సూపర్‌స్టార్ రజినీకాంత్, లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘వేట్టైయాన్ - ది హంటర్’ నుంచి ‘మనసిలాయో..’ లిరికల్ సాంగ్ రిలీజ్
మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. అంటూ పక్కా మాస్ బీట్‌తో అమ్మాయి పాడే పాట వింటుంటే అందరూ స్టెప్పులేయాలనిపిస్తోంది. ఇంతకీ అంతలా అందరినీ మడత పెట్టేలా వచ్చిందెవరో తెలుసుకోవాలంటే ‘వేట్టైయాన్ - ది హంటర్’ సినిమా చూసేయాల్సిందేనంటున్నారు మేకర్స్. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్ - ది హంటర్’.
‘వేట్టైయాన్ - ది హంటర్’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాలు 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ష్ కలయికలో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్- ది హంటర్’.
పేట, దర్బార్, జైలర్ చిత్రాలకు పుట్ స్టాపింగ్ ట్యూన్ అందించి మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ నాలుగోసారి రజినీకాంత్ వేట్టైయాన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ‘మనసిలాయో..’ అంటూ సాగే ఈ పాట వింటుంటే ఎనర్జిటిక్ బీట్‌తో సాగుతుంది. రజినీకాంత్, మంజు వారియర్ మధ్య వచ్చే పాట అని తెలుస్తుంది. అలాగే ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సైతం స్టెప్పులేస్తూ కనిపించటం విశేషం. సూపర్ స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టు ఆయన అభిమానులు సహా అందరినీ దృష్టిలో పెట్టుకుని అనిరుధ్ మరోసారి తనదైన పంథాలో బాణీలను అందించినట్లు ‘మనసిలాయో..’ అనే పాటను వింటుంటే తెలుస్తోదిసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీనివాస మౌళి రాసిన ఈ పాటను నకష్ అజీజ్, అరుణ్ కౌండిన్య, దీప్తి సురేష్ పాడారు. ఆసక్తికరమైన మరో విషయమేమంటే ఈ పాట తమిళ వెర్షన్ కోసం లెజెండ్రీ ప్లే బ్యాక్ సింగ్ మలేషియా వాసుదేవన్ వాయిస్‌ను ఏఐలోక్రియేట్ చేసి ఇందులో ఉపయోగించటం విశేషం.
రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆడియెన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వటానికి సిద్ధమవుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
తెలుగు రిలీజ్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలవుతున్నాయి.
నటీనటులు:
సూపర్‌స్టార్ రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషరా విజయన్ తదితరులు
నటీనటులు:
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్, సుభాస్కరన్, టి.జె.జ్ఞానవేల్, మ్యూజిక్: అనిరుద్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.కదిర్, ఎడిటర్: ఫిలోమిన్ రాజ్, ప్రొడక్షన్ డిజైన్: కె.కదిర్, యాక్షన్: అన్బరివు, కొరియోగ్రఫీ: దినేష్, హెడ్ ఆఫ్ లైకా ప్రొడక్షన్స్: జి.కె.ఎం.తమిళ్ కుమరన్, పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్- ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).