Kiran Abbavaram's KA worldwide Malayalam version release by Dulquer Salmaan's Enterprise Wayfarer films

 యంగ్ హీరో కిరణ్ అబ్బవరం "క" సినిమా మలయాళం థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వేఫరర్ ఫిలింస్




యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ "క" సినిమా అనౌన్స్ మెంట్ నుంచే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ తో పాటు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. "క" సినిమా గురించి వస్తున్న పాజిటివ్ టాక్ ఇతర చిత్ర పరిశ్రమల దృష్టినీ ఆకర్షిస్తోంది.


తాజాగా "క" సినిమా సినిమా మలయాళ థియేట్రికల్ రైట్స్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది. మలయాళంలో "క" సినిమాను వరల్డ్ వైడ్ గా ఈ సంస్థ థియేట్రికల్ రిలీజ్ చేయనుంది. "క" సినిమా ఫస్ట్ లుక్, టీజర్ చూసిన దుల్కర్ సల్మాన్ ఇంప్రెస్ అయి మలయాళ వెర్షన్ తమ వేఫరర్ ఫిలింస్ సంస్థలో విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. స్ట్రాంగ్ కంటెంట్ తో "క" సినిమా ఈ క్రేజ్ ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రైట్స్ ను నిర్మాత వంశీ నందిపాటి తీసుకున్నారు. ఇదే క్రమంలో త్వరలోనే తమిళ, కన్నడతో పాటు ఇతర భాషల బిజినెస్ క్లోజ్ కానుంది.


"క" సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.



నటీనటులు - కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు


టెక్నికల్ టీమ్

ఎడిటర్ - శ్రీ వరప్రసాద్

డీవోపీస్ - విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం

మ్యూజిక్ - సామ్ సీఎస్

ప్రొడక్షన్ డిజైనర్ - సుధీర్ మాచర్ల

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - చవాన్

క్రియేటివ్ ప్రొడ్యూసర్ - రితికేష్ గోరక్

లైన్ ప్రొడ్యూసర్ - కేఎల్ మదన్

సీయీవో - రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)

కాస్ట్యూమ్స్ - అనూష పుంజ్ల

మేకప్ - కొవ్వాడ రామకృష్ణ

ఫైట్స్ - రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్

కొరియోగ్రఫీ - పొలాకి విజయ్

వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్

వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - ఫణిరాజా కస్తూరి

కో ప్రొడ్యూసర్స్ - చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి

ప్రొడ్యూసర్ - చింతా గోపాలకృష్ణ రెడ్డి

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

రచన దర్శకత్వం - సుజీత్, సందీప్

Post a Comment

Previous Post Next Post