Naga Chaitanya Opens Up About ‘Thandel’: A Journey of Passion and Transformation

 ‘తండేల్’ నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ. ఆడియన్స్ కి సరికొత్త ఎమోషనల్ హై ఇస్తుంది. డెఫినెట్ గా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య

Naga Chaitanya, Thandel movie, Sai Pallavi, Chandoo Mondeti, Geetha Arts, Bunny Vasu, Allu Aravind, Telugu cinema, Tollywood, Thandel release date, Naga Chaitanya interview, Thandel story, Thandel cast, Devi Sri Prasad music, Thandel songs, Thandel trailer, Naga Chaitanya transformation, SriKakulam, real-life story, Telugu love story, survival drama, emotional high, Aamir Khan, Karthi, Thandel visuals, Virupaksha cinematographer, Thandel climax, National Awards, Telugu movie 2024.

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగచైతన్య విలేకరుల సమావేశంలో ‘తండేల్’ విశేషాలు పంచుకున్నారు.

‘తండేల్’ సినిమాపై ఆడియన్స్ లో చాలా అంచనాలు వున్నాయి. మీలో ఎలాంటి ఎక్సయిట్మెంట్ వుంది ?

- నా కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్, హై బడ్జెట్ మూవీ. క్యారెక్టర్, స్టొరీ అన్ని రకాలుగా బిగ్ స్పాన్ వున్న సినిమా ఇది. చాలా ఎక్సయిట్మెంట్ వుంది. ఆల్రెడీ సినిమా చూశాం. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. సెకండ్ హాఫ్ అయితే యునానిమాస్ గా చాలా బాగా చెప్పారు. నాకు కూడా ఎమోషనల్ హై ఇచ్చింది. చివరి ముఫ్ఫై నిమిషాలు వెరీ సాటిస్ఫాక్షన్. క్లైమాక్స్ గ్రేట్ ఎమోషనల్ హై ఇస్తుంది.

‘తండేల్’ కథ ఎలా వచ్చింది ?

దూత సమయంలో ఈ కథ విన్నాను. వాసు గారు గీత ఆర్ట్స్ లో ఈ కథని హోల్డ్ చేశారని తెలిసింది. డెవలప్ చేసి మంచి సేఫ్ వస్తే చెప్పమన్నాను. నేను మొదట విన్నప్పుడు ఒక డాక్యుమెంటరీ లా వుంది. సినిమాటిక్ లాంగ్వేజ్ లోకి తీసుకురావడానికి వర్క్ చేయాలి. అలా వర్క్ చేసిన తర్వాత అద్భుతంగా వచ్చింది.

శ్రీకాకుళం వెళ్లి అక్కడి వారిని కలవడం ఎలా అనిపించింది ?

-ఈ కథ మొదట ఓ ఐడియాగా చెప్పారు. పాత్రకు తగ్గట్టుగా మారాలంటే వాళ్ళ లైఫ్ స్టయిల్ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి వాళ్ళని నేరుగా కలవాలని వెళ్లాం. మొత్తం హోం వర్క్ చేశాక నేను చేయగలనని కన్వెన్స్ అయిన తర్వాత జర్నీ మొదలైయింది.

మీరు ఈ సినిమాకి ప్రాణం పెట్టి వర్క్ చేశారని బన్నీ వాసు గారు చెప్పారు. యాక్టర్ గా నెక్స్ట్ లెవల్ కి వెళ్తారని అంటున్నారు ?

-ప్రతి సినిమాతో ఇంకా బెటర్ అవ్వాలని ప్రతి యాక్టర్ కి వుంటుంది. అయితే ఈ కథ రియల్ లైఫ్ క్యారెక్టర్ దొరికింది కాబట్టి ఇంకా మోటివేట్ అయ్యాను. యాక్టర్ గా నెక్స్ట్ స్టెప్ వెళ్ళే అవకాశం ఈ సినిమాలో కనిపించింది. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్ ఫర్మేషన్ మీదే వున్నాను. శ్రీకాకుళం యాస గురించి ట్యూషన్ తీసుకున్నాను. యాస రియల్లీ ఛాలెజింగ్ గా అనిపించింది.  

రాజు పాత్రని ఎంచుకోవడానికి కారణం ?

నాకు ఎప్పటి నుంచో రియల్ లైఫ్ స్టొరీస్ ఆధారంగా సినిమా చేయాలని వుండేది. పైగా ఇది మన తెలుగోళ్ళ కథ. ఇది నాకు స్ఫూర్తిని ఇచ్చింది. రూటెడ్ గా వుండే కథలు చేయడానికి ఇష్టపడతాను.

డైరెక్టర్ చందూ గురించి ?

-చందుతో నాకు ఇది మూడో సినిమా. తనతో ట్రావెల్ అవ్వడం ఇష్టం. నన్ను కొత్తగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. నా కోసమే ఆలోచిస్తుంటాడు. ఈ సినిమా కమర్షియల్ గా తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు.

ఇందులో ప్రేమకథకి ఎంత స్కోప్ వుంటుంది ?

‘తండేల్’ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ. లవ్ స్టొరీ వెనుక మిగతా లేయర్స్ వుంటాయి.

‘తండేల్’ మీనింగ్ ఏమిటి ?

శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడ బోట్స్ ని లీజ్ కి తీసుకొని ఫిషింగ్ చేసుకొని అక్కడే అమ్మి తిరిగివస్తారు. ‘తండేల్’ అంటే లీడర్. ఇది గుజరాతీ వర్డ్. సినిమాని దాదాపు సముద్రంలో షూట్ చేశాం. రియల్ లొకేషన్ లో షూట్ చేయడం పెర్ఫార్మెన్స్ కి కూడా ప్లస్ అవుతుంది. జైల్ ఎపిసోడ్స్ చాలా ఎమోషనల్ గా వుంటాయి.

మళ్ళీ గీత ఆర్ట్స్ లో చేస్తున్నారు, 100 పెర్సెంట్ లవ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా ?

-అవుతుంది. ఒక యాక్టర్ గా మంచి దారి చూపిస్తుందని భావిస్తున్నాను. గీత ఆర్ట్స్ లో మళ్ళీ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. యాక్టర్ కి మంచి రిలీజ్ ఇస్తారు. వాళ్ళ ప్రోడక్ట్ బావుంటుంది. ఈ కథ గీత ఆర్ట్స్ దగ్గర వుండటం నాకు డబుల్ బొనంజా.  

సాయి పల్లవి గురించి ?

-పల్లవి ఫెంటాస్టిక్ యాక్టర్. పల్లవితో యాక్ట్ చేయడం ఇష్టం. తనలో మంచి పాజిటివ్ ఎనర్జీ వుంటుంది. క్యారెక్టర్ ని డీప్ గా అర్ధం చేసుకుంటుంది. ఒక ఆర్టిస్ట్ అలా వున్నప్పుడు మన పెర్ఫార్మెన్స్ కూడా ఎన్ హ్యాన్స్ అవుతుంది.

దేవిశ్రీ మ్యూజిక్ గురించి ?

-దేవి ఇచ్చిన బుజ్జితల్లి పాట సినిమాని గ్రౌండ్ లెవల్ లోకి తీసుకెళ్ళిపోయింది. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దేవితో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది. తనతో చేసిన ప్రతి సినిమా ఆడియో సూపర్ హిట్.  

లవ్ స్టొరీతో పాటు సర్వైవల్ డ్రామా చేయడం ఎలా అనిపించింది ?

-చాలా ఛాలెంజింగ్. ఇందులో ఒక లవ్ స్టొరీ వుంది. అలాగే మాస్ ఎలిమెంట్స్ కూడా వున్నాయి. చాలా ఇన్స్పిరింగ్ గా అనిపించింది. ప్రతి హానెస్ట్ లవ్ స్టొరీలో ఒక పెయిన్ వుంటుంది. ఇందులో ఆ పెయిన్ ని బాగా ప్రజెంట్ చేశాం. ఎమోషనల్ హై చాలా కొత్తగా వుంటుంది. ఒక యాక్టర్ గా చాలా తృప్తిని ఇచ్చిన సినిమా ఇది.

ఆమీర్ ఖాన్ గారి రియాక్షన్ ఏమిటి ?

-ఆమీర్ గారికి ట్రైలర్ చాలా నచ్చింది. 7న వాళ్ళ అబ్బాయి సినిమా రిలీజ్ వున్నప్పటికీ ట్రైలర్ నచ్చి ఈవెంట్ కి వచ్చారు. అలాగే కార్తి గారు కూడా కంటెంట్ నచ్చే వచ్చారు.

శామ్ దత్ విజువల్స్ గురించి ?

-బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారు. విరూపాక్ష చూసి ఆయనతో వర్క్ చేయాలని అనుకున్నాను. లక్కీగా కుదిరింది, నెక్స్ట్ సినిమా కూడా ఇదే టీంతో వర్క్ చేయాలని వుంది.

శివుని సాంగ్ గురించి ?

-సాయి పల్లవితో డ్యాన్స్ చేయాలంటే కష్టపడాలి.(నవ్వుతూ) అయితే చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. ఆ సాంగ్ థీమ్ కూడా శివ పార్వతుల లవ్ స్టొరీ మీద వుంటుంది. మా క్యారెక్టర్స్ కూడా సినిమాలో శివ పార్వతుల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. అందుకే ఆ సాంగ్ ఆ థీమ్ లో పెట్టారు.

రియల్ లైఫ్ కథలు చేసినప్పుడు అవార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువ వుంటుంది.. ఈ సినిమా విషయంలో మీ అంచనాలు ఎలా వున్నాయి ?

-నేను అవార్డ్స్ గురించి ఇంకా అలోచించలేదు. అయితే అరవింద్ గారు రిలీజ్ తర్వాత నేషనల్ అవార్డ్స్ కి పంపిస్తానని అన్నారు. నేను అయితే అంత వరకు అలోచించలేదు. ఆడియన్స్ ని అలరించడం నాకు మోస్ట్ ఇంపార్టెంట్. అరవింద్ గారితో నాకు చాలా మంచి బాండింగ్ వుంది. అరవింద్ గారు, వాసు, నేను ఎప్పటినుంచో ట్రావెల్ అవుతున్నాం.

తండేల్ ఎలాంటి జ్ఞాపకాల్ని ఇచ్చింది ?

-రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని కలిసినప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించింది. వాళ్లతో చాలా టైం స్పెండ్ చేశాను. వాళ్ళలో ఒక నిజాయితీ కనిపించింది. నిజాయితీ వున్నప్పుడు ఏదైనా సాధించగలం.

-షూటింగ్ సమయంలో చాలా విషయాలు జరిగాయి. ఒకసారి బోట్ కొలాప్స్ అయిపొయింది. కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసి కెమరామెన్ అందరినీ తీసుకెళ్ళారు. చాలా విషయాలు జరిగాయి.

రాజు క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ?

-రాజు ఫైటర్. జైల్లో వునప్పుడు బాధని ఓర్చుకొని తన వారికోసం ఎలా పోరాటం చేశాడు ఎలా బయటికి వచ్చాడనేది చాలా గొప్పగా వుంటుంది. తన ప్రేమకథే తనకి బలాన్ని ఇస్తుంది.  

ఆల్ ది బెస్ట్

-థాంక్ యూ

Post a Comment

Previous Post Next Post