Karunada Chakravarthi Shiva Rajkumar Comes On Board For Global Star Ram Charan RC16

 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చి బాబు సాన, ఏఆర్ రెహమాన్, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పాన్ ఇండియా ఫిల్మ్ #RC16-వెరీ పవర్ ఫుల్ రోల్ లో కరుణాడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్



RRR  గ్లోబల్ సక్సెస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ తెచ్చింది. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన సెన్సేషనల్ బుచ్చిబాబు సానాతో కలిసి తన 16వ సినిమా చేయనున్నారు రామ్ చరణ్. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సగర్వ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై మెగా-బడ్జెట్, హై-క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్‌ వాల్యూస్ తో రూపొందే ఈ మోస్ట్ ఎవెయిటింగ్ ప్రాజెక్ట్ #RC16తో వెంకట సతీష్ కిలారు గ్రాండ్‌గా ఫిల్మ్ ప్రొడక్షన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.


  ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. తాజగా టీమ్ RC16 తెలుగు సినిమాకి కరుణాడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ ఎరైవల్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది. కన్నడ సూపర్ స్టార్ ఈ చిత్రంలో వెరీ పవర్ ఫుల్ రోల్ పోషించడానికి సైన్ చేశారు. ఈ న్యూస్ ని ఈ రోజు శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు ప్రత్యేక సందర్భంగా అనౌన్స్ చేసహ్రు. ఈ న్యూస్ తో ఇద్దరు స్టార్స్ అభిమానులు ఆనందంగా వున్నారు. ఇద్దరు సూపర్‌స్టార్‌లను కలిసి తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ మ్యాసీవ్ మూవీకి అకాడమీ-అవార్డ్-విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ రత్నవేలు డీవోపీ కాగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్.


ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.  


నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన

సమర్పణ : మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్

బ్యానర్: వృద్ధి సినిమాస్

నిర్మాత: వెంకట సతీష్ కిలారు

సంగీతం: ఏఆర్ రెహమాన్

డీవోపీ: ఆర్ రత్నవేలు

ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా

మార్కెటింగ్: ఫస్ట్ షో


Post a Comment

Previous Post Next Post