Latest Post

Naa Prema Kadha Chitram shooting Started

 


జె.ఎల్.14 రీల్ సినిమా ప్రొడక్షన్ పతాకంపై జె.వి మోహన్ గౌడ్ సమర్పణలో యస్. కె జలీల్ నిర్మాతగా రాజశేఖర్ సుధా పల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకో బోతున్న "నా ప్రేమ కథ చిత్రం" చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలు హైదరాబాదు లోని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి హాలులో ఈ రోజు ఘనంగా జరిగాయి.ఈ చిత్ర హీరో హీరోయిన్లుగా సంతోష్ ,పవన్,ప్రసునా చంద్రిక, సైవా నాయుడు, నటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన సినీ ప్రముఖులు 'మా' మాజీ అధ్యక్షులు శివాజీరాజా ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టగా, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ కెమెరా స్విచాన్ చేయగా, సుఖీభవ ప్రాపర్టీస్ అధినేత ఏ.గురురాజ్ ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు. హాజరైన అతిథులందరూ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపి.. చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా

చిత్ర సమర్పకుడు జె. వి. మోహన్ గౌడ్ మాట్లాడుతూ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చి ఇందులో పార్ట్నర్ గా చేరడానికి ఒప్పుకున్నాను, సినిమా బాగా రావడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

నిర్మాత యస్.కె. జలీల్ మాట్లాడుతూ... మోహన్ గౌడ్ గారు మా టీం లో చేరడం మా అదృష్టం  ఆయన అనుభవం  మేము అనుకున్న బడ్జెట్లో సినిమా తీయడానికి  ఉపయోగ పడుతుంది. జనవరి 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని తెలిపారు.

దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. ఎక్కడ

కాంప్రమైజ్ కాకుండా సినిమా తీయమని ధైర్యాన్ని నిర్మాతలు నాకు ఇచ్చారు. కచ్చితంగా వాళ్ల నమ్మకాన్ని నిలబెడతానని, షూటింగ్ కు ముందు నుంచే 30 రోజులు హీరో హీరోయిన్లకు రిహార్సల్  చేయించామని తెలిపారు.ఈ చిత్రంలో వింజమూరి మధు ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తుండగా ఇంకా మిగిలిన పాత్రలలో తిరుపాల్ ,మల్లయ్య,రాబి,సలామ్  నటిస్తున్నారు. ఈ చిత్రానికి షాయక్

పర్వేజ్ సంగీతదర్శకుడిగా,మేనగ శ్రీను ఎడిటర్ గా, వై. రవి ఫైట్ మాస్టర్ గా పని చేస్తున్నారు అని అన్నారు.

Sree Vishnu New Movie Launched


 శ్రీ‌విష్ణు హీరోగా, ప్ర‌దీప్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో ల‌క్కీ మీడియా బ్యాన‌ర్ ఫిల్మ్ ప్రారంభం


విల‌క్ష‌ణ‌ క‌థ‌ల‌తో, భిన్న త‌ర‌హా చిత్రాల‌తో, అభిన‌యానికి అవ‌కాశం ఉన్న పాత్ర‌ల‌తో దూసుకుపోతున్న శ్రీ‌విష్ణు.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ఇంట‌రెస్టింగ్ సినిమాల‌కు సంత‌కం చేస్తూ వ‌స్తున్నారు.

లేటెస్ట్‌గా శ్రీ‌విష్ణు క‌థానాయ‌కుడిగా ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 11గా బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న చిత్రం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ప్ర‌దీప్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ముహూర్త‌పు స‌న్నివేశానికి హీరో నారా రోహిత్ క్లాప్ నివ్వ‌గా, నిర్మాత శిరీష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ స‌న్నివేశానికి శ్రీ‌రామ్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పూజా కార్య‌క్ర‌మాల్లో ఫ‌ణికుమార్‌, విజ‌య‌ల‌క్ష్మి, గంజి ర‌మేష్ కుమార్ పాల్గొన్నారు. ద‌ర్శ‌కునికి శిరీష్ స్క్రిప్టును అంద‌జేశారు.

యాక్ష‌న్ ఎమోష‌నల్ డ్రామాగా రూపొందే ఈ చిత్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని రోల్‌లో శ్రీ‌విష్ణు క‌నిపించ‌నున్నారు. టాప్ టెక్నీషియ‌న్లు ఈ మూవీకి ప‌నిచేస్తున్నారు.

హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మిగ‌తా టెక్నీషియ‌న్ల పేర్ల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

శ్రీ‌విష్ణు న‌టిస్తోన్న 'రాజ రాజ చోళ' సినిమా షూటింగ్ పూర్త‌వ‌గా, 'గాలి సంప‌త్' చిత్రం, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న టైటిల్ ఖ‌రారు చేయ‌ని సినిమా షూటింగ్‌లు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి.

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: ప్ర‌దీప్ వ‌ర్మ అల్లూరి
ప్రొడ్యూస‌ర్‌: బెక్కెం వేణుగోపాల్‌
బ్యాన‌ర్‌: ల‌క్కీ మీడియా
సినిమాటోగ్ర‌ఫీ: శివేంద్ర‌
మ్యూజిక్‌: హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

U G Productions Sammathame Movie Luanched

 


యు.జి ప్రొడక్షన్స్   "సమ్మతమే" చిత్రం ప్రారంభం


యు.జి ప్రొడక్షన్స్ పతాకంపై

కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కె.ప్రవీణ నిర్మిస్తున్న

 "సమ్మతమే" చిత్రం  హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వచ్చిన భువనగిరి ఎం.ఎల్.ఏ. పైలా శేఖర్ రెడ్డి క్లాప్ కొట్టగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హీరో, హీరోయిన్ లపై కెమెరా స్విచ్ ఆన్ చేసారు. పూజ కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం లో


 దర్శకుడు మాట్లాడుతూ ...ఈ చిత్రం 9 వ తేదీ నుండి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తున్నాము.మార్చి మొదటి వారంలో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాము.నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా మాకిచ్చిన ఫ్రీడంతో

అనుకున్న టైం లొనే షూటింగ్ కంప్లీట్ చేస్తాము అని అన్నారు.


 నిర్మాత మాట్లాడుతూ ...యు. జి.ప్రొడక్షన్ లో మేము తీస్తున్న మొదటి చిత్రం "సమ్మతమే".ఈ టైటిల్ తగ్గట్టే ఈ మూవీ ఉంటుంది.జనం ముందుకి మంచి సినీమా తీసుకెళ్లాలనే తాపత్రయం తో ముందుకు వచ్చాము.ప్రజలందరూ ఆదరించే విదంగా మేము తీసే ఈ సినిమాను ప్రేక్షకులు అందరించి ఆశీర్వదించాలని అన్నారు.


 హీరో మాట్లాడుతూ .. ఈ సినిమాకోసం మూడు సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాము.నేను ఇండస్ట్రీ కు వచ్చి షాట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేసిన తరువాత నాకు ఫస్ట్ పరిచయమయ్యింది గోపినే .మా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్ ను రాత్రి,పగలు కష్టపడి తయారుచేసుకొన్నాము.నేను నటించిన "రాజా వారు - రాణి గారు" సినిమా తర్వాత,"యస్.ర్.కల్యాణ మండపం" సినిమా షూట్ కంప్లీట్ అయ్యిపోయింది.నిన్నటితో  "సెబాస్టియన్" మూవీ షూటింగ్ కూడా అయ్యిపోయింది.రేపటి నుండి ఈ సమ్మతమే షూటింగ్ మొదలవుతుంది.నాకు చాలా హ్యాపీ గా ఉంది ఇలా డే అండ్ నైట్ వర్క్ దొరకడం చాలా హ్యాపీగా ఉంది.అలాగే చాందిని తో వర్క్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది.ఎందుకంటే ఇద్దరం షాట్ ఫిల్మ్ నుండే వచ్చాము.శేఖర్ చంద్ర పాటలు ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి.మేమంతా ఈ సినిమాను మీకెప్పుడు చూపిస్తామా అని చాలా ఎక్సయిటెడ్ గా ఎదురు చూస్తున్నాము.ఈ "సమ్మతమే" పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం అని అన్నారు.


 హీరోయిన్ మాట్లాడుతూ ...కలర్ ఫోటో తరువాత లుక్ అండ్ క్యారెక్టర్ పరంగా డిఫ్రెంట్ గా ఉండే పాత్ర కావాలని ఎదురు చూసాను.అలాంటి మంచి స్క్రిప్ట్,మంచి డైలాగ్ లున్న బ్రిలియంట్ స్క్రిప్ట్ చెప్పడంతో ఈ మూవీ చేయడానికి ఒప్పుకున్నాను.సినిమా పై ఇంత డెడికేషన్,ప్యాసినెట్ ఉన్న దర్శక,నిర్మాతతో ఈ మూవీ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.


 మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి.కథకు తగ్గట్టు ఉండే ఈ పాటలను ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని అన్నారు.


 నటీ,నటులు


కిరణ్ అబ్బవరం,చాందిని చౌదరి


 సాంకేతిక నిపుణులు


ప్రొడక్షన్...యు.జి.ప్రొడక్షన్స్

కథ,కథనం,మాటలు,దర్శకత్వం.. గోపీనాథ్ రెడ్డి

నిర్మాత..కె.ప్రవీణ

సంగీతం..శేఖర్ చంద్ర

ఎడిటర్..విప్లవ్ నైశాడం

డి. ఓ. పి...సతీష్ రెడ్డి మాసం

ఆర్ట్...సుధీర్ మాచర్ల

పి.ఆర్.ఓ...వంశీ - శేఖర్

Rayudu Chitralu New web series launched

 New web series starring Nikhil Vijayendra, Niharika Konidela launched by Rayudu Chitralu



A new web series starring Mega Daughter Niharika Konidela was launched on Friday in Hyderabad. Directed and produced by Bhanu Rayudu, this Rayudu Chitralu production stars YouTuber Nikhil Vijayendra as the male lead. Well-known TV anchor Anasuya Bharadwaj has a key role in it. The puja event of the untitled web series had Niharika and her husband Chaitanya Jonnalagadda light the lamp. Star writer Vijayendra Prasad and Sensational Director VV Vinayak handed over a copy of the script to Bhanu Rayudu. Young producer Harshith Reddy launched the logo of the banner. 


Speaking on the occasion, director-producer Bhanu Rayudu said, "We all know how much the digital world is progressing. Web series are being made with novel concepts. Our web series is a fantasy drama that will be quite novel. When I thought about who would be apt for the lead role, I felt Niharika alone can do full justice. So, I approached her with the script. Prominent YouTuber Nikhil Vijayendra has been roped in. And Anasuya garu has a key role in the web series, which will go on the floors soon.


Cast:


Nikhil Vijayendra, Niharika Konidela, Anausya Bharadwaj, Aastha Malik, Harika and Vasanth Sameer. 


Crew:


Writer: Shouryav, Cinematographer: Dhanush Bhaskar, Music composer: Kalyan Malik, Director, Producer: Bhanu Rayudu.


Master Pre Release Event

 


మాస్టర్‌' అన్నీ వర్గాలను మెప్పించే ఫీస్ట్‌లా ఉంటుంది - డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌


దళపతి విజయ్‌ కథానాయకుడిగా నగరం, ఖైది చిత్రాలతో సెన్సేషల్‌ హిట్స్‌ సాధించిన డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎక్స్‌బీ ఫిల్మ్‌ క్రియేటర్స్‌ బ్యానర్‌పై గ్జేవియర్‌ బ్రిట్టో నిర్మించారు. ఈ సినిమా తెలుగు హక్కులను ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు దక్కించుకున్నారు. ఇంతకు ముందు హీరో విజయ్‌ చిత్రం 'విజిల్‌'ను తెలుగులో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు విడుదల చేశారు. 'విజిల్‌' ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో మాస్టర్‌ సినిమా  సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలవుతుంది. ఈ సందర్భంగా 'మాస్టర్‌' బిగ్‌ సీడీని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది....


శంతన్‌ భాగ్యరాజ్‌ మాట్లాడుతూ "నిర్మాత మహేశ్‌ కోనేరుగారికి అభినందనలు. తెలుగు సినిమాలో భారీ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. చిన్నా, పెద్ద సినిమాలని కాకుండా సినిమాను సెలబ్రేషన్‌లా చూసే తెలుగు ప్రేక్షకులంటే ఎంతో ఇష్టం. 'మాస్టర్‌' సినిమాలో నటించడం చాలా హ్యాపీగా ఉంది. విజయ్‌ అన్న.. విజయ్‌ సేతుపతి, మాళవికా, ఆండ్రియా.. ఇలా  భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన లోకేశ్‌ కనకరాజ్‌గారికి థాంక్స్‌. తెలుగులో సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అన్నారు. 

అర్జున్‌ రాజ్‌ మాట్లాడుతూ "ఖైది సినిమా తర్వాత లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో చేసిన సినిమా మాస్టర్‌. విజయ్‌గారు, విజయ్‌ సేతుపతిగారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది" అన్నారు. 


అనిరుద్‌ రవిచంద్రన్‌ మాట్లాడుతూ - "మాస్టర్‌ సినిమాను మహేశ్‌ కోనేరుగారు భారీ ఎత్తున రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. ఈ సినిమా హిట్‌తో మహేశ్‌గారు సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన విజయ్‌గారికి థాంక్స్‌. డైరెక్టర్‌ లోకేశ్‌ నాకు సోదరుడితో సమానం. త్వరలోనే లోకేశ్‌ దర్శకత్వంలో సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారని భావిస్తున్నాను. అనంత్‌ శ్రీరామ్‌, కృష్ణకాంత్‌, సింగర్‌ శ్రీకృష్ణ, మాలిలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయి. విజయ్‌ సార్‌గారి సినిమానే కాదు.. సినిమా చూసిన తర్వాత ఆలోచించేలా చేసే సినిమా ఇది. దర్శకుడు లోకేశ్‌ పర్‌ఫెక్ట్‌గా క్లాస్‌, మాస్‌ను మిక్స్‌ చేసి సినిమాను తెరకెక్కించాడు. అలాగే విజయ్‌ సేతుపతి, శంతన్‌, అర్జున్‌రాజ్‌, మాళవికా, ఆండ్రియా అందరూ మంచి తారాగణం సినిమాలో నటించారు. సినిమాను థియేటర్స్‌లో సెలబ్రేట్‌ చేసుకుంటానడంలో సందేహం లేదు" అన్నారు. 


ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ అధినేత మహేశ్‌ కోనేరు మాట్లాడుతూ - "కోవిడ్‌ సమయంలో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనకు తెలుసు. ఈ ఏడాది ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి.  ఈ సంక్రాంతికి మా మాస్టర్‌ సినిమాతో పాటు క్రాక్‌, రెడ్‌, అల్లుడు అదుర్స్‌ సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రతి సినిమా చాలా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. విజయ్‌గారి గత చిత్రం విజిల్‌ను తెలుగులో నేను విడుదల చేశాను. చాలా పెద్ద హిట్‌ అయ్యింది. మళ్లీ మాస్టర్‌ సినిమాను రిలీజ్‌ చేసే అవకాశం ఇచ్చిన విజయ్‌గారికి, నిర్మాతలు లలిత్‌గారికి, జగదీష్‌గారికి ధన్యవాదాలు. సినిమా అద్భుతంగా ఉంది. విజయ్‌గారి కెరీర్‌లోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుంది. జనవరి 13న దాన్ని చూస్తాం" అన్నారు. 


డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌ మాట్లాడుతూ - "మాస్టర్‌ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న మహేశ్‌ కోనేరుగారికి అభినందనలు. సినిమా చాలా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. నా గత రెండు చిత్రాలను తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. ఇప్పుడు మాస్టర్‌ జనవరి 13న విడుదలవుతుంది. ఎప్పటిలాగానే ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటుందని భావిస్తున్నాను. సినిమా అన్ని వర్గాల వారికి ట్రీట్‌లా ఉంటుంది. విజయ్‌గారికి, విజయ్‌ సేతుపతిగారికి, బ్రిట్టో గారికి, జగదీష్‌గారికి, అనిరుద్‌ రవిచంద్రన్‌ సహా ఎంటైర్‌ యూనిట్‌కి స్పెషల్ థాంక్స్‌" అన్నారు. 


ఈ కార్యక్రమంలో పాటల రచయితలు, సింగర్స్‌ అనంత్‌ శ్రీరామ్‌, కృష్ణకాంత్‌, సింగర్‌ శ్రీకృష్ణ, మాలి సహా  సినిమాటోగ్రాఫర్‌ సత్యన్‌ సూర్యన్‌, కొరియోగ్రాఫర్‌ దినేశ్‌ సహ నిర్మాత జగదీష్‌ తదిరులు పాల్గొన్నారు.

Megaa Super Good Films Back In Action In Telugu With ISHQ

 Megaa Super Good Films Back In Action In Telugu With ISHQ





Prestigious Banner in South India, Megaa Super Good films that delivered numerous blockbusters, is back in action in Telugu with it's first film in 2021.


Young hero Teja Sajja who is busy with various projects will be playing the lead role, while Priya V Varrier is roped in as leading lady. SS Raju will direct the joint production venture of NV Prasad, Paras Jain and Vakada Anjan Kumar. RB Choudary presents it.


Titled ISHQ, the film comes up with the tagline- Not a love story. While the title suggests it's a romantic entertainer, the tagline tells something else.


The makers zeroed in popular craftsmen to handle different crafts. Mahathi Swara Sagar will render soundtracks and Sam K Naidu cranks the camera. Srimani pens lyrics, while A Vara Prasad and Vithal Kosanam will handle editing and art departments respectively.


The team will divulge other details soon.


Cast: Teja Sajja, Priya Prakash Varrier


Technical Crew:


Director  SSRaju

Producers: NV Prasad, Paras Jain, Vakada Anjan Kumar

Presenter: RB Choudary

Cinematography: Sam K Naidu

Music Director: Mahathi Swara Sagar

Editor: A Vara Prasad

Art Director: Vithal Kosanam

Lyric Writer: Srimani

 PRO: Vamsi-Shekar

Yash About KGF -2

 KGF: Chapter 1 was a huge hit, are you expecting KGF: Chapter 2 to break all records?



KGF 1 was a magnum opus in a way and a complete labour of love and ambition. We had many limitations with Chapter 1 and ambition was the fuel that drove us. The team worked really hard and the success that Chapter 1 recieved was needless to say, a massive gratification in every way. We have worked just as hard, if not more, in putting together KGF 2 and made the film bigger in scale. The sucess of Chapter 1 has empowered us to do better and we hope to please and entertain our existing audience and also widen the audience and fan base for KGF Chapter 2. The agenda is to entertain our audience and keep our fans happy - if in that process, we end up breaking some kind of record, that would be an added bonus. 


How different will Chapter 2 be from Chapter 1?

Chapter 1 was an introduction to Rocky, his personality, his world and his hunger to overcome his demons. 

In KGF 2, you will see some different shades to Rocky that you haven't seen before. It will be a bigger action packed and emotional ride! 



Do you have a special surprise in-store for your fans in the film ?

There are a few ! But it wouldn't be a surprise if I let it out! 



How was it working with Raveena Tandon and Sanjay Dutt? 

Both Sanjay Sir and Raveena Ma'am are wonderful to work with. 

Sanjay Sir sets a great example of what grit and perseverance can get you through. The professionalism and passion that he showed towards his role and this film despite his health condition was very inspiring. 

Raveena Ma'am has always been and is still a versatile and good actor. She is a lovely, vibrant person full of life and she brought that warmth and energy on set too. 

Working with both of them was a great experience. 


How did you prep up for your role in the film ?

(Jokingly) I have been in character for 4 years now! 

To be very honest, I have lived with the character of Rocky for a long while and many nuances of the character came very naturally to me. I didn't really have to "prepare" too much. 


What was the most challenging and exciting sequence for you to film?

There are many exciting and challenging  sequences...I don't think I can pick just one. But I'll answer this question once the film has been released! 


When do you plan to wrap up the film?

We are nearly done. We have just a one day patchwork shoot left.

Victory Venkatesh Fans Support to an ailing Fan



 విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ వితరణ!

     సినీ హీరో వెంకటేష్ ని తొలి నుండి అభిమానించే విశాఖ జిల్లా యలమంచిలి ప్రాంతానికి చెందిన అప్పారావు అనే అభిమాని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. రెక్కాడితే  గాని డొక్కాడని అప్పారావుకి కుటుంబ సమస్యలు కూడా బోలెడన్ని. దానికి ఈ  ఆరోగ్య సమస్య తోడై చాలా ఇబ్బందుల్లో వున్నాడు. సాటి అభిమాని సమస్యని అర్థం చేసుకున్న రాష్ట్ర వెంకటేష్ ఫాన్స్ కరస్పాండెంట్ పి.చందు.. తనతో నిత్యం కాంటాక్ట్ లో ఉన్న అభిమానుల సాయంతో 62,000/- రూపాయలతోపాటు నెలరోజులకి సరిపడే నిత్యావసర వస్తువులు,బట్టలు, మందులు ఆ అభిమాని కుటుంబానికి అనకాపల్లి నూకాంబిక అమ్మవారి సన్నిధిలో అందజేశారు.
ఈ సందర్భంగా అప్పారావు కుటుంబ సభ్యులు... ఇంత గొప్ప సాయాన్ని అందించిన అభిమానులందరికి జీవితాంతం మా కుటుంబం ఋణపడివుంటుందన్నారు.  
    2019లో కర్నూల్ లో చనిపోయిన ఇజ్రాయిల్ కుటుంబానికి 50,000 రూపాయాలు ఆల్ ఇండియా వెంకటేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో అందజేసామని..మళ్ళీ ఇప్పుడు అప్పారావు కుటుంబానికి 62,000 రూపాయల మొత్తాన్ని అందజేసామని, ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వెంకటేష్ అభిమానులు పెద్ద మొత్తంలో సేకరించి పంపి తమ సేవా నిరతిని చాటుకున్నారని...మిగతా ఏరియా అభిమానులు సైతం అద్భుతమైన స్పందనని తెలియజేశారని... వారందరికీ ఈ సందర్భంగా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అభిమానసంఘాల సమన్వయ కర్త చందు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్జి శంకర్, పిల్లి శ్రీను, విజయనగరం వాసు, రమెష్, గాజువాక శివకుమార్, రాంబాబు, శరత్, లాయర్ శ్రీను, సతీష్,సోమేశ్, రాము, శ్రీను, దాడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు!!

Ugly in urvasi OTT

 


వివాహేతర సంబంధాల వల్ల

విచ్చినమయ్యే జీవితాల 

నేపధ్యంలో రూపొందిన


మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ "అగ్లీ'

"ఊర్వశి ఓటిటి"

ప్రేక్షకులకు ప్రత్యేకం!!

అక్రమ సంబంధాల వల్ల 

ఏర్పడే అనర్ధాల నేపథ్యంలో

రూపొందిన చిత్రం 'అగ్లీ'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'దయ' దర్శకత్వంలో అస్మక క్రియేషన్స్ పతాకంపై సుశాంత్ భండారి నిర్మించారు.

      రోహిత్ కుమార్, సత్య భగత్, ప్రయాగ పాండే, సోనాక్షివర్మ, పరితోష్ తివారి, అక్షయ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం 'ఊర్వశి ఓటిటి' ప్రేక్షకులను అలరించనుంది.

    వివాహేతర సంబంధాల వల్ల విచ్చినమయ్యే జీవితాల నేపద్యంలో స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలిచే ఈ చిత్రం "ఊర్వశి ఓటిటి" ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు దయ చెబుతున్నారు.

     ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్, ఎడిటింగ్: అనిల్ ఆలయం, కెమెరా: విజయ్ ఎస్.వి.కె, నిర్మాత: సుశాంత్ భండారి, రచన-దర్శకత్వం: దయ!!

Available On:

ఊర్వశి ఓటిటి

1995 Vaisalyapuramlo Urvasi Movie Launched



 1995 వైశాల్యపురంలో ఊర్వశి 

ఎస్వీ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై నిర్మాతలు టి.వేణుగోపాల్, సతీష్ నిర్మిస్తున్న చిత్రం ‘1995 వైశాల్యపురంలో ఊర్వశి ’.గోవింద్ శర్మన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ లో  పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బండి శ్రీనివాస్ సహకారంతో రూపొందిస్తున్న ఈమూవీలో శుక్రాంత్, అను వర్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు. సి.కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ప్రసన్న కుమార్ రెడ్డి గౌరవదర్శకత్వం వహించారు. సి.కళ్యాణ్​ మాట్లాడుతూ..‘ముందుగా అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త టీమ్ తో మొదలైన ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా’అన్నారు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ..‘ఊర్వశి సినిమాని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి మేం ఎప్పుడూ ముందుంటాం. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’అన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ..‘వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుందనుకుంటున్నా. చిత్రయూనిట్ అంతా తపనతో పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది టీమ్ అంతటికీ ఆల్‌ ద బెస్ట్’చెప్పారు. దర్శకుడు గోవింద్ మాట్లాడుతూ..‘మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు.  శుక్రాంత్ కి కథ చెప్పగానే నన్ను నమ్మి ఓకే చెప్పారు. విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ లవ్ స్టోరీతో పీరియాడికల్ డ్రామాగా రూపొందిస్తున్నాం. నాకు దర్శకుడిగా చాన్స్ ఇచ్చిన నిర్మాతకు బుణపడి ఉంటాను. డైలాగ్ రైటర్ మధుబాబుకి ధన్యవాదాలు’అన్నారు.   హీరో శుక్రాంత్ మాట్లాడుతూ‘గోవింద్ నాకు స్టోరీ చెప్పినప్పుడే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. ప్రస్తుతం కనబడుటలేదు మూవీలో నటిస్తున్నాను. త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఊర్వశి  నాకు గుర్తిండిపోయే సినిమా అవుతుంది’అన్నాడు. హీరోయిన్ అనువర్ణ మాట్లాడుతూ..‘మమ్మల్ని  ఎంకరేజ్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. మంచి మూవీతో మీ ముందుకు వస్తున్నాం’అంది హీరోయిన్ అనువర్ణ. మ్యూజిక్ డైరెక్టర్ నందన్, ఎడిటర్ వైఆర్ శేఖర్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా శ్రీపతి బండి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Rashmi Goutham Launched Thread and Fabrics Studio



 జబర్దస్త్ యాంకర్ నటి రష్మి గౌతమ్ ప్రారంభించిన థ్రెడ్ & ఫ్యాబ్రిక్స్ స్టూడియో

 కె.పి.హెచ్.బి కాలనీలో నటి జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సందడి

నటి జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కి పర్సనల్  ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్న డిజైనర్ దివ్య ఏర్పాటు చేసిన...త్రెడ్ అండ్ ఫ్యాబ్రిక్ డిజైనర్ స్టూడియోను రష్మీ గౌతమ్ ప్రారంభించింది.ఈ సందర్భంగా


 జబర్దస్త్ యాంకర్ నటి రష్మీ గౌతమ్ మాట్లాడుతూ ...దివ్య మంచి ఔట్ లుక్ డిజైన్స్ అందిస్తుంది.తను నాకెంతో ఇష్టమైన డిజైన్స్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. ఎంతో శ్రద్ద పెట్టి డెడికేషన్ తో పని చేస్తుంది.అలాగే ఈ మధ్య మహిళలు ఎక్కువగా వాకిన్ స్టోర్లను ఆదరిస్తున్నందున తన మనసులో ఉన్న కోరికకు నా.. మాటలు తోడు అవ్వడంతో ఈ వాకిన్ స్టోర్ ప్రారంభించడం జరిగింది.అలాగే తను తయారు చేసే చాక్లెట్ నాకు ఎంతో నచ్చాయి.తను త్వరలో చాక్లెట్ స్టోర్ ప్రారంభింస్తానంటే నా సహకారం ఉంటుంది.కాబట్టి ఆమెను అందరూ ఆదరించాలని తను ఈ స్టూడియో తో పాటు సిటీ లో మరిన్ని బ్రాంచ్ లు ఓపెన్ చేస్తే వాటికి నేనె గెస్ట్ గా వస్తానని అన్నారు.


 ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ దివ్య మాట్లాడుతూ ...రష్మి గౌతమ్ గారి సహకారం మరిచిపోలేనిది.రెండు సంవత్సరాలు గా తను చేసే డీ,జబర్దస్త్ ప్రోగ్రామ్స్ కు నేను ఫ్యాషన్ డిజైనర్ గా చేయడం ఏంతో హ్యాపీ గా ఉంది.రష్మీ గౌతమ్ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా తొందరగా రిలీజ్ అయ్యి మంచి హిట్టు కొట్టాలి.

చాలామంది ఆన్ లైన్ లో ఫ్యాబ్రిక్స్ కొని మోసపు తున్నామని నా దృష్టికి తీసుకు రావడం తో  నాకు ఫిజికల్ స్టోర్ పెట్టాలనే పట్టుదలతో స్టోర్ పెట్టడమే నా డ్రీమ్ అనుకున్నాను.నేను రెండు సంవత్సరాలనుండి అనుకుంటున్న నా కోరిక ఈ లాక్ డౌన్ తో మరింత డిలే అయ్యింది.నేను అనుకున్న డ్రీమ్ ఈ రోజు కె.పి.హెచ్.బి లో నేను ఓపెన్ చేసిన థ్రెడ్ & ఫ్యాబ్రిక్స్ స్టూడియో తో తీరింది. రష్మీ గౌతమ్ గారు వచ్చి నా స్టూడియో ప్రారంభించిన ఆమెకు నా  ధన్యవాదాలు.అలాగే నేను తయారు చేసే హోమ్ మేడ్ చాక్ లెట్స్ లలో మ్యారీ గోల్డ్ చాక్లెట్ తనకు ఎంతో ఇష్టం.కష్ట పడే వారు అంటే రశ్మి గౌతమ్ కు ఏంతో ఇష్టం.

అందుకే ఆమె సపోర్ట్ తో  చాక్లెట్స్ స్టోర్ ఓపెన్ చేస్తాను.  ఈ సారి సంక్రాంతి పండుగ తన సొంత ఊరు వైజాగ్ లో జరుపుకుంటానని ,అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 

Macho hero Gopichand, Maruthi, GA 2 Pictures - UV Creations join hands for a new project

 Macho hero Gopichand, Maruthi, GA 2 Pictures - UV Creations join hands for a new project



Star director Maruthi scored a super hit with Prathi Roju Pandage and he is set to work with macho hero, Gopichand for his upcoming film which is billed to be a commerical entertainer. Allu Aravind will be presenting this film while GA 2 Pictures and UV Creations will be jointly bankrolling it. Bunny Vas and Maruthi are collaborating again delivering a super hit with Prathi Roju Pandage. The makers have released a humorous video to announce the film and it has caught the attention of everyone. The announcement video is going viral on social media now. Seasoned actor, Rao Ramesh has provided the voice over for this video. This will be 29th film of Gopichand, and 10th film of Maruthi and incidentally marks the first collaboration between the duo. The title poster and first look will be out soon.


Hero - Gopichand

Presented by - Allu Aravind

Banner - GA 2 Pictures, UV Creations

Producer: Bunny Vas

Director: Maruthi

Happy Birthday To BA Raju

 


B.A.Raju is the  One of the Senior and Famous  PRO of Tollywood. He Started his career as Journalist and  Turned as Pro and Producer in  over  a period of time. he owns  the Popular  magazine Super Hit and Industry Hit Movie Portal.He worked As Pro For almost all the heros Right From Superstar Krishna to Latest young Heros 

He is multi-talented personality as a producer he has got good hit films as well

B.A.Raju is one of  the Favorite PRO for Heros Like  Nagarjuna, Venkatesh, Mahesh Babu  

Currently B.A. Raju is busy with few projects and on the other side he is working on  his son  B. Shiva Kumar  debut  which is an action thriller titled 22.

B A Raju is Celebrating his birthday today i.e on 07January 

Telugucinemas.in wishing  Raju Garu A  Very Happy Birthday.

Rana Daggubati’s Aranya Releasing Worldwide On March 26th

 Rana Daggubati’s Aranya Releasing Worldwide On March 26th



Handsome Hunk Rana Daggubati became a Pan India Star with consecutive hits in Telugu, Hindi and other languages. His last film Housefull 4 where he was seen in a negative role turned out to be a massive hit. Now, Rana is coming up with a multi-lingual film Haathi Mere Saathi releasing in Telugu as Aranya.


The makers today announced to release the film on March 26th. Directed by Prabhu Solomon, the lavishly made film will release across three languages – Telugu, Hindi and Tamil.


“Welcoming the new year and the new normal, we are excited to bring Haathi Mere Saathi/Aranya/Kaadan on 26th March, in a theatre near you! Thank you for all the love, support and patience you have shown me. Can’t wait for you all to see it!” tweeted Rana.


Aranya is a story of a man living in the jungle for 25 years. The film focuses on ecological issues and deforestation crisis.


Zoya Hussain and Shriya Pilgaonkar are the other prominent cast.


Shantanu Moitra provides sound tracks and backgrounds score while A.R.Ashok Kumar cranks the camera.


Cast: Rana Daggubati, Vishnu Vishal, Zoya Hussain, Shriya Pilgaonkar and others.


Technical Crew:

Produced by: Eros International

Directed by: Prabhu Solomon

Story and screenplay: Prabhu Solomon

Dialogues & Lyrics: Vanamaali

DOP: A.R.Ashok Kumar

Music and Background score: Shantanu Moitra

Sound Design: Resul Pookutty

Editor: BuVan

Production Design: Mayur Sharma

Costumes: Kirti kolwankar and Maria Tharakan

Action: ‘Stunner’ Sam and Stun Siva

Associate Producer: Bhavana Mounica ( Eros )

VFX: Phantom FX & White Apple

Chief Operating Officer: Kumar Ahuja (Eros)

Group Chief Marketing Officer: Manav Sethi (Eros)

Head of Distribution: Nandu Ahuja (Eros)

President motion pictures - Ram Mirchandani (Eros

Alludu Adhurs Trailer Launched Grandly

 


సంక్రాంతికి వస్తోన్న "అల్లుడు అదుర్స్" పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము.. ట్రైలర్ లాంఛ్ లో సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్,  నేచురల్ స్టార్ నాని, !!


యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభానటేష్, అను ఇమ్మానుయెల్ హీరోయిన్స్ గా రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో గొర్రెల సుబ్రమణ్యం నిర్మించిన చిత్రం " అల్లుడు అదుర్స్". ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం జనవరి 15న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. నేచురల్ స్టార్ నాని, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్,   దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, సప్తగిరి, ఎడిటర్ తమ్మిరాజు, సమర్పకుడు రమేష్ కుమార్ గంజి,  బెల్లంకొండ సురేష్, చిత్ర నిర్మాత గొర్రెల సుబ్రమణ్యం పాల్గొన్నారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన వినాయక్,  నాని "అల్లుడు అదుర్స్" ట్రైలర్ లాంఛ్ చేశారు..


సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ' సాయిని 'అల్లుడు శ్రీను'తో లాంఛ్ చేశాం. ఆ చిత్రంలో సాంగ్స్, ఫైట్స్ ఎంత బాగా చేశాడో ఇప్పుడు "అల్లుడు అదుర్స్" లో కూడా సాయి అద్భుతంగా చేశాడు. దేవిశ్రీప్రసాద్ ఎనర్జీ సాంగ్స్ ఇచ్చాడు. రాజమండ్రి నుండి సినిమా మీద ప్యాషన్తో వచ్చిన నా మిత్రుడు సుబ్రమణ్యం ఈ చిత్రాన్ని కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రమేష్ కుమార్ కూడా మంచి ఫ్రెండ్ . వాళ్లిద్దరూ కలిసి చేసిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయి పనిచేసిన అందరికీ  మంచి పేరు, నిర్మాతలకు మరిన్ని డబ్బులు రావాలి. మా సాయికి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి.. అన్నారు.


నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ..  నా కెరీయర్ బిగినింగ్ లో బెల్లంకొండ సురేష్ గారితో రైడ్ సినిమా చేశాను.. ఆ చిత్రం ఎంత మంచి హిట్ అయిందో అందరికీ తెలుసు. అప్పుడు సాయిని చూశాను.. ఆఫీసులో డాన్సులు, ఫైట్స్ ప్రాక్టీసు చేసేవాడు. ఆల్లుడు శ్రీనుతో సాలిడ్ గా కెరీయర్ ప్లాన్ చేసుకొని మంచి సినిమాలు చేస్తున్నాడు.. త్వరలో హిందీలో కూడా సినిమా చేయబోతున్నాడు.   ఇప్పుడు "అల్లుడు అదుర్స్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులను థియేటర్ కి తీసుకుని రావడంలో అల్లుడు అదుర్స్ సాయి మెయిన్ కీ రోల్ పోషించాలి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు, నిర్మాతలకు ఎక్కువ  డబ్భులు రావాలి.. అన్నారు.


చిత్ర నిర్మాత గొర్రెల సుబ్రమణ్యం మాట్లాడుతూ.. " ఫస్ట్ ఈ ప్రాజెక్టు ని ఇంత బాగా డిజైన్ చేసిన బెల్లంకొండ సురేష్ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాను. రాక్షసుడు సినిమాకి ముందు సాయి తో సినిమా చేసుకో అని మాట ఇచ్చారు. ఆ మాటని నిలబెట్టుకొని గొప్పగా సినిమా చేసి ఇచ్చారు. నేను ఊహించిన దానికంటే అల్లుడు అదుర్స్ అద్భుతంగా వచ్చింది. మా హీరో సాయి డాన్సులు, ఫైట్స్, ఎంటర్టైన్మెంట్ సూపర్ గా చేశారు. సాయికి కూడా లైఫ్ లాంగ్ ఋణపడి ఉంటాను. సంతోష్ శ్రీనివాస్ ఒక మంచి ప్రాజెక్ట్ ద్వారా నన్ను నిర్మాతగా ఇండస్ట్రీలో పరిచయంచేస్తున్నారు. చోటా కె.నాయుడు గారు ఫెంటాస్టిక్ విజువల్స్ తో అద్దంలా సినిమాని తీర్చిదిద్దారు. అలాగే దేవిశ్రీప్రసాద్ మంచి సాంగ్స్ తో పాటు, ఆర్.ఆర్ కూడా చాలా బాగా చేశారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ చిత్రం ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది.. జనవరి 15న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నాం.. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద సక్సెస్ చెయ్యాలని.. అన్నారు.


చిత్ర సమర్పకుడు రమేష్ కుమార్ గంజి మాట్లాడుతూ.. ' మంచి కథాబలం ఉన్న సినిమాలో నేను కూడా ఒక బాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. సంతోష్ శ్రీనివాస్ దమ్మున్న సినిమా చేశాడు. సినిమా చూశాను.. నాకు బాగా నచ్చింది. ఫైట్స్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్ సూపర్బ్ గా ఉంది. సంక్రాంతికి విన్నర్ అయ్యే సినిమాలలో మా చిత్రం గ్యారెంటీగా సూపర్ హిట్ సాధిస్తుంది.. మా హీరో సాయి కెరీయర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది.. ఈ అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సురేష్ గారికి నా థాంక్స్.. అన్నారు.


దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రౌతు మాట్లాడుతూ.. ' ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ తో వస్తోన్న ఈ చిత్రం ఆడియెన్స్ చేత అల్లుడు అదుర్స్ అనిపిస్తుంది. ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. చాలా రోజుల తర్వాత ఒక కలర్ ఫుల్ సినిమా సంక్రాంతి పండక్కి వస్తున్న పర్ఫెక్ట్ యాప్ట్ ఫిల్మ్ ఇది. కంటెంట్ నమ్మి కాంప్రమైజ్ కాకుండా సుబ్రమణ్యం చాలా గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ మూడు కమర్షియల్ సాంగ్స్, రెండు మెలోడీ  సుపర్బ్ గా ఇచ్చారు. ఈ సినిమా చూశాక ఫామిలీ ఆడియెన్స్ అందరూ మా అల్లుడు అదుర్స్ అంటారు.


బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ' హీరో, హీరోయిన్స్ తో పాటు మా యూనిట్ అంతా కాశ్మీర్ లో వున్నారు. అక్కడ లాస్ట్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. నా మొదటి సినిమా సాంబయ్య నుండి ఇప్పటివరకూ నిర్మాతగా నన్ను అందరూ సపోర్ట్ చేసి.. ఎంకరేజ్ చేశారు.. మా అబ్బాయి సాయి ని కూడా ఆదరించి ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమా నిర్మించిన సుబ్రమణ్యం, రమేష్ కుమార్ లను కూడా ఎంకరేజ్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, చోటా కె.నాయుడు విజువల్స్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, స్టన్ శివ ఫైట్స్ ఈ సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి. డెఫినెట్ గా ఈ సినిమా ప్రేక్షకులుచేత  అల్లుడు అదుర్స్ అనిపిస్తాడు. ఇక కందిరీగ వాసుని నేనే ఇంట్రడ్యూస్ చేశాను. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత రభస చేశాను.. రెవిన్యూ పరంగా ఆ చిత్రం మంచి పేరు తెచ్చింది. హైపర్ కూడా బాగానే ఆడింది. ఈ సినిమాతో సంతోష్ శ్రీనివాస్ టాప్ టెన్ డైరెక్టర్స్ లిస్టులో చేరతాడు. ఇక నుండి కందిరీగ వాసు అనేదిపోయి అల్లుడు వాసు అని పిలుస్తారు. అంత గొప్పగా ఈ సినిమాని తెరకెక్కించిన వాసుకి హాట్సాప్. కచ్చితంగా వాసుకి ఈ సినిమా మంచిపేరు తెస్తుంది. సుబ్రమణ్యం సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు. చాలా డేరింగ్ ఉన్న ప్రొడ్యూసర్. ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని చాలా భారీగా నిర్మించిన ఆయన గట్స్ కి హ్యాట్సాప్. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎక్కువ రేట్స్ కి అడిగినా కూడా  సినిమా మీద నమ్మకంతో ఈస్ట్ వెస్ట్ లలో ఓన్ గా రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ సినిమాతో ఆయన గోల్డెన్ నిర్మాతగా పేరు తెచ్చుకుంటాడు. సుమంత్ మూవీ ప్రొడ్యూక్షన్ నా సొంత బ్యానర్ లాంటిది.  ప్రతి సంవత్సరం మా అబ్బాయితో ఈ బ్యానర్లో  సినిమా ఒకటి చేస్తాం అని.. అన్నారు.


సప్తగిరి మాట్లాడుతూ.. ' కందిరీగ సినిమాలో ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ గారికి నా థాంక్స్. ఆ సినిమా హిట్ తో నా కెరీయర్ ఇక్కడి దాకా వచ్చింది. ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను.. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అల్లుడు అదుర్స్ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది.. అన్నారు.

Raviteja Interview About Krack

 


ఈ సంక్రాంతికి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్  క్రాక్ - మాస్ మ‌హారాజ ర‌వితేజ‌


డాన్‌శీను, బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `క్రాక్`. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మిశ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నాను. ‌స‌ర‌స్వ‌తి ఫిలిం డివిజ‌న్ ప‌తాకంపై బి. మ‌ధు నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుదలైన ట్రైల‌ర్‌, పాట‌లకి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న‌ ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా మాస్‌రాజా ర‌వితేజ మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు..


త‌మిళ‌నాడులో ఇచ్చిన‌ట్టుగానే  ఇక్క‌డ కూడా 100% సీటింగ్ కెపాసిటీ ప‌ర్మీష‌న్ వ‌స్తే బాగుండేది అనిపించిందా?

- మ‌న దగ్గ‌ర కూడా ఆ దిశగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి అని తెలిసింది. ప‌ర్మీష‌న్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏది ఏమైనా థియేట‌ర్‌కి వ‌చ్చి సినిమా చూసే ప్రేక్ష‌కులు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించండి. అలాగే వీలైతే చిన్న శానిటైజ‌ర్ బాటిల్ కూడా మీ వెంట తెచ్చుకోవాల్సిందిగా నా త‌రుపున మ‌న‌వి.


క‌రోనా త‌ర్వాత ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్ చేసిన కొంత భ‌యం అయితే ఉంటుంది క‌దా?

- లాక్‌డౌన్ త‌ర్వాత దాదాపు 200మంది డ్యాన్స‌ర్స్‌తో  2 సెట్ సాంగ్స్ షూట్ చేశాం. స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వల్లే  మా సెట్లో ఎవ్వ‌రికి  క‌రోనా రా‌లేదు. దాంతో మాకు కొంత ధైర్యం వ‌చ్చింది. క‌నీస జాగ్ర‌త్త‌లు తీస‌కుంటే త‌ప్ప‌కుండా షూటింగ్స్ జ‌రుపుకోవ‌చ్చు అని..ఒక‌వేల సెట్లో ఎవ‌రైనా మాస్క్ లేకుండా క‌నిపిస్తే త‌ప్ప‌కుండా మాస్క్ వేసుకోమ‌ని చెప్పేవాడిని.


సంక్రాంతికి వ‌స్తున్నారు క‌దా ఎలా అనిపిస్తుంది?

- మాములు రోజుల్లో ఒక సినిమా చూడ‌డానికి, పండుగ సీజ‌న్లో మూవీ చూడ‌డానికి ఎక్క‌డో చిన్న తేడా ఉంద‌ని నేను భావిస్తాను..ఎందుకంటే నేను కూడా అలా సినిమాలు చూసి వ‌చ్చిన వాణ్నే కాబట్టి. అయితే ఈ పండుగ‌కి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం. నా క్యారెక్ట‌ర్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తే చేశాను.  సినిమా చాలా బాగా వ‌చ్చింది. మాస్ ఎలిమెంట్స్ సూప‌ర్‌గా ఉన్నాయి, అలాగే పాట‌లు కూడా బాగా కుదిరాయి. ఈ పండుగ‌కి త‌ప్ప‌కుండా సినిమా ఒక విందు బోజ‌నంలా ఉంటుంది. ఆడియ‌న్స్ కూడా త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు.


గోపిచంద్ మ‌లినేని, మీ  కాంబినేష‌న్లో వ‌చ్చిన రెండు మూవీస్ స‌క్సెస్ అయ్యాయి క‌దా ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుందా?

- డెఫినెట్‌గా హ్యాట్రిక్ కొడ‌తాం అనుకుంటున్నాం. ఎందుకో తెలీదు మా ఇద్ద‌రికీ ప్రాప‌ర్‌గా సెట్ అయ్యింది. ఈ సినిమా త‌ప్ప‌కుండా వ‌ర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను.


ఈ సినిమాలో మీ క్యారెక్ట‌ర్ డ‌బుల్ మాస్ అనుకోవ‌చ్చా?

- డబుల్ మాస్ లేదా త్రిబుల్ మాస్ఆ  అనేది రేపు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.

 పూరిజ‌గ‌న్నాధ్ త‌ర్వాత గోపిచంద్ మ‌లినేనితోనే ఎక్కువ సినిమాలు చేశారు క‌దా..?

- అలా కుదిరింది అంతే..ఏది ప్లాన్ చేసి చేయ‌లేదు..ఒక‌వేల అలా ప్లాన్ చేసిన సెట్ అవ‌దు.


లాక్‌డౌన్ ఎలా గ‌డిచింది?

- అద్భుతంగా గ‌డిచింది. నేను మాములుగానే ఫ్యామిలీ మెన్‌ని. ఫ్యామిలీతో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతాను. ఈ లాక్‌డౌన్ వ‌ల్ల ఇంకా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయ‌గ‌లిగాను. అలాగే హ్యాపీగా వ‌ర్క‌వుట్స్ చేసుకున్నాను. నెట్‌లో చాలా కంటెంట్ ఉంది. బోలెడు సినిమాలు చూశాను. చాలా కొత్త కొత్త‌ విష‌యాలు నేర్చుకున్నాను. నిజంగా చెప్పాలంటే ఒక్క క్ష‌ణం కూడా బోర్‌గా ఫీల‌వ్వ‌లేదు.


- మీ పిల్ల‌లు మిమ్మ‌ల్ని ఇలాంటి క్యారెక్ట‌ర్లో చూడాలి అని అనుకుంటున్నారా?

- నేనేం చేసినా వారికి త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది.


జ‌న‌వ‌రి 26 మీ పుట్టిన‌రోజు క‌దా బ‌ర్త్ డే ప్లాన్స్ ఏంటి?

- స్పెష‌ల్ ప్లాన్స్ అంటూ ఏమి లేవు..మాములుగానే నేను బ‌ర్త్‌డేస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వ‌ను. ఈ నెల‌లో నా సినిమా రిలీజ‌వుతుంది అదే నాకు పెద్ద పండుగ‌.


సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ గురించి చెప్పండి?

- మొద‌ట్లో పూరిజ‌గ‌న్ కాంబినేష‌న్‌లో చ‌క్రీతో ఎక్కువ సినిమాలు చేశాను. ఆ త‌ర్వాత ఎక్కువ సినిమాలు చేసింది త‌మ‌న్ తోనే..నాకు ఎలాంటి పాట‌లు ఇవ్వాలో త‌మ‌న్‌కి బాగా తెలుసు. ఈ సినిమాలో పాట‌ల‌కి బ్ర‌హ్మండ‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది.


మిగ‌తా క్యారెక్ట‌ర్స్ గురించి?

-శృతి హాస‌న్ చాలా మంచి  క్యారెక్ట‌ర్ చేసింది. అలాగే స‌ముద్ర‌ఖని గారు నాకు చాలా ఇష్ట‌మైన వ్య‌క్తి ఆయ‌న ఒక మంచి పాత్ర‌లో క‌నిపిస్తారు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ పాత్ర కూడా ఆక‌ట్టుకుంటుంది. త‌మ‌న్ మ్యూజిక్‌తో పాటు జీకే విష్ణు విజువ‌ల్స్ కూడా ఈ సినిమాకి మెయిన్ అసెట్‌.  రియ‌ల్ ఇన్స్‌డెంట్స్‌, రియ‌ల్ క్యారెక్ట‌ర్స్ తీసుకొని చేసిన సినిమా ఇది.


ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడితే ఇమ్మిడియెట్‌గా మ‌రో సినిమా ఉంటుందా?

- డెఫినెట్‌గా ఉంటుంది..


ఈ పండుగ‌కి కాంపిటేష‌న్ ఎలా ఫీల‌వుతున్నారు?

- మ‌నం ప్ర‌తి సంక్రాంతికి చూస్తూనే ఉన్నాం. సినిమా బాగుంటే అన్ని సినిమాలు ఆడుతాయి. ఎందుకంటే ఒక సినిమా చూశాక మ‌రో సినిమా చూడ‌ను అని ఎవ‌రూ అనుకోరు. అన్ని సినిమాలు చూస్తారు.. పండుగంటే అదే క‌దా..


మీరు ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ చేశారు కదా..మీ క్యారెక్టర్ చూసి ఇన్స్పైర్ అయ్యాం అని ఎవరైనా పోలీసులు చెప్పారా?


- ఎప్పుడైనా బ‌య‌ట ఈ వెంట్స్‌కి వెళ్లి న‌ప్పుడు క‌లిసి విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్ట‌ర్‌కి ఫ్యాన్స్ అండీ అని చెబుతుంటారు. ఈ సినిమా త‌ర్వాత కూడా మ‌ళ్లీ అది రావ‌చ్చు అని అనుకుంటున్నాను.


మీ అబ్బాయి మ‌హాద‌న్ ని మ‌ళ్లీ ఎప్పుడు సినిమాల్లో చూడొచ్చు?

- రాజాదిగ్రేట్ సినిమాలో అనిల్ ప‌ట్టుబ‌ట్టి మ‌హాద‌న్‌తో ఆ క్యారెక్ట‌ర్ చేయించాడు. త‌ను ఇప్పుడు 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఇంకా చాలా టైమ్ ఉంది. ఆ స‌మ‌యానికి వాడికి ఏది అనిపిస్తే అదే చేయ‌మ‌ని చెప్తాను.


నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి?

- ప్ర‌స్తుతం ఖిలాడీ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. త‌ర్వాత ఏ సినిమా అనేది ఇంకా క‌న్ఫ‌ర్మ్ కాలేదు..

Good Response For Nuvena



 'నువ్వేనా' సీజన్‌ 1కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌.. సంక్రాంతికి సీజన్‌ 2 షూటింగ్‌ ప్రారంభం


శ్రీనివాస్ అనంతనేని , ప్రమీల హీరోహీరోయిన్లుగా.. రామ్‌కుమార్‌ వంగోజు దర్శకత్వంలో పవన్ సిద్దార్థ క్రియేషన్స్ పతాకంపై..  ట్రై యాంగిల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన వెబ్‌ సిరీస్‌ 'నువ్వేనా'. టూ టౌన్ లవ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌తో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ సీజన్ -1 ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌ వీడియో, mx ప్లేయర్, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ద్వారా విడుదలై  మంచి  స్పందనను రాబట్టుకుంటోన్న తరుణంలో సీజన్‌2ను సంక్రాంతి నుంచి తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా నిర్మాత శ్రీనివాస్ అనంతనేని తెలియజేశారు.


ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌కుమార్‌ వంగోజు మాట్లాడుతూ.. '' 'నువ్వేనా' సీజన్‌ 1లోని ఒక పాటను ఎల్లిపోకే ... ఫేమ్ సింగర్ దిలీప్ దేవగన్ పాడగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అదే స్థాయిలో రెండో సాంగ్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మా వెబ్‌ సిరీస్‌ నువ్వేనకి పనిచేసిన సినిమాటోగ్రఫర్ మహిషేర్ల, సంగీతాన్ని అందించిన సన్నీ AR, ఎడిటర్ వీరు, సాహిత్యం అందించిన నరేష్‌ల ఎఫర్ట్ మరవలేనిది. సంక్రాంతికి 'నువ్వేనా' సీజన్ -2 షూటింగ్‌ ప్రారంభిస్తాము. ఇందులో నూతన నటీనటులకు అవకాశం కల్పించనున్నాము. సీజన్‌ 1ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు..'' అని తెలిపారు.


శ్రీనివాస్‌ అనంతనేని, ప్రమీల ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌కి సంగీతం: సన్నీ ఏ.ఆర్‌, ఎడిటింగ్‌: వీరు, సినిమాటోగ్రఫీ: మహీ షేర్లా, పాటలు: నరేష్‌, సింగర్‌: దిలీప్‌ దేవగన్‌, పీఆర్వో: బిఎస్‌ వీరబాబు, నిర్మాత: శ్రీనివాస్‌ అనంతనేని, రచన-దర్శకత్వం: రామ్‌కుమార్‌ వంగోజు.

Priyathama Trailer Launched by Vv Vinayak

 


సెన్సేషనల్ డైరెక్టర్ వివి. వినాయక్ విడుదల చేసిన "ప్రియతమా" ట్రైలర్!! 


సంతోష్ పార్లవార్, ఆనంద్ కుమార్ , నాగ వంశీ కృష్ణ, వికాస్ చంద్ర, ఉషా, ఏంజిల్, వృషాలి, ముఖ్య   పాత్రదారులుగా ఆర్కే టాకీస్ బ్యానర్ సమర్పణలో సంతోష్ పార్లవార్ స్వీయ దర్శకత్వంలో పూలకుర్తి కొండయ్య నిర్మించిన చిత్రం "ప్రియతమా". ఈ చిత్రం ట్రైలర్ ని వి.వి. వినాయక్, ప్రముఖ దర్శకుడు రవికుమార్ చౌదరి విడుదల చేశారు. ముగ్గురబ్బాయిలు, ముగ్గురమ్మాయిలు మధ్య నడిచే ట్రయాంగిల్ లవస్టోరీ ఇది. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం జనవరిలో రిలీజ్ కి సిద్ధమవుతోంది.. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే అదే పెద్ద సినిమా.. ప్రియతమా టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ చూశాను.. యూత్ ఆడియెన్స్ ఎంజాయ్ చేసే విధంగా సినిమాని సంతోష్ తెరకెక్కించాడు. ఈ సినిమా సక్సెస్ అయి టీమ్ అందరికీ మంచి పేరు రావాలని.. వినాయక్ అన్నారు. 


సంతోష్ పార్లవార్, ఆనంద్ కుమార్ , నాగ వంశీ కృష్ణ , వికాస్ చంద్ర, ఉషా, ఏంజెల్, వృషాలి, చిత్రం శ్రీను, ఫిష్ వెంకట్, సుమన్ శెట్టి, నర్సింగ్ యాదవ్, చంద్రమోహన్, రచ్చ రవి, అప్పారావు, సత్తిపండు, జయరాజ్, సన్నీ, స్నేహల్, సాక్షి, యాప్.యం. బాబాయ్, లక్ష్మీ ప్రసన్న, సంధ్యారాణి, నాగిరెడ్డి, యాదేశ్, రమేష్, సాధు, జె.శ్రీనివాస్, గోపి, వెంకట్ రెడ్డి, శివ, కె.నాగేశ్వరావు, దేవిధాస్, యం. సూర్యచందర్ రావు, యస్. శ్రీనివాసరావు, జి.నవీన్ కుమార్, కిరణ్ వైద్యా, కరుణాకరన్   తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం; చైతన్య, సినిమాటోగ్రఫీ; ఆనేం వెంకట్, ఎడిటింగ్; బి. మహేంద్రనాథ్, పాటలు; సంతోష్ పార్లవార్, పూలకుర్తి కొండయ్య, నవీన్ రాంపోగు, హర ఉప్పాడ, నిర్మాత; పూలకుర్తి కొండయ్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం; సంతోష్ పార్లవార్.

The Rose Villa Trailer Launched

 


"ది రోజ్ విల్లా" ట్రైలర్ దద్దరిల్లిపోయింది.. బొమ్మకూడా బ్లాక్ బస్టర్ అవుతుంది.. బిగ్ బాస్ విన్నర్ సోహైల్ !!


కన్నడ సూపర్ హిట్ ఫిల్మ్ 'దియా' తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం "ది రోజ్ విల్లా". శ్వేతా వర్మ హీరోయిన్ గా చిత్ర మందిర్ స్టూడియోస్ పతాకంపై హేమంత్ దర్శకత్వంలో అచ్యుత్ రామారావు పి. ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజరవీంద్ర, అర్చన కుమార్, వెన్నెల రామారావు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం జనవరి 4న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బిగ్ బాస్ విన్నర్ సోహైల్ ముఖ్యఅతిధిగా హాజరై "ది రోజ్ విల్లా" ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో దీక్షిత్ శెట్టి, నటి అర్చన కుమార్, ప్రముఖ నటుడు రాజా రవీంద్ర, యాంకర్, నటుడు టి.యన్.ఆర్, కెమెరామెన్ అంజి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, దర్శకుడు హేమంత్, నిర్మాత అచ్యుత రామారావు, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీదేవి కొల్లి పాల్గొన్నారు..


ప్రముఖ నటుడు రాజరవీంద్ర మాట్లాడుతూ.. 'హీరో దీక్షిత్ వెరీ ఫ్యాషనేట్ యాక్టర్. చాలా అద్భుతంగా నటించాడు. అలాగే డాన్సర్, థియేటర్ ఆర్టిస్ట్ అయిన  అర్చన కుమార్ చాలా బాగా యాక్ట్ చేసింది. బేసిగ్గా ఆవిడ కన్నడ అయినా కూడా తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పారు. ఇక కెమెరామెన్ అంజి సూపర్బ్ విజువల్స్ తో ఎక్స్ట్రార్డినరీ గా వర్క్ చేసాడు. సురేష్ బొబ్బిలి ఔట్ స్టాండింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. నిర్మాత రామారావు చిన్న సినిమా అయినా కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్ద సినిమా రేంజ్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. హేమంత్ ఫస్ట్ సినిమా అయినా చాలా క్లారిటీగా కాన్ఫిడెంట్ తో "దిరోజ్ విల్లా" చిత్రాన్ని తెరకెక్కించాడు.  చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశాను.. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చిన రామారావుకు, దర్శకుడు హేమంత్ కి నా థాంక్స్.. అన్నారు.


నటి అర్చనకుమార్ మాట్లాడుతూ.. ' ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్. హేమంత్ ఎక్సలెంట్ గా ఈ చిత్రాన్ని తీశాడు. రాజారవీంద్ర లాంటి సీనియర్ యాక్టర్ తో నటించడం చాలా హ్యాపీగా ఉంది. సెట్స్ లో ఎన్నో టిప్స్ చెప్పారు. ఈ సినిమా నాకు వన్డ్రఫుల్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. దీక్షిత్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. అంజి కెమెరా ముందు ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాలో చూపించారు.. అన్నారు.


 కెమెరామెన్ 'గరుడవేగ అంజి' మాట్లాడుతూ..' నటీనటులు అందరూ ఫెంటాస్టిక్ గా చేశారు. డైరెక్టర్ హేమంత్ పక్కా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆర్టిస్టులు దెగ్గర్నుండి తనకి కావాల్సిన పెర్ఫార్మెన్స్ ని రాబట్టుకున్నారు. సురేష్ బొబ్బిలి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. నా విజువల్స్ కి తగ్గట్లు ఆర్.ఆర్ ఇచ్చాడు. ఇద్దరం పోటాపోటీగా వర్క్ చేశాం. సినిమా చూసిన వారంతా మా ఇద్దరి వర్క్ చాలా బాగుంది అని అప్రిషియేట్ చేస్తున్నారు. అచ్యుత్ రామారావు మేకింగ్ విషయంలో ఏది అడిగినా ఎక్కడా వెనకాడకుండా అన్నీ ఇచ్చి సపోర్ట్ చేశారు.. అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ' ఈ సినిమా స్టార్ట్ కావడానికి మెయిన్ పిల్లర్ రామారావు. మా అందర్నీ  ఒక టీమ్ లా ఫామ్ చేసి ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ నా థాంక్స్. హేమంత్ నేరేట్ చేసిన స్టోరీ చాలా బాగుంది. దానికి తగ్గట్లుగా మ్యూజిక్ చేశాను.. ఈ సినిమా చూసి పెద్ద హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. అన్నారు.


టి.యన్.ఆర్. మాట్లాడుతూ.. ' ఈ చిత్రంలో ముఖ్యమైన ఒక సింగిల్ సీన్ లో యాక్ట్ చేశాను. దీక్షిత్ ఫ్యూచర్ లో బిగ్ హీరో అవుతాడు. ఇప్పటి వరకూ చూసిన రాజా రవీంద్ర వేరు. ఈ సినిమా తరువాత ఆయన నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు. అంత బాగా ఈ చిత్రంలో చేశాడు. హేమంత్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాతో తనకంటూ ఒక మార్క్ బ్రాండ్ తెచ్చుకుంటాడు. అంజి, సురేష్ బొబ్బిలి ఇద్దరూ ది బెస్ట్ ఔట్ ఫుట్ ఇచ్చారు. రామారావు ఇంకా రెండు సినిమాలు నిర్మిస్తున్నారు.. అందులో కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను.. డెఫినెట్ గా ది రోజ్ విల్లా చిత్రం మంచి హిట్ అవుతుంది.. అన్నారు.


చిత్ర దర్శకుడు హేమంత్ మాట్లాడూ.. ' ట్రైలర్ అందరికీ నచ్చుతుందని.. సినిమా ఎలావుందీ అనేది ప్రేక్షకులు చూసి చెప్పాలి. రాజారవీంద్ర ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారు. అలాగే హీరో దీక్షిత్ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఈ కథకి ఆయన పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. నటీనటులు అందరూ బాగా చేశారు. ముఖ్యంగా ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ కెమెరామెన్ అంజి. చాలా గ్రాండియర్ గా విజువల్స్ ఇచ్చారు.  అలాగే సురేష్ రీ-రికార్డింగ్ చాలా ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది. ఒక సెంటిమెంట్ సాంగ్ అద్భుతంగా చేశాడు. ఈ అవకాశాన్ని ఇచ్చిన రామారావు, పద్మనాభరెడ్డి గారికి థాంక్స్.. అన్నారు.


ముఖ్య అతిధి సోహైల్ మాట్లాడుతూ.. ' ఈ బ్యానర్ నా హోమ్ ప్రొడక్షన్ లాంటిది. బిగ్ బాస్ కి ముందు నేను చాలా కష్టాల్లో వున్నప్పుడు రామారావు అన్న నాకు చాలా హెల్ప్ చేసి నాకు బాలీవుడ్ వెబ్ సిరీస్ చేసే అవకాశం ఇచ్చారు. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. యుయస్ లో ఉండి జాబ్ చేసి డబ్బులు సంపాదించుకోకుండా సినిమా మీద ప్యాషన్ తో వరుసగా ఇక్కడ సినిమాలు స్టార్ట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే బుజ్ బమ్స్ వచ్చాయి.. దద్దరిల్లిపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. రామారావు అన్నకి రైట్ టైం ఇప్పుడు స్టార్ట్ అయింది. అందరితో హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ.. కొత్త ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి అవకాశాలు కల్పిస్తున్నారు. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కానీ ప్రొడ్యూసర్. ఫస్ట్ మూవీతో చిత్ర మందిర్ స్టూడియో బ్యానర్ లో బిగ్ హిట్ కొట్టబోతున్నారు.. అంజి కెమెరా విజువల్స్ అల్టిమేట్ గా ఉన్నాయి. ఆయన ఏ ప్రాజెక్ట్ చేసిన ఆ సినిమాకి ప్లస్ అవుతాడు. నా సినిమాలన్నీ ఆయనతోనే చేయాలనుకుంటున్న. సురేష్ ఆర్ ఆర్ ఇరగదీశాడు. రాజరవీంద్ర వన్ మాన్ షోలా చేసాడు. ఐ ఫీస్ట్ లా ఈ సినిమా ఉండబోతుంది. దియా సినిమా నాకు బాగా నచ్చింది. దీక్షిత్ మంచి నటుడు. చాలా తక్కువమంది ఆర్టిస్టులతో సినిమా తీసి బెస్ట్ ఔట్ ఫుట్ ఇచ్చాడు హేమంత్. వెరీ బ్రిలియంట్ డైరెక్టర్.  టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.. అన్నారు.


నిర్మాత అచ్యుత రామారావు మాట్లాడుతూ.. ' చిత్ర మందిర్ స్టూడియోస్ పెట్టి  సక్సెస్ చేశాం. ఇప్పుడు అదే పేరు తో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి మూడు సినిమాలు బాక్ టు బాక్ చేస్తున్నాం. ముందుగా "ది రోజ్ విల్లా" చిత్రం మా బ్యానర్ నుండి వస్తుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్   ప్రతిఒక్కరూ అభిమానంతో ఎంతో ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా చేశారు. వారందరికీ నా థాంక్స్. ఇందులో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశాను. దీక్షిత్ కమిటెడ్ గా పెర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. అలాగే రాజరవీంద్ర, అర్చనకుమార్, శ్వేతా వర్మ బ్యూటిఫుల్ గా నటించారు. కెమెరామెన్ అంజి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ పెద్ద సినిమా లెవెల్ లో ఈ చిత్రానికి బెస్ట్ ఔట్ ఫుట్ అందించారు. ఇక డైరెక్టర్ హేమంత్ తను అనుకున్నది అనుకున్నట్లుగా తీశాడు. తనకి కావాల్సింది ప్రొవైడ్ చేశాం. న్యూ కాన్సెప్ట్ తో మంచి సినిమా చేశాడు.  అందరం ఒక ఎమోషన్ లా ఫీలయి వర్క్ చేశాం. మా చిత్రమందిర్ స్టూడియో బ్యానర్ కి సపోర్ట్ గా నిలిచిన సుమన్, మూర్తి లకు నా థాంక్స్. మా బ్యానర్ నుండి వస్తున్న ముగ్గురు మొనగాళ్ళు, టెన్త్ క్లాస్ డైరీ, త్వరలో రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాకి రవితేజ మన్యం వన్ ఆఫ్ ది పార్ట్నర్ గా జాయిన్ అవుతున్నారు. నెక్స్ట్ సోహైల్ తో ఒక హిందీ వెబ్ సిరీస్ చేస్తున్నాం. దానికి వర్మ దర్శకుడు. శ్రీ విష్ణు, దీక్షిత్ లతో కూడా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.


హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ..' కన్నడలో చేసిన "దియా" చిత్రాన్ని భాషా భేదం లేకుండా ఆదరించి సక్సెస్ చేశారు. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా రామారావు కి థాంక్స్. ఒక ప్యాషన్ తో ఎంతో హార్డ్ వర్క్ చేసి హేమంత్ ఈ సినిమా చేశాడు. స్టోరీ  అద్భుతంగా నేరేట్ చేసాడు. షూటింగ్ బిగినింగ్ నుండీ సెట్లో ఎలా యాక్ట్ చేయాలో చెప్పి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నారు. కెమెరామెన్ అంజి చాలా ఫాస్ట్ గా క్లారిటీగా ఫినిష్ చేశారు. రాజరవీంద్ర సెట్లో చాలా టిప్స్ ఇచ్చారు. శ్వేతా వర్మ, అర్చన కుమార్ వండర్ ఫుల్ గా నటించారు. సురేష్ ఆర్.ఆర్.బాగా చేశారు. మన సినిమా ఎలా వస్తుంది.. అని ఫోన్ చేసి రామారావును అడిగే వాడ్ని. ఇప్పుడు మీకోసం సినిమాని రెడీ చేసి ఇస్తున్నాం. చూసి ఆదరించి సక్సెస్ చెయాలని కోరుతున్నా.. నేను చిన్నప్పటినుండి తెలుగు సినిమాలు బాగా చూసేవాడ్ని. ఫస్ట్ హ్యాపీ సినిమా చూశాను. తర్వాత అందరి హీరోల సినిమాలు చూశాను. ఎప్పుడూ నేను యాక్టర్ ని అవుతానని అనుకోలేదు. లక్కీగా అయ్యాను. చాలా నెర్వస్ గా ఉంది. అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది.. అన్నారు.


దీక్షిత్ శెట్టి, శ్వేతా వర్మ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజరవీంద్ర, అర్చనకుమార్, వెన్నెల రామారావు, టి.యన్.ఆర్ ముఖ్య పాత్రలు పోషించారు.


ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ;  గరుడవేగ అంజి, మ్యూజిక్; సురేష్ బొబ్బిలి, ఎడిటర్; శివ, స్టైలింగ్; శ్రీదేవి కొల్లి, సందీప్ శర్మ, పి.ఆర్.ఓ; వంశీ శేఖర్, యూనిట్; యు అండ్ ఐ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాత; అచ్యుత్ రామారావు.పి, రచన-దర్శకత్వం; హేమంత్.

Telugu Film Producers Council "Press Note"

 


PRESS NOTE

Sub:- Request to Govts of Andhra Pradesh and Telangana for increase of occupancy of seats in Cinema

Theatres/Multiplexes in Andhra Pradesh & Telangana from 50% to LOO% - as done by Tamilnadu

Government vide their G.O. (Ms) No. 001 dt. 04.01.2021-Reg.

We hereby inform that the Governments of Government of Andhra Pradesh and Telangana were kind

enough to accord the permission upto 50% occupancy of seats in Cinema Theatres/Multiplexes duly

following Standard Operating Procedure in Andhra Pradesh and Telangana vide G.O. R.T. No.443

dated 05.10.2020 and G.O. Ms. No. 158 dated 23.11.2020 respectively. ln this connection, we hereby

inform that with the occupancy upto 50% seats and the expenditure incurred for maintenance of

theatres with Standard Operating Procedure, the Management of Theatres are not able to meet

necessary expenditure for maintenance of theatres and therefore incurring losses.

Now, that the Government of Tamilnadu have issued orders vide G.O.(Ms) No. 001 dated 04.01.2027

increasing the seating capacity of Cinemas Theatres/Multiplexes from 50% to LOO% in Tamilnadu by

following the Standard Operating Procedure, taking into account the decrease in COVID-19 cases day by

day and the problems faced by the Cinema Theatres/Multiplexes.

We therefore, requested both'Chief Ministers of Andhra Pradesh and Telangana and other concerned

Hon'ble Ministers and Departments through our letters dated 04.01.202Lto issue necessary orders to

increase the occupation of Cinema Theatres from 50% to 100% duly following Standard Operating

Procedure in Andlra Pradesh and Telangana which will help the Management of Cinema

Theatres/M ultiplexes meet the necessary expenditure for maintenance of Cinema

theat ultiplexes in /nphra Pradesh affielangana.

(MOHAN VADLAPATLA}

Hon. Secretary Hon. Secretary