Team Sekhar Kammula’s Kubera Extends Birthday Wishes To Nagarjuna With A Stylish New Poster

 స్టైలిష్ న్యూ పోస్టర్‌తో నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శేఖర్ కమ్ముల కుబేర టీమ్ 



సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్-అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ కుబేర. లీడ్ రోల్స్ తో సహా రష్మిక మందన్న పాత్రని పరిచయం చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.


పోస్టర్‌లో నాగార్జున న్యూ లుక్‌లో, స్టైలిష్ గా ఎదురుగా ఉన్నవారికి ఆప్యాయంగా పలకరిస్తూ కనిపించారు. అతని చిరునవ్వు ఎప్పిరియన్స్ కి ఎలిగెన్స్ ని యాడ్ చేసింది. 


హై బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.


శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న కుబేర, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మల్టిలింగ్వెల్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.


Post a Comment

Previous Post Next Post