Home » » "Cheppaleni Allaredho" From "Narudi Brathuku Natana" Released

"Cheppaleni Allaredho" From "Narudi Brathuku Natana" Released

నరుడి బ్రతుకు నటన నుంచి ‘చెప్పలేని అల్లరేదో’ పాట విడుదల



శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ వంటి వారు ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ మూవీని రిషికేశ్వర్ యోగి తెరకెక్కిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ గారు, సుకుమార్ బొరెడ్డి, డా. సింధు రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూఛిబొట్ల గారు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్లు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.


ఈ చిత్రం విడుదలకు ముందే దాదాపు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. కేరళలోని అందమైన  ప్రాంతాల్లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ నుంచి మంచి మెలోడీ పాటను రిలీజ్ చేశారు.


చెప్పలేని అల్లరేదో అంటూ సాగే  ఈ పాటను చిత్రన్ రచించగా.. అనంతు ఆలపించారు. లోపెస్ ఇచ్చిన మెలోడీయస్ ట్యూన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఎంతో వినసొంపుగా ఉన్న ఈ పాట లిరికల్ వీడియో, అందులో చూపించిన విజువల్స్ మరింత హైలెట్ అవుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.


సినిమా వివరాలు:

తారాగణం: శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వీవీఏ రాఘవ్, దయానంద్ రెడ్డి తదితరులు


సాంకేతిక వర్గం

నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డా. సింధూ రెడ్డి

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

రచయిత - ఎడిటర్ - దర్శకుడు: రిషికేశ్వర్ యోగి

కెమెరామెన్ : ఫహద్ అబ్దుల్ మజీద్

సంగీత దర్శకుడు : NYX లోపెజ్

పీఆర్వో : సాయి సతీష్ 


Share this article :