Kiccha Sudeep MAX team unveils its banger teaser

 కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ‘మాక్స్’ టీజర్.. అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్



కన్నడ స్టార్ హీరో, అభినయ చక్రవర్తి బాద్‌షా కిచ్చా సుదీప్ నటించిన ‘మాక్స్’ టీజర్‌ను మంగళవారం (జూలై 16) నాడు విడుదల చేశారు. యాక్షన్ జానర్‌ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ మాక్స్ టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.


మాక్స్ పాన్-ఇండియన్ సినిమాగా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాక్స్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కిచ్చా సుదీప్ చాలా కాలం తరువాత మళ్లీ మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. టీజర్‌లో అతని డెమి-గాడ్ లుక్ అభిమానులకు ఐ ఫీస్ట్‌లా ఉంది. మాస్, యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకునేలా సినిమాను తీయబోతోన్నారని టీజర్ చూస్తేనే తెలుస్తోంది.


విజయ్ కార్తికేయ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, ప్రమోద్ శెట్టి తదతరులు నటించారు. అజనీష్ లోక్‌నాథ్ చిత్రానికి సంగీతం అందించారు. వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్ థాను, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌పై కిచ్చా సుదీప్ ఈ చిత్రాన్ని నిర్మించారు.



Post a Comment

Previous Post Next Post