Victory Venkatesh Graced Sai Lakshmi Bhanu Rajeev Marriage

 సాయిలక్ష్మీ, భాను రాజీవ్‌ జంటను ఆశీర్వదించిన వెంకటేశ్‌..



లండన్‌లో దాదాపు రెండు రోజుల పదమూడు గంటల పాటు సంగీతంలోని ఎంతో విశిష్టమైన 72 మేళకర్త రాగాలను పలికించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు వంటి అత్యున్నతమైన అవార్డును అందుకున్న ప్రముఖ సంగీత దర్శకులు స్వర వీణాపాణి. ‘పట్టుకోండి చూద్దాం’, ‘ దేవస్థానం’, ‘మిథునం’ వంటి చక్కని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన పెద్ద కుమార్తె చి.ల.సౌ మారుతీ సాయిలక్ష్మీ వివాహం చి. భాను రాజీవ్‌తో సోమవారం రాత్రి  హైదరాబాద్‌లోని క్రౌన్‌ విల్లా గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో ప్రముఖ హీరో దగ్గుబాటి వెంకటేశ్‌ పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. నటులు, దర్శకులు, రచయితలు తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్,  జనార్థన మహర్షి, సింగర్‌ రేవంత్, కమెడియన్‌ శివారెడ్డి దంపతులు పాల్గొని వివాహ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా స్వర వీణాపాణి దంపతులు, వోగోటి వెంకట మారుతీ రామకృష్ణ దంపతులు  తమ పిల్లల వివాహ కార్యక్రమానికి హాజరై ఆశీస్సులు అందించిన ప్రముఖులందరికి పేరు,పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు.

Post a Comment

Previous Post Next Post