Megastar Chiranjeevi Srikanth Odela Movie Announced Through Intense Poster

 మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ ఫిల్మ్ ఇంటెన్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ మెంట్





గొప్ప విజన్ తో స్క్రిప్ట్‌లను ఎంచుకునే అసాధారణ సామర్ధ్యం గల మెగాస్టార్ చిరంజీవి, తన ప్రముఖ కెరీర్‌లో ప్రతిభావంతులు, డెబ్యుటెంట్ ఫిల్మ్ మేకర్స్ తో పనిచేశారు. ప్రామెసింగ్ ఫిల్మ్ మేకర్స్ ని గుర్తించి, వారి ఎదుగుదలకు దోహదపడం మెగాస్టార్ స్పెషాలిటీలో ఒకటి. చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగాస్టార్‌కి వీరాభిమాని అయిన అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్సకత్వంలో చేస్తున్నారు. ఇది ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. తొలి చిత్రం దసరాతో భారీ బ్లాక్‌బస్టర్‌గా ఇచ్చిన దర్శకుడు, భారీ కమర్షియల్ విజయాన్ని సాధించడమే కాకుండా, అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకుని ప్రశంసలు పొందారు. ఈ రోజు అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. శ్రీకాంత్ ఒదెల, మెగాస్టార్ తో తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేపట్టడంతో ఈ కొలాబరేషన్ మరో స్థాయికి చేరింది. నేచురల్ స్టార్ నాని అనానిమస్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


ఈరోజు విడుదలైన అఫీషియల్ పోస్టర్ చిరంజీవి పాత్ర ఇంటెన్స్ తెలియజేస్తూ సినిమా పవర్ ఫుల్ నేచర్ ని ప్రజెంట్ చేస్తోంది. పోస్టర్‌లోని అద్భుతమైన ఎరుపు రంగు థీమ్ కథకు ప్రధానమైన వైలెన్స్ ని సూచిస్తుంది. "He finds his peace in violence," " అనే కోట్ చిరంజీవి పోషించబోయే ఫెరోషియస్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ని తెలియజేస్తోంది. ఈ కోలబారేషన్ హై- ఆక్టేన్, థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది. ఇది చిరంజీవికి మోస్ట్ వైలెంట్ మూవీ కానుంది.


దర్శకుడు శ్రీకాంత్ ఒదెల, నేచురల్ స్టార్ నానితో తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్‌' చిత్రం పూర్తయిన తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.


సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు


తారాగణం: మెగాస్టార్ చిరంజీవి


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

బ్యానర్: SLV సినిమాస్

సమర్పణ: నాని అనానిమస్ ప్రొడక్షన్స్

పీఆర్వో: వంశీ-శేఖర్

Post a Comment

Previous Post Next Post