Pushpa 2 Hyderabad Event Held Grandly by Shreyas Media



 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో  నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు 


మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు శ్రేయాస్ మీడియా టీమ్ ఈ ఈవెంట్ కి వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తో పాటు బుచ్చి బాబు గోపిచంద్ మలినేని లాంటి ప్రముఖ దర్శకులు కూడా హాజరు అయ్యారు 


 గతం లో జరిగిన కొన్ని ఈవెంట్స్ లో జరిగిన పలు సంఘటనల నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా పబ్లిక్ ఫంక్షన్ జరగలేదు.   ఏ ఈవెంట్ పర్మిషన్ కూడా ప్రభుత్వం పోలీసులు ఇవ్వడానికి సిద్ధంగా లేని సమయం లో శ్రేయస్ మీడియా వారికి ఎంతో కష్టం మీద పుష్ప 2 ఈవెంట్ చేయడానికి అనుమతి ఇచ్చారు ఈ ఈవెంట్ కోసం 24 గంటల్లో పర్మిషన్ తీసుకొచ్చి ఈవెంట్ చేసారు.ఆదివారం రాత్రి ఈవెంట్ కి పర్మిషన్ రాగానే యుద్ధప్రాతిపదికన సోమవారం నాటికి టీమ్ అంతా వర్క్ చేసి పాసులు ప్రింటింగ్ చేసి కష్టమైనా పరిస్థితుల్లో ఈవెంట్ ని నిర్వహించారు.ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన లేకుండా ఈవెంట్ ని నిర్వహించారు శ్రేయాస్ మీడియా వారిని అభినందించాలి 


సునీల్, ఫహాడ్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్,  ధనుంజయ తదితరులు కీలకపాత్ర పోషిస్తూ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. రేపు ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుందాం

Post a Comment

Previous Post Next Post