Cult blockbuster Baby bagged 5 awards out of 8 Nominationsat the 69th Filmfare Awards

ఐదు అవార్డ్స్ తో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో సత్తా చాటిన కల్ట్ బ్లాక్ బస్టర్ "బేబి"



ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి మరో హిస్టారిక్ ఫీట్ చేసింది. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. 8 నామినేషన్స్ లో 5 అవార్డ్స్ గెల్చుకుంది బేబి.

బేబి సినిమాలో  ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చిన వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్ గా, క్లాసిక్ ఇమేజ్ తో పాటు కమర్షియల్ సక్సెస్ సాధించి 100 కోట్ల గ్రాసర్ గా నిలిచినందుకు బెస్ట్ ఫిల్మ్ గా, తన మ్యూజిక్ తో బేబికి ప్రాణం పోసిన విజయ్ బుల్గానిన్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా, ఓ రెండు మేఘాలిలా పాటతో టైటిల్స్ నుంచే సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేసేలా సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరామ్ కు బెస్ట్ లిరిసిస్ట్ గా, ఈ పాట అందంగా పాడిన శ్రీరామ చంద్ర బెస్ట్ సింగర్ గా అవార్డ్స్ దక్కాయి.

బేబి సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కుతున్నాయంటే ఆ ఘనత ఈ ప్రేమ కథను హృద్యంగా తెరపై ఆవిష్కరించిన డైరెక్టర్ సాయి రాజేష్ కే దక్కుతుంది. ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్, డైరెక్టర్ సాయి రాజేష్ కాంబినేషన్ లో బాలీవుడ్ లో బేబి సినిమా రీమేక్ కు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి.

 

Post a Comment

Previous Post Next Post