చెన్న క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన చిత్రం "తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా" పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా, చిత్ర దర్శకుడు వెంకటేష్ వీరవరపు మీడియాతో మాట్లాడుతూ,
"AJ కథలు సంస్థ ద్వారా నాకు ఈ ప్రాజెక్ట్ చేసే అవకాశం వచ్చింది. జంధ్యాల గారు స్లాపిస్టిక్ కామెడీకి పునాది వేశారు. ఇప్పుడు, అదే స్ఫూర్తితో, స్లాపిస్టిక్ కామెడీని నేటి తరానికి అనువుగా తెరకెక్కిస్తున్నాం" అని విశ్వాసంగా తెలిపారు.
ఈ చిత్రం ప్రధాన పాత్రలో నటిస్తున్న నివాస్ కూడా మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. "AJ కథలు సంస్థ ద్వారా నాకు మెయిన్ లీడ్‌గా అవకాశం రావడం పెద్ద గౌరవం. వైజాగ్‌లో నా చదువులు పూర్తయ్యాక సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం నా కెరీర్‌లో గొప్ప ప్రారంభంగా భావిస్తున్నాను" అని పేర్కొన్నారు.
చిత్రం: తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా
దర్శకత్వం: వెంకటేష్ వీరవరపు
కథ: AJ కథలు
సంగీతం: అజయ్ పట్నాయక్
Post a Comment