యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" ట్రైలర్ రిలీజ్
ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న సినిమా
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. "చిరంజీవి" సినిమా ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
"చిరంజీవి" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - పుట్టినవారు మరణించకతప్పదు, మరణించిన వారు జన్మించక తప్పదు అనే భగవద్గీత శ్లోకంతో ఆసక్తికరంగా ఈ ట్రైలర్ మొదలవుతుంది. కుడివైపు గుండె ఉండే ప్రాణాంతక వ్యాధి ఉన్నా హీరో చావు నుంచి అనేక సార్లు తప్పించుకుంటూ ఉంటాడు. అతని కోసం కొన్ని గ్యాంగ్స్ వెంటాడుతుంటాయి. హీరో తల్లి అతడిని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ కాపాడుకుంటుంది. అతన్ని ప్రేమించే అమ్మాయి కూడా చిరుకు ఏదైనా ఆపద వస్తుందేమో అని భయపడుతుంటుంది. మరోవైపు స్పైడర్ మ్యాన్ గెటప్ లో ఒక వ్యక్తి విలన్స్ ను వేటాడుతుంటాడు. 'వేటాడేది పులినైతే వేస్ట్ చేసే ప్రతి బుల్లెట్ కు ఒక వ్యాల్యూ ఉంటుంది..', వాడు చిరంజీవి చంపినా చావడు, చచ్చినా చావడు..' వంటి డైలాగ్స్ ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి అయిన హీరోను ఒక మహిళ తుపాకీతో కాలుస్తుంది. ఆమె ఎవరు? ప్రాణాలు తీయాలని చూసే విలన్స్ ఒకవైపు, ప్రాణాలు కాపాడాలని తపించే తల్లి, ప్రియురాలు మరోవైపు, ఈ సంఘర్షణలో ప్రాణాంతక వ్యాధి ఉన్న హీరో ఎలా విజయం సాధించాడు అనేది ట్రైలర్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. హీరో కికు యనమల తన ఓవరాల్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.
నటీనటులు - కికు యనమల, కశిష్ ఖాన్, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, తదితరులు
టెక్నికల్ టీమ్
డీవోపీ - రామకృష్ణ
మ్యూజిక్ - శేఖర్ చంద్ర
ఎడిటింగ్ - ఛోటా కె ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - యష్ మిట్టల్
కొరియోగ్రఫీ - గోవింద్, శుభ సాయి వెంకట్
పీఆర్ఓ - సురేష్ (ఎస్ కే మీడియా)
ప్రొడ్యూసర్- దీప్తి నడిమింటి
స్క్రిప్ట్, డైరెక్షన్- శుభా సాయి వెంకట్


Post a Comment