JACK crackling and hilarious teaser unveiled

 స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ బర్త్ డే స్పెషల్ ట్రీట్‌గా ‘జాక్’ టీజర్.. ప్ర‌ముఖ నిర్మాత‌ బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాణంలో బొమ్మరిల్లు బాస్కర్ తెరకెక్కిస్తున్న వినోదాత్మక చిత్రం

Star boy Siddu Jonnalagadda Birthday Treat: Bommarillu Baskar and BVSN Prasad's "JACK," crackling and hilarious teaser unveiled  Star boy Siddu Jonnalagadda celebrating his birthday today and makers of his upcoming film "Jack - Konchem Krack" gave a solid treat with a crackling and kickass teaser. The film directed by Bommarillu Bhaskar is releasing worldwide on April 10th. The sensational combo of Siddu and Bhaskar explored a new genre and it is evident in the teaser.
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన రోజు (ఫిబ్రవరి 7) సందర్భంగా ‘జాక్ - కొంచెం క్రాక్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సిద్ధు బర్త్ డే స్పెషల్‌గా మేకర్లు జాక్ టీజర్‌‌ను విడుదల చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సిద్ద, భాస్కర్‌ కాంబోలో అదిరిపోయే ఓ వినోదాత్మక చిత్రం రాబోతోందనీ టీజర్ స్పష్టంగా చెబుతోంది.

టీజర్‌లో సీనియర్ నటుడు నరేష్, సిద్దు మధ్య వచ్చే తండ్రీ కొడుకులకు సంబంధించిన స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు న‌వ్వులు పంచుతాయ‌ని అర్థం అవుతుంది. ఇక హీరోల పాత్రలోని డిఫరెంట్ షేడ్స్ ఈ టీజర్‌లో చూపించాడు. అసలు హీరో ఏంటి? ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అతని లక్ష్యం ఏంటి? అతని గమ్యం ఏంటి? ఆ పోరాటాలు ఏంటి? ఈ ప్రేమ కథ ఏంటి? అని ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తేలా, సినిమా మీద ఆసక్తి పెంచేలా టీజర్‌ను కట్ చేశారు. సిద్దు నుంచి మరొక బ్లాక్ బస్టర్ రాబోతోందని ఈ టీజర్ చెప్పకనే చెబుతోంది. సిద్దు స్టైలీష్ లుక్స్, యాక్టింగ్‌కు మరోసారి ఆడియెన్స్ మెస్మరైజ్ కానున్నారు.

వైష్ణవి చైతన్య, సిద్దు జంట చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సారి తన శైలిని పూర్తిగా పక్కన పెట్టి ఏదో సందేశాన్ని ఇస్తూనే కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించారని అర్థం అవుతోంది. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అచ్చు రాజమణి స్వరాలు సమకుర్చారు.


Post a Comment

Previous Post Next Post