‘Makutam’ Teaser: Vishal Impresses in Three Distinct Avatars

 విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మకుటం’.. యాక్షన్ మోడ్‌లో అదిరిన టీజర్‌



'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్‌లోనే ‘మకుటం’ ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలబోతోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ‘మకుటం’ రూపుదిద్దుకుంటోంది. స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం రాబోతోంది. రవి అరసు అందించిన కథ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ అన్నింటికీ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఈ రోజు (జూన్ 11) మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.

మండుతున్న శవం.. అందులోంచి సిగరెట్ వెలిగించుకుంటూ ఇచ్చిన హీరో ఎంట్రీ అదిరిపోయింది. ఇక ఇందులో అంజలి మాస్ యాక్షన్‌ను చూడొచ్చు. అంజలి ఓ కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఇక విశాల్ అయితే మూడు డిఫరెంట్ గెటప్స్‌లో తన విశ్వరూపం చూపించారు. ఈ టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి. ఇదొక యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని టీజర్‌ని చూస్తేనే తెలుస్తోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ అద్భుతమైన పనితీరుని కనబర్చారని టీజర్ స్పష్టంగా చెబుతోంది.


స్టైలిష్, విజువల్ ట్రీట్‌లా విశాల్ ఈ మూవీని తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం నాథన్, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం కానున్నాయి. ఈ సినిమాకి ఎడిటర్‌గా ఎన్.బి. శ్రీకాంత్, జి. దురైరాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు.


మొత్తం మీద ఈ టీజర్‌ ఒక్కసారిగా ‘మకుటం’పై భారీ అంచనాల్ని పెంచేసింది. విశాల్ త్రిపాత్రాభినయం, స్టైలిష్ దర్శకత్వం, ఆకట్టుకునే సాంకేతిక నైపుణ్యం, ఆసక్తికరమైన కథనం అన్నీ కలిసి ఈ చిత్రాన్ని అతని కెరీర్‌లోనే క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలబెట్టాయి. 'మకుటం' జూలైలో విడుదల కానుంది.


 తారాగణం : విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు


 సాంకేతిక సిబ్బంది: 


నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ ఫిల్మ్స్

నిర్మాత: ఆర్.బి. చౌదరి

దర్శకుడు: విశాల్

కథ: రవి అరసు

సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్

ఎడిటర్: ఎన్.బి. శ్రీకాంత్

కళా దర్శకుడు: జి. దురైరాజ్

కాస్ట్యూమ్ డిజైనర్: వాసుకి భాస్కర్

పి.ఆర్.ఓ: సాయి సతీష్ 



Post a Comment

Previous Post Next Post