Akshay Kumar From Team Kannappa Pre-look Unleashed

‘కన్నప్ప’ నుంచి అక్షయ్ కుమార్‌ బర్త్ డే స్పెషల్‌గా ప్రీ లుక్ పోస్టర్


బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 9) సందర్భంగా కన్నప్ప టీం స్పెషల్‌గా సర్ ప్రైజ్ చేసింది. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

అక్షయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని.. అక్షయ్ కుమార్ పోషించిన శివుని పాత్రకి సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్ చేశారు. రుద్రాక్ష మాలతో అలంకరించబడిన చేతిని చూపించారు. ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడు.. భక్తికి మాత్రం దాసుడు అంటూ శివుని తత్త్వం గురించి చెప్పే డైలాగ్ పోస్టర్ మీద పెట్టారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం ఉంది. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు తిన్నడు పాత్రతో వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.డిసెంబర్‌లో ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే.

Post a Comment

Previous Post Next Post