Nabha Natesh is Currently immersed back-to-back Pan-India movies

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్




గ్లామర్ తో పాటు పర్ ఫార్మెన్స్ తో మెప్పించగల హీరోయిన్ నభా నటేష్. ఆమె తన మొదటి సినిమా నుంచే అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇండస్ట్రీలోనూ నభా అట్రాక్టివ్ లుక్స్ తో పాటు మంచి పర్ ఫార్మర్ అనే పేరు తెచ్చుకుంది. ఆమె లేటేస్ట్ గా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ చేస్తోంది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు మూవీలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది.


తాజాగా నభా నటేష్ నాగబంధం అనే పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేసింది. ఈ రోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో నాగబంధం సినిమా ప్రారంభమైంది. అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.అభిషేక్ నామా దర్శకుడు.డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్  షూటింగ్ కు వెళ్లనుంది. నాగబంధం సినిమాతో నభా నటేష్ మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇటీవల డార్లింగ్ మూవీలో ఆమె పర్ ఫార్మెన్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.

 

Post a Comment

Previous Post Next Post