Ramana Gogula is back with Sankranti ki Vastunnam

 దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, రమణ గోగుల కాంబో ఈజ్ బ్యాక్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఫస్ట్ సింగిల్ త్వరలో రిలీజ్



హీరో వెంకటేష్ , డైరెక్టర్ అనిల్ రావిపూడి మచ్ సెలబ్రేటెడ్ కాంబినేషన్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' 2025లో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. హైలీ సక్సెస్ ఫుల్ కోలబరేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఫ్రెష్ నెరేటివ్ తో అద్భుతంగా ఉంటుందని హామీ ఇస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.


18 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, రమణ గోగుల కాంబో మళ్లీ వస్తోంది. బ్లాక్‌బస్టర్ లక్ష్మి కోసం వెంకటేష్‌తో కలిసి పని చేసిన రమణ గోగుల 'సంక్రాంతికి వస్తున్నాం' ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్ ని అందించారు. ఇది వీడియో ద్వారా రివిల్ చేశారు.


రెగ్యులర్ ప్లేబ్యాక్ సింగర్‌గా కాకుండా పెక్యులర్ వాయిస్‌తో పాట పాడాలని సూచించిన దర్శకుడు అనిల్ రావిపూడి, చాలా పరిశీలన తర్వాత, వారు భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన, భాస్కరభట్ల రాసిన గోదారి గట్టుమీద ట్రాక్‌కి తన వాయిస్ అందించడానికి వెటరన్ రమణ గోగులని ఎంపిక చేశారు. ఈ పాటను త్వరలో విడుదల చేయనున్నారు. రమణ గోగుల ప్రత్యేకమైన వాయిస్‌తో ఇది మూవీకి ఎక్స్ ట్రా మ్యాజిక్‌ను యాడ్ చేయడం ఖాయం.


ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.


తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి

సమర్పణ: దిల్ రాజు

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

నిర్మాత: శిరీష్

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

డీవోపీ: సమీర్ రెడ్డి

ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్

ఎడిటర్: తమ్మిరాజు

కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ

యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్

VFX: నరేంద్ర లోగిసా

పీఆర్వో: వంశీ-శేఖర్

డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా

మార్కెటింగ్: నాని


Post a Comment

Previous Post Next Post