Home Town Web Series Preview – A Nostalgic Journey on Aha

 

Home Town, an Aha web series starring Rajiv Kanakala, Jhansi, and Prajwal Yadma, takes viewers on an emotional journey back to their roots. Streaming from April 4th.


'హోం టౌన్' వెబ్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - స్పెషల్ ప్రివ్యూ షో ఈవెంట్ లో నటుడు రాజీవ్ కనకాల


ఆహా సబ్ స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. ఈ నెల 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు మీడియా మిత్రులకు 'హోం టౌన్' వెబ్ సిరీస్ స్పెషల్ ప్రివ్యూ ప్రదర్శించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో

నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ - 'హోం టౌన్' వెబ్ సిరీస్ లో నటించే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నా. ఈ సిరీస్ ను బిగ్ స్క్రీన్ మీద మీతో పాటే నేనూ చూస్తున్నా. మిగతా ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ ప్రివ్యూ చూసిన వారిలో కొందరికి తమ సొంత ఊరు, మరికొందరికి తమ గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఉంటాయి. ఈ సిరీస్ లో పిల్లల అల్లరి చూస్తుంటే 35 ఏళ్లు వెనక్కి వెళ్లిన ఫీలింగ్ కలిగింది. నవీన్ మేడారం గారు 'హోం టౌన్' వెబ్ సిరీస్ కు బ్యాక్ బోన్ గా ఉండి నడిపించారు. అలాగే మా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి పల్లె అందరికీ కనెక్ట్ అయ్యేలా సిరీస్ రూపొందించారు. టెక్నికల్ సైడ్ మంచి క్వాలిటీతో ఈ సిరీస్ తెరకెక్కింది. నాతో పాటు కలిసి నటించిన ఝాన్సీ గారికి ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నిర్మాత నవీన్ మేడారం మాట్లాడుతూ- 90's ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ తర్వాత మా సంస్థలో చేసిన వెబ్ సిరీస్ 'హోం టౌన్'. 90's ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లో ఆ ముగ్గురు పిల్లలు ఓవర్ నైట్ స్టార్స్ ఎలా అయ్యారో 'హోం టౌన్' సిరీస్ రిలీజ్ తర్వాత కూడా ఇక్కడున్న ఈ ముగ్గురు పిల్లలకు కూడా అలాంటి గుర్తింపు వస్తుంది. ఈ సిరీస్ ను చేసే అవకాశం ఇచ్చిన ఆహా ఓటీటీకి థ్యాంక్స్. 'హోం టౌన్' ప్రొడ్యూస్ చేయడంలో దేవ్ దీప్ గాంధీ కుండు సినిమాటోగ్రాఫీ, సురేష్ బొబ్బిలి మ్యూజిక్..ఇలా నా టెక్నికల్ టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. 'హోం టౌన్' మా ఎంఎన్ ఓపీ బ్యానర్ కు మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి పల్లే మాట్లాడుతూ - మనలో చాలా మంది ఊరి నుంచి సిటీకి వచ్చిన వాళ్లమే. విదేశాలకు వెళ్లినా మనకంటూ ఓ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అదే మన సొంతూరు. సొంతూరుతో ముడపడిన జ్ఞాపకాలను మర్చిపోలేం. అలాంటి ఎమోషన్స్ అన్నీ 'హోం టౌన్' వెబ్ సిరీస్ లో మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. చివరి ఎపిసోడ్ మాత్రం మిస్ కావొద్దు. ఈ సిరీస్ చేసే అవకాశం ఇచ్చిన నా ప్రొడ్యూసర్ నవీన్ గారికి, ఆహాకు థ్యాంక్స్ చెబుతున్నా. మొదటి రోజు నుంచే నన్ను రాజీవ్ కనకాల గారు సపోర్ట్ చేశారు. ప్రజ్వల్ నటుడిగానే కాదు రైటింగ్ సైడ్ కూడా అసిస్ట్ చేశాడు. ప్రతి ఆర్టిస్ట్ తమ బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ అన్నకు, మిగతా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ - 'హోం టౌన్' వెబ్ సిరీస్ ఈవెంట్ కు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్. ఈ సిరీస్ కు వర్క్ చేయడం హ్యాపీగా అనిపించింది. డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డిని చూస్తే సందీప్ రెడ్డి వంగాలా అనిపించారు. చివరి ఎపిసోడ్ లో ఎన్నో ట్విస్ట్స్ ఉంటాయి. మిస్ కాకుండా చూడండి. అన్నారు.

యాక్టర్ ప్రజ్వల్ యాద్మ మాట్లాడుతూ - 'హోం టౌన్' వెబ్ సిరీస్ లో నటించే అవకాశం కల్పించిన నవీన్ మేడారం గారికి ఆహాకు థ్యాంక్స్. డైరెక్టర్ శ్రీకాంత్ గారు నేను కొత్త యాక్టర్ అని చూడకుండా ఆడిషన్ చూసి అవకాశం ఇచ్చారు. ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నా. రాజీవ్ కనకాల గారు మమమ్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. మమ్మల్ని ఈ వెబ్ సిరీస్ లో చూస్తే మన ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ మీకు గుర్తొస్తాయి. ఝాన్సీ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. 90's ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ కు వచ్చిన గుర్తింపు మాలాంటి కొత్త నటీనటుల్లో ఎంతో నమ్మకాన్ని తీసుకొచ్చింది. ఒక వెబ్ సిరీస్ తో కూడా సినిమా కంటే ఎక్కువగా పేరు తెచ్చుకోవచ్చనే ఆశ కలిగించింది. ఆ సిరీస్ చేసిన సంస్థలో నాకు అవకాశం వచ్చింది, 'హోం టౌన్' సిరీస్ మా అందరికీ మంచి గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.

యాక్టర్ సాయిరామ్ మాట్లాడుతూ - 90's ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ తర్వాత మా అందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అదే సంస్థలో 'హోం టౌన్' సిరీస్ చేసే అవకాశం వచ్చింది. ఈ సిరీస్ తో నాకు ఎన్నో మంచి మెమొరీస్ దక్కాయి. రాజీవ్ గారితో నాకు ఎక్కువగా సీన్స్ లేవు గానీ సెట్ లో బాగా ఎంజాయ్ చేశాం. ప్రజ్వల్, ఆనీ, అనిరుధ్...ఇలా మా గ్యాంగ్ అంతా మిమ్మల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఆహాలో 'హోం టౌన్' తప్పకుండా చూడండి. అన్నారు.

యాక్టర్ అనిరుధ్ మాట్లాడుతూ - 'హోం టౌన్' వెబ్ సిరీస్ కు రాజీవ్ గారి తర్వాత సెలెక్ట్ అయ్యింది నేనే. ఈ సిరీస్ లో శాస్త్రి అనే క్యారెక్టర్ లో నటించాను. డైరెక్టర్ శ్రీకాంత్ గారు నన్ను చూడగానే నా కథలో శాస్త్రి క్యారెక్టర్ నువ్వేరా అని వెంటనే కన్ఫర్మ్ చేశారు. చెడు చూడకు, మాట్లాడకు, వినకు అనే మూడు కోతుల్లా ప్రజ్వల్, సాయిరామ్ నా క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ సిరీస్ తో మా అందరికీ మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

యాక్ట్రెస్ అనీ మాట్లాడుతూ - 'హోం టౌన్' వెబ్ సిరీస్ లో ఆఫర్ వచ్చినప్పుడు ఈ సిరీస్ తప్పకుండా బాగుంటుంది. నా కెరీర్ కు మంచి ప్రాజెక్ట్ అవుతుందని అనిపించింది. సెట్ లో మాకు డైరెక్టర్ శ్రీకాంత్ గారు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేయించారు. అందుకే సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. రాజీవ్, ఝాన్సీ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. చివరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో అనే సస్పెన్స్ నేను కూడా ఫీల్ అవుతున్నా. మీతో పాటు నేనూ ఆహాలోనే ఆ ఎపిసోడ్ చూడాలి. ప్రజ్వల్, సాయిరామ్, అనిరుధ్ క్యారెక్టర్స్ హిలేరియస్ గా ఉంటాయి. మీరంతా మా 'హోం టౌన్' సిరీస్ ను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్ట్రెస్ శ్రావ్య మాట్లాడుతూ - ఈ బ్యానర్ లో గతంలో 90's ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటించాను. ఇప్పుడు 'హోం టౌన్' సిరీస్ చేశాను. ఈ వెబ్ సిరీస్ లో సమీర అనే క్యారెక్టర్ లో నటించాను. ఫస్ట్ టైమ్ నా కెరీర్ లో ఒక ముస్లిం క్యారెక్టర్ చేశాను. ఈ పాత్రలో బాగా నటించానంటే అందుకు మా డైరెక్టర్ శ్రీకాంత్ గారు ఇచ్చిన ఫ్రీడమ్ కారణం. 'హోం టౌన్' వెబ్ సిరీస్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.


Home Town web series, Rajiv Kanakala, Aha series, Srikanth Reddy Palle, Telugu web series, nostalgia, village life, family drama, streaming April 4th, Jhansi actress


Post a Comment

Previous Post Next Post