Star Boy Siddhu Jonnalagadda donates 15 lakhs to each Andhra Pradesh and Telangana governments for the flood relief

 వరద బాధితులకు అండగా నిలిచిన సిద్ధు జొన్నలగడ్డ.. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.30 ల‌క్ష‌లు విరాళం



తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన క‌థానాయ‌కుడు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌. హీరోగానే కాకుండా స్క్రీన్ ప్లే రైట‌ర్‌, కో ఎడిట‌ర్‌, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌గా ఆయ‌న త‌నేంటో ప్రూవ్ చేసుకున్నారు. రీసెంట్‌గా టిల్లు స్క్వేర్‌తో ఘ‌న విజ‌యాన్ని సాధించారు. తోటివారికి తోచినంత సాయం చేయ‌టంలో నిజ జీవితంలోనూ ఈయ‌న ముందుంటుంటారు.


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన ఆంద్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లో కొన్ని చోట్ల‌ ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. భీక‌ర‌మైన న‌ష్టం వాటిల్లింది. ప్ర‌భుత్వాలు వారిని త్వ‌రిత గతిన ఆదుకోవ‌టానికి చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెండు తెలుగు రాష్ట్రాల‌కు త‌న‌వంతు సాయం అందించ‌టానికి ముందుకు వ‌చ్చారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.15 ల‌క్ష‌లు, తెలంగాణ రిలీఫ్ ఫండ్‌కు రూ.15 ల‌క్ష‌లు విరాళాన్ని అందించారు.

Post a Comment

Previous Post Next Post