Director Venky Kudumula Interview About Robinhood

 'రాబిన్‌హుడ్' ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే ఫుల్ ఫన్ ఎంటర్‌టైనర్‌. నితిన్ అన్న, నా కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం వుంది: డైరెక్టర్ వెంకీ కుడుముల  

Robinhood is an upcoming Telugu heist comedy entertainer starring Nithiin and Srileela, directed by Venky Kudumula and produced by Mythri Movie Makers with a high budget. The film features veteran actor Rajendra Prasad in a key role and Australian cricketer David Warner in a special cameo. The promotional content has already generated massive buzz, with GV Prakash Kumar's songs becoming chartbusters.  Venky Kudumula initially planned a story for Chiranjeevi but later adapted the idea to suit Nithiin. He describes the protagonist as a manipulative character who relies more on mental strength than physical power. The film is packed with fun elements, making it a perfect family entertainer.  David Warner, a cricket star, was roped in for a cameo, which surprised the director. Warner, known for his fun personality on social media, confidently acted in the film. Rajendra Prasad plays a security agency owner who gets manipulated by the hero, leading to unexpected twists. Srileela’s role is humorous, portraying an overconfident intellectual.  Venky Kudumula, influenced by Trivikram Srinivas, aspires to create fantasy-based stories in the future and is keen on working with Chiranjeevi someday. The movie is scheduled for a March 28, 2024 release.


హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ కుడుముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

రాబిన్‌హుడ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?

-భీష్మ సినిమా తర్వాత చిరంజీవి గారి కోసం ఒక కథ అనుకున్నాను. ఆయనకి ఫస్ట్ ఐడియా చెప్తే చాలా ఎక్సైట్ అయ్యారు. నేను చిరంజీవి గారికి ఫ్యాన్ బాయ్ ని. చాలా అద్భుతంగా ఉండాలని స్టోరీ, స్క్రీన్ ప్లే డెవలప్మెంట్ కి చాలా సమయం తీసుకుని చేశాను, అయితే ఎక్కడో ఓ దగ్గర చిరంజీవి గారిని సాటిస్ఫై చేయలేకపోయాను. మేము అనుకున్నలాగా అది అవ్వలేదు. మరో కథతో వస్తానని చెప్పాను.

-తర్వాత నితిన్ అన్నని కలిశాను. నేను హీరోని బట్టి కథ రాస్తాను. రాబిన్‌హుడ్ ఐడియా ముందే వుంది. నితిన్ అన్నతో ఫిక్స్ అయ్యాక ఆయనకి తగ్గట్టుగా కథని మలిచాను.

భీష్మ తర్వాత నితిన్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

-భీష్మ సినిమాతో మా మధ్య కంఫర్టబుల్ జర్నీ వచ్చింది. నేను అంతకుముందే అ ఆ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాను. అప్పటినుంచి నితిన్ అన్నతో మంచి పరిచయం ఉంది. రాబిన్‌హుడ్ జర్నీ కూడా వండర్ఫుల్ గా జరిగింది.

ఇందులో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?

ఇందులో హీరో మాన్యుపులేటర్. ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ స్ట్రాంగ్ అని నమ్మే పర్సన్. సినిమాల్లో ఫస్ట్ 20 మినిట్స్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేయడానికి రకరకాల గెటప్స్ అలరిస్తాయి. 20 నిమిషాల తర్వాత కథ మారిపోతుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమానితిన్ గారి కెరీర్ లో, నా కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందని నమ్మకం ఉంది. సినిమా అంతా రెగ్యులర్ ఇంట్రవెల్స్ లో ఫన్ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ ఎంటర్టైనర్ ఇది.  

డేవిడ్ వార్నర్ పాత్ర గురించి ?

-ఇందులో ఒక క్యామియో రోల్ ఇంటర్నేషనల్ స్టార్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. నిర్మాతలు ఎవరని అడిగినప్పుడు డేవిడ్ వార్నర్ అని చెప్పాను. నాకు క్రికెట్ చాలా ఇష్టం. అలాగే డేవిడ్ వార్నర్ ఆట కూడా ఇష్టం. అయితే ఇది సాధ్యమవుతుందని అనుకోలేదు. నిర్మాత రవి గారు చాలా సీరియస్ గా ట్రై చేసి మీటింగ్ అరేంజ్ చేశారు. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను.వార్నర్ ని ఢిల్లీలో కలిసి ప్రజెంటేషన్ ఇచ్చాను. ఆయన కూడా చాలా ఎక్సైట్ అయ్యారు.

-వార్నర్ ఫ్యామిలీ మెన్. ఆయన పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి రీల్స్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. అది అలా కంటిన్యూ అయిందని చెప్పారు. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా యాక్ట్ చేశారు. ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ ఉండడం వల్లే రీల్స్ కూడా అంత అద్భుతంగా చేయగలిగారు.

రాజేంద్రప్రసాద్ గారి క్యారెక్టర్ గురించి?

-ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారిది చాలా ఇంపార్టెంట్ రోల్. ఆయన సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతుంటారు. ఆయన్ని హీరో మాన్యుపులేట్ చేసి ఓ సీరియస్ వరల్డ్ లోకి తీసుకెళ్తాడు. ఆయన అమాయకంగా అందులో ఇరుక్కుపోతాడు. ఈ క్యారెక్టర్ రాసినప్పుడు నుంచి ఆయనే కనిపించారు.

శ్రీలీలా క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?

-టాలెంట్ ఉండడం వేరు. టాలెంట్ ఉందని ఊహించుకోవడం వేరు. ఇందులో శ్రీలీల క్యారెక్టర్ రెండో టైపు(నవ్వుతూ) వెరీ ఇంటలెక్చువల్ అనుకునే అమ్మాయి. చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.

జీవి ప్రకాష్ మ్యూజిక్ గురించి?

-ఆయనతో వర్క్ చెయ్యాలని ఎప్పటినుంచో ఉంది. ఆయన కరెక్ట్ టైం కి మ్యూజిక్ డెలివరీ చేసే కంపోజర్. ఇప్పటికే పాటలు కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బిజిఎం కూడా ఎక్స్ట్రార్డినరీగా చేశారు. అది డా సర్ప్రైజ్ పాట కూడా కథలో భాగంగానే వస్తుంది.  

కేతిక శర్మ సెలక్షన్ ఎవరిది?

-ప్రొడ్యూసర్స్ మొదట పుష్ప సినిమాలో కేతికతో ఒక స్పెషల్ నెంబర్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు కుదరలేదు. ఈ సినిమాలో ఆ ఛాయిస్ ఉన్నప్పుడు కేతిక అయితే బాగుంటుందని అనుకుని ఈ సాంగ్ చేయించాం.  

సినిమా రిలీజ్ కి మీకు టైం దొరికింది కదా.. ఈ గ్యాప్ లో సినిమాని బెటర్ చేసే ప్రయత్నం చేశారా?

-ఖచ్చితంగా. మాకు చాలా టైం దొరికింది. క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్, క్వాలిటీ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ లో సినిమా చాలా బెటర్ ఐంది. మంచి క్వాలిటీతో సినిమా బయటికి వస్తుంది.

రాబిన్ హుడ్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?

-అవసరం వున్న వారికోసం నిలబడే హీరో రాబిన్ హుడ్. ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్. ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంటుంది.  

రాబిన్ హుడ్ యాక్షన్ గురించి?

రామ్ లక్ష్మణ్ మాస్టర్ తో ఎప్పటినుంచో పని చేయాలనుకుంటున్నాను. ఇందులో ఇంటర్వెల్ బ్లాక్ వాళ్ళే చేశారు విక్రమ్ మోర్ మాస్టర్. రియల్ సతీష్ గారు, రవి వర్మన్ మాస్టర్ కూడా యాక్షన్ డిజైన్ చేశారు. యాక్షన్ చాలా అద్భుతంగా వచ్చింది.

మైత్రి మూవీ మేకర్స్ గురించి?

-మైత్రి మూవీ మేకర్స్ ఒకసారి కథ ఓకే చేసిన తర్వాత ఇంక దేని గురించి ఆలోచించరు. వాళ్ళ సపోర్టు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మిస్తారు .

మీరు నితిన్ గారు చేసిన పాడుకాస్ట్ బాగా వైరల్ అయింది కదా అలాంటి సీక్వెన్స్ సినిమాలో పెడితే ఎలా ఉంటుంది?

-నిజానికి అది బయట చేశాం కాబట్టే బావుంది. సినిమాల్లో సిచువేషన్ లేకుండా పెడితే అది వర్కౌట్ అవ్వదు.

మీ డైలాగ్స్ లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుందని కామెంట్స్ వినిపిస్తుంటాయి.. మీరు ఎలా ఫీలవుతారు?

-అది నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఆయన్ని గురువు లాగా ఫీల్ అవుతాను. ఆయనతో ఒక సినిమాకు పని చేశాను. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.

మీకు ఎలాంటి జోనర్ సినిమా చేయాలని ఉంది?

-నాకు చందమామ కథలు అంటే చాలా ఇష్టం. ఒక ఫాంటసీ టచ్ ఉండే కథలు చేయాలని ఉంది.

చిరంజీవి గారితో సినిమా ఉంటుందా?

-డెఫినెట్ గా చిరంజీవి గారితో సినిమా చేస్తాను.

ఆల్ ది బెస్ట్

-థాంక్ యూ



Post a Comment

Previous Post Next Post