కపుల్ ఫ్రెండ్లీ" మూవీపై స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసలు
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన "కపుల్ ఫ్రెండ్లీ" మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. "కపుల్ ఫ్రెండ్లీ" సినిమాకు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నారని, ఇది మనసుకు హత్తుకునే ప్రేమ కథా చిత్రమని తన పోస్ట్ లో సిద్ధు పేర్కొన్నారు. హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మానస వారణాసితో పాటు ఇతర టీమ్ మెంబర్స్ అందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు.
కపుల్ ఫ్రెండ్లీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ రూపొందించారు. "కపుల్ ఫ్రెండ్లీ" సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేశారు. "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తోంది. 2 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ 3.96 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం.


Post a Comment