Home » » Marichipokamma Maruvabokammaa Song From Chitti Potti Unveiled

Marichipokamma Maruvabokammaa Song From Chitti Potti Unveiled

 "చిట్టి పొట్టి" నుండి మరిచిపోకమ్మ మరువబోకమ్మ పాట విడుదల !!



భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మ గా ... ఒక అడబిడ్డకి పుట్టింటి పైన ఉన్న ప్రేమ, మమకారం ను తెలిపే చిత్రం.  ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది.


చిట్టి పొట్టి టైటిల్ , మరియు మోషన్ పోస్టర్ కు చక్కటి ఆదరణ లభించింది, అలాగే ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర గ్లిమ్స్ కు విశేష ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో గ్లిమ్స్ లోని డైలాగ్స్ వైరల్ అవ్వడం విశేషం. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి తెలిపారు.



ఈ సినిమా నుండి మరిచిపోకమ్మ మారువబోకమ్మ పాట విడుదలయ్యింది... ఈ సాంగ్ కు శ్రీ వెంకట్ మంచి ట్యూన్ ఇచ్చారు, దర్శక..నిర్మాత...భాస్కర్ యాదవ్  దాసరి ఈ సాంగ్ ను రచించారు. మొదటిపాట  చిట్టి పొట్టి సాంగ్ ను నిర్మాత దిల్ రాజు విడుదల చేసారు, అది బాగా పాపులర్ అయ్యింది.  మరిచిపోకమ్మ మారువబోకమ్మ పాట కూడా అంతే ప్రజాధారణ పొందుతోంది. అక్టోబర్ 3న చిట్టి పొట్టి చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. 




నటీనటులు:

రామ్ మిట్టకంటి , పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ


సాంకేతిక నిపుణులు:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి

సంగీతం: శ్రీ వెంకట్

కొరియోగ్రాఫర్: కపిల్ మాస్టర్ ఎడిటర్: బాలకృష్ణ బోయ

కెమెరా: మల్హర్బట్ జోషి

పి.ఆర్.ఓ: లక్ష్మి నివాస్


Share this article :