Seetha Payanam Collected 8.7Crs Gross in 4days

 నాలుగు రోజుల్లో 8.7 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ ‘సీతా పయనం’

యాక్షన్ కింగ్ అర్జున్ గత వారం ‘సీతా పయనం’ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అర్జున్ తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో తెరకెక్కించిన ‘సీతా పయనం’తో తన కూతురు ఐశ్వర్య అర్జున్, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్‌ని తెరకు పరిచయం చేశారు. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ సినిమాని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయగా మంచి ప్రశంసల్ని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీకి మంచి వసూళ్లు వస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది.

అర్జున్ రాసుకున్న కథ, తెరకెక్కించిన విధానం, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, ఐశ్వర్య అర్జున్ నటన ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక మరీ ముఖ్యంగా అనూప్ రూబెన్స్ అందించిన పాటలు, ఇచ్చిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. మంచి మౌత్ టాక్‌తో ఈ సినిమాకి రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి.

నాలుగు రోజుల్లో ఈ మూవీకి 8.7 కోట్ల గ్రాస్ వచ్చిందని మేకర్స్ ప్రకటించారు. గత వారం విడుదలైన చిత్రాల్లో ‘సీతా పయనం’ టాప్‌లో ఉందని చెప్పుకోవచ్చు. ఆడియెన్స్ ఆదరణతో ఈ మూవీ రెండో వారం కూడా దూసుకుపోయేలా ఉంది. ఐశ్వర్య డెబ్యూ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టుతోందని అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీలో అర్జున్, ధృవ్ సర్జాలు సైతం స్పెషల్ కేమియో రోల్స్‌ను పోషించడం ప్లస్ అయిన సంగతి తెలిసిందే.

Post a Comment

Previous Post Next Post