Aishwarya Gowdaa Making her debut as a heroine with Ye Rojaithe Chushaano Ninnu

 'ఏ రోజైతే చూశానో నిన్ను' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతున్న ప్రముఖ కన్నడ బాలనటి ఐశ్వర్య గౌడ



మహేష్ బాబు, నాగార్జున, రవితేజ వంటి ప్రముఖ కథానాయకులతో ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ఇనావర్స్ సినిమా ఫ్యాక్టరీ మరియు రాస్ర ఎంటర్ టైన్మంట్ సంయుక్తంగా రూపొందిస్తున్నా నూతన చిత్రం 'ఏ రోజైతే చూశానో నిన్ను'. ఈ చిత్రం ద్వారా ఇద్దరు బాల నటులు నూతన నాయకానాయికలు పరిచయమవుతుండటం విశేషం.


స్క్రీన్ ప్లే మరియు విజువల్ ఎఫెక్ట్స్ లో సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఏ రోజైతే చూశానో నిన్ను' చిత్రం ద్వారా చెక్, బుర్రకథ, రంగ రంగ వైభవంగా వంటి సినిమాల్లో చైల్డ్ హీరోగా నటించి మెప్పించిన భరత్ రామ్ హీరోగా పరిచయమవుతున్నాడు. అలాగే ఈ చిత్రం ద్వారా ఒక యువ ప్రతిభావంతురాలను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు.


చార్లీ 777, జాగ్వార్ లాంటి పలు కన్నడ చిత్రాల్లో నటించి బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య గౌడ 'ఏ రోజైతే చూశానో నిన్ను' చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈ విషయాన్ని తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 


ఈ డిసెంబర్ నెలలోనే 'ఏ రోజైతే చూశానో నిన్ను' షూటింగ్ ప్రారంభం కానుంది. భరత్ రామ్, ఐశ్వర్య గౌడ లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Post a Comment

Previous Post Next Post