Home » » Thangalaan Theatrical Trailer releasing on July 10th

Thangalaan Theatrical Trailer releasing on July 10th

స్టూడియో గ్రీన్ ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న చియాన్ విక్రమ్ "తంగలాన్" సినిమా ట్రైలర్ ఈ నెల 10న రిలీజ్చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. "తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. "తంగలాన్" సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.


ఈ రోజు "తంగలాన్" సినిమా ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ నెల 10వ తేదీన "తంగలాన్" ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్  వచ్చింది. "తంగలాన్" సినిమా కోసం విక్రమ్ మారిపోయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. "తంగలాన్" ట్రైలర్ పై కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.


నటీనటులు - చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు


టెక్నికల్ టీమ్


సంగీతం - జీవీ ప్రకాష్ కుమార్

ఆర్ట్ - ఎస్ ఎస్ మూర్తి

ఎడిటింగ్ - ఆర్కే సెల్వ

స్టంట్స్ - స్టన్నర్ సామ్

పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

బ్యానర్స్ - స్టూడియో గ్రీన్

నిర్మాత - కేఈ జ్ఞానవేల్ రాజా

దర్శకత్వం - పా రంజిత్ 


Share this article :