Naga Vamsi Launches 'Elage Pilla' Song from Anakapalli

 ప్రముఖ నిర్మాత నాగవంశీ గారి చేతుల మీదుగా ‘అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్.. ఆగస్ట్ 7న గ్రాండ్‌గా సినిమా విడుదల



భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కి ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌ను, పాటల్ని రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.

తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘ఎలగే పిల్ల’ అనే పాటను రిలీజ్ చేసి, చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. పాట క్యాచీగా ఉందని, లిరికల్ వీడియోలో విజువల్స్, హీరో వేసిన స్టెప్పులు బాగున్నాయని చిత్రయూనిట్‌ను ప్రశంసించారు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించాలని ఆయన కోరుకున్నారు.

తాజాగా ‘అనకాపల్లి’ నుంచి ఓ రొమాంటిక్, ఫీల్ గుడ్ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘ఎలగే పిల్ల’ అంటూ సాగే ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. కపిల్ కపిలాన్, దేవజండ్ గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. కొరియోగ్రాఫీ కూడా చాలా అందంగా ఉంది. సింపుల్ స్టెప్పుల్ని హీరో విక్రమ్ సహిదేవ్ చాలా గ్రేస్‌తో వేసినట్టుగా లిరికల్ వీడియోని చూస్తే అర్థం అవుతోంది. ఇక రీల్స్‌లో ఈ హుక్ స్టెప్పులు ఎక్కువగా వైరల్ అయ్యేలా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ‘అమ్మోరు దిగినాది’, ‘లబ్బరు బొమ్మ’ పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ లవ్ సాంగ్ కూడా ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు.

తారాగణం : విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్

నిర్మాతలు: కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన

సహ నిర్మాత: కాండ్రేగుల కుమార్ రాజా

కథ & స్క్రీన్‌ప్లే: త్రినాధరావు నక్కిన

దర్శకుడు: ఖగేష్ తమ్మినేని

డీ ఓ పి : మాయా. వి

సంగీతం: దేవ్ జండ్

ఎడిటర్: శ్రీకృష్ణ అట్టలూరి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సెట్రామరాజు మల్లెల

సంభాషణలు: ఉదయ్ భాగవతుల

ప్రొడక్షన్ డిజైనర్: రఘు కులకర్ణి

కొరియోగ్రఫీ: శేఖర్ VJ, యష్ మాస్టర్, జిత్తు మాస్టర్

కాస్ట్యూమ్ డిజైనర్: సూర్య కొయ్య

సాహిత్యం: అనంత శ్రీరామ్, కెకె, గణేష్ సలాది, రాంబాబు గోశాల, తేజ గొర్లె

అదనపు పాటలు: వి.కిరణ్ కుమార

కో-డైరెక్టర్: రమేష్ బాబు యేపాటి

సౌండ్ ఎఫెక్ట్స్: హేమంత్

డి ఐ : రెడ్ ఓచర్

రంగు: ఎం. రాజు రెడ్డి

లైన్ ప్రొడ్యూసర్: NVSS సురేష్

ప్రొడక్షన్ కంట్రోలర్: చందు దేశెట్టి

పీ అర్ ఓ : సాయి సతీష్

మార్కెటింగ్: స్టార్ సర్కిల్


Post a Comment

Previous Post Next Post