Kiran Abbavaram's Next, A Periodic Thriller Titled as "KA

హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రానికి "క" టైటిల్ అనౌన్స్ మెంట్



యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రోజు ఈ సినిమాకు "క" అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ అనౌన్స్ చేశారు. టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం మేకోవర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు.

దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో "క" సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. కిరణ్ అబ్బవరం కొంత విరామం తర్వాత చేస్తున్న "క" సినిమా అనౌన్స్ మెంట్ నుంచే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.


నటీనటులు : కిరణ్ అబ్బవరం

టెక్నికల్ టీమ్

ఆర్ట్ - సుధీర్ మాచర్ల

సినిమాటోగ్రఫీ - విశ్వాస్ డానియేల్

మ్యూజిక్ - సామ్ సీఎస్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

బ్యానర్ - శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్

నిర్మాత - చింతా గోపాలకృష్ణ రెడ్డి

దర్శకత్వం - సుజీత్, సందీప్

 

Post a Comment

Previous Post Next Post