Latest Post

'Climax' releasing on March 5th

 Senior Actor Rajendra Prasad’s Multi-genre flick 'Climax' releasing on March 5th with clean U/A !!




Sr. Hero, Versatile Actor Dr. Rajendra Prasad & Acclaimed Writer/Director/Producer Bhavani Shankar’s upcoming Multi-genre flick 'Climax' ready for the release on March 5th with U/A.


Garnering a huge response to the Trailer, Climax stars Sri Reddy, Prudhvi Raj and Shivashankar Master in prominent roles in P.Rajeshwar Reddy & K.Karunakar Reddy production under Kaipas Film Production House.


Director Bhavani Shankar says, “Our ’Climax’ has an interesting character played by Sr. Hero Dr. Rajendra Prasad. We’re confident that we’ll entertain the audience of all genres while each and every role will thrill you throughout the film. As of now, our U/A certificate clears all the rumours around Vijay Modi characterization. Watch our CLIMAX in theatres on March 5th or a never before movie watching experience.”


Music : Rajesh Nidhwana

DOP : Rawi Cumar Neerla

Choreography: Prem Rakshith

Editing: Basva Peddireddy

Art: Rajkumar

O Manchi Roju Chusi Cheptha Releasing on March 19




 విజయ్ సేతుపతి నిహారిక కొణిదెల జంటగా నటించిన చిత్రం "ఓ మంచి రోజు చూసి చెప్తా", మార్చ్ 19న విడుదల 


విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయినా తమిళ చిత్రం "ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్". మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో "ఓ మంచి రోజు చూసి చెప్తా" అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హాక్కులను భారి  ధరకి సొంతం చేస్తున్నారు. ఈ చిత్రానికి  "ఓ మంచి రోజు చూసి చెప్తా" అనే పేరుతో మార్చ్ 19న విడుదల చేస్తున్నారు. 


ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ "ఓ మంచి రోజు చూసి చెప్తా" చిత్రం తమిళం లో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి గారి నటన ఈ చిత్రానికే ఒక హై లైట్. విలక్షణ నటనతో ప్రేక్షకులని అలరిస్తాడు. నిహారిక కొణిదెల గారు ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మార్చ్ 19 న భారీగా విడుదల చేస్తున్నాము" అని తెలిపారు. 



చిత్రం పేరు : ఓ మంచి రోజు చూసి చెప్తా


బ్యానర్ : అపోలో ప్రొడక్షన్స్


నటి నటులు : విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల, గౌతమ్ కార్తీక్, గాయత్రీ శంకర్, విజి చంద్ర శేఖర్, రమేష్ తిలక్ మరియు తదితరులు 


సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ 


కెమెరా : శ్రీ శరవణన్ 


ఎడిటర్ : అర్ గోవింద్ రాజ్ 


పి అర్ ఓ : పాల్ పవన్

Check Movie Review

 


Check out the Review of Check Movie Starring Nithiin, Rakul Preet Singh, and Priya Prakash Varrier Directed by  Chandra Sekhar Yeleti Produced by V. Anand Prasad  Under Bhavya Creations Kalyani Malik Composed music for this flick 

Story:

Check is the Story of Aditya( Nithin) who is caught by Police under Terrorist act and later he will be death sentenced by the court of law. How he try to Defend him what changes his direction in Jail  ? is he really involved in Terror attacks forms the rest of the story

 

Performances 

In this segment we must Appriciate Hero Nithin for his performance he done his best he has done perfect Justification to his role .Even though this film has zero commercial Elements Hero Nithin has shown his guts to do the flim like Check has has given his best  particularly the combination scens betwen Actor Sai Chand and Nithin came out very well . Rakul Preeth Singh has done decent job her performance is good .Priya Varrier makes a decent debut even though she has less screen presence she has given her best 

Sai Chand needs special Mention he has given splendid performance as a guru to nithin he has done out standing job  Harshvardhan comedy worked well . Murali Sharma ,Sampath Raj ,Aziz Nasser and rest of the cast has given their best 


coming to Technical Aspects we must appriciate Producer for Doing this kind of film with High Production values and The place goes to Art department for their set work total Set up looks so realistic and perfect . Kalyani Malik has given excellant music even though this film has only one song kalyani malik did it well and the background score is the soul of the film and he has done ultimate work and it helped in taking the movie to next level . camera work is neat visuals are good . The dialogues are pefect  .Editing is okay 

Director Chandrashekar Yeleti has given his best he tried very well to engage audience and hope fully this film will be commercial hit for him and he has brought out excellent performances from each and every artist 

   

Verdict:

Finally on the wole i can say Check is a Decent attempt with some gripping element except the climax scen every thing is good Go watch and Enjoy the flick this weekend 


Telugucinemas.in Rating  3/5

Blockbuster Director Anil Ravipudi to unveil the teaser of Muddy

 Blockbuster Director Anil Ravipudi to unveil the teaser of Muddy



Muddy is the first Indian film on Mud Race and the recently released motion poster garnered everyone's attention and received a thumping response. The film is a pan-Indian attempt and will have its theatrical release in five Indian languages: Telugu, Kannada, Hindi, Tamil and Malayalam. The motion poster clocked three million views already and is trending. The teaser of the film will be unveiled by blockbuster director Anil Ravipudi on February 26th evening at 6:03 PM.


Muddy is directed by Dr. Pragabhal and it features Yuvan and Ridhaan Krishna in the lead roles. The film is shot lavishly in exclusive locations in the presence of real mud racing players. Prema Krishnadas produced the film on PK7 Creations banner and there are good expectations on the film. KGF Sensation Ravi Basrur composed the songs and background score for this mud racing action entertainer and several renowned technicians are apart of Muddy. After the motion poster received a wide response, the audience are eagerly waiting for the teaser of Muddy. The makers planned the promotions on a lavish scale nationwide and the film's release date would be announced officially soon.


Hero Uday Shankar Interview About Kshana Kshanam

 



"క్షణక్షణం" మూవీ క్లైమాక్స్ వరకు ఉత్కంఠగా కూర్చోబెడుతుంది - హీరో ఉదయ్ శంకర్



కొత్త కంటెంట్ తో సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు యంగ్ హీరో ఉదయ్ శంకర్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా "క్షణక్షణం" శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. మన మూవీస్ బ్యానర్ లో  జియా శర్మ నాయికగా  కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో డాక్టర్ వర్లు "క్షణక్షణం" చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో నటించిన అనుభవాలను హీరో ఉదయ్ శంకర్ మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు చూస్తే..







నేను గతంలో రెండు చిత్రాలు "ఆటగదరా శివ", "మిస్ మ్యాచ్" లో హీరోగా చేశాను. ఆటగదరా శివ చిత్రానికి ఓటీటీలో మంచి ఆదరణ దక్కింది. ఆటగదరా శివ చిత్రానికి అత్యధిక వ్యూయింగ్ వచ్చినట్లు ఈ మధ్య బన్నీ వాస్ గారు చెప్పారు. మూడో చిత్రంగా క్షణక్షణం చిత్రం చేశాను. సినిమా రిలీజ్ కాబోతోంది. 


ఆడియెన్స్ థియేటర్ కు రావాలి లేకపోతే ఒక మంచి సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. ప్రమోషన్ బాగా చేస్తున్నాం. ఈ టైమ్ లో థియేటర్లు ఎక్కువగా దొరకడంలేదు. అయినా గీతా ఫిలింస్ వారు వీలైనంత ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారు. నాజీవితంలో జరిగిన ఘటనలు కొన్ని ఈ కథలో రిలేట్ అయ్యాయి. హీరో క్యారెక్టరైజేషన్ నాజీవితంతో పోల్చుకున్నాను. నాకే కాదు చాలా మందికి ఇలా జరుగుతుంటాయి. ఇంట్లో, బయటా రిజెక్షన్స్ వస్తుంటాయి. నా జీవితంలో పదీ పదిహేనేళ్లుగా నా జీవితంలో ఇలాంటివే జరిగాయి. కాబట్టి నేను నటించేందుకు పెద్దగా కష్టపడలేదు. సహజంగానే అనిపించింది. 


క్షణక్షణం టైటిల్ ను నేను బజ్ కోసం పెట్టలేదు. చూడగానే క్యాచీ టైటిల్ అని పెట్టాను అని దర్శకుడు అన్నారు. క్షణక్షణం టైటిల్ కథకు యాప్ట్. వెంకటేష్ గారి క్షణక్షణం పెద్ద హిట్ సినిమా. ప్రేక్షకులకు బాగా నచ్చిన చిత్రం. మా సినిమా డార్క్ హ్యూమర్ గా ఉంటుంది. చివరి 20 నిమిషాలు ఊహించలేరు. బన్నీ వాస్ గారికి కూడా ఆ  చివరి ఇరవై నిమిషాలే బాగా నచ్చింది. నేను ఊహించలేదు ఉదయ్ అన్నారు. 


మా కథకు కామెడీ కావాలని యాడ్ చేస్తే అసహజంగా ఉంటుంది. హీరో క్యారెక్టర్ నుంచే కామెడీ పుడుతుంది. హీరో బాధలే ప్రేక్షకులకు నవ్వులు పంచుతాయి. కోటి గారితో నా ఫస్ట్ మూవీ. లాయర్ క్యారెక్టర్ చేశారు. ముందుకు ఈ క్యారెక్టర్ కు కీరవాణి గారిని అనుకున్నాం. అయితే ఆయన ఆర్ఆర్ఆర్ బ్యాక్ గ్రౌండ్ లో బిజీగా ఉండి ఉంటారు. కోటి గారు చివరకు మా టీమ్ లోకివచ్చారు. రోషన్ సాలూరి మ్యూజిక్ బాగాచేశారు. ఆయన నిర్మల కాన్వెంట్ చిత్రానికి రోషన్ బాగా మ్యూజిక్ చేశాడు. తండ్రి కోటిగారు నటిస్తుంటే రోషన్ మ్యూజిక్ చేయడం వాళ్లిద్దరికీ కొత్త ఎక్సీపిరియన్స్. కోటి గారు సీన్ పేపర్ తీసుకుని క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయి చేశారు. ఎన్నిసార్లు టేక్స్ చేస్తానని కోటి గారు అన్నారు. 


కార్తీక్ గారు కథ చెప్పినప్పుడు తీసింది చూసినప్పుడు ఒకేలా అనుభూతి చెందాం. ఈ  కథను అనుకున్నట్లే చేయాలి. అనుకున్నదానికంటే ఎక్కువచేసినా సమస్యే. మేము అనుకున్నంతే చేయాలి. ఇంకొంత సీన్స్ ఎక్కువ చేయకుండా ఖచ్చితంగా అనుకున్నట్లే చేశాం. మౌళి గారు వన్ ఆప్ ద ప్రొడ్యూసర్. కోవిడ్ టైమ్ లో ఫిష్ హార్బర్ లో సినిమా షూటింగ్ చేయాలి. వర్లు గారు, మౌళి గారు లేకుంటే మా సినిమా షూటింగ్ అయ్యేది కాదు. మాస్క్ లు, శానిటైజర్లు, పీపీఈ కిట్స్ ఇలా ప్రతి ఒక్కరికీ ఇచ్చారు. ఉన్నవారికంటే ఎక్కువే తీసుకొచ్చి పెట్టారు. క్షణక్షణం సినిమా ఆడితేనే మరో సినిమా అవకాశం హీరోగా వస్తుంది, ఆ వాస్తవం నాకుతెలుసు. నేను లెక్కల్లో జీనియస్ గానీ, సినిమా లెక్కలు అస్సలు తెలియవు. కోటి, రఘు కుంచె, గిఫ్టన్ ఈ ముగ్గురు సంగీత దర్శకులు. మా సినిమాలో వాళ్లు నటించడం కో ఇన్సిడెంట్. 


నాకు హీరోయిన్ జియా శర్మతో సినిమాలో ఎలాంటి కెమిస్ట్రీ ఉండదు. ఆమె నా భార్య క్యారెక్టర్ చేసింది, ఎప్పుడూ మాకు గొడవలు జరుగుతుంటాయి. ఒక సమస్య నుంచి బయటకు రాగానే మరో సమస్యలో హీరో పడతాడు. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. మేము ఏం చేసినా సినిమా జనాలు చూడాలి. ఫస్టాఫ్ సినిమా బాగుంటుంది. ఇంటర్వెల్ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి చివరి దాకా సినిమా ప్రేక్షకుల్ని కూర్చోబెడుతుంది. సెకండాఫ్ నుంచి క్లైమాక్స్ దాకా ఉత్కంఠగా ఉంటుంది. 


రొటీన్ సినిమాలు కొత్త హీరోలు చేస్తే చూడరు. బ్యాక్ గ్రౌండ్ ఉంటే రెడీ మేడ్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ల సంగతి వేరు. బయట నుంచి వచ్చి కొత్తగా ట్రై చేసే హీరోలకు డిఫరెంట్ కథలు ఎంచుకోవాలి, విజయ్ సేతుపతి, ఆయుశ్మాన్ ఖురానా లాంటి వాళ్లు బాలీవుడ్ లో అదే ప్రయత్నం చేశారు. ఈ హీరో వస్తుందంటే ఏదో ఓ కొత్త కథ ఉంటుందనే పేరొస్తే చాలు. అభిమానులు వస్తుంటారు. ఉదయ్ సినిమా వస్తుందంటే ఏదో కొత్త కథ తీసుకొస్తాడనే పేరు తెచ్చుకోవాలని ఉంది. కథలో ఇంపార్టెంట్స్ ఉంటే క్యారెక్టర్స్ చేసేందుకైనా సిద్ధమే. అయితే హీరోగా చేయాలనేది నా కోరిక. ఒక సఖి, గీతాంజలి, ఓకే బంగారం లాంటి ఫీల్ గుడ్ ప్రాపర్ లవ్ స్టోరీలో నటించాలని ఉంది.

Heroine Nanditha Interview About Akshara

 


ఆ రికార్డ్ నాకు తప్ప మరే హీరోయిన్ కు లేదు -  "అక్షర" హీరోయిన్ నందితా శ్వేత


"ఎక్కడికిపోతావు చిన్నవాడా" చిత్రంతో టాలెంటెడ్ హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది కన్నడ నాయిక నందితా శ్వేత. ఆ తర్వాత "ప్రేమ కథా చిత్రమ్ 2", "శ్రీనివాస కళ్యాణం" లాంటి చిత్రాల్లో ఆకట్టుకుంది. ఇటీవలే "కపటధారి" చిత్రంతో పలకరించిన నందితా శ్వేత తన కొత్త సినిమా "అక్షర" తో ప్రేక్షకుల ముందుకొస్తోంది.  సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 26న ‘‘అక్షర’’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా "అక్షర" చిత్రంలో నటించిన అనుభవాలను మీడియాతో పంచుకుంది నందితా శ్వేత. ఆమె మాట్లాడుతూ...


నా కెరీర్ లో హారర్ ఫిలింస్ ఎక్కువ చేయలేదు. ప్రేమకథా చిత్రమ్2, ఎక్కడికి పోతావు చిన్నవాడా మాత్రమే చేశాను. ఈ చిత్రంలో విద్యార్థులతో ఎక్కువగా మాట్లాడుతాను. ట్విస్ట్ ఉంటుంది కథలో. ఆ మలుపు ఏంటి అనేది చెప్పను. సినిమాలో చాలా ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ఏదో సందేశం చెబుతున్నాం. మీరు కూర్చుని చూడండి అని ఉండదు. మెసేజ్ కాకుండా సినిమాకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అక్షర నాకు ఒక ఛేంజ్ ఓవర్ మూవీ అనుకోవచ్చు. కెరీర్ బిగినింగ్ లోనే ఫీమేల్ స్క్రిప్ట్ చేయడం అంటే సాహసం అనుకోవాలి. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు కొంత భయపడ్డాను. ఇప్పుడు నేను సందేశం చెబితే తీసుకుంటారా లేదా అనేది సందేహించాను. కానీ డేర్ డెసిషన్ తీసుకున్నాను. టీమ్ కూడా ననన్ను తీసుకోవడంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అక్షర మూవీ కోసం నన్ను పిలిచినప్పుడు హారర్ మూవీనే కదా అనుకున్నాను. కానీ చిన్న కృష్ణ గారు కథ చెప్పినప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించింది. షకలక శంకర్, మధు నందన్, సత్య, అజయ్ ఘోష్ చేసిన క్యారెక్టర్లు చేసిన కామెడీ చాలా  బాగుంటుంది.


అక్షర సినిమాలో హారర్  లేదు. సస్పెన్స్ ఉంటుంది. లాక్ డౌన్ లో ఫస్ట్ 3 మంత్స్ రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆన్ లైన్ కోర్సులు చేశాను. వెబ్ సిరీస్ లో ఛాన్సులు వచ్చాయి. కానీ నేను అంగీకరించలేదు. దానికి కారణం. నిర్మాతలు చాలా మంది లాక్ డౌన్ ముందు చేసిన సినిమాలు థియేటర్లోనే రిలీజ్ చేయాలని అనకుున్నారు. ఓటీటీకి ఎక్కువ మంది ఆసక్తి చూపించలేదు. నా సినిమాల్లో ఇటీవల కపటధారి థియేటర్లో రిలీజ్ అయ్యింది. మార్చి నుంచి చూస్తే అక్షరతో కలిపి నేను చేసిన నాలుగు సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. ఇది మరే హీరోయిన్ కు దక్కని ఘనత అనుకోవచ్చు.


స్క్రిప్ట్ ఈజ్ హీరో అనుకుంటాను. అందులో నా క్యారెక్టర్ ఎంత బాగుంది,  ఎంత నిడివి ఉంది అని ఆలోచించేదు. అక్షరలో నన్ను ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో చూస్తారు. కపటధారిలో నా క్యారెక్టర్ తక్కువ ఉంది అని కొందరు అన్నారు. సహజంగానే థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ కు తక్కువగానే స్పేస్ ఉంటుంది. ఆ వాస్తవం నాకు తెలుసు. తమిళం, తెలుగులో ఒకేసారి కపటధారి చిత్రాన్ని చిత్రీకరించాం. అదొక కొత్త అనుభవం నాకు. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాత్రమే కాదు ఏ సిస్టమ్ అయినా ఫ్లస్ మైనస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఎందుకు చేశామటే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. స్టూడెంట్స్ సఫర్ అవడం నాకు ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తోంది. మన పిల్లలు కాన్వెంట్ లో చదవాలని తల్లిదండ్రులు అంతా అనుకుంటారు. అలాగే మా పేరెంట్స్ కూడా చిన్నప్పుడు నన్ను పెద్ద స్కూల్ లో వేశారు. ఆ ఏడాది నాకు వారితో అడ్జస్ట్ కావడం చాలా కష్టమైంది. ఇంగ్లీష్ లోనే మాట్లాడాలని అనడ కూడా ఇబ్బంది పడ్డాను. ఫీజ్ కట్టడం కూడా కష్టమైంది. ఆతర్వాత తొమ్మిదో తరగతి నుంచి కార్పొరేషన్ స్కూల్లో జాయిన్ అయ్యాను. నా లాంటి కథే చాలా మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉంటుంది.


విద్యా వ్యవస్థలోనే లోపాలను చెబుతున్నాం. కానీ విద్య లేనిదే ఎదగలేము అని చెప్పలేదు. విద్య వల్లే జీవితంలో పైకి వస్తాము అని కాదు. కమ్యునికేషన్ బాగుంటుంది ఎడ్యుకేషన్ ఉంటే. నేను ఉన్నత చదువు వదిలేసి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాను. హీరోయిన్ గా నాకూ పేరు చ్చింది.


అక్షరలో విద్యా వ్యవస్థ అంశాలతో కామెడీ చేయలేదు. ఎడ్యుకేషన్ కు కామెడీకి సంబంధం లేదు. అది రెండు వేరే వేరే ట్రాక్ లు ఉంటాయి. ఎంటర్ టైనింగ్ కోసం కామెడీ చేసింది. ప్రేక్షకులు వినోదం కోసం చేసిన పాత్రలు అవి. ఈ చిత్రంలో నటించడం ఛాలెంజింగ్ గా అనిపించలేదు. క్యాజువల్ గానే నటించాను. ఎక్కడికి పోతావు చిన్నవాడా లో రెండు పాత్రల మధ్య ట్రాన్సఫర్మేషన్ ఉంటుంది. అప్పుడు కష్టం అనిపించింది .కానీ ఈ చిత్రంలో ఒకే పాత్ర కంటిన్యూగా ఉంటుది కాబట్టి కేవలం యాక్ట్ చేశాను. అంతే


ఫ్లాప్ అయితే మూవీస్ రావు అంటారు, గ్లామర్ గా లేకుంటే మూవీస్ రావు అంటారు, ఎడు ఏనిమిది సినిమాలు చేశాను. నందిత సినిమా చేయలేదు అని ఎవరూ అనరు. ఇప్పటికీ అవకాశాలు బాగానే వస్తుంటాయి. అక్షర లాంటి చిత్రం చేశాను సంతృప్తిగా ఉంది. ప్రతి సినిమా కష్టపడే చేస్తుంటాము. విజయం, అపజయం నా చేతిలో లేదు.


అక్షర ఓన్లీ తెలుగు, మిగతా భాషల్లో అనుకుంటున్నారు చూడాలి.  రాజు గారి గది హీరో అశ్విన్ తో  ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. అందులో ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. చాలా కష్టపడి నటిస్తున్నాను. దబాంగ్ మూవీకి తమిళ్, తెలుగు, కన్నడ కు డబ్బింగ్ చెప్పాను. శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. నేను ఇంట్రోవర్ట్, ఎక్కువగా అందరితో కలవను కాట్టి లాక్డౌన్ పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.

Software Blues Ready For Release

 


విడుదలకు సిద్ధమైన "సాఫ్ట్ వేర్ బ్లూస్"


 శ్రీరాం, భావనా చౌదరి, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్.రాజు, బస్వరాజ్   నటీనటులుగా ఉమాశంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తోన్న  చిత్రం "సాఫ్ట్ వేర్ బ్లూస్"  ఈ చిత్రం మార్చి మూడవ వారంలో థియేటర్లలో విడుదలవుతున్న  సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.



 ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... నేను సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న సమయంలోనే నిర్మాతలకు "సాఫ్ట్ వేర్ బ్లూస్" కథ చెప్పడం జరిగింది.వారు నన్ను నమ్మి  ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు.అందరు "సాఫ్ట్ వేర్ బ్లూస్" అంటే ఎదో అను కుంటున్నారు. బ్లూస్ అంటే కష్టాలు అని అర్థం. సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ పడే కష్టాలను తెలియజేస్తూ..ఈ సినిమా లవ్, కెరీర్, ఫ్రెండ్స్ మధ్య  నడుస్తుంది.హీరో బెస్ట్ పెర్ఫారర్ ఇయర్ అవార్డ్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తుంటాడు.తను అవార్డ్ ఎందుకు తెచ్చుకోవాలను కుంటాడనే థీమ్ తీసుకొని, సాఫ్ట్ వేర్ జాబ్  సెర్చింగ్ లోని కష్టాలు, అలాగే ప్రస్తుతం సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న వారి కష్టాలు ఎలా ఉంటాయి.వారికిచ్చిన టార్గెట్స్, టాస్క్స్ పూర్తి చేసే క్రమంలో వారు పడుతున్న టెన్షన్స్ ను తెలుపుతూ  ఔట్ & ఔట్ కామెడీ ఎంటర్ట్ టైన్ గా ఈ మూవీ రూపొందించడం జరిగింది. ఇందులో నటించిన వారెవరూ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కాకున్నా డెడికేషన్ తో వర్క్ చేశారు.సంగీత దర్శకుడు మూవీకి మంచి పాటలందించాడు.మార్చి మూడవ వారంలో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు.


 నటుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ.. సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కష్టాలను తెలియజేస్తూ  సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మొట్ట మొదటి సినిమా "సాఫ్ట్ వేర్ బ్లూస్".సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకునే డైరెక్టర్ ఉదయ్ శంకర్ గారు తను జాబ్  వదులుకొని ఈ సినిమా చేస్తున్నాడు. సాఫ్ట్ వేర్ కు సంబంధం లేని వారికి కూడా ఈ సినిమా నచ్చుతుందని అన్నారు 


 కె.యస్. రాజు మాట్లాడుతూ... తమిళనాడు నుండి హైదరాబాద్ కు వచ్చి సాఫ్ట్ వేర్ జాబ్ వెతుక్కొనే కమెడియన్ పాత్రలో హీరోకు ఫ్రెండ్ గా  నటించానని  అన్నారు.



 మరో నటుడు బస్వరాజ్ మాట్లాడుతూ  హీరో కి ఫ్రెండ్ గా ఓబుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను.

ఇప్పటివరకూ నేను నాలుగు సినిమాలు చేసినా ఈ సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేశాను. నాకీ అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.


 సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ... సాఫ్ట్ వేర్ జాబ్ అంటే అందరికీ చులకన భావం ఉంటుంది.నేను ఈ కథ విన్న తర్వాత వారికి  ఎన్ని కష్టాలు ఉంటాయో ఈ మూవీ ద్వారా తెలుసుకున్నాను. పాటలు బాగా వచ్చాయి. ఇందులో వున్న మూడు పాటలు కథకు అనుగునంగానే  వస్తాయి అని అన్నారు 


 హీరోయిన్ భావన మాట్లాడుతూ ..ఇది నాకు మొదటి చిత్రమైనా సెట్ లో నటీనటులందరూ నాకు బాగా కో ఆపరేట్ చేశారు.ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయి గా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు 


 హీరో శ్రీరాం మాట్లాడుతూ... అందరూ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ అంటే  లగ్జరీ జీవితం అనుకుంటారు. కానీ  వారికి కష్టాలు, కన్నీళ్లు వుంటాయని ఈ చిత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. సినిమా చూసిన వారందరికీ  "సాఫ్ట్ వేర్ బ్లూస్" కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ కు ఫస్ట్ మూవీ అయినా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తున్న తను నాలుగు లక్షల జీతాన్ని వదులుకొని సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో  ఈ మూవీ చేస్తున్నాడు.తనకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు.


 నటీ నటులు

శ్రీరాం, భావనా చౌదరి,ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్.రాజు, బస్వరాజ్   తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి


 సాంకేతిక నిపుణులు:

నిర్మాతలు: సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్  

కథ, దర్శకత్వం: ఉమాశంకర్

సంగీతం: సుభాష్ ఆనంద్,

సినిమాటోగ్రఫీ: నిమ్మ గోపి,

ఎడిటర్: వి.కె.రాజు,

ఫైట్స్: దేవరాజ్,

పి.ఆర్. ఓ : దుద్ది శ్రీను

Actor Sampath Raj Interview About Check



'లౌక్యం' సక్సెస్ తర్వాత ఆనందప్రసాద్ గారు ఐఫోన్ లు ఇచ్చారు. 'చెక్'కి అంతకంటే పెద్ద గిఫ్ట్ అడగాలి!* - సంపత్ రాజ్ ఇంటర్వ్యూ

సంపత్ రాజ్... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయనకు ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. సంపత్ రాజ్ కెరీర్ ప్రారంభంలో 'లౌక్యం'లో అతడికి మంచి పాత్ర ఇచ్చి భవ్య క్రియేషన్స్ ప్రోత్సహించింది. ఈ సంస్థలో ఆయన నటించిన తాజా చిత్రం 'చెక్'. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం 'చెక్'. శుక్రవారం (ఫిబ్రవరి 26న) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సంపత్ రాజ్ తో ఇంటర్వ్యూ...


'చెక్' సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా గురించి...

మంచి కథతో రూపొందిన చిత్రమిది. జైలులో ఓ ఘటన జరిగిన తర్వాత ఏమైందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఎక్కువ శాతం హీరో ఒకే కాస్ట్యూమ్ లో కనిపిస్తారు. రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండాలో... అంత దగ్గరగా ఉంటుందీ సినిమా.‌ చాలా చాలా బావుంటుంది. 


ఇప్పటివరకు మీరు నటించిన సినిమాల్లో 'చెక్' భిన్నమైన సినిమా అనుకోవచ్చా?

అవును. తెలుగులో నేను నటించిన సినిమాల్లో భిన్నమైనది ఇదే. సినిమాలో ఎక్కువ లోకేషన్స్ ఉండవు. ఎక్కువ సన్నివేశాలు జైలులో జరుగుతాయి. షూటింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నది ఏంటంటే... నిజ జీవితంలో ఓ ఖైదీ జైలులో ఎలా ఉంటాడు? జైలు జీవితం ఎలా ఉంటుంది? అనేది చూశా. పదేళ్లు, ఇరవై ఏళ్ళు జైలులో అలా ఉండాలంటే ఎలా ఉంటుంది? ఈ సినిమా చేయడం ద్వారా ఖైదీ జీవితాన్ని చూశా. అది కాకుండా దర్శకుడు ఆ ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకువెళతారు. అది హండ్రెడ్ పర్సెంట్ పక్కా. నాకు నమ్మకం ఉంది. 


ట్రైలర్ చూస్తే మీరు పోలీస్ గా చేశారని తెలుస్తుంది. నితిన్ లాస్ట్ సినిమా 'భీష్మ 'లో కూడా మీరు పోలీస్ గా చేశారు కదా!

'భీష్మ'లో నేను పోలీస్ అయినప్పటికీ... అందులో నా క్యారెక్టర్ లో ఎక్కువ ఫన్ ఉంటుంది. దానికి, ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి అసలు సంబంధం ఉండదు. రెండు డిఫరెంట్ రోల్స్. పోలిక ఏమీ ఉండదు. 


'చెక్'లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

హీరో మీద పగ ఉంటుంది. ప్రతీకారంతో హీరోకి ఉరిశిక్ష పడాల్సిందే, ఉరి అమలు కావాల్సిందే అనే లక్ష్యంతో ఉంటాడు. అతని జీవితంలో మరో అంశం  ఉరి పడిందా? లేదా? అన్నది సినిమా. చంద్రశేఖర్ యేలేటి గారు కథ చెప్పినప్పుడు విజువల్ గా ఆ పాత్రలో నన్ను ఊహించుకున్నా. నాకు డిఫరెంట్ రోల్, డిఫరెంట్ పోలీస్ అని అర్థమైంది.


భీష్మ', 'చెక్' కంటే ముందు కూడా మీరు పోలీస్ రోల్స్ చేశారు. పోలీస్ అంటే సంపత్... సంపత్ అంటే పోలీస్ అన్నట్టు!


(నవ్వుతూ)... ఇప్పుడు 'ఎఫ్3'లో కూడా పోలీస్ గా చేస్తున్నాను. నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే... తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ఓ లెటర్ రాస్తాను. 'నాకు పెన్షన్ ఇవ్వండి' అని. ఎక్కువసార్లు పోలీస్ గా నటిస్తున్నాను కదా! అలాగే, 'పోలీస్ కమీషనర్, ఐజీ డ్రస్ లు నేనే కుట్టించుకుంటా' అని. పోలీస్ క్యారెక్టర్ అంటే దానికి తగ్గ డ్రస్ నేనే వేసుకుని షూటింగ్ కి వెళ్తా. పెన్షన్ మాత్రం తప్పకుండా అడుగుతా. (నవ్వులు)


దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి గారి గురించి?

ఆయన గురించి చెక్ చేయడానికి ముందే నేను విన్నాను. నేను రామోజీ ఫిల్మ్ సిటీలో వేరే సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సినిమా కథ చెప్పడానికి ఆయన వచ్చారు. పది నిమిషాలు నా క్యారెక్టర్ గురించి వివరించారు. ఈలోపు మేం ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాలు కాకుండా చాలా విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాం. దర్శకుడిగా ఆయన ప్రతిభ గురించి అందరికీ తెలుసు. 


భవ్య క్రియేషన్స్, సంపత్ రాజ్... సక్సెస్ ఫుల్ కాంబినేషన్!

మా కాంబినేషన్ లో 'లౌక్యం' సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా అంత కంటే పెద్ద హిట్ అవ్వాలి. ఆనంద ప్రసాద్ గారు, అన్నే రవి గారు నా ఫ్యామిలీ. భవ్య క్రియేషన్స్ నా హోమ్ ప్రొడక్షన్ కింద భావిస్తా. ‘లౌక్యం’ హిట్ తర్వాత సక్సెస్ టూర్ లో కోన వెంకట్ గారు ఓ మాట చెప్పారు. సినిమా సక్సెస్ తర్వాత కనీసం ఒక యాపిల్ కూడా ఇవ్వరు. కానీ, ఆనంద ప్రసాద్ గారు యాపిల్ ఐ ఫోన్ ఇచ్చారు అని. కచ్చితంగా ఈ సినిమా ‘లౌక్యం’ కంటే పెద్ద హిట్ అవుతుంది. ఐ ఫోన్ కంటే పెద్ద గిఫ్ట్ అడగాలి. 


లౌక్యం లో నటించిన రకుల్ కూడా ఈ సినిమాలో నటించారు. ఆమెతోనూ మీది సక్సెస్ ఫుల్ కాంబినేషన్!


రకుల్ కి బ్రదర్ నటించాను. తనకు తండ్రిగా నటించాను. తనకు కొలీగ్ చేశా. ఆ అమ్మాయితో కూడా నాది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఈ సినిమాతో మరోసారి అది ప్రూవ్ అవుతుంది.


'చెక్' చూశారా?

లేదు. కానీ, కథంతా తెలుసు. క్లైమాక్స్ చాలా బావుంటుంది. నాకు అది బాగా నచ్చింది. ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా ఉంటుంది. ఒకటి జరుగుతుందని ఊహిస్తారు. చూస్తే... అది కాదు, మరొకటి జరుగుతుంది. విజువల్స్ షాక్ ఇస్తాయి. దర్శకుడి ఇంటిలిజెన్స్ క్లైమాక్స్ లో ప్రేక్షకులకు తెలుస్తుంది. స్క్రీన్ ప్లే చాలా బావుంటుంది. క్లైమాక్స్ లో టర్న్ అండ్ ట్విస్టులు ఎక్స్ట్రా డినరీ. ప్రేక్షకులు అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నా. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి ఇస్తుంది.

Art director Anand Sai is on board For Pspk 28

 Art director Anand Sai is on board for the much awaited movie of Power Star Pawan Kalyan and Harish Shankar produced by Mythri Movie Makers.



Anand Sai as an art director needs no introduction. Starting from Power Star Pawan Kalyan's 'Tholiprema' to Mega Power Star Ram Charan's 'Yevadu', Anand Sai has worked for nearly hundred movies, winning appreciation, accolades and state government awards for his work. After dedicating the last five years of his expertise for the Yadadri Sree Lakshmi Narasimha Swamy temple as the chief architect, he has decided to step back into films since the temple is in its last leg of completion. After a small hiatus, he would be on sets as the art director for the prestigious project produced by popular production house Mythri Movie Makers in the combination of Power Star Pawan Kalyan and director Harish Shankar with grandeur. It is notable that both his debut and his comeback film are with Power Star Pawan Kalyan. The producers of Mythri Movie Makers Mr. Naveen Yerneni, Mr. Y. Ravi Shankar along with director Harish Shankar have welcomed art director Anand Sai and have officially announced his name as the Art Director with a poster on social media.



Magnificent Art Director Anand Sai garu is back to Cinema after dedicating his 5 years of craftsmanship for Yadadri Temple - The Pride of Telangana.

Hero Nithin Interview About Check

 


ఆ అవకాశం వస్తే... నా ఫస్ట్‌ ఛాయిస్‌ పవన్‌కల్యాణ్‌గారే!

– నితిన్‌ ఇంటర్వ్యూ


యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన సినిమా ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానున్న నేపథ్యంలో పాత్రికేయ మిత్రులతో నితిన్‌ సమావేశమయ్యారు. నితిన్‌ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు...


‘చెక్‌’ సినిమా ఎలా మొదలైంది?

– ‘భీష్మ’ సినిమా అంగీకరించిన సమయంలోనే ‘చెక్‌’ అంగీకరించా. ఒక కమర్షియల్‌ సినిమా, ఒక డిఫరెంట్‌ సినిమా చేయాలనే ఆలోచనతో ఈ సినిమాకు ఓకే చెప్పా. లాస్ట్‌ ఇయర్‌ ‘భీష్మ’ విడుదలైంది. తర్వాత లాక్‌డౌన్‌ రావడంతో ‘చెక్‌’ చిత్రీకరణ ఆలస్యమైంది.


డిఫరెంట్‌ సినిమాలు, ప్రయోగాలు చేయాలని ఎప్పుడు అనిపించింది?

– ‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత! మూడు ఫ్లాపులు రావడంతో ఓ కమర్షియల్‌ సినిమా, మరో డిఫరెంట్‌ సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యా. డిఫరెంట్‌ సినిమాలు తీయడంతో చంద్రశేఖర్‌ యేలేటిగారు మాస్టర్‌ కాబట్టి ‘చెక్‌’ ఒప్పుకొన్నా.


చంద్రశేఖర్‌ యేలేటిగారు ‘చెక్‌’ స్ర్కిప్ట్‌, మీ క్యారెక్టర్‌ చెప్పినప్పుడు ఏమనిపించింది?

– ఫస్ట్‌ వేరే కథ చెప్పారు. ఆ స్ర్కిప్ట్‌ లైన్‌ బావుంది. రెండు నెలలు ట్రావెల్‌ చేశాం. అయితే, ఆ స్ర్కిప్ట్‌ మీద ఆయన అంత కాన్ఫిడెంట్‌గా లేరు. నాకూ అంత కాన్ఫిడెన్స్‌ రాలేదు. మళ్లీ రెండు నెలలు గ్యాప్‌ తీసుకుని వచ్చి ‘చెక్‌’ స్ర్కిప్ట్‌ చెప్పారు. లైన్‌ చెప్పగానే ఇన్‌స్టంట్‌గా నచ్చింది. కథలో ఎక్కువ శాతం జైలులో జరుగుతుంది. సాంగ్స్‌ లేవు. రొమాంటిక్‌, కామెడీ ట్రాక్స్‌ లేవు.


అసలు, కథేంటి?

– ఆదిత్య జీవిత ప్రయాణమే ‘చెక్‌’. అతను జైలులో ఉండే ఓ ఖైదీ. చెస్‌ నేర్చుకుని ఎలా గ్రాండ్‌ మాస్టర్‌ అయ్యాడు? అనేది సినిమా. చంద్రశేఖర్‌ యేలేటిగారు కథ చెప్పినప్పుడు నాకు క్లైమాక్స్‌ నచ్చింది. లాస్ట్‌ 15 మినిట్స్‌ హైలైట్‌. అక్కడ యేలేటిగారి మార్క్‌ అంతా కనిపిస్తుంది.


కొత్త నితిన్‌ను చూస్తారని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు!

– అవును. నా యాక్టింగ్‌ కొత్తగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. సినిమా చాలామంది చూశారు. వందమంది చూస్తే, వందమందికీ నచ్చింది. అందరూ బావుందని చెప్పారు.


ఎక్కువశాతం సినిమా జైలులో జరుగుతుంది కాబట్టి క్యారెక్టర్‌ కోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రిపేర్‌ అయ్యారా?

– లేదండీ. సెట్‌కి వెళ్లాక యేలేటిగారు ఏం చెబితే అది ఫాలో అయ్యా. ‘భీష్మ’, ‘రంగ్‌ దే’ సెట్స్‌లో కాస్త జోవియల్‌గా ఉండేవాణ్ణి. ‘చెక్‌’ సెట్‌లో మాత్రం కామ్‌గా ఉండేవాడ్ని. జైలులో ఖైదీ క్యారెక్టర్‌ కాబట్టి సెట్‌ వాతావరణం అంతా డార్క్‌గా ఉండేది. షాట్‌ చేయడం, తర్వాత పక్కకి వెళ్లి కామ్‌గా కూర్చోవడం... అంతే!


కొత్త క్యారెక్టర్లు చేసినప్పుడు రీసెర్చ్‌ చేస్తారు కదా! మీరు?

– నేనేం చేయను. నా డైరెక్టర్లను ఫాలో అవుతా. డైరెక్టర్లు ఏం చేబితే... అది ఫాలో అవుతా. దర్శకులందరూ మంచివాళ్లు.


రాజమౌళిగారు ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో మీ గురించి గొప్పగా చెప్పారు. మీ ఫీలింగ్‌ ఏంటి?

– ఇట్‌ ఫీల్స్‌ గ్రేట్‌. రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడి నుంచి కాంప్లిమెంట్స్‌ రావడం గ్రేట్‌.


సినిమాలో మీరు డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారా? ట్రైలర్‌ చూస్తే అలా...

– లేదు లేదు. నాది సింగిల్‌ రోలే. ఫ్లాష్‌బ్యాక్‌ పార్ట్‌ ఉంది. అందులో కలర్‌ఫుల్‌ కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తా.


ప్రియా ప్రకాశ్‌ వారియర్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌?

– వెరీ నైస్‌. తెలుగులో ఆమెకు తొలి సినిమా ఇది. చాలా బాగా నటించింది.


రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి?

- యాక్చువల్లీ... రకుల్‌కి థ్యాంక్స్‌ చెప్పాలి. సినిమాలో తను లాయర్‌ రోల్‌ చేసింది. తనకు, నాకు మధ్య సాంగ్స్‌ లేవు. రొమాంటిక్‌ ట్రాక్‌ లేదు. ఓ మంచి క్యారెక్టర్‌లో నటించడానికి ముందుకు వచ్చింది. సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేసింది.


భవ్య క్రియేషన్స్‌ సంస్థలో తొలిసారి సినిమా చేశారు. ఈ బ్యానర్‌లో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌?

- ఇటువంటి సినిమాను ప్రొడ్యూస్‌ చేయడం గ్రేట్‌. ఇది రెగ్యులర్‌ సినిమా కాదు. డిఫరెంట్‌ సినిమా. ఇటువంటి సినిమాలకు ఖర్చు పెట్టవచ్చు. అయితే, ఓ పది కోట్లు లేదా కొంత పెడతారు. కానీ, భారీ బడ్జెట్‌తో సినిమా ప్రొడ్యూస్‌ చేసిన ఆనందప్రసాద్‌గారు గ్రేట్‌ అని చెప్పాలి. సినిమా బాగా ఆడి వాళ్లకు డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను.

*‘చెక్‌’ వంటి సినిమాకు రీ–రికార్డింగ్‌ ఇంపార్టెంట్‌. కల్యాణీ మాలిక్‌ ఎలా చేశారు?

– రీ–రికార్డింగ్‌తో సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకువెళ్ళారు. ఆయన అంత మంచి మ్యూజిక్‌ ఇచ్చారు.


సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయిన ఫస్ట్‌ వీక్‌ ఎక్కువ టేక్స్‌ తీసుకున్నారట?

– అవును. యేలేటిగారి స్టయిల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ వేరు. అర్థం చేసుకోవడానికి ఓ వారం పట్టింది. అప్పుడు ఎక్కువ టేక్స్‌ తీసుకున్నా. తర్వాత ఈజీగా చేశా. ‘జయం’ తర్వాత అన్ని ఎక్కువ టేక్స్‌ తీసుకున్నది ఈ సినిమాకే. ఐటెమ్‌ సాంగ్స్‌, రొమాంటిక్‌ సాంగ్స్‌, కామెడీ ఎపిసోడ్స్‌ వంటివి ఏమీ ఉండదు. సినిమా అంతా కంటెంట్‌ ఉంటుంది. లాక్‌డౌన్‌లో ప్రజలందరూ ఓటీటీల్లో డిఫరెంట్‌ సినిమాలు చూశారు. వాళ్ళు కూడా డిఫరెంట్‌ సినిమాలు కోరుకుంటున్నారు. తప్పకుండా ఈ సినిమా జనాలకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాకు సీక్వెల్‌ చేసే ఐడియా ఉంది. క్లైమాక్స్‌ చూస్తే మీకూ అర్థమవుతుంది.


ఈ సినిమా చేయడం రిస్క్‌ అనిపించలేదా?

– రెండేళ్ల క్రితం అయితే రిస్క్‌ ఏమో! ఇప్పుడు ఆడియన్స్‌ డిఫరెంట్‌ సినిమాలు, ఓటీటీలో కొత్త కంటెంట్‌ చూస్తున్నారు. ‘నాంది’, ‘ఉప్పెన’ ఆడాయి. ఇటువంటి సినిమాలకు ఫ్యాన్స్‌  ఉన్నారు.


మ్యారేజ్‌ తర్వాత ఫస్ట్‌ మూవీ! అదీ కంటెంట్‌ ఓరియెంటెడ్‌ మూవీ. ప్లాన్‌ చేసుకుని చేశారా?

– ఏం ప్లాన్‌ లేదు. పెళ్లికి ముందే సినిమా ఒప్పుకొన్నా. లాక్‌డౌన్‌ వల్ల సినిమా డిలే అయ్యింది. అటువంటి ప్లానింగ్‌ ఏమీ లేదు.


పెళ్లి తర్వాత విడుదలవుతున్న సినిమా ఇదే. మీరెంత ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. వైఫ్‌ ఎంత ఎగ్జైటెడ్‌గా ఉన్నారు?

– నాకు ఎగ్జైట్‌మెంట్‌ ఏమీ లేదు. సినిమా ఆడితే లక్‌ అంటారు. ఆడకపోతే ఆమె బ్యాడ్‌లక్‌ అంటారు. అందుకని, తనకు కొంచెం టెన్షన్‌ ఉంది.


సినిమా టీజర్‌, ట్రైలర్‌ చూసి మీ వైఫ్‌ ఏమన్నారు?

– తనకు బాగా నచ్చింది.


ఆవిడతో సినిమాల గురించి షేర్‌ చేసుకుంటారా?

– లేదు.సినిమాల గురించి మాట్లాడను. మా మధ్య సినిమా, స్టోరీ డిస్కషన్లు ఉండవు. అది వేరే జీవితం, ఇది వేరే జీవితం!


మ్యారీడ్‌ లైఫ్‌ ఎలా ఉంది?

– సేమ్‌! నాకు పెద్ద తేడా ఏమీ లేదు. పెళ్లికి ముందు షాలిని ఇంటికి వచ్చి వెళ్తుండేది. పెళ్లి తర్వాత ఎప్పట్నుంచో తను ఇంట్లో ఉన్న ఫీలింగ్‌. ఇంట్లో మెంబర్‌లా ఉంది తప్ప నాకు కొత్తగా ఏమీ లేదు.


వాళ్ళది డాక్టర్స్‌ ఫ్యామిలీ, మీది యాక్టర్స్‌ ఫ్యామిలీ...

– యాక్టర్‌ అండ్‌ డాక్టర్‌... బాగా సింక్‌ అయ్యింది. నాకు ఏదైనా అనారోగ్యం  వస్తే, ఇంతకు ముందు డాక్టర్‌ దగ్గరకు వెళ్ళేవాడ్ని. ఇప్పుడు అత్తమామలకు ఫోన్‌ చేసి అడగొచ్చు.


మల్టీస్టారర్‌ ఫిల్మ్స్‌ చేసే ఇంట్రెస్ట్‌ ఉందా?

– ఉంది. అవకాశం వస్తే... నా ఫస్ట్‌ ఛాయిస్‌ పవన్‌కల్యాణ్‌గారే. ఆ ఛాన్స్‌ ఎప్పుడు వస్తుందా? అని వెయిట్‌ చేస్తున్నా.


మీ ప్రతి సినిమాలో పవన్‌ కల్యాణ్‌గారి ప్రస్తావన ఉంటుంది. మరి, ఈ సినిమాలో?

- ఇందులో ఆ స్కోప్‌ లేదు. జైలులో పవన్‌గారి ఫొటో పెడితే బాగోదు.


మీ నెక్ట్స్‌ సినిమాలు?

– ‘రంగ్‌ దే’ చిత్రీకరణ పూర్తి చేశా. ‘అంధాధున్‌’ రీమేక్‌ షూటింగ్‌ సగం అయ్యింది. ఈ రెండు సినిమాల రిలీజ్‌ డేట్స్‌ అనౌన్స్‌ చేశాం. మేలో ‘పవర్‌ పేట’ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తా. కుదిరితే ఆ సినిమా డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. మరో సినిమాలు యాక్సెప్ట్‌ చేశా. ప్రజెంట్‌ ఉన్నవి రిలీజ్‌ అయ్యాక వాటి గురించి చెబుతా.

April 28 Yem Jarigindhi Hero Ranjith Interview

 


డా.రంజిత్‌తో   ఇంటర్వ్యూ

సాధారణంగా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు అంటుంటారు.. అయితే డా.రంజిత్.. ముందుగా ఆయుర్వేద డాక్టర్‌గా పేరు సంపాందించి.. తనలోని నటుడిని సంతృప్తి పరచుకోవడానికి ఇప్పుడు యాక్టర్ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన చిత్రం ఏప్రిల్ 28 ఏం జరిగింది. వీరాస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  సందర్భంగా డా.రంజిత్‌తో జరిపిన ఇంటర్వ్యూ ఇది.  


నాన్న స్ఫూర్తితో..

మా నాన్న ఎలూర్చి వెంకట్రావు ఆయుర్వేద డాక్టర్‌గా చక్కటి పేరు గడించారు. సినిమాలపై ఆయనకు అమితమైన ఆసక్తి ఉంది. సినీ రైటర్స్ అసోసియేషన్‌ను నాన్న ప్రారంభించారు. గాడ్‌ఫాదర్, మావూరి మారాజు, ఇంటింటి దీపావళి, ప్రజల మనిషితో పాటు చాలా సినిమాలకు రచయితగా పనిచేశారు. ఆయన బాటలోనే అడుగులు  వేస్తూ నేను వైద్యవృత్తిని ఎంచుకున్నా. పన్నెండేళ్లుగా డాక్టర్‌గా పనిచేస్తున్నా. నాన్నగారి ద్వారా నాకు సినిమాల పట్ల ఇష్టం మొదలైంది. ఆ ఆసక్తితోనే ఈ చిత్రంలో నటించా.

సినీ రచయిత ప్రయాణం

ఇందులో సినీ రచయితగా నా పాత్ర విభిన్నంగా ఉంటుంది.  నిర్మాతల్ని మెప్పించే మంచి కథ రాయడం కోసం రచయిత తన కుటుంబంతో  కలిసి ఓ ఇంటికి వెళతాడు. అక్కడ అతడికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయన్నది ఆకట్టుకుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా  నవ్యమైన పాయింట్‌తో వీరాస్వామి సినిమాను తెరకెక్కించారు. గతంలో కన్నడంలో హీరోగా అవధి అనే సినిమా చేశా. ఆ సినిమాకు వీరాస్వామి కో డైరెక్టర్‌గా పనిచేశారు. అప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉంది.  ఆయన చెప్పిన కథలో విరామ సన్నివేశాల ముందే వచ్చే మలుపు ఆకట్టుకోవడం సినిమాను అంగీకరించా. పతాక ఘట్టాలు  నవ్యానుభూతిని పంచుతాయి. వీరాస్వామి, హరిప్రసాద్ జక్కా  ఊహకందని మలుపులతో స్క్రీన్‌ప్లే తీర్చిదిద్దారు.  గంట యాభై నిమిషాలు ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది.

ఏప్రిల్ 28 మంచి రోజు..

టైటిల్‌తో పాటు ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభిస్తోంది.  ఓ సందర్భంలో హాస్యనటుడు అలీకి ఈ సినిమా గురించి చెప్పాను.  టైటిల్ విని ఆయన  ఏప్రిల్ 28న అడవిరాముడు, యమలీల, బాహుబలి, పోకిరి లాంటి గొప్ప సినిమాలు విడుదలయ్యాయని అన్నారు. అలాంటి మంచి రోజు టైటిల్‌గా కుదరడం ఆనందంగా ఉంది. అకథానుగుణంగా ఈ సినిమాలో ఏప్రిల్ 28కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అదేమిటన్నది తెరపై ఆసక్తిని పంచుతుంది.

మంచి సినిమా కోసం..

నిఖిల్, సొహెల్‌తో చాలా కాలంగా పరిచయముంది. ఇప్పటివరకు నేను చూసిన  గొప్ప ఇంట్రావెల్ బ్యాంగ్ ఇదేనని నిఖిల్ సినిమా చూసి ప్రశంసించారు.  సొహెల్‌కు ఈ సినిమా చాలా నచ్చింది. మంచి సినిమాను ప్రోత్సహించేందుకు వారిద్దరూ ముందుకు రావడం ఆనందంగా ఉంది.

ఆ పరిమితులు లేవు

వైద్యవృత్తికే నా తొలి ప్రాధాన్యత. జనాలకు సేవ చేస్తూనే సినిమాల్లో నటిస్తా.  హీరోగా మాత్రమే నటించాలనే పరిమితులు పెట్టుకోలేదు.  పాత్రకు ప్రాముఖ్యత  ఉందనిపిస్తే విలన్‌గా నటించడానికి సిద్ధమే. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సినీ ప్రయాణాన్ని కొనసాగించాలనుంది. సినిమాల పట్ల నాలో ఉన్న  ఇష్టాన్ని గుర్తించిన అమ్మనాన్నలు నన్ను ప్రోత్సహించారు. వైద్యవృత్తిని వదులుకోకుండా సినిమాలు చేయమని సలహాఇచ్చారు.

చక్కటి సలహాలిచ్చారు...

తనికెళ్లభరణి, అజయ్, రాజీవ్‌కనకాల వంటి అనుభవజ్ఞులతో ఈ సినిమాలో కలిసి పనిచేశా. వారి సహకారం వల్లే నా పాత్రకు  పరిపూర్ణంగా న్యాయం చేయగలిగా. తనికెళ్లభరణితో కలిసి నటించిన సన్నివేశాలన్నీ సింగిల్ టేక్‌లోనే పూర్తిచేశా. హావభావల విషయంలో అజయ్ చక్కటి సలహాలిచ్చారు. ఈ సినిమా విడుదల తర్వాతే కొత్త చిత్రాలను అంగీకరించాలనే ఆలోచనలో ఉన్నా. సొంతంగా కొన్ని కథలు రాశాను.-

Nani's Shyam Singha Roy First Look Poster Out

 Nani's Shyam Singha Roy First Look Poster Out



It turns out to be a magnum opus when a very talented actor and capable director work together. In that case, Natural Star Nani and Rahul Sankrityan’s first collaboration Shyam Singha Roy is no less than a magnum opus, given the film is made with a unique concept and it is going to present Nani in a never seen before getup.


Three beautiful heroines Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian are playing female leads and several top-notch technicians working for the film produced by Venkat S Boyanapalli


Wishing Nani on his birthday, the makers of Shyam Singha Roy have dropped first look poster today and the actor gives pleasant surprise with his remarkable makeover as a Bengali guy.


From hairstyle to dressing, Nani aces the look of a Bengali and more importantly his chiseled physic grabs all the attention. A girl hugs Nani affectionately from behind signifying the film is going to narrate a great love story as well.


Shyam Singha Roy is a very special film for all the actors and technicians associated with given the film is made with a distinctive subject. The film’s shooting is currently taking place in Kolkata. The entire lead cast including all the heroines is taking part in the lengthy schedule where crucial scenes of the film are being shot.


Rahul Ravindran, Murali Sharma and Abhinav Gomatam play important roles in the film.


The Production No 1 of Niharika Entertainment has original story by Satyadev Janga. Melody songs specialist Mickey J Meyer is on board to compose soundtracks, while Sanu John Varghese cranks the camera. Naveen Nooli is the editor.


Cast: Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Ravindran, Murali Sharma, Abhinav Gomatam


Technical Crew:

Director: Rahul Sankrityan

Producer: Venkat S Boyanapalli

Banner: Niharika Entertainment

Original Story: Satyadev Janga

Music Director: Mickey J Meyer

Cinematography: Sanu John Varghese

Production Designer: Avinash Kolla

Executive Producer: S Venkata Rathnam (Venkat)

Editor: Naveen Nooli

PRO: Vamsi-Shekar

Deverakonda Lo Vijay Prema Katha Pre Release Event

 


ఘనంగా "దేవరకొండలో విజయ్ ప్రేమ కథ" ప్రీ రిలీజ్ కార్యక్రమం


విజయ్ శంకర్‌, మౌర్యాని జంటగా శివత్రి ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం 'దేవరకొండలో విజయ్ ప్రేమకథ' . వెంకటరమణ.ఎస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పడ్డాన మన్మథరావు నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా  'దేవరకొండలో విజయ్ ప్రేమకథ' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'దేవరకొండలో విజయ్ ప్రేమకథ' సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకులు వీరభద్రమ్ చౌదరి, మ్యూజిషియన్ సామల వేణు, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా


నిర్మాత పడ్డాన మన్మథరావు మాట్లాడుతూ...సినిమా నిర్మించాలనేది నా కోరిక. మంచి సినిమా చేయాలని ప్రయత్నిస్తుంటే.. దర్శకుడు వెంకటరమణ మంచి స్టోరీ తీసుకొచ్చాడు. ప్రేమికులు, తల్లిదండ్రులకు, సమాజానికి నచ్చే కథ ఇది. ఆర్నెళ్లు కథను తయారుచేసి సెట్స్ మీదకు వెళ్లాం. మీ ఆశీర్వాదం ఉంటే సినిమా స్థాయి పెరుగుతుంది. కొన్ని సినిమాలు కుటుంబంతో చూడాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ సినిమా సకుటుంబంగా చూడొచ్చు. హీరోకు బాగా పేరు తీసుకొచ్చే చిత్రం అవుతుంది. హీరోయిన్ మౌర్యానీకి ఖచ్చితంగా అవార్డ్ వస్తుంది. అంత బాగా నటించారు. సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న దేవరకొండలో విజయ్ ప్రేమకథ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.


దర్శకుడు వెంకటరమణ.ఎస్. మాట్లాడుతూ....నిర్మాత పడ్డాన మన్మథరావు గారు నా ఫ్రెండ్. నాలుగైదు కథలు ఆయన దగ్గరకు తీసుకెళ్లా. ఆయన నాకు ఒకే మాట చెప్పారు. నేను నా  ఫ్యామిలీతో సినిమా చూడాలి. అలాంటి కథ తీసుకురా అన్నారు. నాకో మంచి సినిమా చేయడానికి ఆయన అవకాశం ఇచ్చారు. కెమెరామెన్ అమర్ చాలా సపోర్ట్ చేశారు. మౌర్యానీ ఈ సినిమాకు హీరో అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా చిత్రీకరిస్తూ ఏడ్చిన రోజులున్నాయి. ఈ సినిమా టైటిల్ గురించి చాలా మంది ఫోన్లు చేశారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఫోన్లు చేశారు. ఈ టైటిల్ పెట్టడానికి ఒక ఊర్లో జరిగే విజయ్ అనే యువకుడి ప్రేమ కథ కారణం. ఏడు ఏనిమిది ఏళ్ల క్రితం విజయ్ దేవరకొండకు కథ చెప్పాను.  ఆయన పది నిమిషాలు విన్నారు. చాలా బాగుందని చెప్పి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో సుధాకర్ కోమాలకు ఫోన్ చేసి చెప్పారు. కథ బాగుంది నువ్వు చేయి అని అతనితో అన్నారు. ఒక కథ చెప్పాక బాగుండి కూడా ఇది నాకు యాప్ట్ కాదు వేరే వాళ్లతో చేయమని చెప్పిన తొలి హీరో విజయ్ దేవరకొండ. ఆ రోజే విజయ్ దేవరకొండకు చెప్పాను నువ్వు పెద్ద హీరోవు అవుతావు అని. ఇది విజయ్ దేవరకొండ మీద అభిమానంతో పెట్టుకున్న పేరే గానీ ఇంకోటి కాదు. అన్నారు.


హీరోయిన్ మౌర్యానీ మాట్లాడుతూ....షూటింగ్ టైమ్ లో నిర్మాత మాకే లోటు లేకుండా చూసుకున్నారు. దర్శకుడు వెంకటరమణ గారికి థ్యాంక్స్. నా ఫస్ట్ మూవీ అర్థనారీ తర్వాత నాకు హార్ట్ టచింగ్ అనిపించిన చిత్రమిదే. దర్శకులు ప్రతిసారీ మాలాంటి ఆర్టిస్టులకు లైఫ్ ఇస్తుంటారు. నాకు లైఫ్ ఇచ్చే చిత్రమిది. ప్రతి సన్నివేశాన్ని చక్కగా రూపొందించారు దర్శకుడు వెంకటరమణ. ఎమోషనల్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంటుంది. నిజంగా జరిగిన ప్రేమ కథ ఇది. ఇందులో వాస్తవ సంఘటనలు స్ఫూర్తి ఉంది. అన్నారు.


హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ....మా అన్నయ్య నిర్మాత మన్మథరావు లేకుంటే నేను లేను. ఆయన రుణం తీర్చుకోలేను. నన్ను హీరోగా స్టేజీ మీద నిలబెట్టారు. ఆయన ఒక హీరో ఎలా ఉండారో అలా నన్ను మార్చేశారు. ఆయన ఇచ్చిన సహకారంతో ఇవాళ నేను ఆరు సినిమాలు పూర్తి చేయగలిగాను. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ దర్శకులు వెంకటరమణ. ఆయన ప్రాణం పెట్టి సినిమా చేశారు. సీన్ ఎలా అనుకున్నారో అలా చేశారు. మాతో చేయించుకున్నారు. మౌర్యానీ నేను బాగా నటించేందుకు సహకరించారు. అన్నారు.


రచ్చ రవి మాట్లాడుతూ...మన్మథరావు నాకు మంచి ఫ్రెండ్. ఇది కొత్త కథ. విజయ్ శంకర్ బాగా నటించాడు. మౌర్యానీ చాలా బాగా నటించిందని ఈ సినిమా చూశాక నిర్మాతకు చెప్పాను. మహా శివరాత్రి రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రేక్షకులు ఆదరించి, కొత్త తరహా చిత్రాలకు ఆదరణ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.


మ్యూజిషియన్ సామల వేణు మాట్లాడుతూ...నాకు వచ్చినన్ని అవార్డ్స్, ఈ మూవీకి కూడా రావాలి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. సాంగ్స్, ట్రైలర్స్ బాగున్నాయి. అన్నారు.


సంగీత దర్శకుడు సదాచంద్ర మాట్లాడుతూ...దర్శకుడు, నిర్మాత, నేను పని విషయంలో టామ్ అండ్ జెర్రీగా పనిచేశాం. టైటిల్ సాంగ్ చంద్రబోస్ గారు పాడారు. చంద్రబోస్ గారు అలా ట్యూన్ వినేసి, టైటిల్ సాంగ్ రాసిచ్చారు. చంద్రబోస్ గారు గురువు లాంటి వారు. ఆయన ఎంతో బిజీగా ఉన్నా పాట అసువుగా చెప్పి రాయించారు. ఆ పాట సినిమాలో హైలైట్ అవుతుంది. అన్నారు.


ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ...దర్శకుడు కొత్త తరహా కథా కథనాలతో సినిమా చేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం ఉంటుందని అనుకుంటున్నా. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇండస్ట్రీకి మరింత కొత్త కంటెంట్ తో , న్యూ టాలెంట్ పరిచయం అవుతారు. అన్నారు.


రచ్చ రవి మాట్లాడుతూ....దర్శకుడు వెంకటరమణ నాకు ఫ్రెండ్స్. ఆయనతో మన్యం అనే సినిమా గతంలో చేశాను. ఈ సినిమాలో ఒక మంచి సీన్ చేయించుకున్నారు. తక్కువ నిడివి అయినా మంచి క్యారెక్టర్ చేశాను. క్రాక్ సినిమాలో కటారి కృష్ణ కూతురిగా మౌర్యాని నటించింది. విజయ్, మౌర్యాని లకు ఆల్ ద బెస్ట్. పాటలు, ట్రైలర్, మేకింగ్ చూస్తే సినిమా క్వాలిటీగా ఉందని తెలుస్తోంది. పాటలు బాగున్నాయి. విజయ్ దేవరకొండ ఎంత కష్టపడితే స్టార్ అయ్యాడో, అంతే కష్టపడమని ఈ సినిమా హీరో విజయ్ కు సలహా ఇస్తున్నా. అన్నారు.


ఈ కార్యక్రమంలో డీఐజీ అల్లం కిషన్ రావు, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, రచ్చ రవి, లయన్ వీణా సరస్వతి తదితరులు పాల్గొన్నారు.


నాగినీడు, వెంకట గోవిందరావు, శివన్నారాయణ, కోటేశ్వరరావు, రచ్చరవి, సునీత, శిరిరాజ్, చలపతిరావు, సాయిమణి, సుభాష్ రెడ్డి నల్లమిల్లి తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం - సదాచంద్ర, ఎడిటర్ - కేఏవై పాపారావు, పొటోగ్రఫీ - జి అమర్, సాహిత్యం - చంద్రబోస్, భాస్కరభట్ల, వనమాలి, కాసర్ల శ్యాం, మాటలు - వై సురేష్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ - సంతోష్ ఎస్, ఆర్ట్ - వీఎన్ సాయిమణి, కొరియోగ్రఫీ - వీరస్వామి, ఫైట్స్ - అవినాష్, నిర్మాత - పడ్డాన మన్మథరావు, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం - వెంకటరమణ ఎస్.

Rajendra Prasad sang a Rap song

 Rajendra Prasad sang a Rap song



Rajendra Prasad is one of the finest actor in Tollywood. Apart from doing Hero roles in his young age, he did many versatile roles in his second innings. If Rajendra Prasad say yes to a character, He will mesmerize everyone with his outstanding performance. He did many different roles and pleased everyone.

The versatile actor is doing out-of-the-box role in his upcoming film Climax. The film is slated for release on 27th February.


Now, A Rap song composed by Rajesh and Nidwana is out and it is trending in social media. The Rap song with "Lakshmi Vachindi" lyrics is been sung by one and only Rajendra Prasad. The song is very trending and Rajendra Prasad garu filled life with his typical voice. The director K. Bhavani Shankar himself penned the lyrics for this song.


Kaipas banner has bankrolled the film and Shasha Singh, Prudhvi, Siva Shankar master, Ramesh and Others played major roles in this film.

Director Narra Siva Nagu Interview About Devineni

 


“దేవినేని” ఏ నాయకుడికి సంబంధించిన కథ కాదు...డైరెక్టర్ నర్రా శివనాగు


వంగవీటి అభిమానుల గాని దేవినేని అభిమానులు గాని ఎవరినీ డ్యామేజ్ చేసే విధంగా సినిమా లో ఎక్కడ చూపించలేదు.ఒకసారి మీరు సినిమా చూడండి. సినిమాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాకు తెలపండి వెంటనే వాటిని కరెక్షన్ చేస్తాము అంటున్నాడు దర్శకుడు నర్రా శివనాగు..ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి తారకరత్న హీరోగా వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటీ,నటులుగా బెజవాడలో ఇద్దరు మహా నాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబ నేపథ్యంలో సెంటిమెంట్‌ కలయికలో నర్రా శివనాగు ద‌ర్శ‌క‌త్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దేవినేని’ దీనికి ”బెజవాడ సింహం” అనేది ట్యాగ్ లైన్ ఈ సినిమాపై వస్తున్న రూమర్లపై అందరికీ క్లారిటీ ఇవ్వాలని ఇదివరకే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది.అయినా ఇంకా కొంతమంది నాయకులు ఫోన్స్ చేసి ఇబ్బంది పెడుతున్న సంధర్బంగా


చిత్ర దర్శకుడు నర్రా శివ నాగు మాట్లాడుతూ... ఇది దేవినేని నెహ్రూ (బెజవాడ) ఒరిజినల్ బయోపిక్ కానే కాదు. డైరెక్టర్ గా, కథకుడిగా తను ఊహించి రాసుకున్న కథే అని చెబుతున్నారు దర్శకుడు నర్రా శివనాగు. ఎలక్ట్రానిక్ & సోషల్ మీడియా ద్వారా ఏ నాయకుడికి సంబంధించిన కథ కాదనీ ఇది ఒక కమర్షియల్ ఫార్ములా కథ అనీ చిత్ర దర్శకుడు క్లియర్ గా అర్థమయ్యే విధంగా ఆవేదన వ్యక్తం చేసినా కూడా ఆంధ్ర ప్రదేశ్ నుండి కొంతమంది నాయకులు రకరకాలుగా ఇబ్బంది కరమైన ఫోన్లు చెయ్యడం వాట్సాప్ మెస్సేజ్ లు పంపించి దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. “దేవినేని” సినిమా వల్ల ఏ రాజకీయ నాయకులకు ఎలాంటి డామేజ్ కలగదనీ, ఏ నాయకులకు తమ రాజకీయ జీవితాలకు ఈ “దేవినేని” మూవీ డామేజ్ చేయదనీ దర్శకుడు నర్రా శివనాగు ఇంతకు ముందే మీడియా ముఖంగా వివరించడం జరిగింది.


ఇది బయోపిక్ సినిమా అని పత్రికల వాళ్లు రాస్తున్నారు. ఇది బయోపిక్ కాదు, దయచేసి గమనించగలరు.కోర్ట్ ద్వారా ఫైట్ చేస్తామనీ, ఎంత దూరమైనా వెళ్తామనీ లేటెస్ట్ గా కొన్ని వాట్సాప్ మెసేజ్ లు వస్తున్నాయి. బ్రదర్ దయచేసి మీరు ఏవేవో ఊహించుకోకండి. ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుణ్ని కించపరచే విధంగా గానీ డామేజ్ చేసే విధంగా కానీ “దేవినేని” మూవీ ఉండదు. ఇది ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ మాత్రమే.


ఫిలిం చాంబర్స్ “దేవినేని” టైటిల్ ని సర్టిఫై చేశాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ (సెంట్రల్ గవర్నమెంట్) ఈ చిత్రాన్ని చూసి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. “దేవినేని” చిత్రంలో నటించిన హీరో కూడా నందమూరి ఫ్యామిలీలో ఒక పెద్ద హీరోనే. దర్శకుడు కూడా ఎంతో అనుభవంతో ఎన్నో చిత్రాలు చేసి ప్రజాదరణ పొందిన దర్శకుడే.


ఈ “దేవినేని” చిత్రం ఏ నాయకుణ్ని డామేజ్ చేసే విధంగా ఉండదని మరొక్క సారి మనవి చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.


నటీనటులు


నందమూరి తారకరత్న , సురేష్ కొండేటి, ధ్రువతార,

బెనర్జీ తుమ్మల ప్రసన్న కుమార్, సంగీత దర్శకుడు కోటి,తుమ్మల పల్లి రామ సత్యనారాయణ ,బాక్స్ ఆఫీస్ చందు రమేష్,లక్ష్మీ నివాస్, లక్ష్మీ నరసింహ తదితరులు


సాంకేతిక నిపుణులు

ఆర్.టి.ఆర్ ఫిలిమ్స్

నిర్మాతలు :-జిఎస్ఆర్, రాము రాథోడ్

డైరెక్టర్ :-నర్రా శివనాగు

లిరిక్ రైటర్ :- మల్లిక్,

పి ఆర్ ఓ.:- మధు వి.ఆర్


Rang De is all set to release on 26th March



Rang De prepares itself for a colourful release. 

Youth star 'Nithin', Keerthy Suresh starrer Rang De is all set to release on 26th March.

 The promotion festivities for Rang De have been kicked off.


'Rang De' is the first movie with the combination of Youth Star 'Nithin'and  'Mahanati' Keerthy Suresh which is being bankrolled  by Sithara Entertainments.


In the past 4 days,  Rang De team have completed the shoot of a song in the movie. Currently the post production process is underway.


The producer of the movie, Surya Devara Naga Vamshi has announced that the audience can celebrate 'Rang De' in theaters from March 26th 2021. The director Venky Atluri has conveyed that this movie can be enjoyed thoroughly with the whole family. He also expressed that the chemistry of the lead couple Nithiin and Keerthy Suresh would mesmerize everyone. It is also worthy of note that the recently released lyrical video of the song along with a few pictures from the movie have received immense popularity within a very short span.


After expertly crafting the love genre with 'Tholi Prema' and 'Mr.Majnu', highly skillful and  young Director, Venky Atluri, has been entrusted with the role of directing this movie by producer 'Suryadevara Nagavamsi'.


Apart from the lead pair of Nithin and Keerthy Suresh, prominent actor Naresh,  Kousalya, Rohini,Bramhaji, Vennela Kishore,Vineeth, Gayithri raghuram,  Satyam Rajesh, Abhinav Gomatam and  Suhas play pivotal characters in the movie.

Dop- P.C Sreeram

Music- Devi Sri Prasad

Editing- Naveen Nooli

Art- Avinash Kolla

Additional Screenplay- Satish Chandra Pasam

Executive Producer - S. Venkatarathnam (Venkat)

PRO: LakshmiVenugopal 

Presented by PDV Prasad

Produced by Suryadevara Nagavasmi

Written and Directed by Venky Atluri.

Akshara Pre Release Event Held Grandly

 


ఘనంగా ‘‘అక్షర’’ ప్రీ రిలీజ్ వేడుక


నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘‘అక్షర’’. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 26న ‘‘అక్షర’’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం మంగళవారం సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఎమ్మెల్సీ కవిత, దర్శకులు సుధీర్ వర్మ, కృష్ణ చైతన్య, శ్రీకాంత్ అడ్డాల తదితర పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ‘‘అక్షర’’ సినిమా ఘన విజయం సాధించాలని టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. బిగ్ టికెట్ ను సాయి తేజ్, ఎమ్మెల్సీ కవిత రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా


దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ...ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ ఎఫ్పుడు వచ్చినా మంచి హిట్స్ అవుతుంటాయి. అక్షర కూడా అలాగే విజయం సాధించాలి. నందిత శ్వేత ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా నాకు ఇష్టం. అహితేజ బెల్లంకొండ నిర్మాత కంటే నాకు మిత్రుడు అని చెప్పుకుంటాను. చిన్నికృష్ణ నా స్నేహితుడు, అతను మంచి రచయిత, నటుడు కూడా. దర్శకుడు నటుడు అయితే నటీనటుల నుంచి ఎలాంటి ఔట్ పుట్ తీసుకుంటాడో అర్థం చేసుకోవచ్చు. అన్నారు.


నటుడు మధునందన్ మాట్లాడుతూ..అక్షర సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. అక్షర సినిమాతో నిర్మాతలకు బిగ్ సక్సెస్ రావాలి. అన్నారు.


దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ...నేను చిన్ని కృష్ణ మేమంతా ఫ్రెండ్స్. నేను చదువుల్లో వీక్ అందుకే దర్శకుడిని అయ్యాను. బాగా చదువుకుంటే ఏ ఉద్యోగమో చేసుకునే వాడిని. అక్షర సినిమా టీమ్ కు నా బెస్ట్ విశెస్ చెబుతున్నాను. అన్నారు.


సినిమాటోగ్రాఫర్ నగేష్ మాట్లాడుతూ...ఈ స్టోరీ నాకు నెరేట్ చేసినప్పుడు ఇదొక మీనింగ్ ఫుల్ మూవీ తప్పకుండా చేయాలని అనుకున్నాను. మాది రైతు కుటుంబం. ఇంటర్ చదివేప్పుడు చదువు మానేస్తానని అన్నప్పుడు సపోర్ట్ చేసి చదివించారు. అక్షర టీజర్ చూసినప్పుడు నా జీవితంతో రిలేట్ చేసుకున్నాను. ఎంతోకొంత చదువుకున్నాను కాబట్టే సినిమాటోగ్రాఫర్ కాగలిగాను. అన్నారు.


ఎడిటర్ సత్య గిడుటూరి మాట్లాడుతూ...అక్షర సినిమా ఇవా‌ళున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెబుతుంది. ఒక మంచి సినిమాగా గుర్తుండిపోతుంది. అన్నారు.


దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ..చిన్న కృష్ణ అండ్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అక్షర సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అన్నారు.


నటుడు హర్షవర్థన్ మాట్లాడుతూ...అక్షర సినిమా ఆలోచన కాదు చిన్నికృష్ణ ఆవేశం, ఆవేదన. ఎమ్మెల్సీ కవిత గారు ఈ కార్యక్రమానికి రావడం మాకెంతో సంతోషం. ఈ కథకు స్ఫూర్తి ఈతరం చదువుల పరిస్థితే. కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా అక్షర సినిమా ఉండదు. విద్యార్థులు అసలైన ఒత్తిడి ఉండేది కుటుంబం నుంచే. కష్టపడి కాకుండా ఇష్టపడి చదుకోవాలని చెప్పే చిత్రమిది. నా కెరీర్ లో ఓ మైలురాయి అక్షర సినిమా. స్టూడెంట్స్ ర్యాంకులు సాధించడం ఒక్కటే ముఖ్యం కాదు నాలెడ్జ్ పెంచుకోవడం ముఖ్యం అని చెప్పే సినిమా అక్షర. అన్నారు.


ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..జై తెలంగాణ, అందరికీ నమస్కారం. ఈరోజు అక్షర సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. వేదిక మీద ఉన్న చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. అనేక కారణాలు ఉన్నా, చదువుల్లో ఉన్న ఒత్తిడి ప్రధానమైన సర్వేలు చెబుతున్నాయి. మనమంతా ఒక సమాజంగా చేయాల్సిన పని ఉంది. ఆ బాధ్యతను అక్షర టీమ్ కొంత తీసుకుంది. నేనూ భాగం కావాలని నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. రోజుకు నలుగురు ఐదుగురు పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు అని తెలిసిన తర్వాత మనం ఇంకా అప్రమత్తం కావాలని అనిపించింది. బట్టీ బట్టి సిలబస్ మార్చేసి సులువుగా విద్యను నేర్పే విధానాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. సినిమా మాధ్యమం ఎంతో శక్తివంతమైనది కాబట్టి సినిమా ద్వారా ఇలాంటి మంచి విషయం చెబితే సమాజానికి త్వరగా చేరుతుంది. తారే జమీన్ పర్ అనే సినిమా వచ్చాక, పిల్లలు సరిగ్గా చదవకపోతే తల్లిదండ్రులు ఎక్కడ లోపముందో ఆలోచించడం మొదలుపెట్టారు. అక్షర సినిమా చూశాక మన సమాజంలో విద్యను చూసే కోణంలో ఒక మార్పు రావాలి. నందిత బాగా నటించారని ఆశిస్తున్నా. అన్నారు.


హీరోయిన్ నందితా శ్వేత మాట్లాడుతూ...అక్షర మూవీ ఎగ్జైటింగ్ తట్టుకోలేకపోతున్నా. ఒక గొప్ప ఫీల్ లో ఉన్నాను. ఎడ్యుకేషన్ కు సంబంధించిన మూవీ చేశాం అని ఎమ్మెల్సీ కవిత గారికి చెప్పినప్పుడు ఆమె వెంటనే స్పందించి వచ్చారు. థ్యాంక్స్ మేడమ్. సాయి తేజ్ తో నేను ఇప్పటిదాకా నటించలేదు. కానీ ఆయన మా హీరో అనే చెబుతాను. హీ ఈజ్ అవర్ హీరో. మా టీమ్ కు మీరు ఇచ్చిన సపోర్ట్ కు చాలా థ్యాంక్స్. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తర్వాత నాకు అక్షర సినిమా చాలా ఇంపార్టెంట్. లాక్ డౌన్ తర్వాత చాలా సినిమాలను థియేటర్లో హిట్ చేస్తున్నారు. అలాగే మా అక్షర మూవీని కూడా ప్రేక్షకులు హిట్ చేయాలని కోరుకుంటున్నా. మా కోసం కాకున్న మా నిర్మాతల కోసం సినిమా సూపర్ హిట్ కావాలి. దర్శకుడు చిన్ని కృష్ణ గారు పది సినిమాలు చేయమన్నా చేస్తాను, ఆయన నా బెస్ట్ డైరెక్టర్. ఈ నెల 26న మీ ముందుకొస్తున్నాం. ప్లీజ్ థియేటర్ కు రండి, మంచి మూవీని చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.


దర్శకుడు చిన్ని కృష్ణ మాట్లాడుతూ...మా సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అక్షర సినిమా ట్రైలర్ చూపించేందుకు కవిత గారి దగ్గరకు వెళ్లాం. ట్రైలర్ చూశాక ఆమె దర్శకుడు ఎ‌వరు అని అడిగారు. అప్పుడు నాకు చాలా సంతోషమేసింది. ఎవర్ని గుర్తించాలనేది కేసీఆర్ గారికి తెలుసు. ట్రైలర్ చూడగానే నాలాంటి దర్శకుడిని గుర్తించినందుకు కృతజ్ఞతలు. ఎడ్యుకేషన్ మీద ఒక మంచి పాయింట్ చెబుదామని అక్షర చిత్రాన్ని చేశాం. సుప్రీమ్ హీరో సాయి తేజ్ గారితో నాకు ఏడు ఏనిమిది ఏళ్లుగా పరిచయం. ఎక్కడున్నా బాగున్నావా అని మాట్లాడుతారు. తేజ్ గారు మా కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్. నువు కామెడీ సినిమాలు చేస్తావు కదా, అక్షర లాంటి సినిమా చేశావు ఎందుకు అని అడిగారు. పేపర్లలో వచ్చిన కొన్ని ఘటనలు నేను ఈ కథ రాసేందుకు స్ఫూర్తినిచ్చాయి. సీఎం కేసీఆర్ గారు సినిమా ఇండస్ట్రీని కరోనా తర్వాత ఆదుకున్నారు. టాక్సులు మాఫీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ గారికి థ్యాంక్స్. కార్పొరేట్ విద్యపై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు నేను కథ రాసేప్పుడు చాలా స్ఫూర్తినిచ్చాయి. సాయి తేజ్, కవిత గారు రావడం వల్ల కోట్ల మందికి మా సినిమా చేరింది. అన్నారు. 


నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ...ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడటం నాకు చాలా కొత్తగా ఉంది. స్టేజీ కింద ఉండి మా హీరోలను చూసి ఆనందపడటమే తెలుసు. ఇవాళ మా హీరో తేజ్ గారితో స్టేజీ మీద ఉండటం సంతోషంగా ఉంది. రెండేళ్లు అక్షర సినిమా కోసం కష్టపడ్డాం. ఈ సినిమా ప్రచారం చేయడం, రిలీజ్ చేయడం ఒత్తిడికి గురయ్యాం. మాకు తెలిసిన హీరోల్లో ఏకైక హీరో తేజ్ అన్న. ఆయన మేము అడగ్గానే తన షెడ్యూల్స్ మార్చుకుని మరీ మా కార్యక్రమానికి వచ్చారు. తేజ్ అన్న ఎప్పుడూ హీరోలా బిహేవ్ చేసేవారు కాదు. ఒక స్నేహితుడు, సోదరుడిలా చూసుకుంటారు. తన మంచితనం వల్లే ఇవాళ ఇంతటి స్థాయిలో ఉన్నారు. ఇవాళ కార్యక్రమం ఇంత గ్రాండ్ గా జరుగుతుంది అంటే అది సాయి తేజ్ అన్నయ్య వల్లే. ఎమ్మెల్సీ కవిత గారు అక్షర ట్రైలర్ చూసి మా సినిమా ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. అలాగే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. చిన్ని కృష్ణ అన్న కామెడీ సినిమాలు చేయిస్తారని అందరికీ తెలుసు కానీ ఆయన మంచి ఎమోషన్ రైటింగ్ కూడా చేయగలడు. ఈ సినిమా తర్వాత చిన్నికృష్ణ అన్న చాలా బిజీ అవుతారు. అన్నారు.


నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ....అక్షర సినిమాను ఇంకా త్వరగా రిలీజ్ చేయాల్సింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 24 అక్షర మీ ముందుకు రావాల్సింది. సినిమా హాల్ ఎంటర్ టైన్ మెంట్స్ అని బ్యానర్ పెట్టి ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా అని అనుకున్నాం. కానీ అక్షర సినిమాను ఖచ్చితంగా సినిమా హాల్లోనే చూపించాలని అన్ని కష్టాలు తట్టుకుని నిలబడ్డాం. అనుకున్నట్లే థియేటర్లోనే మీ ముందుకు వస్తున్నాం. నందితా శ్వేత ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా ఇబ్బందుల్లో రిలీజైంది. ఆ సినిమా హిట్ అయ్యింది. అక్షర కూడా ఇబ్బందుల్లోనే రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నం. మమ్మల్ని ముందుకు నడిపించిన దర్శకుడు చిన్ని కృష్ణ గారికి థ్యాంక్స్. చైతన్య ప్రసాద్ గారు రాసిన అసులదర అనే పాట సినిమా ఏంటో చెప్పింది. మా ఈ చిన్న సినిమాను పెద్ద మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన కవిత గారికి, సాయి తేజ్ గారికి థ్యాంక్స్. రిలీజ్ కోసం మేము టెన్షన్ పడుతున్నప్పుడు దిల్ రాజు గారు, శిరీష్ గారు మాకు అండగా నిలబడి సినిమా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వారికి రుణపడి ఉంటాము. అన్నారు. 


సుప్రీమ్ హీరో సాయి తేజ్ మాట్లాడుతూ...ఇక్కడికి వచ్చిన సినిమా టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్. గెస్ట్ గా వచ్చిన ఎమ్మెల్సీ కవిత గారికి థ్యాంక్స్. ఈ సినిమా స్టార్ట్ అయి రెండేళ్లవుతోంది. అహితేజ నాకు ముందు నుంచీ టచ్ లో ఉండి సినిమా ప్రమోషన్ కు రావాలని కోరాడు. సినిమా టైమ్ లో అహితేజ టెన్షన్ లో ఉండేవాడు. కానీ అక్షర సినిమా రిలీజయ్యాక ఆయన టెన్షన్ తగ్గిపోతుంది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. దర్శకుడు చిన్న కృష్ణ గారితో నాకు చాలా రోజులుగా తెలుసు. నా కెరీర్ స్టార్టింగ్ లో కథ చెప్పేందుకు వచ్చారు. 6 ఏళ్లుగా చిన్నకృష్ణ గారితో పరిచయం. ఎప్పుడు కలిసినా సరదాగా ఉంటుంది. నందితా చాలా బాగా నటించింది. ట్రైలర్ లో చూశాను. సీరియస్ టాపిక్ ఎంచుకుని చక్కగా నటించారు. నేను ఈ ఈవెంట్ కు రావడానికి కారణం ఈ సినిమా నిర్మాతలు మెగా ఫ్యాన్స్. నా ఫ్యాన్స్ నిర్మాతలు అయినప్పుడు నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అది నా బాధ్యత. నేను కొంత డల్ గా కెరీర్ లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ అంతా అండగా ఉన్నారు. నేనూ వారికి సహకారం అందించాలనుకున్నాను. అక్షర సినిమాలో విద్య మన హక్కు, నాణ్యమైన విద్య పిల్లలకు అందాలి అని చెప్పారు. ఈ చిత్రంలో వినోదంతో పాటు సందేశం ఉంటుంది. అక్షరను థియేటర్లో చూడండి, మంచి సినిమాను ఆదరించండి. అన్నారు.



ఈ చిత్రంలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

కెమెరామాన్ : నగేష్ బెనల్, సంగీతం : సురేష్ బొబ్బిలి, ఎడిటర్ : జి.సత్య, ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి, కాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు, లైన్ ప్రొడ్యూసర్స్ :  గంగాధర్, రాజు ఓలేటి, పి.ఆర్.ఓ :  జియస్ కె మీడియా, కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి,సుమంత్ కొప్పు రావూరి, నిర్మాణ సంస్థ :  సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ, రచన - దర్శకత్వం : బి. చిన్నికృష్ణ.

Vishnu Manchu’s Mosagallu Theatrical Trailer On February 25th

 Vishnu Manchu’s Mosagallu Theatrical Trailer On February 25th



Tall hunk Vishnu Manchu’s Pan India film Mosagallu is getting ready to grace the theatres in March. In the meantime, promotional activities are in full swing for the film which is undoubtedly one of the highly anticipated films in 2021, given teaser, songs and posters received wonderful response.


Billed to be a high octane action thriller, Mosagallu is a Pan India film to be released in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi languages.


The team has announced to release theatrical trailer of the film on February 25th with a poster where Vishnu looks class and elegant.


Jeffrey Chin is directing, while Vishnu Manchu is producing the film. Kajal Aggarwal will be seen as Vishnu’s sister. Ruhi Singh is the female lead and Suniel Shetty plays a crucial role in his Tollywood debut.


Mosagallu has music by Sam CS, while Sheldon Chau is the cinematographer.


Cast: Vishnu Manchu, Kajal Aggarwal, Suniel Shetty, Ruhi Singh, Naveen Chandra, Navdeep and others.


Crew:

Producer - Vishnu Manchu

Executive Producer- VijayKumar R

Director - Jeffrey Gee Chin

Music- Sam CS

DOP - Sheldon Chau

Production Design - Kiran Kumar M

Sri simha "BHAAG SAALE" Announced



 Sri simha "BHAAG SAALE" Announced, presented by D.suresh babu..

Madhura sridhar reddy, yash rangineni producing the film.


Leading director-producer Madhura Sridhar Reddy has announced the film

"Bhaag Saale". starring Keeravani's son Sri Simha Koduri as the hero.

Presented by Producer d.Suresh Babu, the film is being produced by

Madhura Sridhar Reddy and Yash Rangineni in association with Big Ben

Cinemas and Madhura Entertainment. New director Praneeth Bramandapalli

is making "Bhaag Saale". The film unit released the title announcement

and first look on the occasion of Sri Simha's birthday. This is the

third film starring Sri Simha after "Mattu Vadalara" and "Thellavarite

Guruvaram".


Suresh Productions, Big Ben Cinemas and Madhura Entertainment have

previously released super hit films like "Pelli Chupulu" and

"Dorasani". They are confident of similar success with their new

project. Madhura Sridhar Reddy has earned a special place in Tollywood

as a director and producer. Encouraging young talent, he introduced

New Age films such as "Sneha geetham", "Backbench Students", "Ladies

and Gentleman", and "ABCD".


"Bhaag Saale" is a crime comedy genre movie and title sounds solid.

Sri Simha's look, characterization seems to be energetic. In the first

look poster there is a photo of Sri Simha Shade, with photos of two

people running next to the title. With this first look poster it is

understood that another new concept movie will be seen in Tollywood.

Regular shooting of "Bhaag Saale" will start from the third week of

March. Keeravani's son Kalabhairava is composing the music for the

film.


Other cast and crew for the film will be announced soon. Editing

-Satya Giduturi, Cinematography - Sundar Ram, Art -Purushottam, PRO


-GSK Media.


April 28 Yem Jarigindhi Pre Release Event Held Grandly

 


ఏప్రిల్ 28 ఏం జరిగింది చిత్రం ఊహకందని మలుపులతో థ్రిల్‌ను పంచుతుంది: ప్రీ రిలీజ్ వేడుకలో హీరో నిఖిల్, బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సొహెల్


రంజిత్‌ , షెర్రీ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ఏప్రిల్ 28 ఏం జరిగింది. వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వీరాస్వామి.జి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్, బిగ్‌బాస్-4 ఫేమ్ సయ్యద్ సొహెల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ పెద్ద సినిమా, చిన్న సినిమా అనే మాటల్ని నేను చాలా ఏళ్లుగా వింటున్నా. ఆ భేదాలకు అర్థం ఏమిటో నాకు తెలియదు. సినిమా బడ్జెట్ ఎంత, అందులో ఎవరూ నటించారనేది దానికంటే సినిమా అందించే ఎక్స్‌పీరియన్స్ ముఖ్యం అని నా భావన. అనుభూతి పరంగా చూస్తే  ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా నేను ఈ సినిమా చూశా. చాలా నచ్చింది. హీరో రంజిత్ నాకు మంచి స్నేహితుడు. యువత, అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ సమయంలో ఆ సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి నేను పడిన  బాధ, తపన అవన్నీ రంజిత్‌లో ఈ సినిమా ద్వారా చూస్తున్నా. రంజిత్ కోసం ఈ సినిమా ఆడాలి. మంచి పాయింట్‌ను ఎంచుకొని ఈ సినిమా చేశారు. ఆద్యంతం ఊహకందని మలుపులతో థ్రిల్‌ను పంచుతుంది. విరామ సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. ద్వితీయార్థం, పతాక ఘట్టాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. మంచి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం బాధ్యతగా భావించి ఈ సినిమాను ప్రోత్సహించడానికి ముందుకొచ్చా. సౌండ్ డిజైనింగ్, ఎడిటింగ్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. ట్రైలర్‌కు మించి సినిమా అద్భుతంగా ఉంటుంది అని అన్నారు.

బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సొహెల్ మాట్లాడుతూ  బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను చూసిన మొదటి సినిమా ఇది. నాకు చాలా బాగా నచ్చింది. అశ్లీలత, ద్వంద్వర్థాలకు తావు లేకుండా కుటుంబమంతా కలిసిచూసేలా ఉంటుంది.  రంజిత్ అద్భుతమైన నటనను కనబరిచాడు. వీరాస్వామి వినూత్నమైన పాయింట్‌తో సినిమాను తెరకెక్కించారు. హరిప్రసాద్ స్క్రీన్‌ప్లే ఉత్కంఠను పంచుతుంది. బోర్ లేకుండా ఆద్యంతం ఈ సినిమా థ్రిల్‌ను కలిగిస్తుంది అని తెలిపారు.

హీరో రంజిత్ మాట్లాడుతూ ఏప్రిల్ 28న అడవిరాముడు, యమలీల, బాహుబలి, పోకిరి లాంటి గొప్ప సినిమాలు విడుదలయ్యయని హాస్యనటుడు అలీ ఓ సందర్భంలో చెప్పారు. అలాంటి మంచి రోజును టైటిల్‌గా తీసుకొని రూపొందిన చిత్రమిది. ప్రతి ఒక్కరం ఎంతో కష్టపడి సినిమా చేశాం. మంచి ప్రయత్నంగా తెలుగు ప్రేక్షకుల్ని ఆదరిస్తారనే నమ్మకముంది అని పేర్కొన్నారు.

చిత్ర దర్శకుడు వీరాస్వామి మాట్లాడుతూ  తొలుత మార్చి 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నాం.  కానీ  ఆ రోజు ఎక్కువ సినిమాలు విడుదలవుతుండటంతో ఫిబ్రవరి 27న విడుదలచేస్తున్నాం. డ్యాన్స్ అసిస్టెంట్, డ్యాన్స్‌మాస్టర్, రచయిత, దర్శకుడిగా ఇలా నా ప్రతి అడుగులో కుటుంబ సభ్యుల సహకారం ఉంది. కుటుంబ ప్రోత్సాహంతో పాటు రంజిత్‌కు నాపై ఉన్న నమ్మకం వల్లే ఈ సినిమా చేయగలిగా. ధర్మతేజ సాహిత్యం, సందీప్ సంగీతం, భాను నృత్యాలు, రంజిత్, రాజీవ్ కనకాల, అజయ్ అభినయం ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయి. నిఖిల్, సొహెల్ సినిమా చూసి ప్రశంసించడంతో పాటు ప్రేక్షకుల్లోకి ఈ చిత్రాన్ని తీసుకెళ్లడానికి సహాయం చేస్తుండటం ఆనందంగా ఉంది అన్నారు.

స్క్రీన్‌ప్లే రైటర్ హరిప్రసాద్ జక్కా మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో  రూపొందిన చిత్రమిది. ఓ ఇంటి నేపథ్యంలో విభిన్నంగా సాగుతుంది. డాక్టర్‌గా పేరుతెచ్చుకున్న రంజిత్ ఈ సినిమాతో యాక్టర్‌గా చక్కటి గుర్తింపును తెచ్చుకుంటాడనే నమ్మకముంది అని తెలిపారు.

గేయరచయిత ధర్మతేజ మాట్లాడుతూ సినిమా కథను అంతర్లీనంగా చాటిచెప్పే మంచి పాటను  రాశాను. చక్కటి టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధిస్తుంది అని అన్నారు.

సంగీత దర్శకుడు సందీప్ కుమార్ మాట్లాడుతూ కథానుగుణంగా పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరాయి అని తెలిపారు.

డ్యాన్స్ మాస్టర్ భాను మాట్లాడుతూ దర్శకుడు అవ్వాలనే వీరాస్వామి కల ఈ సినిమాతో నెరవేరింది. నృత్య దర్శకుడిగానే కాకుండా దర్శకుడిగా  ప్రభుదేవా, లారెన్స్ మాదిరిగా వీరాస్వామి గొప్ప పేరు తెచ్చుకోవాలి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎడిటర్ సంతోష్, కో-డైరెక్టర్ బాలాజీ, రంజిత్ గురువు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.