvt Ltd banners.


Ketika Sharma is playing as heroine in this film while versatile actor Jagapathi Babu will be seen in a crucial role.


The makers will soon announce its release date launch and launch vigorous promotional campaign.


Cast: Naga Shaurya, Ketika Sharma, Jagapathi Babu, Sachin Khedekar etc.


Technical Crew:

Story, Screenplay, Direction: Dheerendra Santhossh Jagarlapudi

Producers: Narang Das K Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar

Cinematographer: Raam Reddy

Music Director: Kaala Bhairava

Editor: Junaid

PRO: Vamsi-Shekar, BA Raju

Dear Megha Pre Release Event Held Grandly

 డియర్ మేఘ" ఎక్స్ట్రార్డినరీ లవ్ స్టోరి - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ




మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్,

అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ''డియర్ మేఘ''.

'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్', బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని

నిర్మించారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ ఎమోషనల్ ప్రేమ కథా

చిత్రం సెప్టెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్

కానుంది. తాజాగా ''డియర్ మేఘ'' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో వైభవంగ

జరిగింది. ఈ సందర్భంగా



*గీత రచయిత కృష్ణ కాంత్ మాట్లాడుతూ*....''డియర్ మేఘ'' సినిమాకు పనిచేసిన

యూనిట్ అంతా ఫ్యామిలీ లాగా అయిపోయారు. ఈ సినిమాలోని ఐదు పాటలు దేనికది

సందర్భానుసారం ఉంటాయి. మొత్తం ఆల్బమ్ అంతా మెలొడియస్ గా ఉంటుంది. పాటలు

కమర్షియాలిటీ కోసం ఎక్కడా ఇరికించినట్లు ఉండవు. పాటలే కాదు సినిమా కూడా

బ్యూటిఫుల్ గా ఉంటుంది. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లకు ఆడియెన్స్

వస్తారని ప్రూవ్ అయ్యింది. ''డియర్ మేఘ'' చిత్రానికి కూడా అలాగే థియేటర్

లలో ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.



*హీరో సొహైల్ మాట్లాడుతూ*....''డియర్ మేఘ'' కంటెంట్ చూస్తుంటే ఒక ఫ్రెష్

లవ్ స్టోరి అనే ఫీలింగ్ కలుగుతోంది. ఇలాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో

చూడలేదు. పాటలు  చాలా బాగున్నాయి. అరుణ్ ఆదిత్ తనకు తానుగా ఎదిగిన హీరో.

అలాగే మేఘా ఆకాష్ బ్యూటిఫుల్ హీరోయిన్. నిర్మాత అర్జున్ దాస్యన్ ఫస్ట్

మూవీతో మంచి అటెంప్ట్ చేశారనిపిస్తోంది. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్.

అన్నారు.


*హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ*...''డియర్ మేఘ'' విజువల్స్ చాలా కొత్తగా

ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ గారికి కంగ్రాట్స్. గీత రచయిత కెకె గారు

గొప్ప సాహిత్యాన్ని ఇచ్చారు. ఆయనతో నేను కూడా పనిచేశాను. అరుణ్ ఆదిత్

అన్నకు మంచి హిట్ రావాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఆయన చాలా ఫ్రెండ్లీ.

ఆల్ ద బెస్ట్ టు అదిత్ అన్న. ఈ చిత్రాన్ని థియేటర్ లలో విడుదల చేసేందుకు

ముందుకొచ్చిన నిర్మాత అర్జున్ దాస్యన్ గారికి థాంక్స్. పరిస్థితులు ఎలా

ఉన్నా, సినిమాను థియేటర్ లో చూడాలని కోరుకునే అభిమానులెందరో వారందరి

కోరికను నెరవేర్చారు. ''డియర్ మేఘ'' చూశాక ఆడియెన్స్ మేఘా ఆకాష్ ను డియర్

మేఘా అని పిలుస్తారు. అన్నారు.


*దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ*...''డియర్ మేఘ'' సినిమా

ఎక్స్ట్రార్డినరీ రొమాంటిక్ ఫిల్మ్. ఇలాంటి రొమాంటిక్ లవ్ స్టోరి ఈ మధ్య

కాలంలో రాలేదు. హరి గౌర కంపోజ్ చేసిన పాటలు చాలా బాగున్నాయి. మెలొడీ

సాంగ్స్ ను బాగా ఎంజాయ్ చేశాను. మేఘా ఆకాష్ 40 ఏళ్ల కిందట కనిపించి ఉంటే

నాకు డివోర్స్ అయ్యేవి కావు. ఆమె చాలా క్యూట్, హోమ్లీ లుక్ లో ఉంది. నా

సినిమాలకు సెట్ అవదు. అరుణ్ ఆదిత్ ను ఎక్కువ పొగిడితే నన్ను గే

అనుకుంటారు. అతనితో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నా. టీమ్ అందరికీ ఆల్ ద

బెస్ట్ చెప్పను. ఎందుకంటే సినిమా గురించి నా ఫీలింగ్స్ ఆల్రెడీ

చెప్పేశాను. అన్నారు.


*హీరో అర్జున్ సోమయాజులు మాట్లాడుతూ*....మాది చెన్నై. సినిమాల్లో అవకాశాల

కోసం హైదరాబాద్ వచ్చాను. చాలా ఆడిషన్స్ కు వెళ్లి ప్రయత్నించాను. లాస్ట్

మినట్ లో ఆ అవకాశం చేజారిపోయేది. చివరగా డైరెక్టర్ సుశాంత్ గారిని

కలిశాను. ఆయన నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ''డియర్ మేఘ'' లో పార్ట్

అవడం అదృష్టంగా భావిస్తున్నాను. మా సినిమాను థియేటర్ లో చూడండి, ఎంజాయ్

చేయండి. అన్నారు.



*హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ*... నా పేరు మీద గతంలో ఓ పాట వచ్చింది.

ఇప్పుడు ఓ సినిమా రూపొందడం అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ సుశాంత్

గారితో పనిచేయడం సంతోషంగా ఉంది. మేఘ స్వరూప్ క్యారెక్టర్ ను నాతో

చేయించినందుకు థాంక్యూ. ఈ పాత్రలో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. అర్జున్

దాస్యన్ నా ఫేవరేట్ ప్రొడ్యూసర్. ఆయనను హ్యాపీ ప్రొడ్యూసర్ అని

పిలవొచ్చు. తెలుగులో సినిమాలు చేశాను గానీ ఏ సినిమా టీమ్ కు ఇంత దగ్గర

కాలేదు. వీళ్లు నా ఫ్యామిలీలా మారారు. ఈ టీమ్ తో మళ్లీ మళ్లీ పనిచేయాలని

కోరుకుంటున్నా. అర్జున్ సోమయాజులుకు టాలీవుడ్ లోకి వెల్ కమ్ చెబుతున్నా.

నా ఫ్రెండ్ అరుణ్ ఆదిత్ తో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. సెప్టెంబర్ 3న మా

డియర్ మేఘ చిత్రాన్ని థియేటర్ లలో చూడండి. మంచి ఎమోషనల్ లవ్ స్టోరి. మీరు

ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.



*దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ*...ఆర్జీవీ గారికి శ్రీదేవి గారితో

పనిచేయడం ఎంత కిక్ ఇచ్చిందో, నాకు మేఘా ఆకాష్ తో పనిచేయడం అంతే కిక్

ఇచ్చింది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో స్నేహా ఉల్లాల్, డార్లింగ్ లో

కాజల్ ఇంట్రడక్షన్ చూసే ఉంటారు. మా చిత్రంలో మేఘా ఆకాష్ ఇంట్రడక్షన్ సీన్

చూస్తే అవి మర్చిపోతారు. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ గారు అంత బాగా పిక్చరైజ్

చేశారు. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్

తెలుగులో ఒక పెద్ద బ్యానర్ అవుతుంది. నెక్ట్ ఆ సంస్థ నుంచి మంచి మంచి

చిత్రాలు రాబోతున్నాయి. మా సినిమాలో పాటలు వింటే సినిమా చూసేందుకు

తప్పకుండా థియేటర్ కు వస్తారు. అరుణ్ తో నా ఫ్రెండ్ షిప్ కు గిఫ్ట్ డియర్

మేఘ. మా చిత్రాన్ని సెప్టెంబర్ 3న థియేటర్ లలో చూడండి. అన్నారు.


*నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ*...మా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు

వచ్చి, ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ గారికి థాంక్స్. సాంగ్ రిలీజ్ చేసిన

కిరణ్ అబ్బవరంకు థాంక్స్. ప్రతి లవ్ స్టోరి అబ్బాయి కోణంలో ఉంటుంది. కానీ

డియర్ మేఘ అమ్మాయి వైపు నుంచి కథను చెబుతుంది. ఈ కథ నచ్చి తెలుగు

ప్రేక్షకుల కోసం డెవలప్ చేయించాం. పాటలు వినసొంపుగా, విజువల్స్ గ్రాండ్

గా ఉంటాయి. సెప్టెంబర్ 3న అన్ని జాగ్రత్తలు తీసుకుని డియర్ మేఘ సినిమా

చూడండి. అన్నారు.


*హీరో ఆదిత్ అరుణ్ మాట్లాడుతూ*...మనం థియేటర్ లో ఫ్యామిలీతో కలిసి ఎలాంటి

సినిమా చూడాలనుకుంటున్నామో అలాంటి సినిమా డియర్ మేఘ. మా మనసు, మైండ్

అన్నీ పెట్టి చేశాం. ఒక సినిమా విజయం సాధిస్తుందో లేదో ఎవరూ చెప్పలేరు.

కానీ మా ప్రయత్నం వందశాతం పెట్టి తెరకెక్కించాం. నా సినిమా థియేటర్ లో

రిలీజ్ అయి 28 నెలలు అవుతోంది. మళ్లీ ఈ చిత్రంతోనే మీ ముందుకొస్తున్నా.

కాబట్టి ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. నిర్మాత అర్జున్

దాస్యన్ ప్యాషన్ తో డియర్ మేఘ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు రిలీజ్

టైమ్ లో కూడా చాలా మంది థియేటర్ వద్దు అని సలహాలు చెప్పారు. ఇష్టపడి

చేసిన సినిమాను అంతే నమ్మకంగా థియేటర్ లో రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు

అర్జున్. ఆయనకు థాంక్స్. మేఘా ఆకాష్ అంకితభావం ఉన్న నటి. అర్జున్

సోమయాజులు క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. టాలీవుడ్ లో అతనికి మంచి ఫ్యూచర్

ఉండాలి. ఆర్జీవీ గారు నాతో సినిమా చేస్తానని ఇప్పటిదాకా చెప్పలేదు. ఈ

వేదిక మీదే అనౌన్స్ చేశారు. నాకు ఇదో అఛీవ్ మెంట్ అనుకుంటున్నా.

ప్రేక్షకుల ఆదరణతోనే ఇంత దూరం వచ్చాము. మీ లవ్ కు థాంక్స్. సెప్టెంబర్ 3న

థియేటర్స్ కు రావడం మర్చిపోకండి. అన్నారు.



ఈ కార్యక్రమంలో దర్శకుడు వీఎన్ ఆదిత్య, నిర్మాత ప్రసన్న కుమార్, సంజయ్

రెడ్డి, సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ, సంగీత దర్శకుడు హరి గౌర ఇతర

చిత్రబృందం పాల్గొన్నారు.