Director VN Aditya and Producer Dr. Meenakshi Anipindi Unveil Birthday Special Poster for Catherine Tresa

 డైరెక్టర్ వీఎన్ ఆదిత్య, ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ మూవీ నుంచి బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్



టాలీవుడ్ కు పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ సమర్పణ  లో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు కేథరీన్ ట్రెసా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కేథరీన్ ట్రెసా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.


ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో స్ట్రాంగ్ కంటెంట్ తో ఈ సినిమాను దర్శకుడు వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎంతోమంది దేశ, విదేశాల కొత్త నటీనటులకు అవకాశం కల్పిస్తున్నారు. అమెరికన్స్‌, స్పానిష్‌ పీపుల్‌, ఆఫ్రికన్స్‌, యూరోపియన్స్‌, ఏషియన్స్‌, తమిళ్‌, కన్నడ, తెలుగు ఆర్టిస్టులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను యూఎస్ లోని డల్లాస్‌లో చిత్రీకరిస్తారు. త్వరలో ఈ థ్రిల్లర్ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.



నటీనటులు - కేథరీన్ ట్రెసా, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ - ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్

సమర్పణ - ఏయు & ఐ

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

నిర్మాత - డాక్టర్ మీనాక్షి అనిపిండి

రచన - పద్మావతి మల్లాది

స్క్రీన్ ప్లే, దర్శకత్వం - డాక్టర్ వీఎన్ ఆదిత్య

Post a Comment

Previous Post Next Post