రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘వాట్స్ అప్ నరేష్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
యూత్ ఫుల్, కామెడీ, లవ్ ఎంటర్టైనర్ చిత్రాలు ఇప్పుడు థియేటర్లో ఎక్కువగా విజయాన్ని సాధిస్తున్నాయి. యూత్‌ని టార్గెట్ చేసే చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉన్న క్రమంలో తాజాగా అలాంటి ఓ చిత్రమే రూపుదిద్దుకుంటోంది. 'బలగం' తర్వాత కావ్య కళ్యాణ్‌రామ్..'కొత్తపోరడు' తర్వాత అన్వేష్ మైఖేల్ జంటగా రాబోతోన్న చిత్రం ‘వాట్స్ అప్ నరేష్’. సివివి సినిమా బ్యానర్ మీద భాగ్యలక్ష్మీ చింత నిర్మించిన ఈ చిత్రానికి సివి విశాల్ దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్, లవ్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు.
‘వాట్స్ అప్ నరేష్’ గ్లింప్స్‌ని గమనిస్తే నరేష్ పాత్రలో అన్వేష్ మైఖేల్ చిల్ గాయ్‌లా కనిపిస్తున్నాడు. ఎనిమిది కోట్లు కట్నం ఇస్తే ఎన్ని కాలాలు అయినా వెయిట్ చేస్తా అనే డైలాగ్‌తో అతని పాత్రని పరిచయం చేశాడు. ఇక సాఫ్ట్ వేర్ లైఫ్, ప్రేమ, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల అంశాల్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ఇక చివర్లో సింపుల్‌గా హాయ్ అంటూ హీరో, హీరోయిన్ల పాత్రల పరిచయం కూడా కొత్తగా, ఫ్రెష్‌గా అనిపిస్తోంది. ఇక గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన 'లోకం తీరింతే.. నువ్వే మారాలంతే.. లొల్లె ఒద్దంటే.. తెలివిని కప్పెట్టంతే' అనే లిరిక్స్ సినిమా కథని, హీరో పాత్రను తెలియజేసేలా ఉన్నాయి.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. విప్లవ్ నైషదం ఎడిటర్‌గా పని చేస్తున్నారు. వేదరామన్ శంకరన్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రేమికుల రోజున ఈ మూవీకి సంబంధించిన రెండో గ్లింప్స్‌ని రిలీజ్ చేయబోతోన్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్‌లతో చిత్రయూనిట్ ఆకట్టుకోనుంది.
తారాగణం : అన్వేష్ మైఖేల్, కావ్య కళ్యాణ్‌రామ్, కె సాయి సంతోష్, ఉషశ్రీ మురళి, సంతోష్ నందివాడ, ప్రియాంక రవిరు, మధు, పద్మ, బొమ్మకంటి రవీందర్, సునందన, మాల పార్వతి, కిరణ్ కుమార్ తదితరులు.
సాంకేతిక బృందం
బ్యానర్ : సివివి సినిమా
నిర్మాత: భాగ్య లక్ష్మి చింత
రచన & దర్శకత్వం: సివి విశాల్
DOP: వేదరామన్ శంకరన్
సంగీతం: స్మరణ్ సాయి
ఎడిటర్: విప్లవ్ నైషదం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణకాంత్ మామిడాల
సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్లపల్లి, గుణ వి బాలు
సింక్ సౌండ్ రికార్డిస్ట్ : భువనగిరి హేమ
ప్రొడక్షన్ డిజైన్: భరత్ చంద్ర మల్కేద్కర్
ఆర్ట్ డైరెక్టర్: సంగెం నిఖిల్ హాసన్
కాస్ట్యూమ్ డిజైనర్: నిఖితా బచల
రంగు: వెంకట్ పి
DI: కెమిలియన్ పోస్ట్
ప్రొడక్షన్ బ్యానర్: సివివి సినిమా
ప్రొడక్షన్ కంట్రోలర్: ఉబా ప్రసాద్
లైన్ ప్రొడ్యూసర్: వంశీ కృష్ణ
PRO: సాయి సతీష్


Post a Comment