"Janaka Aithe Ganaka" Next single 'Em Papam Chesamo' lyrical video Released

 సుహాస్‌, దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ ‘జనక అయితే గనక’ నుంచి ‘ఏం పాపం చేశామో’ లిరికల్ సాంగ్ రిలీజ్‌



వెర్సటైల్ యాక్ట‌ర్ సుహాస్‌, సంగీర్త‌న హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై  హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్‌ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఈ సినిమా  ద‌స‌రా సంద‌ర్భంగా ‘జనక అయితే గనక’ అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానుంది. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌లు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.


తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మంచి వినోదాన్ని ఇచ్చే పాటను రిలీజ్ చేశారు. మిడిల్ క్లాస్ ఉద్యోగి, మేనేజర్‌తో పడే తంటాలు, చాలీచాలని జీతాలతో ఉండే ఉద్యోగి కష్టాల్ని ఎంతో ఫన్నీగా చూపించారు. ‘ఏం పాపం చేశామో’ అంటూ సాగే ఈ పాటను కృష్ణ కాంత్ రచించగా.. రితేష్ జి. రావు ఆలపించారు. విజయ్ బుల్గానిన్ బాణీ ఎంతో ఫన్నీగా ఉంది. ఇక ఇందులోని ర్యాప్‌ను రితేష్ జి. రావు రాశారు.


రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో సినిమా నుంచి మరింత ప్రమోషన్ కంటెంట్‌ను వదిలేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post