Double Ismart 2nd Single Maar Muntha Chod Chinta Unveiled On July 16th

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్, సంజయ్ దత్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ 'డబుల్ ఇస్మార్ట్' సెకండ్ సింగిల్ మార్ ముంత చోడ్ చింత జూలై 16న రిలీజ్ 



ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ మ్యూజిక్ ప్రమోషన్‌లు బ్లాక్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ సెన్సేషనల్ హిట్‌గా మారింది. మేకర్స్ ఇప్పుడు మూవీ సెకండ్ సింగిల్-మార్ ముంత చోడ్ చింత అప్‌డేట్‌ ఇచ్చారు. 


మార్ ముంత చోడ్ చింత అనేది ఈ సిరిస్ లో హీరో పాపులర్ డైలాగ్. పోస్టర్ సూచించినట్లు ఈ పాట మాస్ బ్లాస్ట్‌ను అందించబోతోంది. రామ్ రెండు బాటిళ్ల కల్లును ఆస్వాదిస్తూ కనిపించారు. సెట్ వైబ్రెంట్ గా కనిపిస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.


పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా కనిపించనుంది.


ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని గియాన్నెలి సినిమాటోగ్రఫీ అందించారు. 'డబుల్ ఇస్మార్ట్' ఆగస్ట్ 15న గ్రాండ్ గా విడుదల కానుంది.

 

Post a Comment

Previous Post Next Post