Thandel Third Single Hilesso Hilessa out on January 23rd

 అల్లు అరవింద్ ప్రెజెంట్స్, నాగ చైతన్య, సాయి పల్లవి, దేవి శ్రీ ప్రసాద్, చందూ మొండేటి, బన్నీ వాసు, గీతా ఆర్ట్స్ 'తండేల్' థర్డ్ సింగిల్ బ్లాక్ బస్టర్ లవ్ సాంగ్ హైలెస్సో హైలెస్సా జనవరి 23న రిలీజ్

Thandel, Thandel movie, Thandel third single, Hilesso Hilessa, Naga Chaitanya, Sai Pallavi, Rockstar DSP, Devi Sri Prasad, Shreya Ghoshal, Nakash Aziz, Chandoo Mondeti, Geetha Arts, Allu Aravind, Bunny Vas, Thandel songs, Thandel release date, Thandel on February 7, Telugu movies 2025.

యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'తండేల్'. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్లు బ్లాక్ బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ సింగిల్ "బుజ్జి తల్లి" సెన్సేషనల్ హిట్ అయింది. రీసెంట్ గా రిలీజైన సెకండ్ సింగిల్ "నమో నమః శివాయ" సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఈ రోజు థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'తండేల్' థర్డ్ సింగిల్ బ్లాక్ బస్టర్ లవ్ సాంగ్ హైలెస్సో హైలెస్సా జనవరి 23న రిలీజ్ కానుంది. సముద్ర తీరంలో రగ్గడ్ లుక్ లో లవ్లీ స్మైల్ తో నిలుచుకున్న నాగచైతన్య, ఎదురుగా బ్యూటీఫుల్ గా డ్యాన్స్ చేస్తూ సాయి పల్లవి కనిపించిన సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మూవీకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు, షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: చందూ మొండేటి

సమర్పణ: అల్లు అరవింద్

నిర్మాత: బన్నీ వాసు

బ్యానర్: గీతా ఆర్ట్స్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

డీవోపీ: షామ్‌దత్

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

Post a Comment

Previous Post Next Post