Group Landmark Expands Stronger in Hyderabad with Two New Kia Workshops

హైద‌రాబాద్‌లో మ‌రింత‌గా విస్త‌రిస్తున్న గ్రూప్ ల్యాండ్ మార్క్

• గ్రూప్ ల్యాండ్ మార్క్ ఆధ్వ‌ర్యంలో రెండు కియా ఆథ‌రైజ్డ్ వ‌ర్క్‌ షాపులు. ఇప్ప‌టికే అత్తాపూర్‌లో ఒక‌టి, త్వ‌ర‌లో మేడిప‌ల్లిలో మ‌రొక‌టి

• కియా, మ‌హీంద్రా, మెర్సిడిస్-బెంజ్‌ల‌కు 11 స‌ర్వీసు సెంట‌ర్ల‌తో తెలంగాణ‌లో మల్టీబ్రాండ్, ఇంటిగ్రేటెడ్ గుర్తింపు

• విస్త‌ర‌ణ‌కు కీల‌క కేంద్రంగా హైద‌రాబాద్‌; ప్రీమియం, మెయిన్ స్ట్రీమ్ వాహ‌నాల సెగ్మెంటులో పెరుగుతున్న క‌స్ట‌మ‌ర్ల డిమాండ్ 

హైదరాబాద్, ఆగ‌స్టు 2, 2025: హైదరాబాద్ న‌గ‌రంలో రెండు కియా ఆథ‌రైజ్డ్ షోరూంలతో గ్రూప్ ల్యాండ్ మార్క్ తెలంగాణ‌లో త‌న ఉనికిని బ‌లోపేతం చేసుకుంటోంది. ఇప్ప‌టికే అత్తాపూర్‌లో ఒక‌టి ప‌నిచేస్తుండ‌గా త్వ‌ర‌లో మేడిప‌ల్లిలో మ‌రొక‌టి రాబోతోంది. అంద‌రికీ అందుబాటులో స‌ర్వీసింగ్ ఉండేలా అత్యాధునిక స‌దుపాయాల‌తో, మౌలిక వ‌స‌తుల‌తో, వేగంగా స్పందిస్తూ, కియాలో శిక్ష‌ణ పొందిన నిపుణుల‌తో సేవ‌లు అందిస్తున్నారు. దీనివ‌ల్ల హైద‌రాబాద్‌లో కియా, మ‌హీంద్రా, మెర్సిడిస్ బెంజ్ కార్ల‌కు స‌ర్వీసింగ్ విష‌యంలో గ్రూప్ ల్యాండ్ మార్క్ ఉనికి బ‌ల‌ప‌డింది. 

అత్తాపూర్‌లో కొత్త‌గా ప్రారంభించిన కియా వ‌ర్క్ షాప్‌లో పూర్తిస్థాయిలో 24 బేలు ఉన్నాయి. వీటిలో మెకానిక‌ల్, బాడీ షాప్ కార్య‌క‌లాపాలు అన్నీ చేస్తారు. నెల‌కు 1500 వాహ‌నాల స‌ర్వీసింగ్ చేయ‌గ‌ల సామ‌ర్థ్యం ఉంది. వేగం, సామ‌ర్థ్యాలు ఉండేలా డిజైన్ చేసిన ఈ కియా ఆథ‌రైజ్డ్ వ‌ర్క్ షాప్‌లో ఒక ఎక్స్‌ప్రెస్ స‌ర్వీస్ సెట‌ప్‌, ప్ర‌త్యేకంగా య‌జ‌మానుల కోసం లాంజ్‌, అందులో ఉచిత వై-ఫై, ఇత‌ర స‌దుపాయాలు, పిక‌ప్, డ్రాప్ ఆప్ష‌న్లు కూడా ఉన్నాయి. ఉప్ప‌ల్ ప్రాంతంలోని మేడిప‌ల్లిలో కొత్త‌గా రాబోయే స‌ర్వీస్ సెంట‌ర్ హైద‌రాబాద్ తూర్పు కారిడార్‌ను క‌వ‌ర్ చేస్తుంది. దీనివ‌ల్ల స‌ర్వీసింగ్ వేగ‌వంతం అవుతుంది. ఈ రెండు కేంద్రాలు క‌లిపి న‌గ‌ర కార్ల య‌జ‌మానుల స‌మ‌యాన్ని ఆదా చేస్తాయి, పార‌ద‌ర్శ‌క‌త‌, బ్రాండ్ విశ్వ‌స‌నీయ‌త‌తో స‌ర్వీసింగ్ వారికి ల‌భిస్తాయి. 

ఈ సంద‌ర్భంగా గ్రూప్ ల్యాండ్ మార్క్ వ్య‌వ‌స్థాప‌కుడు, ఛైర్మ‌న్ సంజ‌య్ ఠ‌క్క‌ర్ మాట్లాడుతూ, “మా ప్ర‌యాణంలో హైద‌రాబాద్ చాలా ముఖ్య‌మైన అధ్యాయం. ఇది కేవ‌లం మార్కెట్ కాదు. న‌మ్మ‌క‌మైన స‌ర్వీస్‌, నిరంత‌ర మ‌ద్ద‌తుకు విలువ‌నిచ్చే ప్రాంత‌మిది. కేవ‌లం ఏడాదిలోనే మేం కియా, మ‌హీంద్రా, మెర్సిడిస్ బెంజ్ కంపెనీల‌వి 11 ట‌చ్‌పాయింట్లు ఏర్పాటుచేశాం. ఈ ప్రాంతానికి సేవ చేయ‌డంలో మా నిబ‌ద్ధ‌త‌ను ఇది చూపుతుంది. ఇప్పుడు కొత్త‌గా కియా వ‌ర్క్‌షాపుల‌తో కేవ‌లం స‌దుపాయాలే కాక సామీప్య‌త‌, వేగంగా అందించ‌డం, ప్ర‌తిరోజూ సౌల‌భ్యం అన్నింటిపైనా పెట్టుబ‌డి పెడుతున్నాం. క్షేత్ర‌స్థాయిలో మేం సాధించిన న‌మ్మ‌కం ఆధారంగానే గ్రూప్ ల్యాండ్ మార్క్ వృద్ధి చెందుతోంది” అని చెప్పారు. 

హైద‌రాబాద్‌లో గ్రూప్ ల్యాండ్ మార్క్ స‌ర్వీసింగుకే ప‌రిమితం కాలేదు. ఈ న‌గ‌రాన్ని వ్యూహాత్మ‌క వృద్ధి కేంద్రంగా చూస్తోంది. డిమాండు నిరంత‌రం పెర‌గ‌డం, ప్రీమియం సామ‌ర్థ్యాన్ని ఎవ‌రూ చేరుకోక‌పోవ‌డం ఇక్క‌డ క‌నిపిస్తున్నాయి. బోయిన్‌ప‌ల్లి, మేడిప‌ల్లిలో రెండు కియా షోరూంలు ఉండ‌డంతో షోరూం నుంచి స‌ర్వీసింగ్‌కు క‌నెక్టెడ్ అనుభ‌వాన్ని ఈ బ్రాండ్ అందిస్తోంది. ఇక భార‌త‌దేశంలోనే అతిపెద్దదైన మ‌హీంద్రా ఆథ‌రైజ్డ్ వ‌ర్క్‌షాప్ వ‌ట్టినాగుల‌ప‌ల్లిలోని క్యూసిటీలో ఉంది. మెకానిక‌ల్, బాడీ షాప్, ఈవీ స‌ర్వీసింగ్ లాంటి స‌దుపాయాల‌తో ఇక్క‌డ 38 బేలు ఉన్నాయి. క‌స్ట‌మ‌ర్ల‌కు ఇన్ఫోటైన్‌మెంట్ లాంజ్‌, ఉచిత వై-ఫై, పిక‌ప్, డ్రాప్ స‌దుపాయాలు క‌ల్పిస్తున్నాము. 

ఇక ల‌గ్జ‌రీ సెగ్మెంటు విష‌యానికొస్తే, మెర్సిడెస్-బెంజ్ స‌ర్వీసింగ్ సెంట‌ర్ ద్వారా అమ్మ‌కాల అనంత‌ర స‌ర్వీసింగ్ సేవ‌ల‌ను య‌జ‌మానుల‌కు అందిస్తూ గ్రూప్ త‌న సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఈ ట‌చ్ పాయింట్లు అన్నీ క‌లిపి ల్యాండ్ మార్క్ వారి స‌మీకృత‌, మ‌ల్టీబ్రాండ్ ఉనికిని మ‌రింత బ‌లోపేతం చేస్తున్నాయి.    

Post a Comment

Previous Post Next Post