Latest Post

Paisa Paramathma movie director Vijay Kiran interview

పైసా పరమాత్మ" చిత్రం దర్శకుడిగా నాకు నూరు మార్కులు తెచ్చిపెట్టింది :- దర్శకుడు విజయ్ కిరణ్ తిరుమల

యువకులు, బ్రహ్మ తో క్రియేటివ్ స్టార్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ కిరణ్ తిరుమల కొంతకాలం గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టి రీసెంట్ గా "పైసా పరమాత్మ" చిత్రానికి దర్శకత్వం వహించారు. సాకేత్, సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, ర‌మ‌ణ‌, అనూష‌, అరోహి నాయుడు, బ‌నీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ సుచిత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై టి.కిర‌ణ్ కుమార్ నిర్మించారు. మార్చి 12న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి మంచి స్పందన లభిస్తోంది.. కాగా ఈ చిత్ర దర్శకుడు విజయ్ కిరణ్ తిరుమల పత్రికలవారితో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆ విశేషాలు..

 దర్శక నిర్మాత విజయ్ కిరణ్ తిరుమల  మాట్లాడుతూ.. పూర్తిగా స్టోరీ ని నమ్మి చేసిన చిత్రమిది. ఇప్పటితరానికి ఈ సినిమా నచ్చుతుంది.  సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం మేము అనుకున్న ధియేటర్స్ కన్నా ఎక్కువ ధియేటర్స్ లో రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నటీనటులు అందరూ సూపర్బ్ గా నటించారు. క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయి ప్రతి పాత్రకు న్యాయం చేశారు. ఈ సందర్బంగా మా టీం అందరికీ నా స్పెషల్ థాంక్స్. అలాగే నేను కృతజ్ఞతలు చెప్పుకునేవారు ఇద్దరు వ్యక్తులు వున్నారు. మా అమ్మా, నాన్న. ఇంకోటి మా గురువుగారు. వాళ్ళ వల్లే నేను ఇంత మంచి సినిమా తీయగలిగాను. సక్సెస్ అనేది రెండు రకాలు. ఒకటి డబ్భుతో వచ్చేది, మరొకటి పేరుతొ వచ్చేది. ఈ సినిమా నాకు మంచి దర్శకుడిగా శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చింది. ఒక దర్శకుడిగా నేను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నానో దానిని పర్ఫెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్  స్క్రీన్ పై ప్రెజెంట్ చేయగలిగాను. సినిమా చుసిన ప్రేక్షకులు వందశాతం మార్కులు దర్శకుడికి  వేశారు. అంటే నేను సక్సెస్ అయినట్టే అని నా ఫీలింగ్. ఫ్రెష్ విజువల్స్ తో కొత్త కంటెంట్ వున్నా మా పైసా పరమాత్మ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. పూరి జగన్నాద్, త్రివిక్రమ్, కృష్ణ వంశీ గారు వాళ్ళ మార్క్ ఏంటో క్రియేట్ చేసుకున్నారు. అలా నాకంటూ నా స్టయిల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించగలిగాను. క్యారెక్టర్స్ ఎలివేషన్ హైలెట్ గా చూపించడం జరిగింది. ఆర్టిస్టుల దెగ్గరనుండి పాత్రకు తగ్గట్లు పెర్ఫార్మెన్స్ రాబట్టుకోగలిగాను. అన్ని ప్రధాన పాత్రలు బాగా ఈ చిత్రంలో పండాయి. టైటిల్ కి ఎంత మంచి పేరు వచ్చిందో సినిమాకి కూడా అంతే హ్యుజ్ రెస్పాన్స్ వస్తోంది. త్వరలో ఓటిటి లో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇక నుండి నేను చేయబోయే చిత్రాలు కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి టయ్యప్ అయి చేయాలనీ ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా వున్నాయి.. ప్రాపర్ గా అవి బౌండ్ స్క్రిప్ట్స్ రెడీ చేసి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరపాలి. మా లక్ష్మి సుచిత్ర బ్యానర్ లో కొత్త కంటెంట్ వున్నా అన్ని జోనర్ మూవీస్ చేయాలనీ నిర్ణయించుకున్నాం. నా జీవితం అంతా సినిమానే.. సినిమా అంటే నాకు విపరీతమైన ఇష్టం. మంచి స్టార్ కాస్ట్ తో బ్లాక్ బస్టర్స్ మూవీస్ చేయాలనీ దర్శకుడిగా నా గోల్. త్వరలో డి యమ్ కే టైటిల్ తో ఒక పవర్ ఫుల్ కాఫ్ స్టోరీ తో సినిమా చేయబోతున్నాను.. అన్నారు.

Isha Chawla plays a Blind women who traces her sister’s death in upcoming film Agochara!

Isha Chawla plays a Blind women who traces her sister’s death in upcoming film Agochara!

Self-Motivated Delhi beauty Isha Chawla has made a mark for herself in Telugu industy with her acting skills. Now the actress is all set to surprise her fans with powerful character of …  in her upcoming film Agochara. 

She will essay the role of a blind women. The character has many shades. It is an impactful character in the movie. The film is helmed by cinematographer Kabir Lal, It marks his Directorial debut. 

Elated about the role, Isha says, “I have known Kabir sir since long and I am happy to work with him. The script have me goosebumps and I was super excited to work. It was like I was awaiting for this role to come to me. When the story was narrated by Kabir sir, I was on cloud nine and in no time I agreed to be a part of the project.”

Isha’s character is pivotal and to get into the skin of the character she has put in loads of efforts. Talking about the same, Isha states,  “ Playing a blind character is challenging not only mentally but also emotionally. My character believes in conquering the world with her inner strength. This would be one of the best experiences of my life.”

Actor Kamalraju is essaying the role of a husband who is a psycologist. 

Agochara movie is a Love-Revenge Thriller Film. How an incident changes the life of characters completely forms the plot of the movie. Currently, the cast and crew is shooting the film in beautiful resort in Dehradhun. Bankrolled by Lovely World Production, and the film is slated to release in June.

PURI launches BACKDOOR Song

 



బ్యాక్ డోర్"తో అందరికీ

బంపర్ ఆఫర్స్ రావాలి!!

-దర్శకసంచలనం పూరి జగన్నాధ్


     నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "బాక్ డోర్" బ్లాక్ బస్టర్ అవ్వాలని, ఈ చిత్రంతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికీ బంపర్ ఆఫర్స్ రావాలని ఆకాంక్షించారు సంచలన దర్శకులు పూరి జగన్నాధ్. "బ్యాక్ డోర్" చిత్రంలోని "రారా నన్ను పట్టేసుకుని" అనే పల్లవితో సాగే గీతాన్ని పూరి ముంబైలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన సంగీత దర్శకుడు ప్రణవ్, గీత రచయిత్రి నిర్మల, దర్శకుడు కర్రి బాలాజీ, నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, హీరో తేజలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఛార్మి కూడా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

     విజయ్ దేవరకొండతో... ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్ భాగస్వామ్యంతో.. హిందీ, తెలుగు భాషల్లో "లైగర్" చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పూరి జగన్నాధ్... ఈమధ్యకాలంలో ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. తమ చిత్రం నుంచి మొదటి పాటను పూరి జగన్నాధ్ చేతుల మీదుగా విడుదల చేసి, ఇప్పటికే తమ చిత్రానికి ఏర్పడిన క్రేజ్ ను రెట్టింపు చేసుకోవాలనే కృత నిశ్చయంతో... చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ, సంగీత దర్శకుడు ప్రణవ్, హీరో తేజ... ప్రత్యేకంగా ముంబయి వెళ్లి... ఈ పాటను పూరితో విడుదల చేయించారు. "లైగర్" చిత్రం పనులతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... తమ కోసం అమూల్యమైన సమయం వెచ్చించి.. "బ్యాక్ డోర్" చిత్రంలోని పాటను రిలీజ్ చేసి, సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని అభిలషించిన పూరీకి ఎప్పటికీ రుణపడి ఉంటామని దర్శకుడు కర్రి బాలాజీ అన్నారు. తనను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్న "బ్యాక్ డోర్" చిత్రం నుంచి తొలి గీతం పూరి ఆవిషరించడం పట్ల ప్రణవ్ పట్టరాని సంతోషం వెలిబుచ్చారు.

     ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వం.. 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న 'బ్యాక్ డోర్' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అతి త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది.

     ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల, చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, సమర్పణ: 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!

Chavu Kaburu Challaga Vizag Event Grand success






 విశాఖ‌లో ఉల్లాసంగా ఉత్సాహంగా జ‌రిగిన‌ చావు క‌బురు చ‌ల్లాగా జ‌రిగిన గ్రాండ్ రిలీజ్ ఈవెంట్



కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా కొత్త దర్శకుడు కౌశిక్ తెరకెక్కించిన చావుకబురు చల్లగా సినిమా మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా వైజాగ్ లో గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ చేశారు దర్శక నిర్మాతలు. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.



మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "గీతా ఆర్ట్స్ కు, వైజాగ్ కు విడదీయరాని సంబంధం ఉంది. గతేడాది ఇక్కడ ఏ ఫంక్షన్ చేసాము అందరికీ గుర్తుంది కదా..! సరైనోడు, గీత గోవిందం దగ్గర నుంచి అల వైకుంఠపురం దాకా అన్నీ వేడుకలు వైజాగ్ లో జరిపాం. ఈ ఊరితో ఉన్న అనుబంధం అలాంటిది. ఎందుకంటే కొత్త కథలను కొత్త ఆలోచనలు ఆదరించే అలవాటు మీ అందరికీ ఉంది. ఇకపోతే చావు కబురు చల్లగా.. ఇది అసలు ఒక టైటిలేనా..? దర్శకుడు ఒక కథ రాసుకొని మీకు చావు కబురు చల్లగా అని ఒక కథ చెబుతాను అన్నాడు. ఎవరైనా చావు కబురు చల్లగా చెబుతారా.. కానీ దర్శకుడు ఈ సినిమాలో ఆ టైటిల్ కు న్యాయం చేశాడు. కార్తికేయ గురించి చెప్పాలి.. (నీకు మంచి ఫాలోయింగ్ ఉందయ్యా నీ పేరు చెప్పగానే అరుస్తున్నారు.. నవ్వుతూ) కథలో తీయడానికి ఏంలేదు భర్త చచ్చిపోయి హీరోయిన్ ఏడుస్తుంటే కార్తికేయ వెళ్లి ఆయన ఎలాగూ లేడు.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు. ఇలాంటి విచిత్రమైన కథ అనేక మలుపులు తిరుగుతూ చావు కబురు చల్లగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు కౌశిక్. కథ క్లైమాక్స్ కి వచ్చేసరికి హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే బాగుండు అని ప్రేక్షకులతో అనిపించేలా తెరకెక్కించాడు దర్శకుడు. లావణ్య ఎంత అద్భుతమైన నటి అనేది అందరికీ తెలుసు.. ఈ సినిమాలో గ్లామర్ తక్కువగా ఉండే పాత్ర చేసింది. మరో మంచి తల్లి క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో. ఆమె ఇక్కడికి రాలేదు. మార్చి 19న మా సినిమా విడుదల అవుతుంది. ఒక మంచి సినిమా తీశాం. మీరందరూ థియేటర్లకి వచ్చి చూడండి. మీరు నా గురించి ఫాలో అవుతే నేను అంత గబుక్కున ఏ సినిమా బాగుంది అని చెప్పను.. ఇది నేను చూశాను బాగుంది.. మీరు కూడా రేపు మార్చి 19న థియేటర్లకు వచ్చి చూసి ఎంజాయ్ చేయండి.." అని తెలిపారు.



దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ.. "ఈ స్టేజి, సెటప్ చూస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుంది నిజంగా నాకు అర్థం కావడం లేదు. వైజాగ్ మీరు సూపర్ అంతే. మేము వైజాగ్ లో షూట్ చేస్తున్నప్పుడు ఎంత మంది వచ్చారో.. ఇక్కడికి ఎంత మంది వచ్చారో.. వాళ్లంతా రేపు మార్నింగ్ షో టిక్కెట్లు తెగితే మేము సేఫ్ అంతే. థియేటర్ల వరకు వచ్చే బాధ్యత మీది.. మిమ్మల్ని నేర్పించే బాధ్యత మాది. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాము. మీ అందరికీ థాంక్స్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. CMR షాపింగ్మాల్ రమణ గారికి స్పెషల్ థాంక్స్. ఏ డెబ్యూ డైరెక్టర్ కు కూడా ఇంత మంచి లాంచ్ దొరకదు.. ఇదంతా కేవలం అరవింద్ గారి వల్లే సాధ్యమైంది. థాంక్యూ సో మచ్ సార్. సభాముఖంగా మీ కాళ్ళకి నమస్కారం పెడుతున్నాను. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే సినిమా తీయాలని చాలా ఏళ్లుగా ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. అలాంటిది నా తొలిసినిమా మూడు రోజుల్లో విడుదల కానుంది. ఆ సినిమాకోసం మీరంతా ఇలా వెయిట్ చేస్తుంటే ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మార్చి 19 తర్వాత బస్తీ బాలరాజు మాత్రమే గుర్తుంటాడు.. కార్తికేయ గుర్తుండడు. బయటకు వచ్చాక పేరు మారిపోతుంది. కార్తికేయలో మరో కోణాన్ని మీరు అందరూ చూస్తారు. అందరి కళ్ళు ఆయన మీదకి లాగేసుకున్నాడు. మల్లికా క్యారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు.. ఏమాత్రం తేడా జరిగినా సినిమా అవుట్. అలాంటిది నువ్వు చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేశావు లావణ్య. సినిమాలో నటించిన వాళ్లందరికీ, సాంకేతిక నిపుణులు అందరికీ థాంక్యూ సో మచ్.." అని తెలిపారు.



హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. " మల్లిక క్యారెక్టర్ నా కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్. చావు కబురు చల్లగా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి అద్భుతమైన కథ నాకు చెప్పినందుకు కౌశిక్ కు థాంక్స్. కార్తికేయ చాలా బాగా నటించాడు. మార్చ్ 19న అందరూ థియేటర్ లకి వచ్చి మా సినిమాను ఆదరించండి.." అని తెలిపారు.



హీరో కార్తికేయ మాట్లాడుతూ.. " హలో వైజాగ్.. ఈ సినిమాలో నేను చేసిన బస్తీ బాలరాజు గారు పూర్తిగా వైజాగ్ కుర్రోళ్ళను రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న బీచ్, ఇక్కడ ఫ్రెండ్స్ అందరు నాకు చాలా ఇష్టం. ఎన్ని రోజులు ఆర్ఎక్స్ 100 హీరోగా గుర్తు పెట్టుకున్నారు.. ఇకపై బస్తీ బాలరాజు పాత్ర లో నన్ను గుర్తు పెట్టుకుంటారు. మార్చ్ 19 నా చావు కబురు చల్లగా అన్ని థియేటర్లలో మారుమోగిపోవాలి. ఈ సినిమాను నిర్మించిన గీత ఆర్ట్స్ చాలామంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో లావణ్య తప్ప మేము అందరం దాదాపు కొత్త వాళ్ళం. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే నిర్మాత బన్నీ వాసు గారు దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమాపై చాలా మంచి బజ్ క్రియేట్ అయింది. ఆర్ ఎక్స్ 100 తర్వాత దాన్ని మించి హిట్ కొట్టే అవకాశం ఇన్నాళ్లకు దొరికింది. కుటుంబ సమేతంగా థియేటర్ లో కూర్చుని మా సినిమాను ఎంజాయ్ చేయండి.." అని తెలిపారు

Anand Deverakonda Announced Two Movies

 


పుట్టిన రోజున రెండు కొత్త సినిమాలను అనౌన్స్ చేసిన ఆనంద్ దేవరకొండ


దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్ చిత్రాలతో కమర్షియల్ సక్సెస్ తో పాటు ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. క్రేజీ సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోగా మారారు ఆనంద్ దేవరకొండ. ఇవాళ (సోమవారం) పుట్టిన రోజు  జరుపుకుంటున్న ఆనంద్ దేవరకొండ తన రెండు కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. ఈ రెండు కొత్త సినిమా వివరాలు చూస్తే..


మధురా శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ సినిమా ప్రకటించారు. బలరాం వర్మ నంబూరి, బాల సోమినేని చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మధురా ఎంటర్ టైన్ మెంట్స్, రోల్ కెమెరా విజువల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర కాస్ట్ అండ్ క్రూ ఎవరు అనే వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.


ఆనంద్ దేవరకొండ అనౌన్స్ చేసిన మరో చిత్రాన్ని హై లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ సంస్థ తన తొలి చిత్రంగా నిర్మిస్తోంది. కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ ఉదయ్ శెట్టి రూపొందించనున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించనున్నారు.

Vijay Deverakonda Launched Silakaa Song from Pushpaka Vimanam

 


విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘‘పుష్పక విమానం’’ లోని ‘‘సిలకా’’ పాట విడుదల


యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "పుష్పక విమానం". దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో 'కింగ్ అఫ్ ది హిల్' ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.  ‘‘పుష్పక విమానం’’ మూవీ నుండి మొదటి సాంగ్ ‘‘సిలకా’’ ను ఇవాళ (సోమవారం మార్చి 15) ఉదయం 11.07 నిమిషాలకు స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. 


*‘‘సిలకా ఎగిరిపోయావా ఆసలన్ని ఇడిసేసి ఎనకా...సిలకా చిన్నబోయిందె సిట్టి గుండె పిట్ట నువ్వు లేక ‘‘* అంటూ సాగే ఈ పాటకు రామ్ మిరియాల సంగీతాన్ని అందించడంతో పాటు మరో గీత రచయిత ఆనంద్ గుర్రం తో కలిసి సాహిత్యాన్ని అందించారు. చమన్ బ్రదర్స్ అనే బ్యాండ్ పేరుతో మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్  పాటలో కనిపిస్తున్నారు. వాళ్లు పాడుతూ డాన్సులు చేస్తూ పాటకు జోష్ తీసుకొచ్చారు. 


*ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశలో ఉన్న ‘‘పుష్పక విమానం’’ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. *


ఆనంద్ దేవరకొండ, గీత్ సైని, శాన్వి మేఘన, సునీల్, నరేష్, హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య, మీనా వాసు,షేకింగ్ శేషు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి 

సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా, సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు:  గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి

రచన-దర్శకత్వం: దామోదర

Ardha Shathabdham in Aha

 


మార్చి 26 న 'ఆహా' లో వరల్డ్ ప్రీమియర్ గా విడుదలవుతున్న "అర్ధ శతాబ్దం"


జాతీ, మత, వర్ణ వివక్ష కు వ్యతిరేకంగా, ప్రేమ కోసం జరిగే పోరాటంగా రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో 2003 లో జరిగిన కథే "అర్ధ శతాబ్దం".రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్‌, కృష్ణ ప్రియ, సుహాస్‌, పవిత్ర లోకేష్‌, అజయ్‌, శుభలేఖ సుధాకర్‌, రాజా రవీంద్ర, రామ రాజుచ దిల్‌ రమేష్, టీఎన్‌ఆర్‌, శరణ్య, నవీన్‌ రెడ్డి, ఆమని నటీనటులుగా రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణలు నిర్మిస్తున్న  చిత్రం 'అర్ధ శతాబ్దం'.ఈ చిత్రం మార్చి 26 నుంచి 'ఆహా' లో  వరల్డ్ ప్రీమియర్ గా స్ట్రీమ్ కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా


చిత్ర దర్శకుడు రవీంద్ర పుల్లే మాట్లాడుతూ.. పెద్ద డైరెక్టర్ అయిన క్రిష్ గారికి మా కథ నచ్చడంతో ఆయన మా సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేయడంతో మా సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది.కార్తీక్ కు రానా గారు బర్త్ డే విషెస్ తెలపడం. ప్రముఖ దర్శకుడు సుకుమార్ గారు పుష్ప షూట్ లో బిజీగా ఉన్నా మా టీంతో టైం స్పెండ్ చేసి మా చిత్రం గురించి తెలుసుకుని టీజర్ ను  లాంచ్ చేయడం జరిగింది.రకుల్ ప్రీత్ గారు ఒక సాంగ్ లాంచ్ చేశారు.ఇలా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ మా సినిమాకు సపోర్ట్ గా నిలిచారు వారందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు.ఈ "అర్ధశతాబ్దం" సినిమా 1950 నుండి 2003 వరకు జరుగుతుంది. ఇండియన్ డెమాక్రసీ మాములు పబ్లిక్ పై ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది దాన్ని ఎలా అర్థం చేసుకుని యుటిలైజ్ చేసుకుంటున్నాం.అలాగే దాని ఎలా మిస్ యూజ్ చేసుకొంటున్నాం అనే కథాంశంతో అద్భుతమైన లవ్ స్టొరీ ని జోడించి  సినిమాను తెరకెక్కించడం జరిగింది.నిర్మాతల సపోర్టుతో చిత్రాన్ని పూర్తి చేసి చిత్ర టీజర్ ను విడుదల చేశాము.ఆహా వారికి మా మా టీజర్  నచ్చడంతో ఈ సినిమాను ఆహాలో విడుదల చేయమని ఆఫర్ రావడంతో ప్రస్తుతం  ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మా అర్ధశతాబ్దం సినిమాను మార్చి 26 నుంచి  వరల్డ్ ప్రీమియర్ గా  100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా  విడుదల చేస్తున్నామని అన్నారు.


నిర్మాత చిట్టి కిరణ్ మాట్లాడుతూ.. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో  ఈ నెల 26వ తేదీన వస్తున్న మా "అర్ధ శతాబ్దం" చిత్రాన్ని ఆదరించి మాకు సపోర్ట్ నిలిస్తే మరిన్ని చిత్రాలు నిర్మిస్తామని అన్నారు


నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ... 22 సంవత్సరాల నుండి ఆర్టిస్ట్ గా మీ అందరికీ పరిచయ స్తున్నే.అయితే రవి, కిరణ్ లు షూటింగ్ మొదలు పెట్టిన తరువాత నాకు ఈ కథ చెప్పడం జరిగింది. ఈ కథ నచ్చడంతో నిర్మాతగా వారితో కలసి నిర్మించడం జరిగింది.సినిమా పూర్తి అయిన తరువాత థియేటర్స్ లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశాము.అయితే కరోనా టైం లో థియేటర్స్ బంద్ ఉన్న టైం లో మేము ఎలా వెళ్ళాలి అనుకున్న ప్యాండమిక్ స్విచ్వేషన్ లో ఆహా నుండి కాల్ వచ్చింది.ఆహా నుండి వచ్చిన ఆఫర్ ను మిస్ చేసుకోకుండా ప్రస్తుతం జనాల్లోకి వెళ్లేలా ఆహా లో విడుదల చేస్తే మరిన్ని చిత్రాలు నిర్మించవచ్చని ఈ నెల 26 న ఆహా లో విడుదల చేస్తున్నాం.అందరు మా సినిమాను చూసి  ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు..


నటీనటులు : కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్‌, కృష్ణ ప్రియ, సుహాస్‌, పవిత్ర లోకేష్‌, అజయ్‌, శుభలేఖ సుధాకర్‌, రాజా రవీంద్ర, రామ రాజుచ దిల్‌ రమేష్, టీఎన్‌ఆర్‌, శరణ్య, నవీన్‌ రెడ్డి, ఆమని


సాంకేతిక నిపుణులు:

బ్యానర్‌ : రిషితా శ్రీ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ, 24 ఫ్రేమ్స్‌ సెల్యూలాయిడ్‌

డైరెక్టర్‌ : రవీంద్ర పుల్లె

నిర్మాత : చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ

డీఓపీ: వెంకట్‌ ఆర్‌ సేకమూరి, అష్కర్, ఇ జె వేణు

మ్యూజిక్‌ : నోఫెల్ రాజ

ఎడిటర్‌ : జే ప్రతాప్ కుమార్‌

ఆర్ట్ డైరెక్టర్‌ : సుమిత్‌ పటేల్‌

యాక్షన్‌ : అంజి మాస్టర్

కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ

పి ఆర్ ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు 

పబ్లిసిటీ డిజైనర్‌ : ధనీ ఏలే

పోస్ట్ ప్రొడక్షన్‌ : అన్నపూర్ణ స్టూడియోస్

Director Sukumar About Jagadam

 


రామ్‌తో మళ్ళీ 'జగడం' రీమేక్ చెయ్యాలని ఉంది

- క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ 

పదిహేడేళ్ల కుర్రాడు... కొత్తగా గ్యాంగ్‌లో జాయిన్ అయ్యాడు. కొట్లాటకు గ్యాంగ్ సభ్యులతో కలిసి వెళ్ళాడు. ఎదురుగా పెద్ద గ్యాంగ్ ఉంది. వాళ్ళను చూసి కుర్రాడి గ్యాంగ్ లీడర్ భయపడ్డాడు. వెనకడుగు వేశాడు. కానీ, కుర్రాడు వేయలేదు. చురకత్తుల్లాంటి చూపులతో తనకంటే బలవంతుడిని ఢీ కొట్టాడు. ధైర్యంగా నిలబడ్డాడు. - ఈ సీన్‌కి రాజమౌళి కూడా ఫ్యాన్.


గ్యాంగ్‌కి కుర్రాడు కొత్త. కాని సినిమా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు కాదు. అప్పటికి 'దేవదాసు'తో అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అయితే, ఈ సీన్‌తో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. యాక్షన్ హీరోకి కావాల్సిన లక్షణాలు ఇతడిలో ఉన్నాయని పేరు తెచ్చుకున్నాడు. పైన చెప్పినది 'జగడం'లో సీన్ అని గుర్తొచ్చి ఉంటుంది కదూ! ఆ ఎనర్జిటిక్ హీరోయే మన ఉస్తాద్ రామ్. 


హీరోగా రామ్‌కి, దర్శకుడిగా సుకుమార్‌కీ 'జగడం' ఎంతో పేరు తెచ్చింది. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పైన చెప్పిన సీన్ గురించి ప్రస్తావించారంటే అందులో స్ట్రెంగ్త్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ 'జగడం (వయలెన్స్) ఈజ్ ఫ్యాషన్', '5 ఫీట్ 8 ఇంచెస్ కింగు లాంటి శీనుగాడు' పాటలు యూత్ ప్లే లిస్టులో ఉంటున్నాయి. ఓవర్ ద ఇయర్స్ ప్రేక్షకులలో అభిమానులను పెంచుకుంటూ వస్తున్న 'జగడం' సినిమా విడుదలై మార్చి 16కి 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ ఏట ప్రవేశిస్తోంది.ఈ సందర్భంగా సినిమా విశేషాలను, అప్పటి సంగతులను దర్శకుడు సుకుమార్ మరోసారి గుర్తు చేసుకున్నారు.


ఆ ఆలోచన నుంచి... 'జగడం'


చిన్నప్పటి నుంచి ఒక విషయం నాకు ఇన్స్పిరేషన్ గా ఉండేది. ఎక్కడైనా గొడవ జరుగుతుంటే... నేను వెళ్ళేసరికి ఆగిపోతుండేది. కొట్టుకుంటారేమో, కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉండేది. నేను ఎదుగుతున్న క్రమంలోనూ ఆ ఆలోచన పోలేదు. ఎక్కడైనా కొట్లాటలో వాళ్ళు కొట్టుకోలేదంటే డిజప్పాయింట్ అయ్యేవాడిని. నా స్నేహితులైనా అరుచుకుంటుంటే బాధ అనిపించేది. వీళ్ళు కొట్టుకోవడం లేదేంటి? అని! ఎక్కడో మనలో వయలెన్స్ ఉంది. వయలెన్స్ చూడాలని తపన ఉంది. ఉదాహరణకు, అడవిని తీసుకుంటే అందులో ప్రతిదీ వయలెంట్ గా ఉంటుంది. పులి-జింక తరహాలో ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. ఎక్కడ చూసినా బ్లడ్ ఉంటుంది. 'ఆహారాన్ని సాధించే దారి అంతా వయలెన్స్ తో ఉంటుంది. అలాగే, సెక్స్ ను సాధించే దారి ప్రేమతో ఉంటుంది.' - ఇలా ఎదో అనుకున్నాను. దాని నుంచి మొదలైన ఆలోచనే జగడం. మన చుట్టుపక్కల చూస్తే... చిన్నపిల్లలు ఎవరైనా పడిపోతే, దెబ్బ తగిలితే... 'నిన్ను కొట్టింది ఇదే నాన్నా' అని రెండుసార్లు కొట్టి చూపిస్తాం. ఇటువంటి విషయాలు నాలో కనెక్ట్ అయ్యి ఓ సినిమా సినిమా చేద్దామని అనుకున్నా. రివెంజ్ ఫార్ములాలో.  


ఆర్య' కంటే ముందే...


నిజాయతీగా చెప్పాలంటే... 'ఆర్య' కంటే ముందు 'జగడం' చేద్దామనుకున్నా. నా దగ్గర చాలా ప్రేమకథలు ఉన్నాయి. 'ఆర్య' తర్వాత వాటిలో ఏదైనా చేయవచ్చు. వయలెన్స్ నేపథ్యంలో కొత్తగా ఏదైనా చేద్దామని అనుకున్నా. అప్పటికి నాలో ఆలోచనలు రకరకాలుగా మారి 'జగడం' కథ రూపొందింది. 


రామ్... అంత షార్ప్!


'జగడం' కథ పూర్తయిన సమయానికి 'దేవదాసు' విడుదలై ఏడు రోజులు అయినట్టు ఉంది. నేను సినిమా చూశా. రామ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. హుషారుగా చేస్తున్నాడు. ఎఫ‌ర్ట్‌లెస్‌గా పెర్ఫార్మన్స్ చేస్తున్నాడని అనిపించింది. రామ్‌తో 'జగడం' చేయాలని 'స్రవంతి' రవికిశోర్ గారిని అప్రోచ్ అయ్యాం. ఆయన సరే అన్నారు. అలా 'జగడం' మొదలైంది. అప్పుడు రామ్‌కి పదిహేడేళ్లు అనుకుంట. ఆ టైమ్‌లో ఏం చెప్పినా చేసేసేవాడు. 'నాకు రాదు. రాలేదు. చేయలేను' అనే మాటలు ఉండేవి కావు. చేత్తో కాయిన్ తిప్పమని అడిగితే... పక్కకి వెళ్లి పది నిమిషాల్లో ప్రాక్టీస్ చేసి వచ్చి చేసేవాడు. అంత షార్ప్. నాకు తెలిసి... ఇప్పటికీ రామ్‌ని ఆ బ్రిలియన్స్ కాపాడుతుంది. దానివల్లే తను సక్సెస్ అవుతుంది. తన పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది.


రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నా


నేను ప్రతిక్షణం రామ్‌ను చూసి షాక్ అవుతూ ఉండేవాడిని. అంటే... చిన్న వయసులో ప్రతిదీ ఈజీగా చేయగలుగుతున్నాడు. వెంటనే పట్టుకుని పెర్ఫార్మన్స్ చేయగలుగుతున్నాడు. ఈ సన్నివేశంలో ఇలా కాకుండా వేరేలా చేస్తే బావుంటుందని అడిగితే... మనం కోరుకున్న దానికి తగ్గట్టు ఎక్స్‌ప్రెష‌న్స్‌ వెంటనే మార్చి చేసేవాడు. అన్ని రియాక్షన్స్ ఉండాలంటే ఎక్కువ లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్‌లు ఉండాలి. అప్పటికి తనకు ఎటువంటి లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్‌లు ఉన్నాయో తెలియదు కానీ... ఎటువంటి రియాక్షన్ అడిగినా చేసి చూపించేవాడు. 'జగడం' చేసే సమయానికి రామ్‌ను చూస్తే వండర్ బాయ్ అనిపించాడు. ఇండస్ట్రీలో రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నాను. ఈ రోజు అదే ప్రూవ్ అయ్యింది.   

ప్రతి పాట హిట్టే


'ఆర్య'తో దేవిశ్రీ ప్రసాద్‌తో నాకు అనుబంధం ఉంది. 'జగడం' చిత్రానికీ తనను సంగీత దర్శకుడిగా తీసుకున్నాను. ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ కాకుండా రెండు వస్తువుల మధ్య ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది? - ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చిందే '5 ఫీట్ 8 ఇంచెస్' సాంగ్. చంద్రబోస్ గారికి నేను ఈ కథ అనుకున్నాని చెబితే వెంటనే పాట రాసిచ్చారు. దానికి దేవి ట్యూన్ చేశారు. అదే 'వయలెన్స్ ఈజ్ ప్యాషన్'. సినిమాలో ప్రతి పాట హిట్టే. అప్పట్లో 'జగడం' ఆల్బమ్ సెన్సేషన్. సినిమాకి తగ్గట్టు దేవి మౌల్డ్ అవుతాడు. మంచి నేపథ్య సంగీతం ఇస్తాడు. 'జగడం' పతాక సన్నివేశాల్లో నేపథ్య సంగీతాన్ని నేను ఇప్పటికీ హమ్ చేస్తూ ఉంటాను.


'వయలెన్స్' ఎందుకు 'జగడం'గా మారిందంటే?


వయలెన్స్ ను ఎక్కువ ఎగ్జాగరేట్ చేస్తున్నారని, గ్లామరస్ గా చూపిస్తున్నారని సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. అందువల్ల 'వయలెన్స్ ఈజ్ ప్యాషన్' పాటలో వయలెన్స్ బదులు 'జగడం' అని పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో సెన్సార్ లో చాలా పోయాయి. సినిమా కథనమే మిస్ అయింది. అప్పట్లో నాకు సెన్సార్ ప్రాసెస్ గురించి పూర్తిగా తేలికపోవడం వల్ల చాలా కట్స్ వచ్చాయి. కట్స్ లేకుండా సినిమా ఉంటే ఇంకా బావుండేది. సినిమాకు సరైన అప్రిసియేష‌న్‌ రాలేదేమో అని నాలో చిన్న బాధ ఉంది.


స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌... సూపర్35... సినిమాటోగ్రఫీ!


సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ 'జగడం' అని చెప్పొచ్చు. ఎందుకంటే... అప్పుడే chooke s4 లెన్స్ వచ్చాయి. అప్పట్లో స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ తన సినిమాలకు ఏ కెమెరా ఎక్విప్‌మెంట్ ఉపయోగించారో, మేమూ అదే ఎక్విప్‌మెంట్ ఉపయోగించాం. సూపర్ 35 ఫార్మాట్ లో షూట్ చేశాం. అప్పటివరకు మన దగ్గర ఎవరూ ఆ ఫార్మాట్ లో ఎవరూ చేయలేదు.  కెమెరా యాంగిల్, లైటింగ్ మూడ్... రత్నవేలు ప్రతిదీ డిస్కస్ చేసి చేసేవారు. ప్రతిదీ పర్ఫెక్ట్ షాట్ అని చెప్పొచ్చు. ఇండియాలో సినిమాటోగ్రఫీ పరంగా చూస్తుంటే... వన్నాఫ్ ది బెస్ట్ 'జగడం' అని చెప్పొచ్చు. ఆ క్రెడిట్ మొత్తం రత్నవేలుగారిదే. సినిమాటోగ్రఫీనీ అప్రిషియేట్ చేయలేదు. ఆ సినిమా ఫొటోగ్రఫీ నాకు ఎంతో ఇష్టం. 


ముంబైలో దర్శకుల దగ్గర... లైబ్రరీల్లో 'జగడం'


ఎడిటింగ్ కూడా సూపర్. ఆ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ చేశారు. సినిమా విడుదలైన కొన్నాళ్లకు ఒకసారి మేమిద్దరం ఫ్లైట్‌లో కలిశాం. మాటల మధ్యలో 'జగడం' గురించి వచ్చింది. 'ప్లాప్ సినిమా కదా. మాట్లాడుకోవడం ఎందుకు అండీ' అన్నాను. అందుకు 'అలా అనుకోవద్దు. నేను ముంబై నుంచి వస్తున్నాను. చాలామంది దర్శకుల దగ్గర, వాళ్ళ లైబ్రరీల్లో జగడం సినిమా ఉంది. నీకు అంతకన్నా ఏం కావాలి? చాలామంది నీకు ఫోనులు చేయలేకపోవచ్చు. నిన్ను కలవడం వాళ్ళకు కుదరకపోవచ్చు. కానీ, చాలా అప్రిసియేషన్ పొందిన సినిమా ఇది. టెక్నీషియన్స్ దానిని రిఫరెన్స్ గా పెట్టుకున్నారు' అని శ్రీకర్ ప్రసాద్ గారు చెప్పారు.      


నిర్మాత గురించి...


చిత్రనిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ జేడీ సోంపల్లిగారు ఎంతో మద్దతుగా నిలిచారు. వాళ్ళ అబ్బాయి ఆదిత్యబాబు తరపున ఆయన సినిమా నిర్మించారు. ఆదిత్య ఇప్పటికీ నాతో టచ్ లో ఉంటాడు. నా ఫంక్షన్లకు తనను కూడా పిలుస్తాను.


ఆరు నెలలు ఆడిషన్స్ చేశాం!


అప్పట్లో ఆర్టిస్టులు చాలా తక్కువ మంది. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి. వెబ్ సిరీస్ లు వచ్చాయి. చాలామంది ఆర్టిస్టులు దొరుకుతున్నారు. అప్పుడు అలా కాదు కాబట్టి ఎక్కువ ఆడిషన్స్ చేశాం. సుమారు ఆరు నెలలు 'జగడం' ఆడిషన్స్ జరిగి ఉంటాయి. తాగుబోతు రమేష్, వేణు, ధనరాజ్... ఇలా ఆ సినిమా నుంచి చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. ఇప్పటికి వాళ్ళు అదే గౌరవం, ప్రేమతో చూస్తారు. 


త్వరలో రామ్‌తో సినిమా చేస్తా!


రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్వరలో మళ్ళీ తప్పకుండా చేస్తా. మరో మంచి సినిమా చేయాలి. యాక్చువల్లీ... ఇప్పటి రామ్‌తో మళ్ళీ 'జగడం' రీమేక్ చేయాలని ఉంది. మళ్ళీ ఇప్పటి రామ్‌తో మళ్ళీ జగడం చూసుకోవాలని ఉంది.

Guna Sekhar's Pan-India Project 'Shakuntalam' Shooting Begins

 Dil Raju's Presentation, Guna Sekhar's Pan-India Project 'Shakuntalam' Shooting Begins



Dynamic Director GunaSekhar who is well known for Mythological and Commercial films is now coming with a pure love story based on Adiparvam titled 'Shakuntalam'. This Pan-Indian film is being presented by Dil Raju Produced by Neelima Guna under DRP- Gunaa Teamworks Banner. Star Heroine Samantha Akkineni is playing the titular role of Shakuntala while Malayalam hero Dev Mohan will be seen as Dushyanth. This film is launched with Pooja Ceremony at Annapurna Studios in Hyderabad. Ace Producer Allu Aravind gave the first clap while Super Successful Producer Dil Raju has switched on the camera. The team held a media meet on this occasion.


Dynamic Director Guna Sekhar said, " I am very glad to launch the pan-India project, 'Shakuntalam' today. Very happy that it is being collectively produced by DRP - Gunaa Teamworks (Dil Raju Productions and Gunaa Teamworks). Especially, a maker like Dil Raju garu stands as a big support for this film in all aspects is very encouraging. Everyone knows how good the making and production values of a film will turn out to be if a Director like me gets support from a maker like Dil Raju garu. I am very happy that Dil Raju garu joined hands with me for 'Shakuntalam'. It's not an easy task to do a heroine-oriented film. There were many stories about who will do the role of Shakuntala in the 'Shakuntalam' movie. That role needs an actress with delicacy. I got suggested the name of Samantha by the public themselves. She is very selective in stories. She okayed this film instantly after listening to the script. She understands Shakuntala's role completely and She wanted to reinvent herself in the role of Shakuntala. Samantha has put in all her efforts and learned everything needed for this film four months ago itself. She learned classical dances too. She gets herself involved completely by listening to story developments and complete script. I got the confidence that I can make the film as per my visualization when we have a maker like Dil Raju garu and an actress like Samantha with us. Neelima is very strong that she will debut as a producer with a timeless classical love story. She is the first person who wished for Samantha to do this film. Irrespective of the business angle, Dil Raju garu said to go on with whatever budget we need to make a very good film. Neelima selected Dev Mohan as Dushyanth. He okayed after knowing everything about the story. He trained in horse riding and sword fighting for this film. You will witness real Shakuntala and Dushyanth in the film."


Super Successful Producer Dil Raju said, " Samantha's manager Mahindra approached me about 'Shakuntalam'.  I came to know that GunaSekhar garu is Producing the film himself. I wished someone should back him and told the same to Mahindra. He asked me whether I join the project. I told him, okay but I need to listen to the story first. I watched the 'Okkadu' film in Sathyam Theatre on its release day. I wished to make a film like that. But, my wish didn't fulfill. My desire to make these kinds of films started there. It's not an easy task to do a historical film like 'Shaakuntalam'. By then, Samantha has okayed the film. So, I imagined her while listening to the story narrated by GunaSekhar. All emotions are well set in the story. Some scenes are too good with perfect emotions.  GunaSekhar said that he will take the film to another level. The film's works are going on for four months. GunaSekhar is introducing his daughter Neelima as the producer of this film. I stand behind them. We are planning to release this film in 2022. While we are searching for Dushyanth, GunaSekhar asked me to come to watch a photoshoot. He showed me the photoshoot shot on Dev. He really looks like a king. I felt we find the perfect actor for the Dushyanth role. A perfect team is set for GunaSekhar. We will try our best to make a wonderful film."


Producer Neelima Guna said, " This is my first film as a producer. I seek your support and blessings. Thanks to Allu Aravind garu for gracing this event. Samantha and Hanshitha are giving very good support."


Hero Dev Mohan said, " I am very happy to get introduced to Telugu Film Industry. I am glad to do the role of a King, Dushyant.  Very proud to work with a director like GunaSekhar. Stalwart Producer Dil Raju garu is our main pillar of support. I wish you all will support me. Very happy to work with Samantha."


Star Heroine Samantha Akkineni said, "  I always have a small dissatisfaction. I felt like I am not able to do some kind of role. I did all kinds of roles like Romantic, Villain, Action... But my dream role is a periodical, the role of a Princess. I still watch Disney films. It's a great gift to me to offer this role to me during this point of my career. DIl Raju garu and GunaSekhar garu gave me a wonderful opportunity. I will give my 100 percent for this film. GunaSekhar garu narrated every scene superbly. When I asked about references, Neelima said that there are none. Everything comes from Director's imagination. I am very glad to do this role. The budget of this film is beyond my films But I will do whatever I can for this film."


Dil Raju's daughter Hanshitha Reddy attended this event.


Samantha Akkineni, Dev Mohan, and the Prominent cast will feature in this film. 


Cinematographer: Sekhar V. Joseph, Music: Mani Sharma, Art Director: Ashok Kumar, Editing: Prawin Pudi, Costume Designer: Neeta Lulla, Dialogues: Sai Madhav Burra, Lyrics: Chaitanya Prasad, Sree Mani, Choreographer: Raju Sundaram, PRO: B.A. Raju, VFX Supervisor: Alagar Saamy, Stunt Choreographer: Venkat, Makeup Chief: Ram Babu, Costume Chief: Ashok, Sound Designer: Biswadeep Chatterjee, Publicity Designer: Dhani Aelay, Still Photographer: Daasu, Direction Department: Anil Kumar, Krishna Chaitanya, Johnny Shaik Yakub, Akil Krishna, Surya Kiran, Line Producer: Yashwanth, Executive producer: Kommineni Venkateswara Rao, Executive Producer: Hamambar Jasti, Presented By Dil RajuProduced By Neelima GunaWritten & Directed By GunaSekhar

Brandy Dairies Ready for Release

 


అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కు సిద్ధమైన "బ్రాందీ డైరీస్"

 

వ్యక్తిలోని వ్యసన స్వభావాన్ని దానివల్ల వచ్చే సంఘర్షణలతో సహజమైన సంఘటనను, సంభాషణలు పరిణితి ఉన్న పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూ వాస్తవికత వినోదాల మేళవింపు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే "బ్రాందీ డైరీస్".గరుడ శేఖర్, సునీత సద్గురు హీరో, హీరోయిన్లు గా  కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు దర్శకత్వంలో లేళ్ల శ్రీకాంత్ మరియు మిత్ర బృందం కలసి నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రం* "బ్రాందీ డైరీస్". ఈ చిత్రానికి ప్రకాశ్ రెక్స్ సంగీతాన్ని అందించగా  జానపద గాయకుడు రచయిత పెంచల దాసు ఒక పాట ఇవ్వగా సాయి చరణ్, హరిచరణ్ మరియు రవికుమార్ విందా నేపధ్యగానం సమకూర్చారు.ు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా థియేటర్లలో ఏప్రిల్లో విడుదల కు ఏర్పాట్లు చేస్తున్న  సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా.


 *చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ...* సినిమా మీద ప్యాషన్తో మిత్రులతో కలిసి 2019లో మొదలు పెట్టాము.బడ్జెట్ హెవీ అయినా కూడా చాలామంది మిత్రులు  సినిమాను పూర్తి చేయడానికి ముందుకు రావడంతో వారందరి సహకారంతో క్రౌడ్ ఫండెడ్ మూవీ గా నిర్మించడం జరిగింది. ఇప్పుడొస్తున్న  సినిమా లలో ఇది బిగ్గెస్ట్ ఇండిపెండెంట్  సినిమా. సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియని మాకు నా కథ మీద నమ్మకం తో సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు. చాలామంది సహకారం ఉన్నందుకు ఈ బ్యానర్ ను కలెక్టివ్ డ్రీమ్ గా పేరు పెట్టడం జరిగింది. నాచురల్ లొకేషన్స్ లలో యాభై రెండు రోజుల్లో 104 లొకేషన్స్ లలో సింగిల్  షెడ్యుల్ లో సినిమాను పూర్తి చేయడం జరిగింది.ఈ సినిమా కథకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని "బ్రాందీ డైరీస్" టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా కథ ఆరుగురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఆల్కహాల్ తాగితే  వచ్చే ఇబ్బందులు ఏమిటి, దాని వలన ఎం నస్టం జరుగుతుందనే  విషయాన్ని ఈ చిత్రం ద్వారా  తెలియజేస్తున్నాం. సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు  బ్రాందీ(అల్కాహాల్) మీదనే కథ నడుస్తుంది . మలయాళంలో మోహన్ లాల్  "స్పీరిట్" సినిమా "అల్కాహాల్" గురించి తీసినా ఆ సినిమాలో  అల్కాహాల్ గురించి కొంత భాగమే తెలియజేయడం జరిగింది . ఇప్పటి వరకూ తెలుగులో ఇటువంటి సినిమా రాలేదు మేము తీసిన ఈ కొత్త కథను డ్రమాటిక్ గా ఇప్పుడొస్తున్న రొటీన్ సినిమాలకు భిన్నంగా చూస్తున్న  ప్రేక్షకులకు ఎంటర్  టైన్మెంట్ మిస్ కాకుండా ప్రయోగాత్మకంగా  "బ్రాందీ డైరీస్" ను   ప్రేక్షకుల ముందుకు తీజుకు వస్తున్నాం. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని హంగులతో  ఏప్రిల్ లో విడుదల అవుతున్న మా సినిమాను  ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నామని అన్నారు.

 

నిర్మాత మాట్లాడుతూ ..సినిమా మీద ప్రేమతో ఫ్రెండ్స్ అందర్నీ కలుపుకొని కలెక్టర్ డ్రీమ్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయడం జరిగింది. అన్ని న్యాచురాలిటి లొకేషన్స్ లతో సహజత్వానికి పట్టం కడుతూ పూర్తిగా కొత్త నటీనటులతో సినిమా రూపుదిద్దుకుంది  కథే ముఖ్య పాత్రగా 52 రోజుల్లో 104 లొకేషన్లలో సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశాము.తక్కువ బడ్జెట్ లో ఎక్కువ నాణ్యతతో తీసిన మా సినిమా  మూవీ మాక్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా థియేటర్లలో ఏప్రిల్లో విడుదల కు ఏర్పాట్లు చేస్తున్న మా సినిమా  ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.


 *కో డైరెక్టర్ సురేందర్ మాట్లాడుతూ...* ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఆరు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను కానీ  ఈ సినిమాకు ఫుల్ ఫెడ్జ్ గా వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.నాకిలాంటి మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు 


 *హీరో శేఖర్ మాట్లాడుతూ...*  .ఎంతోమంది సీనియర్ నటులు ఆడిషన్స్ కు వచ్చినా సినిమా గురించి నాకు ఏవిధమైన అవగాహన లేకున్నా ఈ సినిమా కోసం  నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.దర్శక నిర్మాతల సపోర్టుతో సినిమా చేయడం జరిగింది నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు 


 *హీరోయిన్ సునీత సద్గురు  మాట్లాడుతూ ..* ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సినిమాలో నటించినప్పుడు ఆల్కహాల్ మీద కూడా సినిమా తీయొచ్చా అనిపించింది. ఆల్కహాల్ గురించి తెలుపుతూ  లవ్ స్టోరీ ను జోడించి ప్రేక్షకులకు నచ్చే విధంగా చేయడం జరిగింది. ఇందులో ఉన్న పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి.నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు 


 *కీలక పాత్ర పోషించిన రవీంద్రబాబు మాట్లాడుతూ..* 

ఆల్కహాల్ తాగితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే దానిపైన ఈ సినిమా నడుస్తుంది 

 అందరికీ నచ్చే విధంగా సినిమా ఉంటుందని అన్నారు 


 *నటుడు నవీన్ మాట్లాడుతూ* .."బ్రాందీ డైరీస్" టైటిల్ క్యాచీగా ఉంది.. బ్రాందీ తాగితే వచ్చే పరిణామాలను తెలియజేస్తూ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తో సినిమాని తెరకెక్కించారు 

 

 *చిత్ర నటీనటులు* 

గరుడ శేఖర్, సునీత సద్గురు,నవీన్ వర్మ,,కె.వి.శ్రీనివాస్, రవీందర్ బాబు,దినేష్ మద్న్యే తదితరులు

 

 *సాంకేతిక నిపుణులు* 

చిత్రం...బ్రాందీ డైరీస్

బ్యానర్. : కలెక్టివ్ డ్రీమ్స్

నిర్మాత : లేళ్ల శ్రీకాంత్ 

రచన- దర్శకత్వం : శివుడు 

సంగీతం : ప్రకాష్ రెక్స్ 

సినిమాటోగ్రఫీ : ఈశ్వరన్ తంగవేల్ 

ఎడిటర్: యోగ శ్రీనివాస్

Nithin Keerthy Suresh Rang De movie song Released



Nithin, Keerthy Suresh's Rang De movie's  song has been released. 

Youth Star Nithiin and co are featuring in this peppy song.

Nithin's introductory song written by  Srimani


Youth Star Nithiin, Keerthy Suresh's Rang De movie's  song has been released. More details about the introductory song of the hero -

Srimani has penned ghe lyrics for this song. David Simon has lent his voice for the vocals. Devi Sri Prasad has composed this song in a fashion to attract both the youth and music lovers. Other than the lead actor Nithin, his friends Abhinav Gomatam and Suhas are featured in the song. Shekhar Master's choreography teamed up with Venky Atluri's direction has ensured that this song would be a spectacle on the silver screen


According to the story, this song is the introductory song for the hero. The lyrics have been penned by Srimani. All the songs in the movie are situational songs which take the story forward.   Director Venky Atluri's vision of emotion is the primary reason for the song's to have garnered such popularity according to the lyrist Srimani.


On the occasion of 'Rang De' releasing on March 26th the promotions and the related events have been ramped up the the team. Youth Star 'Nithiin' and leading actress 'Keerthy Suresh's combination on the silver screen promises to be enthralling and mesmerizing going by the articles, videos and songs that have been released so far.


Apart from the lead pair of Nithin and Keerthy Suresh, prominent actor Naresh,  Kousalya, Rohini,Bramhaji, Vennela Kishore,Vineeth, Gayithri raghuram,  Satyam Rajesh, Abhinav Gomatam and  Suhas play pivotal characters in the movie.

Dop- P.C Sreeram

Music- Devi Sri Prasad

Editing- Naveen Nooli

Art- Avinash Kolla

Additional Screenplay- Satish Chandra Pasam

Executive Producer - S. Venkatarathnam (Venkat)

Presented by PDV Prasad

Produced by Suryadevara Nagavasmi

Written and Directed by Venky Atluri.

Amani in Chavu Kaburu Challaga

 



‘చావు కబురు చల్లగా’ సినిమాలో వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్న సీనియర్ నటి ఆమని..


మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ విజయాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. ‌ మార్చ్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అదిరిపోయే కామెడీ సీన్స్.. అద్భుతమైన ఎమోషన్.. మంచి కథతో అన్ని కమర్షియల్ హంగులు అద్దుకున్న ట్రైలర్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. 'బ‌స్తి బాల‌రాజు'గా హీరో కార్తికేయ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈయన ఫ‌స్ట్ లుక్, ఇంట్రోతో పాటు క్యారెక్ట‌ర్ వీడియోకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి కూడా మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా సీనియర్ నటి ఆమని గారి లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. 90ల్లో మావిచిగురు, శుభలగ్నం లాంటి హోమ్లీ కారెక్టర్స్‌తో అలరించిన ఆమని.. చావు కబురు చల్లగా సినిమాలో వైవిధ్యమైన పాత్రతో మెప్పించడానికి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చేతిలో మద్యం సీసా.. వంట చేస్తూ విడుదలైన ఈమె ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన వస్తుంది. 

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి మాట్లాడుతూ ఇప్ప‌టికే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న వస్తుంది. మాస్ అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇందులో సీనియర్ నటీనటులు అంతా చక్కగా నటించారు.. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వాళ్లు విడుద‌ల చేస్తున్నారు.


నటీనటులు..


కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు


సాంకేతిక వ‌ర్గం..


స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్

బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్

నిర్మాత - బ‌న్నీ వాసు

దర్శకుడు - కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి

ఎడిట‌ర్‌- స‌త్య జి

ఆర్ట్‌ - జి ఎమ్ శేఖ‌ర్‌

మ్యూజిక్ - జేక్స్‌ బిజాయ్

సినిమాటోగ్రాఫ‌ర్ - క‌ర‌మ్ ఛావ్లా

అడిషిన‌ల్ డైలాగ్స్ - శివ కుమార్ భూజుల‌

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్ - రాఘ‌వ క‌రుటూరి, శ‌ర‌త్ చంద్ర నాయిడు

పి ఆర్ ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

లిరిక‌ల్ వీడియోస్ - క్రేజీ షౌట్

ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ - మ‌నిషా ఏ ద‌త్‌

కాస్ట్యూమ్ డిజైన‌ర్ - మౌనా గుమ్మ‌డి

Energetic Star Ram Released Mass Folk Song 'Jwala Reddy' From 'Seetimaarr'

Energetic Star Ram Released Mass Folk Song 'Jwala Reddy' From 'Seetimaarr'



Aggressive Star Gopichand, Mass Director Sampath Nandi's latest is ‘Seetimaarr’, a sports based Actioner with a backdrop of mass game Kabaddi. 'Seetimaarr is the highest budgeted film in Gopichand's career made with high technical values. Presented by Pavan Kumar and Produced by Srinivasaa Chhitturi under the Srinivasaa Silver Screen banner. Melody Brahma Mani Sharma is composing music for this film. Tamannaah is the heroine while Bhumika is playing a pivotal role. Powerpacked Trailer of 'Seetimaarr' and songs which were released recently received a rave response. Energetic Star Ram Pothineni released Telangana Folk Song 'Jwala Reddy' lyrical song from 'Seetimaarr'.


The mass folk song goes with lyrics,


'Jwala Reddy.. Jwala Reddy.. Telangana biddaro.. karabondi ladduro.. karabondi ladduro.. kaaraboondi ladduro.. aadinche Kabaddiro..

Bala Reddy.. Bala Reddy.. Andhra Team Headduro.. konaseema bloodduro.. konaseema bloodduro.. poradu A to Z rooo...'


This energetic mass folk number is composed by Melody Brahma Mani Sharma while crooned by Shankar Babu and Mangli. This song is already getting very good response in social media. 'Seetimaar' is releasing worldwide on April 2nd.


Gopichand, Tamannaah, Bhumika, Digangana Suryavanshi, Posani Krishna Murali, Rao Ramesh, Bhumika, Rehaman, Bollywood actor Tarun Arora are principal cast while Apsara Rani is doing a special song.


Chief Technicians of this movie are

DOP: S. Soundar Rajan

Music Director: Mani Sharma

Editor: Thammiraju

Art Director: Satyanarayana D.Y.

Presented by: Pavan Kumar

Producer: Srinivasaa Chhitturi

The story, Screenplay, Dialogues, and Direction: Sampath Nandi

 

Hero Kartikeya Gummakonda Sukumar Writings movie to begin from November

 Sukumar Writings's next film with Young Hero Kartikeya Gummakonda to begin from November



We've seen Creative Director Sukumar produce interesting & entertaining blockbuster films like Kumari 21 F & Uppena under Sukumar Writings.
Meanwhile, impressed by the performance of Young Hero Kartikeya in the Trailer of his next Chaavu Kaburu Challaga, Sukumar has now confirmed to produce an interesting story with him under Sukumar Writings.
Beginning the shoot in November, story-screenplay-dialogues will be handled by Sukumar himself.
However, details of the director & other technicians will be officially announced soon.

Powerstar Pawan Kalyan’s Epic magnum opus titled ‘Hari Hara Veeramallu

 Powerstar Pawan Kalyan’s Epic magnum opus titled ‘Hari Hara Veeramallu.’ 




First Look Glimpse Unveiled 

Mega Surya Production is making this grandeur budget film with 150Cr 

Grand Release For Sankranthi 2022



Powerstar Pawan Kalyan and Crafty Director Krish Jagarlamudi’s Legendary Heroic OutLaw Film Titled ‘Hari Hara Veeramallu’; A production of legendary producer AM Ratnam on Mega Surya Production banner.


On the auspicious occasion of Maha Shivaratri, the title and first look glimpse of Powerstar Pawan Kalyan’s forthcoming epic movie under the direction of Krish Jagarlamudi and production of legendary producer AM Ratnam on Mega Surya Production banner are revealed. This magnum opus is titled ‘Hari Hara Veeramallu’ and the first glimpse is extraordinary in its own way.


Powerstar Pawan Kalyan is essaying the title role. *In the video* Pawan’s look is completely refreshing and from tip to toe there can be noticed a clear makeover. It’s a never before look of Pawan and crafty *director Krish’s taking is superb* which is *terrifically complemented by Keeravani’s music* and *the grandeur visuals* go with the flow.


This is the story of legendary heroic outlaw,” says director Krish who is a magician in this space of genres and this film will have his trademark elements. This massive film ‘Hari Hara Veeramallu’ is set in the period of 17th century on the backdrop of Moghuls and Qutub Shahis era and it will offer spectacular visual feast. This is an untold story in Indian cinema and will truly be spellbound.


Gigantic sets like Charminar, Red Fort and Machilipatnam port are assembled for the film’s shooting which means it is being made on a lavish budget of ₹ 150 crore with uncompromising grandeur production values.


So far ‘Hari Hara Veeramallu’ has wrapped up forty percent of its shooting and the makers are hopeful to wrap it up by July and then head to the post-production works. Being a period drama film, six months’ time is dedicated for VFX and it will be supervised by Ben Lock who was associated with Hollywood films earlier.


Nidhhi Agerwal is playing the female lead.


Top technicians such as MM Keeravani and ace cinematographer Gnana Shekar VS are handling music and camera respectively for this film.


Also the film is being made on a pan-India level and will get a simultaneous release in Hindi, Tamil, and Malayalam languages along with Telugu.


‘Hari Hara Veeramallu’ is slated for 2022 Sankranthi release.


Crew:

Presented by AM Ratnam

Direction: Krish Jagarlamudi

Producer: A. Dayakar Rao

Banner: Mega Surya Production

Cinematography: Gnanashekar VS

Music: MM Keeravani

Editor: Sravan

Dialogues: Sai Madhav Burra

Visual Effects: Ben Lock

Production Designer: Rajeevan

Stunts: Ram-Laxman, Sham Kaushal, Dileep Subbarayan

Lyrics: 'Sirivennela' Seetharama Sastry, Chandrabose

Costume Designer: Aiswarya Rajeev

PRO: LakshmiVenugopal


Gaali Sampath Movie Review

 



Check out the review of Gaali Sampath  movie Starring  Sree Vishnu, Lovely Singh, Rajendra Prasad directed by Anish Krishna  produced by Harish Peddi, Sahu Garapati, S. Krishna released in theatres on the special occasion of ‘Maha Sivaratri’

Gaali Sampath movie is all about  a role played by Rajendra Prasad ( Gaali Sampath) who leads his life happily and has big dreams to become an actor but loses his voice in an accident.how he lost his  voice what he has done after that how he fulfilled his dreams forms the rest of the story 

Hero  Sree Vishnu acted as son to  Rajendra Prasad both has done ultimate job  they lived in their roles particularly emotional scenes came out very well 

Undoubtedly  Rajendra Prasad is a legend and he can play any kind of role but this Gaali Sampath role is completely different from other roles Rajendra Prasad has given his best and impressed  audience  with his FIFI Language

Sree Vishnu has done his part well Lovely Singh is okay Sathya performance is good he has done perfect Justification  Tanikella Bharani and rest of the cast has done as per the requirement 

Technical values 

In this segment we must appreciate producers for their production values even though its their first Production they have spent quality amount in production to maintain good standards  Anil Ravipudi contributions are good his screenplay is neat Dialogues are impressive Camera work is great Editing is okay Locations are good  director Anish tried his best to engage audience music is good 

Verdict

On whole  Except  some Routine Elements Gaali Sampath will Entertain you 


Telugucinemas.in 3/5

'Natakam' Fame Ashish Gandhi In A Powerful Police Officer Role!!!

 





Hero Ashish Gandhi created a niche for himself and gained popularity sporting a rugged look in his first film ‘Natakam’. In the meantime, the actor’s next film has begun. Kalyanji Gogana who directed the actor in Natakam will be helming the project. Like Ashish, Kalyanji too showed his expertise in ‘Natakam’.


Ashish Gandhi is playing a powerful police officer in the new film. Popular industrialist Nagam Tirupathi Reddy will be producing the film as Production No 3 of Vision Cinemaas. Thirumala Reddy is the co-producer, while Manikanth is the editor. Bal Reddy is handling the cinematography.


Billed to be an action entertainer, the film’s regular shoot commences from April second week. Ashish Gandhi plays three different roles in the film and his first look as police officer is unveiled today.


While speaking on the occasion, producer Nagam Tirupati Reddy said, “The film is made as Production No 3 of Vision Cinemaas. The director prepared a wonderful story and we loved it completely. We felt only Ashish Gandhi can fit in the role. In a recent photoshoot, Ashish Gandhi looked apt for three different roles. We hope film coming from our banner will give a wonderful experience to everyone. The film’s shoot will begin from the second week of April. Other details will be revealed soon.


Cast: Ashish Gandhi


Technical Department:


Editor: Manikanth

DOP: Bal Reddy

Co-Producer: Thirumala Reddy

Producer: Nagam Tirupati Reddy

Director: Kalyanji Gogana

Sree vishnu Interview About Gaali Sampath

 


మంచి క‌థ‌తో తెర‌కెక్కిన‌`గాలి సంప‌త్` డెఫినెట్‌గా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది - హీరో శ్రీ విష్ణు.


అప్ప‌ట్లోఒక‌డుండేవాడు, నీది నాది ఒకే క‌థ‌, మెంట‌ల్ మ‌దిలో.., బ్రోచెవారెవ‌రురా.. వంటి చిత్రాల‌తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో శ్రీ విష్ణు. ప్ర‌స్తుతం శ్రీ విష్ణు హీరోగా రాజేంద్ర‌ప్ర‌సాద్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం గాలి సంప‌త్. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రిస్తూ స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ చేస్తున్న ఈ చిత్రంలో ల‌వ్ లీ సింగ్ హీరోయిన్ న‌టిస్తోంది. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మార్చి11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో శ్రీ విష్ణు ఇంట‌ర్వ్యూ..


ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట‌య్యింది?

- అనిల్ రావిపూడిగారు ఫోన్ చేసి ఒక సారి నిన్నుక‌ల‌వాలి అని అన్నారు. అలాగే సాహూ గారు, హ‌రీష్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. వాళ్లు ఫోన్ చేసి ఇలా క‌థ చెప్తారంట అన‌గానే ఆయ‌నేంటి నాకు క‌థ చెప్ప‌డం ఏంటి..ఆయ‌న‌వ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు..నేను కొత్త‌ కొత్త డైరెక్ట‌ర్స్‌తో డిఫ‌రెంట్ సినిమాలు చేస్తున్నాను. దాంతో పాటు ఇంత‌కు ముందు నా రెండు మూడు సినిమాల‌కి అనిల్ రావిపూడిగారు వ‌చ్చి స‌పోర్ట్ చేశారు. మా ఈవెంట్‌కి వ‌చ్చి మాకు ఎన‌ర్జి ఇచ్చి వెళ్లేవారు. ఆయ‌నంటే నాకు గౌర‌వం. స‌రే రమ్మ‌న్నారు క‌దా అని వెళ్లాను. ఈ సినిమా పాయంట్ చెప్పారు. ఎలా ఉంది నీకు న‌చ్చితే చేద్దాం అన్నారు. చాలా బాగుంది.. నేను రెడీ అని చెప్పాను. త‌ర్వాత డైరెక్ట‌ర్‌, టెక్నీషియ‌న్స్ ని సెట్ చేసి చెప్తాను అని చెప్పారు. ఫాద‌ర్ క్యారెక్ట‌ర్ ఎవ‌రు చేస్తున్నారు అని అడ‌గ‌గానే రాజేంద్ర ప్ర‌సాద్ గారు అని చెప్పారు. అప్పుడే ఈ సినిమా ఎలా ఉండ‌బోతుంది అని ఒక ఐడియా వ‌చ్చింది.


ఈ సినిమా మీ క‌థా, మీ ఫాద‌ర్ క‌థా?

- ఎవ‌రో ఒక‌రిది అని కాదు. ఈ స్టోరీలోనే నేను, ఫాద‌ర్ ఇద్ద‌రం కుదిరాము.


సెట్లో రాజేంద్ర ప్ర‌సాద్, మీ మధ్య‌ డిస్క‌ర్ష‌న్స్ ఎలా ఉండేవి?

- నేను ఒక సారి రెడీ అయ్యి షూటింగ్ ఎట్‌మాస్పీయ‌ర్ లోకి ఎంట‌ర్ అయ్యాక నా ప‌ని నేను చేసుకుంటాను. షూటింగ్ ఎక్కువ భాగం ఔట్‌డోర్ లో జ‌ర‌గ‌డం వ‌ల్ల బ్రేక్‌లో రాజేంద్ర ప్ర‌సాద్ గారి ద‌గ్గ‌రినుండి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకునేవాడిని. ఆయ‌నా చాలా బాగా చెప్పేవారు. 90వ ద‌శ‌కంలో ఒకే సంవ‌త్స‌రం 12 సినిమాలు చేశారు. అందులో 8సినిమాలు వంద‌రోజులు ఆడాయ‌ని చెప్పారు. అన్ని పాత్ర‌లు ఎలా సెల‌క్ట్ చేసుకునేవారు, ఎలా చేసేవారు? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఆయ‌న్ని అడిగిన‌ప్పుడు చాలా గొప్పగా స‌మాధానాలు చెప్పేవారు.  ఆయ‌న‌ని  క‌లిసిన త‌ర్వాత డిఫ‌రెంట్ క‌థ‌లు ఎలా సెల‌క్ట్ చేసుకోవాలి అనేదానికి చాలా హెల్ప్ అయ్యింది. ఈ క్యారెక్ట‌ర్ కోసం ఎలాంటి ఇన్‌పుట్స్ తీసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. చాలా ఈజీగా చేయ‌గ‌లిగాను. దాదాపు ప్ర‌తి షాట్ సింగిల్ టేక్‌లోనే చేశాను.


సంగీత ద‌ర్శ‌కుడిగా అచ్చు రాజ‌మ‌ణిని ఎంచుకోవ‌డానికి రీజ‌నేంటి?

- అచ్చు తమిళ్‌లో ఒక పాట చేశాడు. అది నాకు ప‌ర్స‌న‌ల్‌గా బాగా న‌చ్చింది. ఈ టీమ్ కూడా విని బాగుంది అన్నారు. ఆయ‌న్ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా పెడ‌దాం లేదా ఆ పాట యాజ్ఇట్ఈజ్ గా పెడ‌దాం అని వారికి చెప్పాను. వారు స‌రే మ్యూజిక్ అచ్చుతోనే చేపిద్దాం అన్నారు. అలా అచ్చుని సంగీత ద‌ర్శ‌కుడిగా తీసుకున్నాం. ఆ పాట‌తో  పాటు ఈ సినిమాలో ఫాద‌ర్ ఎమోష‌న్స్‌తో ఫీ ఫీ ఫీ సాంగ్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కుదిరింది.


తండ్రి కొడుకుల క‌థ‌లో ఒక అమ్మాయికి ఎంత స్కోప్ ఉంటుంది?

- ఈ సినిమాలో కోర్ ఎమోష‌న్ మాత్ర‌మే ఫాద‌ర్ అండ్ స‌న్ మీద ఉంటుంది. మిగ‌తా పార్ట్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. ల‌వ్‌లీ సింగ్ కొత్త అమ్మాయి. చాలా బాగా చేసింది. త‌న క్యారెక్ట‌రైజేష‌న్ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌కి న‌చ్చుతుంది.


రీయ‌ల్ లైఫ్ లో మీ పేరెంట్స్‌తో ఎలా ఉంటారు?

- ఇప్ప‌టి వ‌ర‌కూ నేను ఏ ప‌ని చేసిన ఎప్పుడూ క్వ‌‌చ‌న్ చేయ‌లేదు. నేను ప్ర‌తీది వారికి చెప్పే చేస్తాను. చిన్న‌ప్ప‌టినుంచి నువ్వు అది చేయి ఇది చేయి అని ఎప్పుడూ ప్ర‌జ‌ర్ పెట్ట‌లేదు. నా మీద ఒక న‌మ్మ‌కం ఉంది. అందుకే మ‌న ఇంట్లో ఉండే ఎమోష‌న్స్ ఎక్కువ ఉన్న సినిమాలే ఎక్కువ‌గా చేస్తూ వ‌చ్చాను. దానికి మా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో ఎక్కువ క‌నెక్ట్ అయి ఉండ‌డం కూడా ఓ కార‌ణమేమో.


కొత్త వారితో ఎక్కువ చేయ‌డం వ‌ల్ల ఎక్కువ‌గా లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. టీమ్ అంద‌రం అర‌కు వెళ్లి 30డేస్ అక్క‌డే షూట్ చేశారు. ఇంటీరియ‌ర్ వ‌ర్క్ హైద‌రాబాద్ లో తెర‌కెక్కించాం. ఈ సినిమా అంతా ముందే ప్రాప‌ర్‌గా ప్లాన్ చేయ‌డం వ‌ల్ల షూటింగ్ స‌ర‌దాగా జ‌రిగింది. మా మ‌ధ్య డిస్కర్ష‌న్స్ చాలా హెల్తీగా ఉండేవి. మంచి ర‌న్‌టైమ్‌...ఆడియ‌న్స్‌కి కూడా ఎలాంటి క‌న్‌ఫ్యూజ‌న్ ఉండ‌దు. ఫ్యామిలీస్ కి చిన్న పిల్ల‌ల‌కి ఇంకా ఎక్కువ‌గా న‌చ్చుతుంది.


మంచి క‌థ‌ల‌ను మీరు సెల‌క్ట్ చేసుకుంటున్నారా లేదా మీ కోస‌మో మంచి క‌థ‌లు రాస్తున్నారా?

- ఇది వ‌ర‌కు నేను క‌థ‌ల కోసం ప‌రిగెత్తే వాడిని ఇప్పుడు మంచి మంచి క‌థ‌లు నా ద‌గ్గ‌ర‌కి వ‌స్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది.


ఈ క‌థ అనిల్ కాకుండా వేరే డైరెక్ట‌ర్ వ‌చ్చి చెప్పుంటే సినిమా చేసేవారా?

- బేసిక్‌గా ఈ క‌థ నేను అనిల్ రావిపూడి గారి జోన‌ర్‌కి వెళ్ల‌డం కాదండీ.. ఆయ‌నే నా జోన‌ర్‌కి వ‌చ్చి త‌యారు చేసిన క‌థ‌. నాకు సెట్ అయ్యే క‌థే.. కాబ‌ట్టి డెఫినెట్‌గా చేసేవాడిని.  అలాగే ఈ సినిమా చాలా మంది వేరే భాష‌ల్లో రీమేక్ చేస్తార‌ని అనుకుంటున్నాను. ఒక వేళ నాకు అవ‌కాశం ఉంటే మ‌రో 20 సంవ‌త్స‌రాల త‌ర్వాత రాజేంద్ర ప్ర‌సాద్‌గారి పాత్ర నేనే పోషించి ఈ సినిమా రీమేక్ చేస్తాను.


త‌దుప‌రి చిత్రాల గురించి?

- ప్ర‌స్తుతం రాజ‌రాజ‌చోర సినిమా విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. త‌ర్వాత అర్జున‌ఫ‌ల్గున సినిమా 60% షూట్ కంప్లీట్ అయింది. త‌ర్వాత ఒక కొత్త ద‌ర్శ‌కుడితో కాప్ బ‌యేపిక్ (పోలీస్ ఆఫీస‌ర్ బ‌యోపిక్‌) చేస్తున్నాను. అలా‌గే నా ఫ‌స్ట్ మూవీ బాణం డైరెక్ట‌ర్‌తో మ‌రో మూవీ చేస్తున్నాను. ఈ ఏడాది క‌చ్చితంగా మూడు సినిమాలు విడుద‌ల‌వుతాయి.

Ardha Shathabdham is all set to steal the show from March 26 on Aha

 



An aha original movie Ardha Shathabdham is all set to steal the show from March 26.


Ensuring of a March that’s maha entertaining, aha, the 100% Telugu OTT platform, today unveiled the announcement poster of the much-anticipated drama Ardha Shathabdham, to announce its World Premiere on March 26. 


The intense drama underlines the fight for love over caste, creed and religion while weaving in sub themes of violence and its repercussions. Set in 2003, the revolutionary tale stars actors Karthik Ratnam, Naveen Chandra, Sai Kumar, Krishna Priya, Suhas, Pavitra Lokesh, Ajay and others.


Directed by Ravindra Pulle and produced by Chitti Kiran under the Rishitha Sree Creations banner, the movie has gained a lot of popularity for its very intriguing and conspiring glimpses in the teaser apart from the fact that it brushes the controversial themes of politics and caste-based violence. 


Welcoming massive releases like Naandhi and Krack (earlier) along with originals like Ardha Shathabdham, Super Over and Rana’s much awaited No 1 Yaari, aha has become a household name with the best in Telugu entertainment. With a massive collection of favourites starring superstars and a huge library of classics, aha is constantly giving its viewers a lot to look forward to.



Cast & Crew

Cast: Karthik Ratnam, Naveen Chandra, Krishna Priya, Suhas, Sai Kumar, Subhalekha Sudhakar, Pavitra Lokesh, Ajay, Raja Ravindra, Rama Raju, Dil Ramesh, TNR, Sharanya, Naveena Reddy, Pavitra Lokesh, Ammani

Banner: Rishitha Sree Creations LLP , 24 Frames Celluloid

Director: Ravindra Pulle

Producer: Chitti Kiran Ramoju, Telu Radha Krishna

DOP: Venkata R Sekamuri, Ashkar, EJ Venu

Music: Nofel Raja

Music composer: Nawfal Raja AIS

Editor: J. Pratap Kumar

Art Director: Sumit Patel

Action: Anji Master

Costume designer: Poojitha Tadikonda

Banner: Rishitha Sree Creations, 

Publicity Designer: Dhani Aley

Post production: Annapurna studios

Assitant Editor - Pradeep Goud J

Chavu Kaburu Challaga Pre Release Event

 


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఘనంగా ‘చావు కబురు చల్లగా’ ప్రీ రిలీజ్ వేడుక 


కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వరస విజయాలతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా దూసుకుపోతున్న బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా చావు కబురు చల్లగా. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కిస్తున్నారు. మార్చ్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరుగుతుంది. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేడుకకు చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారు.


దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ.. 


‘గీతా ఆర్ట్స్‌తో నా అనుబంధం ఇప్పటిది కాదు. అల్లు అరవింద్ గారు నాకు తండ్రి సమానులు. అలాగే బన్నీ వాసు సోదర సమానుడు. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం. గీతా ఆర్ట్స్ లో సినిమా అంటే చిన్నా పెద్దా అనేది ఉండదు. కథలకు ప్రాధాన్యత ఇస్తూ.. సినిమాను ప్రేమిస్తుంటారు. ఈ సంస్థతో నా బంధం గురించి చెప్పడానికి టైమ్ సరిపోదు. నాకు మాతృ సంస్థ.. గీతా ఆర్ట్స్, GA2 ఎప్పటికీ ఇలాగే చిరకాలం మంచి సినిమాలు నిర్మిస్తూ.. అరవింద్ గారి తర్వాత వాసు గారు.. ఆ తర్వాత బన్నీ గారి బ్రదర్ బాగా ఉండాలి. చాలా గొప్పగొప్ప సినిమాలు చేయాలి వాసు గారు. గీతా ఆర్ట్స్ అక్షయ పాత్ర లాంటిది కౌశిక్. దానికి నిదర్శనం గీతా ఆర్ట్స్. నేను ఆరేళ్ళు అదే కంపౌండ్ లో ఉన్నాను. ఈ అవకాశాన్ని బాగా యూజ్ చేసుకున్నట్లు అనిపిస్తుంది నాకు. నీకు మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ ఆల్ ది బెస్ట్. గీతా ఆర్ట్స్ కు మంచి విజయం రావాలని.. డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.’ అని తెలిపారు.


ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 


‘బన్నీ ఫ్యాన్స్ అందరికీ హాయ్.. అరవింద్ గారికి, వాసుకి, న్యూ డైరెక్టర్ కౌశిక్, కార్తికేయ.. చావు కబురు చల్లగా టీం అందరికీ నా శుభాకాంక్షలు. ఆర్య విడుదలై 17 ఏళ్ళు అవుతుంది. నాది, సుక్కుది, బన్నీ జర్నీ అంతా గుర్తుకొస్తుంది. అరవింద్ గారు అప్పటికి పెద్ద సినిమాలు చేసేవారు. నేనేమో యంగ్ జనరేషన్ అప్పుడే వచ్చి కొత్త కొత్త దర్శకులతో సినిమాలు చేసాను. ఇప్పుడు చూస్తే వాసు అందర్నీ గీతా ఆర్ట్స్‌కు తీసుకెళ్లి కంటిన్యూగా కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నావ్.. కంగ్రాట్స్. అరవింద్ గారు అప్పట్నుంచి స్కెచ్ వేసారన్నమాట. మీరు నాకు మళ్లీ ఇన్స్‌పిరేషన్ సర్. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు. కొత్త కొత్త సినిమాలు ఎలా తీయాలి అని. ఏడాదిన్నర కింద చావు కబురు చల్లగా కాన్సెప్ట్ చెప్పాడు వాసు. ఎన్నో ప్రేమకథలు మనం చూసాం. కానీ ఇది కొత్తగా ఉంది. ఎక్కడైనా చనిపోయిన దగ్గర బాధ పడుతుంటాం కానీ చనిపోయిన అతడి భార్య దగ్గర్నుంచి కథ మొదలుపెట్టాడు దర్శకుడు కౌశిక్. ఆర్య తీసేటప్పుడు ఇలాగే అనుకున్నాం.. ఇదెలా ఉంటదో అని. వాసు ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టబోతున్నావ్.. అడ్వాన్స్ కంగ్రాట్స్’ అని తెలిపారు.


దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. 


‘నాకు నా హోమ్ బ్యానర్. నా బ్యానర్ ఇది.. బన్నీ బాబు బ్యానర్. నాకు ఇందాక నుంచి హై ఓల్టేజ్ వైర్ తెగిపోయి ఆడుకుంటే ఎలా ఉందో అలా ఉంది. ఎందుకంటే బన్నీ బాబును ఇక్కడ కూర్చోబెట్టి. నేను ఎన్ని సినిమాలు చేసినా భలేభలే మగాడివోయ్ తో నాకు గుర్తింపు ఇచ్చిన నా సంస్థ గీతా ఆర్ట్స్. మా అల్లు అరవింద్ గారు, వాసు కొత్త కథలను ఎంకరేజ్ చేస్తుంటారు. కౌశిక్ గానీ.. లావణ్య, కార్తికేయ అంతా చాలా చేసారు. నాతో పని చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్.. టెక్నికల్ టీం అంతా కొత్త ప్రయత్నం చేసారు. కొత్త కథలను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పడానికి నిదర్శనం నేనే. కౌశిక్ కూడా అలాగే విజయం అందుకుంటాడని ఆశిస్తున్నా..’ అని తెలిపారు.


నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. 


‘ఈ ఏవీ వేస్తున్నట్లు కూడా నాకు తెలియదు. ఈ రోజు మీరు చూసిన ఈ విజువల్‌లో అరవింద్ గారు కానీ, బన్నీ గారు కానీ లేకపోతే నాకు ఈ రోజు మీముందు ఇలా నిలబడి మాట్లాడే అర్హత వచ్చేది కాదు. కానీ ఎప్పుడూ నేను అరవింద్ గారి గురించి మాట్లాడాలి.. ఈ రోజు ఫంక్షన్ కోసం అనుకుంటున్నాను. కానీ నాకు టైమ్ కుదరడం లేదు. ఈ రోజు కూడా వస్తూ వస్తూ చాలా ఆలోచిస్తున్నా ఏం మాట్లాడాలి అని.. కానీ ఆయన గురించి నేను మాట్లాడాను అంటే నేను ఖాళీ అయిపోయాను అని. సర్ అందుకే మీ గురించి నాకు మాట్లాడే టైమ్ రాకూడదని కోరుకుంటున్నాను. కానీ నా లైఫ్‌లో అదే గొప్ప స్పీచ్ అవుతుంది. అది నేను రిజర్వ్ చేసుకుంటున్నాను. అంటే నా జీవితంలో ఇక బన్నీ గారి గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే 18 ఏళ్ళ జర్నీ ఇది. మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం.. క్లాస్ మేట్స్.. కాలేజ్ మేట్స్ కాదు. జస్ట్ క్యాజువల్ గా కలిసిన చాలా చాలా నార్మల్ ఫ్రెండ్ షిప్. ఆ నార్మల్ ఫ్రెండ్ షిప్ కు 18 ఏళ్లు. ఎలా గడిచిపోయినయో కూడా ఈ రోజుకు నాకు తెలియడం లేదు. ఏం చెప్పను నా లైఫ్ బన్నీ.. బన్నీనే నేను. ప్రిపేర్ అవ్వడానికి కూడా ఏం లేదు. ఈ సినిమా గురించి చెప్పాలంటే.. కార్తికేయ గారి గురించి నేను చెప్పేదాని కంటే కూడా ఈ రోజు మధ్యాహ్నమే బన్నీ గారు సినిమా అంతా చూడటం జరిగింది. మీరు చెప్పడమే బాగుంటుంది. తను చాలా ఎత్తుకు ఎదుగుతాడు. కౌశిక్.. జస్ట్ 26 ఏళ్లు.. ఈ రోజు ఓ పెద్దాయన సినిమా చూస్తున్నపుడు అడిగారు ఆ కుర్రాడి వయసెంత అని.. నేను 26 అని చెప్తే నమ్మట్లేదు. 26 ఏళ్లకే ఇంత డెప్త్ గా రాసాడా అని నమ్మట్లేదు. నాకు కలిసినపుడు ఇది మార్చురి వ్యాన్ డ్రైవర్ కథ అండీ.. అక్కడికి వెళ్లినపుడు అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు అన్నాడు.. ఇది వినగానే ఇదేం కథ అని రేపొద్దున్న వింటానమ్మా అని ఒకసారి కూర్చుందాం అని వెళ్లిపోయాను. కానీ ఒక్క ఇన్సిడెంట్ మళ్లీ వెనక్కి తీసుకొచ్చి నన్ను ఈ సినిమాను చేయించింది. అందులో సుక్కు పాత్ర ఉంది. ఏలూరులో ఆర్య విడుదలైన తర్వాత సుకుమార్ ను ఒకరు ఇంటర్వ్యూ చేసారు. మీకు దర్శకుడిగా ఓకే.. ఈ కథను నమ్మి డబ్బులు పెట్టిన దిల్ రాజు గట్స్ మెచ్చుకోవాలి అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత నన్ను కూడా ఎవరో ఒకరు అనకపోతారా అని ఆశ. అలాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ కౌశిక్. ప్రత్యేకంగా లావణ్యకు థ్యాంక్స్.. విడో కారెక్టర్ అనగానే ఏమంటారో అనుకున్నాం.. కానీ వెంటనే చేసారు. నా హార్ట్ కు చాలా దగ్గరైన సినిమాల్లో ఇది ఒకటి..’ అని తెలిపారు.


హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. 


‘అందరికీ  నమస్కారం.. మా సినిమాను సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకు అందరికీ థ్యాంక్స్. అల్లు అర్జున్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్. గీతా ఆర్ట్స్‌తో ఇది నాకు మూడో సినిమా. ఈ సినిమా ఎంతపెద్ద హిట్ అవుతుంది అనేది పక్కనబెడితే కథ ప్రకారం ఈ సినిమా నాకు నచ్చింది. దానికి కౌశిక్, వాసు, అరవింద్ గారికి థ్యాంక్స్. కౌశిక్ ఈ కథ చెప్పినపుడు సగంలోనే ఓకే చెప్పాను. ఇలాంటి కథ చెప్పినందుకు థ్యాంక్స్. కార్తికేయ మంచి కో ఆర్టిస్ట్. ఈ సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నందుకు వాసుకు, అరవింద్ గారికి మరోసారి థ్యాంక్స్..’ అని తెలిపారు.


దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. 


‘అరవింద్ గారికి మొట్టమొదటి సారి టేబుల్ ముందు కథ చెప్పినపుడు షివరింగ్ నాకు గుర్తుంది. ఇప్పుడు కూడా ఆయన పక్కన కూర్చుంటే అదే షివర్ ఉంది. మీరు ధైర్యంగా కూర్చున్నాను అనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ సర్.. మా అందరికీ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. ఇలాంటి కథను ఈ వయసులో ఇంత జడ్జి చేస్తున్నారంటే మీ జడ్జిమెంట్ కు నమస్కారాలు సర్. వాసు ద్వారా చాలా నేర్చుకున్నాను నేను. వాసు ఆర్యతో పరిచయం నాకు. ఇండస్ట్రీలో ఎలా బిహేవ్ చేయాలో తెలిసేది కాదు నాకు. తను నాకు మెంటర్. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది వాసుకు తెలుసు. అలా కన్వే అవ్వడం వల్లే స్టోరీ జడ్జిమెంట్ వచ్చింది. అరవింద్ గారి నుంచి ఆ జడ్జిమెంట్ తీసుకుని సూపర్బ్ ప్రొడ్యూసర్ అయ్యాడు. కార్తికేయ గురించి చెప్పాలంటే.. లిప్స్, ఐస్ సింక్ చేయడం కష్టం ఆర్టిస్టులకు. కానీ కార్తికేయ లిప్స్, ఐస్ కాదు ఐ బ్రోస్, చిన్ కూడా సింక్రోనైజ్ అవుతుంది. నువ్వు చాలా పెద్ద యాక్టర్ అవుతావ్. లావణ్య నువ్వు అందర్ని అన్నయ్య అంటున్నావ్ కాబట్టి లవ్ అన్నయ్య అనొచ్చు నిన్ను. కౌశిక్ కొన్నేళ్ల పాటు నువ్వు ఉంటావ్. రంగమ్మత్త నువ్వు ఛమ్మక్ అంటూ ఉంటావ్. తెలుగు ఇండస్ట్రీలో ఉంటూ ఇలాంటి స్పిరిట్ ఇస్తున్నావ్.. నువ్వు చాలా మందికి ఆదర్శం. సినిమాకు పని చేసిన వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్. ఆమని గారు మావిచిగురు తర్వాత చూడాలనుకున్నా ఇప్పుడు చూస్తున్నాను.. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని.. గీత గోవిందం గీసిన గీతను చెరిపేయాలని కోరుకుంటున్నాను..’ అని తెలిపారు.


దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ.. 


‘ఇక్కడికి వచ్చిన వాళ్లందరికీ థ్యాంక్స్. అరవింద్ గారు మీ సపోర్ట్‌కు థ్యాంక్స్. వాసు సర్ మీ అవకాశానికి థ్యాంక్స్. అమ్మానాన్నలకు థ్యాంక్స్. కంగారు పెట్టొద్దు ఫస్ట్ టైమ్ స్పీచ్. బన్నీ గారు మాట్లాడతారు. ఫస్ట్ నాకు చాలా మంది అడిగారు. గీతా ఆర్ట్స్‌లో ఎలా వచ్చింది అవకాశం. కొన్నేళ్ల కింద నవదీప్ గారికి స్టోరీ చెప్తే అది నచ్చి.. బన్నీ వాసు గారికి పరిచయం చేసారు. ఆ తర్వాత బన్నీ గారి పిఆర్ శరత్ గారు కూడా ఓ కథ విని వాసు గారికి చెప్పారు. అలా నాకు అవకాశం వచ్చింది. దాన్ని నేను సరిగ్గా వాడుకుంటున్నాను అనుకుంటున్నాను సర్. టెక్నికల్ టీం అందరికీ థ్యాంక్స్. సినిమా బాగుంటుందని నమ్ముతున్నాం.. ఈ రోజు బన్నీ గారు సినిమా చూసారు. ఆయనే చెప్పాలి. కార్తికేయ గురించి చెప్పాలంటే.. ఈ కారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు. కార్తిక్ అనుకున్న తర్వాత సెకండ్ డే నే కారెక్టర్ లోకి వెళ్లిపోయాడు. ఆమని గారు థ్యాంక్స్. అనసూయ గారు చాలా థ్యాంక్స్ అండి. ప్రొడక్షన్ టీమ్, డైరెక్షన్ టీంకు థ్యాంక్స్. కోవిడ్ టైమ్ లో బాగా సపోర్ట్ చేసారు. ఫస్ట్ టైమ్ స్పీచ్.. ఏమైనా తప్పులు మాట్లాడుంటే మన్నించండి..’ అని తెలిపారు.


నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ.. 


‘మిమ్మల్నందర్నీ ఇక్కడ కూర్చోబెట్టి మేమంతా ఇలా మాట్లాడటం ఇబ్బందిగా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే బన్నీ మాటలు వినాలని వచ్చారు మీరంతా. కానీ కొన్నిసార్లు తప్పవు. అప్పటి వరకు ఓపిగ్గా ఉన్నారని అర్థమవుతుంది. నేను మాట్లాడుతుంటే మీరు అరవకుండా ఉంటారని ముందు చెప్తున్నాను. నేను ఆహాకు వెళ్లడానికి.. అక్కడ నేను టైమ్ స్పెండ్ చేయడానికి టైమ్ ఇచ్చింది వాసు. గీతా ఆర్ట్స్ కు అంత సపోర్ట్ గా ఉన్నాడు. ఎక్కవ కష్టపెట్టకుండా ఉన్నాడు. ఈ సినిమా విషయానికి వస్తే.. చిత్రమైన కథ విన్నాను సర్. ఎవరో చచ్చిపోతే.. హీరో వెళ్లి తన ప్రేమకథ మొదలుపెడతాడు సర్.. అక్కడ లవ్ స్టోరీ మొదలవుతుంది సర్ అన్నాడు. విచిత్రంగా ఉందయ్యా ఇది.. ఆ కుర్రాడితో చెప్పించు అన్నాను. కౌశిక్ చెప్తుంటే సినిమా తీసేయగలడు అనిపించిన బహు తక్కువ మంది దర్శకుల్లో ఒక్కడు. చాలా బాగా రాయగలడు అతడు. చాలా కాలం ఉండబోయే దర్శకుల్లో కౌశిక్ ఒకడు. నెక్ట్స్ కార్తికేయ.. నేను అంతా చెప్పను. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఈ సీన్ ఎంత సేపు తీసుకున్నాడు అన్నాను.. అరగంటలో చేసామండి.. రెండు టేకులు అన్నాడు. ఓరి మీ దుంపతెగ అనుకున్నాను. అన్ని ఎక్స్ ప్రెషన్స్ ఉన్న సీన్ అరగంటలో చేయడం కష్టం.. కానీ నువ్ చేసావ్. చాలా మంచి నటుడివి నువ్వు. విడుదలకు ముందే నీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. లావణ్యకు మా సంస్థకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. జేక్స్ మీ పాటలు నేను విన్నాను. మలయాళంలో చాలా విన్నాను. ఎప్పుడూ కలిసే వీలు కాలేదు. ఆమని గారు చాలా బాగా చేసారండి. అనసూయ నువ్వంటే నాకు చాలా యిష్టం. కానీ అది చెప్పలేదు. ఇంతకంటే ఏం చెప్పను. గీతా ఆర్ట్స్ అని బన్నీ స్పెషల్ గెస్టుగా వచ్చాడేమో అనుకుంటారేమో.. వాసు బెస్ట్ ఫ్రెండ్ అని వచ్చాడు. చాలా మాట్లాడొచ్చు కానీ బన్నీ కోసం వేచి చూస్తున్నారు కాబట్టి నేను ముగిస్తున్నాను..’ అంటూ తెలిపారు.


హీరో కార్తికేయ మాట్లాడుతూ.. 


‘నాకు నేను రిలాక్స్ అని అల వైకుంఠపురములో బన్నీ గారి డైలాగ్ నాకు నేను చెప్పుకోవాలి. ఆర్ఎక్స్ 100 నుంచి ఇప్పటి వరకు జరిగే ప్రతీ ఫంక్షన్స్‌కు తెలిసిన హీరోలకు మొహమాటంతో మెసేజ్ పెట్టడమే తప్ప.. బన్నీ గారు లాంటి స్టార్ హీరోను పిలిచే ఛాన్స్ కూడా ఎప్పుడూ రాలేదు. అలాంటిది నా సినిమాకు ఈ రోజు బన్నీ గారు గెస్టుగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇది నాకు ఎంత ఎమోషనల్ మూవెంట్ అనేది నాకు లోపల అర్థమవుతుంది. మీకు ఇది చిన్న విషయం కావచ్చు కానీ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. గంగోత్రి నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ అద్భుతం సర్. మీ ప్రతీ సినిమాకు మీ డైలాగ్స్, డాన్స్ అన్నింట్లోనూ వైవిధ్యం ఉంటుంది.. ఎంత హార్డ్ వర్క్ దాని వెనక ఎంత కష్టం ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అరవింద్ గారి కొడుకు.. మెగాస్టార్ మేనల్లుడు అయినా కూడా ఇంత కష్టపడుతున్నారు కాబట్టే ఈ స్థాయిలో ఉన్నారు. కొన్నేళ్ళ కింద నేను మీలో ఒకన్ని. నేను 8వ తరగతిలో ఉన్నపుడు తకదిమితోం పాటకు డాన్స్ చేసా.. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోమంటే గోడ దూకి ఆర్య 2కు వెళ్లా.. బిటెక్ ఫైనల్ ఇయర్ సినిమా చూపిస్త మావా పాటకు థియేటర్ లో డాన్సులేసాం. అరవింద్ గారు మిమ్మల్ని చూస్తుంటే కొత్త సినిమాకు కష్టపడినట్లే ఉంటారు. నేను, కౌశిక్ ఎలా ఉన్నామో.. అలాగే మీరు కూడా ఉన్నారు. అరవింద్ గారి ప్రొడక్షన్ లో చిరంజీవి గారూ, రజినీకాంత్ గారూ, పవన్ కళ్యాణ్ గారూ.. అందరూ యాక్ట్ చేసారు. చిరంజీవి గారికి ఎంత మర్యాద ఉందో.. నాకు అదే రెస్టెప్ట్ వచ్చింది. గీతా ఆర్ట్స్ లో అవకాశం అన్నపుడు అక్కడెలా ఉంటుందో మాట్లాడతారో లేదో అనుకున్నాను కానీ ప్రతీ నటుడికి మీ బ్యానర్ లో చేయడం డ్రీమ్. బన్నీ వాసు గారు మీలో ఆ కసి.. ఆ పాలకొల్లులో ఏదో ఉంది సర్. హిట్ వచ్చాక మీ కంటే ఎక్కువ బెనిఫిట్ నేను అవుతా ఎందుకంటే హీరో కాబట్టి. డార్లింగ్ కౌశిక్ గురించి ఏం చెప్పాలి.. నన్ను ఏ మూవెంట్ లో చూసి ఈ కారెక్టర్ చేయించుకుందాం అనుకున్నావో..? పక్కాగా చెప్తున్నాను.. ఆర్య టైమ్ లో సుకుమార్ గారిని ఎలా చూసారో.. ఈ సినిమా తర్వాత అలా చూస్తారు నిన్ను. లావణ్య నీ ఏజ్ పెంచడం లేదు. బిటెక్ సెకండియర్ లో అందాల రాక్షసి చూసి వామ్మో ఏముందిరా అనుకున్నాం. ఇప్పుడు నాతో యాక్ట్ చేసినందుకు థ్యాంక్స్. నా ఫ్రెండ్స్ కూడా నువ్వు లావణ్య త్రిపాఠితో నటిస్తున్నావ్ అయితే హీరో అయ్యావ్ అంటున్నారు. ఇప్పటి వరకు అందాల రాక్షసితో గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడు మల్లిక అంటారు. ఆమని గారు సినిమా అయిపోగానే మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. కథ చెప్పినపుడు హీరోయిన్ ఎవరు అనే కంటే హీరో మదర్ ఎవరు అని అడిగాను. సినిమాలో నటించిన వాళ్లందరికీ థ్యాంక్స్. జేక్స్ బిజాయ్ గారూ మీరు ఫస్ట్ టైమ్ ఈ మీటర్ లో కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సర్. లిరిసిస్ట్స్, జానీ మాస్టర్ అందరికీ థ్యాంక్స్. అనసూయ గారిని అలా చూస్తుండిపోయా. నేను మీ ఫ్యాన్. సినిమాకు పని చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎవర్నైనా మిస్ అయితే క్షమించండి. ఫైనల్ గా ఒక వెరైటీగా ఓ కాన్సెప్ట్ అనుకున్నా. తెలుగు సినీ లవర్స్ బన్నీ గారికి ఓ లవ్ లెటర్. ప్రియాతిప్రియమైన బన్నీ గారికి... నిన్నటి దాక తెలుగు, మలయాళం ఆడియన్స్ ను ఉర్రూతలూగించారు, ఈ రోజు పుష్పతో ఇండియా వైడ్ ప్రతీ ఒక్కర్నీ షేక్ ఆడించబోతున్నారు. మీరెక్కడికి వెళ్లినా ఏం చేసినా మా అభిమానం మీతో ఉంటుంది అండర్ లైన్. (మా చావు కబురు చల్లగా బ్లాక్ బస్టర్ చేస్తారని). రెడ్ ఇంక్ లో ఉంటాం.. బ్లూ ఇంక్ లో తెలుగు సినిమా ప్రేక్షకులు.. ’ అని ముగించారు.


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారూ మాట్లాడుతూ.. 


‘చావు కబురు ఎప్పుడూ చల్లగా చెప్పాలి. పుష్ప గురించి చివర్లో చెప్పాలి. ఈ సినిమా గురించి ఓ పిట్టకథ ఉంది. వాసు గురించి ఒక్క లైన్ లో చెప్పాలంటే నేను ఇవాళ ఇలా ఉన్నానంటే.. మా నాన్నగారి కంటే ఎక్కువ వాసు కారణం. గంగోత్రి నుంచి ట్రావెల్ అవుతున్నాం. అద్భుతమైన సినిమాలు చేసాడు. 100 పర్సెంట్ లవ్, గీత గోవిందం, భలేభలే లాంటి సినిమాలు చేసాడు. అలాంటి వాసుకు కథ నచ్చడం చిన్న విషయం కాదు. ఎక్కడ్నుంచి వచ్చింది కథ అంటే.. నవదీప్ విని మాకు పంపించాడు. నువ్వు ఇలా ఇచ్చినందుకు థ్యాంక్స్. శరత్ అంటే నాకన్నీ.. శరత్ నాతో పని చేస్తున్నాడు అనేకంటే నా ఫ్యామిలీ. అదేంటో నేనొక్కనే పెరిగితే సరిపోదు.. చుట్టు పక్కలా అంతా పెరగాలి. వాసు సింపుల్ గా మూడు ముక్కలు చెప్పాడు. చాలా బాగుంది కథ అన్నాను. ఇవాళ ఈ సినిమా నేను చూసాను. నా సినిమా గురించి నేను చెప్పలేను కానీ పక్కనోడి సినిమా గురించి చెప్పగలను. చాలా బాగుంది. దర్శకుడు కౌశిక్ గురించి చెప్పాలి. ఈ సినిమా చూస్తున్నపుడు ఏజ్ ఎంత అని వాసును అడిగాను. 26 ఏళ్ళకే ఇంత మెచ్యూరిటీనా.. నాకు రెండు మూడేళ్ల కింద వచ్చిన మెచ్యూరిటీ ఈయనకు ఇప్పుడే వచ్చింది. అందరికీ హిట్ ఇవ్వబోయే దర్శకుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు సిగ్గేసింది నీ మెచ్యూరిటీ చేసి. నేను మీకు బస్తీ బాలరాజు గురించి చెప్పాలి.. కార్తికేయ ఏజ్ ఎంత..? 27, 28 కి ఇంత బాగా చేస్తున్నారు. నేనేం చేసాను ఆ వయసులో.. వీళ్లేంటి ఇంత బాగా చేస్తున్నారు అనుకున్నాను. బస్తీ బాలరాజు గుండెల్లోకి వెళ్తారు. అణువణువు ఇంకిపోయి ఉన్నాడు. ఈ రోజు కార్తికేయ మాట్లాడిన విధానం చాలా బాగా నచ్చింది. సినిమా చూసిన తర్వాత బాలరాజు.. ఇప్పుడు మీ మాటలు బాగా నచ్చాయి. తన జెన్యూన్ వర్క్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన బిజాయ్స్ నంబియార్ గారికి.. ఆయన మలయాళ సినిమా కల్కికి మంచి మ్యూజిక్ ఇచ్చారు. లావణ్య త్రిపాఠికి గీతా ఆర్ట్స్ లో మూడో సినిమా చేస్తుంది. ఆమె మా లక్కీ హీరోయిన్. ఆమని గారి గురించి చెప్పాలి.. మేం మీ సినిమాలు చూస్తూ పెరిగాం.. మీరెప్పుడెప్పుడు వస్తారా అని చూస్తున్నాం. ఈ రోజు మీకు ఇంత మంచి సినిమాతో వచ్చారు. అమ్మా చాలా బాగా చేసారు మీరు. శుభలగ్నం, మావిచిగురు లాంటి సినిమాలు చూస్తూ పెరిగాం. మా అందరికీ చాలా యిష్టమైన ఆర్టిస్ట్ మీరు. మీలాంటి వాళ్లు సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. ఇంకా ఎవర్నైనా మరిచిపోయుంటే క్షమించండి.. తెలుగు ప్రేక్షకులకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. థియేటర్స్ కు వస్తారా అనుకుంటే మీరు సినిమా తీయండి వస్తాం అని భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు. క్రాక్ గానీ, ఉప్పెన గానీ అందరికీ థ్యాంక్స్. వెళ్లేప్పుడు పుష్ప గురించి ఒక్కమాట చెప్పాలి. మీరు నా బలం.. ఆర్మీ.. ప్రాణం.. స్వతహాగా సంపాదించుకున్నానంటే అది కార్ కాదు, కోట్లు కాదు.. మీ అభిమానం మాత్రం. గర్వపడేంత వరకు తీసుకెళ్తాను. ఇది నా ప్రామిస్. సుమ గారికి థ్యాంక్స్. చావు కబురు చల్లగా మీకు కూడా నచ్చుద్ది. ఈ సినిమాలో కొత్త విషయం ఉంది. పుష్ప గురించి ఒకే మాట.. పుష్ప తగ్గేదే లే..’ అంటూ ముగించారు.