AAY Movie Censor Formalities Completed

జీఏ 2 పిక్చ‌ర్స్‌, బ‌న్నీవాస్‌, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్‌, అంజి కె మ‌ణిపుత్ర కాంబోలో రూపొందిన ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆయ్’ సెన్సార్ పూర్తి



విజ‌యవంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నుంచి రాబోతున లేటెస్ట్ మూవీ ‘ఆయ్’. మ్యాడ్ చిత్రంతో మెప్పించిన డైనమిక్ యంగ్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


‘ఆయ్’ సినిమా ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన ప్ర‌మోష‌న్స్‌తో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాట‌లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, రీల్స్‌, షార్ట్స్ అన్నీ ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొందాయి. సినిమాపై మంచి అంచనాలు ఏర్ప‌డ్డాయి. గోదావ‌రి జిల్లా బ్యాక్ డ్రాప్, అక్క‌డున్న ప్రెండ్స్‌కు సంబంధించిన క‌థ‌తో ఫ‌న్నీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన చిత్ర‌మిది. 


తాజాగా ‘ఆయ్’ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంట‌ల 21 నిమిషాలుగా ర‌న్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఔట్ అండ్ ఔట్ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం అల‌రించ‌నుంది. కుటుంబంలోని భావోద్వేగాలు, స్నేహం, కామెడీ, రొమాన్స్‌తో పాటు చ‌క్క‌టి ట్విస్టుతో సినిమాను తెర‌కెక్కించారు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతోంది. 


ఆగ‌స్ట్ 15న ఆయ్ చిత్రం పెయిర్ ప్రీమియ‌ర్స్‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ  సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.  


GA2 పిక్చర్స్:


 ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.

 

నటీనటులు:  


నార్నే నితిన్, నయన్ సారిక, అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు

 

సాంకేతిక వర్గం:


బ్యానర్ - GA2 పిక్చర్స్, సమర్పణ - అల్లు అరవింద్, నిర్మాతలు - బన్నీ వాస్, విద్యా కొప్పినీడి, డైరెక్టర్ - అంజి కె.మ‌ణిపుత్ర‌, సహ నిర్మాతలు - భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, సినిమాటోగ్రఫీ - సమీర్ కళ్యాణి, సంగీతం - రామ్ మిర్యాల, ఎడిటర్ - కోదాటి పవన్ కళ్యాణ్, ఆర్ట్ డైరెక్టర్ - కిరణ్ కుమార్ మన్నె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అజయ్ గద్దె, కాస్ట్యూమ్స్ - సుష్మిత, శిల్ప, కో డైరెక్టర్ - రామ నరేష్ నున్న, పి.ఆర్.ఒ - వంశీ కాకా, మార్కెటింగ్ - విష్ణు తేజ్ పుట్ట, పోస్టర్స్ - అనిల్, భాను.



 

Post a Comment

Previous Post Next Post