Viraj Reddy Cheelam Interview About Guard-Revenge for Love

 అన్ని రకాల అంశాలతో రాబోతోన్న ‘గార్డ్ - రివెంజ్ ఫర్ లవ్’ అందరినీ మెప్పించేలా ఉంటుంది.. నూతన హీరో విరాజ్ రెడ్డి చీలం

Guard - Revenge for Love, Viraj Reddy Cheelam, Anu Productions, Mimi Leonard, Shilpa Balakrishna, Jaga Peddi, Anasuya Reddy, Telugu movie, Australian backdrop, horror comedy, revenge drama, action, security guard life, Nizamabad, acting school, debut film, Telugu vibe, Australia shooting, horror genre, farmer teaser launch, post-production in India, Chinese-style fights, Indian-style music, multilingual release, OTT platforms, passion for cinema, independent release, newcomer auditions, Sri Lankan actress, Tamil-speaking, media support.

అను ప్రొడక్షన్స్‌లో విరాజ్ రెడ్డి చీలం కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘గార్డ్’. రివెంజ్ ఫర్ లవ్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయికలుగా నటించారు. జగ పెద్ది దర్శకత్వంలో అనసూయ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విరాజ్ రెడ్డి చీలం మీడియాతో ముచ్చటించారు. ఆయన ఏం చెప్పారంటే?

మాది నిజామాబాద్. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి సెటిల్ అయ్యాను. చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. అక్కడే యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లాను. ఈ మూవీ మొత్తాన్ని కూడా ఆస్ట్రేలియాలోనే షూట్ చేశాం. నేను అక్కడే ఉండే వాడ్ని కాబట్టి అక్కడ షూట్ చేశాం. కరోనా తరువాత ఈ మూవీని చేశాం. కొత్త వాళ్లే అయినా కూడా అంతా ట్రైనింగ్ తీసుకున్న యాక్టర్లతోనే ముందుకు వెళ్లాం.

ఆస్ట్రేలియాలో సినిమా తీశాం. కానీ స్టోరీ మాత్రం మనదే. తెలుగు వాళ్ల వైబ్ ఎలా ఉంటుందో సినిమా కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఆస్ట్రేలియా ఫ్లేవర్ ఉంటుంది. అక్కడి ఓ సెక్యురిటీ గార్డ్ లైఫ్ ఎలా ఉంటుందో చూపించాను. ఇక్కడ సెక్యురిటీ గార్డ్ లైఫ్ వేరేలా ఉంటుంది. కానీ ఆస్ట్రేలియాలో సెక్యురిటీ గార్డ్ అన్నా కూడా బీఎండబ్ల్యూ కూడా ఉంటుంది.

హారర్, యాక్షన్, కామెడీ, రివేంజ్ ఇలా అన్ని అంశాలతో ఈ మూవీని తీశాం. ముఖ్యంగా హారర్ కామెడీ, రివేంజ్ డ్రామా అని చెప్పొచ్చు. ఈ కథలో అన్ని రకాల అంశాలుంటాయి. పూర్తిగా హీరోయిజం చూపించే పాత్ర కాదు. కథకు తగ్గట్టుగా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించాల్సి ఉంటుంది. ఓ కొత్త హీరోకి ఇంత కంటే మంచి డెబ్యూ దొరకదు. టీజర్, ట్రైలర్ చూసిన వారంతా మెచ్చుకున్నారు.

గార్డ్ మూవీతో పాటుగా నాది ఇంకో మూవీ కూడా రెడీ అవుతోంది. డైరెక్టర్ జగ నాకు ముందు నుంచీ తెలుసు. హారర్ జానర్ అయితే కొత్త వాళ్లు అయినా కూడా జనాలకు ఎక్కువగా దగ్గర అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను కష్టపడి సంపాదించింది అంతా కూడా ఈ మూవీకే పెట్టాను. ఈ సినిమా తరువాత మళ్లీ జీరోతో ప్రారంభించాలి.

మా నాన్న రైతు. అందుకే ఫార్మర్‌తో టీజర్‌ను లాంచ్ చేయించాం. టీజర్, ట్రైలర్ ఈవెంట్లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ అంతా ఆస్ట్రేలియాలోనే జరిగింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ కూడా ఇండియాలోనే జరిగింది. ఫైట్స్ అన్నీ కూడా చైనీస్ స్టైల్లో ఉంటుంది. సౌండింగ్, మ్యూజిక్ అన్నీ కూడా ఇండియన్ స్టైల్లో ఉంటుంది.

 ప్రస్తుతం ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. కానీ ఓటీటీ కోసం అని ముందుగానే అన్ని భాషల్లో ఈ చిత్రం రెడీ చేసి పెట్టాను. ఒక వేళ సినిమాకు మంచి టాక్ వస్తే.. ఇతర భాషల్లో మూవీని రిలీజ్ చేస్తామని ఎవరైనా ముందుకు వస్తే కూడా ఇస్తాను.

 సినిమా అనేది వ్యాపారం. నా మూవీని ఎవ్వరూ సపోర్ట్ చేయకపోయినా.. నాకు నేనే రిలీజ్ చేసుకుంటాను అని ఈవెంట్లలో ఆల్రెడీ చెప్పాను. నాకు నేనుగా, నా ప్యాషన్‌తో ఇక్కడి వరకు వచ్చాను. సినిమాను కూడా నేనే రిలీజ్ చేసుకుంటాను.

అందరినీ ఆడిషన్స్ పెట్టి తీసుకున్నాం. హీరోయిన్ మిమీ లియానార్డ్ శ్రీలంకకు చెందిన వ్యక్తి. కానీ ఆమెకు తమిళం వచ్చు. తెలుగులోనూ డైలాగ్స్ చక్కగా చెప్పారు. ఆమె పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. కొత్త వాళ్లం అంతా కలిసి చేసిన ఈ చిత్రానికి మీడియా నుంచి సపోర్ట్ దక్కాలి.


Post a Comment

Previous Post Next Post