కంప్లీట్ రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్ టైనర్ "లవ్ జాతర" నుంచి యంగ్ టాలెంటెడ్ హీరో అంకిత్ కొయ్య బర్త్ డే పోస్టర్ రిలీజ్
అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా యూజీ ప్రొడక్షన్ బ్యానర్ లో "సమ్మతమే" ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా "లవ్ జాతర". ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. కంప్లీట్ రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్ టైనర్ గా "లవ్ జాతర" సినిమా తెరకెక్కుతోంది.
ఈ రోజు యంగ్ టాలెంటెడ్ హీరో అంకిత్ కొయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ "లవ్ జాతర" సినిమా నుంచి మేకర్స్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ బర్త్ డే పోస్టర్ లో అంకిత్ కొయ్య కొత్త హెయిర్ స్టైల్ తో క్యాజువల్ వేర్ లో క్యూరియస్ గా చూస్తూ కనిపిస్తున్నారు. ఆయన ఈ సినిమాలో త్రివిక్రమ్ అనే క్యారెక్టర్ లో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించనున్నారు.
"లవ్ జాతర" చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తుండగా..సుజాత సిద్ధార్థ్ డీవోపీగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే మేకర్స్ ఇవ్వబోతున్నారు.
నటీనటులు - అంకిత్ కొయ్య, మానస చౌదరి, తదితరులు
టెక్నికల్ టీమ్
డీవోపీ - సుజాత సిద్ధార్థ్
మ్యూజిక్ - చేతన్ భరద్వాజ్
బ్యానర్ - యూజీ ప్రొడక్షన్స్
పీఆర్ఓ - సురేష్ (ఎస్ కె మీడియా)
మార్కెటింగ్ - హౌస్ ఫుల్
ప్రొడ్యూసర్ - కంకణాల ప్రవీణ
రచన , దర్శకత్వం - గోపీనాథ్ రెడ్డి


Post a Comment