The Girlfriend Teaser to Release on December 9th

 ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా టీజర్ రిలీజ్



నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి  జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.


ఈ రోజు "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 9వ తేదీన టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వైవిధ్యమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ప్రస్తుతం చివరి దశ  షూటింగ్ లో ఉంది.  



నటీనటులు - రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు


టెక్నికల్ టీమ్


సినిమాటోగ్రఫీ - కృష్ణన్ వసంత్

సంగీతం - హేషమ్ అబ్దుల్ వాహబ్

కాస్ట్యూమ్స్ - శ్రావ్య వర్మ

ప్రొడక్షన్ డిజైన్ - ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి

పీఆర్ఓ - వంశీ కాక, జీఎస్ కే మీడియా(సురేష్- శ్రీనివాస్)

మార్కెటింగ్ - ఫస్ట్ షో

సమర్పణ - అల్లు అరవింద్

బ్యానర్స్ - గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్

నిర్మాతలు - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

రచన -దర్శకత్వం - రాహుల్ రవీంద్రన్

Post a Comment

Previous Post Next Post