Latest Post

Producer Miryala Ravindar Reddy Interview About Pedakapu-1

 ‘పెదకాపు-1’ తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్పగా చెప్పుకోదగ్గ అరుదైన చిత్రంగా నిలుస్తుంది: నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డియంగ్ టాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ‘పెదకాపు-1’ విశేషాలని పంచుకున్నారు.


పెదకాపు 1 టీజర్ ట్రైలర్ తో చాలా పెద్ద బజ్ ని క్రియేట్ చేసింది ఎలా అనిపిస్తుంది? 

పెదకాపు పై ఇంత మంచి బజ్ రావడం ఆనందంగా వుంది. పెద్ద సినిమా అవుతుందనే నమ్మకంతోనే మొదటి నుంచి పెద్దగానే చేశాం. 


కొత్తవాళ్ళతో ఇంతపెద్ద సినిమా చేయడం సాహసం అనిపించలేదా ?    

ఇది సాహసం కాదండీ. కొత్తవాళ్లతోనే వర్క్ అవుట్ అయ్యే కథ ఇది. ఈ కథకు ఒక సామాన్యుడు కావాలి. కొత్తవాడైతే దానికి సహజత్వం వస్తుంది. 


అఖండ బ్లాక్ బస్టర్  తర్వాత పెద్ద స్టార్ తో సినిమా చేయవచ్చు.  కానీ ఈ సినిమా చేయడానికి కారణం ? 

అఖండ లాంటి విజయం తర్వాత ఏం చేయాలనే డైలమా నాలో కూడా వచ్చింది. పెద్ద స్టార్స్, దర్శకులకు అడ్వాన్సులు ఇవ్వాలని సన్నిహితుల నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే ఎవరితో చేసినా  మంచి కథ వుంటే మంచి సినిమా అవుతుంది. దానికి స్టార్ యాడ్ ఐతే ఇంకా పెద్ద సినిమా అవుతుందని నా నమ్మకం. ఇలాంటి సమయంలో పెదకాపు కథ వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ సినిమాలు అరుదుగా వుంటాయి. అలాంటి అరుదైన చిత్రంగా పెదకాపు నిలుస్తుంది. ఈ సినిమా తర్వాత ద్వారక జర్నీ మారుతుంది. 


పెదకాపు కథలో మీకు నచ్చిన అంశం ఏమిటి ? 

ప్రతి కథలో బలవంతుడు బలహీనుడు మధ్య పోరాటం వుంటుంది. ఇందులోకి వచ్చేసరికి నేటివిటీ తోడైయింది. ఈ కథ తెరపై చూస్తున్నపుడు ఒక సినిమాలా కాకుండా నిజ జీవితాన్నే తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది. శ్రీకాంత్ గారు రాసిన మాటలు గుచ్చుకుంటాయి. సినిమా చూస్తున్నపుడు జీవితంలో నెగ్గాలంటే ఒక సామాన్యుడు ఇంతపోరాటం చేయాలా అనిపిస్తుంది. సినిమా చూసి బయటికి వెళ్తున్నప్పుడు నిజమే కదా.. మనం ఎందుకు పోరాటం చేయకూడదనిపిస్తుంది. 


శ్రీకాంత్ అడ్డాల గారిని వెట్రిమారన్ తో పోల్చారు .. అంత సహజత్వంగా ఉంటుందా? 

వందశాతం. సినిమా అంత చాలా సహజత్వంతో వుంటుంది. ఎక్కడ కుత్రిమంగా సెట్స్ వేయలేదు. వందశాతం నిజాయితీగా తీశాం. ఒక చరిత్రని కళ్ళ ముందు ఎలా చూపించాలో అలానే చూపించాం. 1980 నాటి పరిస్థితులని ప్రతిబింబిచేలా అన్ని రియల్ లోకేషన్స్ లో షూట్ చేశాం. రాజమండ్రి నుంచి ప్రతి రోజు రెండుగంటల పాటు జర్నీ చేసిమరీ కొన్ని సహజమైన లోకేషన్స్ లో షూట్ చేశాం. మరోసారి చెబుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో వెట్రిమారన్, శ్రీకాంత్ అడ్డాల రూపంలో వస్తారు.  


రెండు పార్టులు తీయడం రిస్క్ అనిపించలేదా ? 

లేదండీ. ఈ కథ అనుకున్నప్పుడే రెండు పార్టులు గా అనుకున్నాం. ఇదొక చరిత్ర, ఒక సామాన్యుడు, అసమాన్యుడు కావడం ఒక పూటలో జరగదు. ఈ పోరాటంలో చాలా సవాళ్ళు వుంటాయి. ఇది రెండు పార్టులుగా చెపాల్సిన కథ.


సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది ? ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి కారణం ? 

సెన్సార్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. పెదకాపులో వైలెన్స్ వుంది. ఆ వెలైన్స్ కి కూడా ఒక కారణం వుంది. సమాజంలో శాంతి కావాలంటే యుద్ధం చేయాల్సిందే. ఆ యుద్ధం ఇందులో వుంటుంది. 


ఎప్పుడో జరిగిన ఒక సంఘటనని, ఒక కమ్యునిటీని సూచించే పేరుతో సినిమాగా తీయడం వలన ఇప్పుడు పరిస్థితులని ప్రభావితం చేసే అవకాశం వుంది కదా ?

లేదండీ. ఇందులో ప్రత్యేకంగా ఏ కమ్యూనిటీ ప్రస్తావన వుండదు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో దీని గురించి స్పష్టంగా చెప్పాను. పరిస్థితులు ఎలా మారిపోయినా.. సమాజంలో బలహీనుడు, బలవంతుడు.. ఎప్పుడూ వుంటారు. ఒక సామాన్యుడు తన పరిస్థితులని తట్టుకొని బలవంతుడిని జయించాలంటే ఒక యుద్ధమే చేయాలి. మనం అనుకున్నది సాధించాలంటే పోరాటం తప్పితే వేరే మార్గం వుండదు. అదే ఈ సినిమా కథ.


పెదకాపు టైటిల్ పెట్టడానికి కారణం ? 

మొదట సినిమాకి కొన్ని టైటిల్స్ అనుకున్నాం. ఇది కర్ణ పాత్ర చేసే పోరాటం కదా.. కర్ణ టైటిల్ ఐతే ఎలా వుంటుందని చర్చించాం. ఇలాంటి సమయంలో శ్రీకాంత్ గారు లోకేషన్స్ చూడటానికి వెళ్ళినపుడు ‘పెదకాపు’ అనే పేరుని చూశారు. దాని గురించి అక్కడి వాళ్ళని అడిగితే ఆయన ఆ వూరికి మంచి చేసిన వ్యక్తని చెప్పారు. అప్పుడు శ్రీకాంత్ గారు మన కథ కూడా ఇదే కథ..పెదకాపు పేరు బావుంటుందని అన్నారు. అలా ఈ కథకు పెదకాపు అనే పేరుపెట్టాం. కుటుంబం, సమూహం, ప్రాంతం.. ఇలా ఏదైనా నా అనుకొనే వారికోసం కాపుకాచుకొని వుండేవారికి ఆ పేరు వుంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈ పేరుపెట్టాం.  


మీ ఇంటి నుంచి ఒక హీరోని పరిచయం చేయాలనే ఆలోచన మీకు ముందు నుంచి ఉందా ? విరాట్ మీ అంచనాలని అందుకున్నాడా ? 

విరాట్ కి సినిమాలపై ఆసక్తి వుంది. తను హీరో మెటీరియల్. స్క్రీన్ పై చూస్తున్నపుడు ఒక పెద్ద హీరోని చూసిన అనుభూతినే కలిగింది. హీరోగా పరిచయం చేయొచ్చని నమ్మకం కుదిరింది. ఇది రెగ్యులర్ సినిమా కాదు. చాలా ఇంటెన్స్ తో వున్న యాక్షన్ సినిమా. దీనికి ఒక సామన్యుడు హీరో కావాలి. దీనికి విరాట్ సరిగ్గా సరిపోయాడు. కొత్త హీరోతో ఇంతపెద్ద కాన్వాస్ తో సినిమా చేయడం  ఏ దర్శకుడికైనా కొంచెంరిస్క్ అనిపిస్తుంది. ఐతే ఈ కథని బలంగా నమ్మాం. ఎలాంటి బౌండరీలు లేకుండా సినిమాని పెద్దగానే తీయాలని ముందుగానే చెప్పాను. అవసరమైతే ఒక ఎపిసోడ్ షూట్ చేసి మనం అనుకున్న అవుట్ పుట్ కి మ్యాచ్ కాకపొతే యూనిట్ అందరినీ అలానే వుంచి హీరోని మార్చి మరో హీరోని పెడదాం గానీ కథకి మాత్రం బౌండరీలు గీసుకోవద్దని క్లారిటీగా చెప్పాను. ఆరోజు తర్వాత ఒక కొత్త హీరోతో చేస్తున్నామని ఫీలింగ్ ఎప్పుడూ లేదు. షూటింగ్ వెళ్ళిన తర్వాత నాకన్నా దర్శకుడు, మిగతా టీం చాలా సంతృప్తితో వున్నారు. 


సత్యానంద్ గారు విరాట్ ని ప్రభాస్ తో పోల్చడం ఎలా అనిపించింది ? 

చాలా సంతోషంగా వుంది. సత్యానంద్ గారి దగ్గర జాయిన్ అయిన మొదటి రోజు నుంచి చాలా పాజిటివ్ గా వున్నారు. తెరపై చూస్తున్నపుడు కూడా అలానే కనిపిస్తున్నాడు. 


శ్రీకాంత్ గారు ఇందులో నటిస్తానని చెప్పినపుడు మీ ఫీలింగ్ ఏమిటి ? 

నా మనసులో కూడా అదే వుంది. కూర్చున్న చోటే అన్నీ చేసే పాత్ర అది. దీన్ని చాలా సహజంగా నటించే నటుడు మాత్రమే చేయగలడు. దీని కోసం ఓ ఇద్దరు నటులని అనుకున్నాం. కానీ వారికి వీలుపడలేదు. దీంతో శ్రీకాంత్ గారు కాల్ తీసుకున్నారు. ఒక దర్శకుడికి అన్ని పాత్రలు తెలుసు. ఆ పాత్రని దర్శకుడిగా శ్రీకాంత్ గారే అంత చక్కడా చేయగలరు. సినిమా చూసినప్పుడు మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. అలాగే ఇందులో అనసూయ, తనికెళ్ళ భరణి, రావు రమేష్ గారి పాత్రలు కూడా బలంగా వుంటాయి. అలాగే 294 మంది కొత్తవారు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. మిక్కీజే మేయర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. 


పెదకాపులో రాజకీయ అంశాలు వుంటాయి ? 

వుంటాయి. 80నాటి పరిస్థితుల నేపధ్యంలో వుండే కథ ఇది. ఒక కొత్త పార్టీ వస్తుందంటే యువతలో చైతన్యం వుంటుంది. ఆ పార్టీతో తమ తలరాతలు మారుతాయనే ఆశ వుంటుంది. రాష్ట్రంలోగాని, దేశంలో గాని ఒక కొత్తపార్టీ వస్తుందంటే ముందు ఎట్రాక్ట్ అయ్యేది యువతనే. అలా వచ్చిన పార్టీ వీరికి ఎలాంటి చేయూతనిచ్చిందనేది ఒక అంశంగా వుంటుంది. 


అఖండ 2 ఎప్పుడు ? 

ఎప్పుడనేది చెప్పలేను కానీ అఖండ 2 ఖచ్చితంగా వుంటుంది.  

కొత్త ప్రాజెక్ట్స్ ? 

ఈ సినిమాకి కంటిన్యూగా పెదకాపు2 వుంటుంది. అడివి శేష్ గారితో ఒక సినిమా వుంటుంది. అలాగే మరో రెండు మూడు కథలు చర్చల్లో వున్నాయి.


ఆల్ ది బెస్ట్ 

థాంక్స్

Bheemla Nayak - Title and First Glimpse Out NowPower packed first glimpse of Pawan Kalyan's Bheemla Nayak unveiled


In a treat to Pawan Kalyan fans the first glimpse of Sithara Entertainments' Production No 12 titled #BheemlaNayak has been unveiled.


The power-packed first glimpse runs for 52 seconds unveiled by Director Harish Shankar. It shows Pawan Kalyan, with a dark blue shirt and lungi, thrashing goons and mouthing sharp dialogues.


Harish Shankar Said "I feel very happy to launch the title and glimpse of Pawan Kalyan garu's Bheemla Nayak. Being a fan got super excited to see him in this look and he is as lively and as ferocious as fans would love to watch him. I am sure this movie will be a resounding blockbuster."The film will be releasing in theatres on 12 January 2022 as Sankranthi treat, the first glimpse reveals. A song from the film will be released on September 2, on the Pawan Kalyan's Birthday. 


The film features Pawan Kalyan and Rana Daggubati in lead roles and is directed by Saagar K Chandra. Dialogues and screenplay are by Trivikram.


Bheemla Nayak is produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. Thaman S is scoring the music. The film is a remake of Malayalam film Ayyapanum Koshiyum. 
Starring: Pawan Kalyan, Rana Daggubati


Co-Starring: Nithya Menen, Aishwarya Rajesh, Rao ramesh, Muralisharma, Samudrakhani, Raghubabu, kadambari kiran, Narra srinu, chitti, Pammi sai


Dialogues & Screenplay: Trivikram


Director - Saagar K Chandra


Cinematography: Ravi K Chandran isc


Music: Thaman S


Editor: Navin Nooli


Art Director: A.S. Prakash


VFX Supervisor: Yugandhar T


Presenter: PDV Prasad


Producer: Suryadevara Naga Vamsi


Banner: Sithara Entertainments


PRO: LakshmiVenugopal

Horror Thriller 'LEELA' To be premiered on URVASI OTT

      Another movie which is ready with first copy is getting readied for world digital premiere on Urvasi OTT. It's title is 'LEELA'. It's a horror thriller.

     It's produced on Royal movie creations by A.M.Bhasha under the direction of Bala. Vijay, Sneha Sirish, sandhya, kiran kumar played lead roles. This movie will be premiered exclusively on Urvasi OTT from this Jan 14th.

    For this intense horror thriller camera handled by Kiran Dasari, Editing done by MNR, and Music provided by Sreemithra.

Producer: A.M.Bhasha, Written & Directed By: BALA

Petta Releasing for Sankranthi