Anna Konidela Receives Masters Degree from Singapore University

సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టా పొందిన శ్రీమతి అనా కొణిదెల గారు



రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. శ్రీమతి అనా గారికి ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో పట్టా స్వీకరించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్) లో ఆమె ఈ మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ పట్టా పొందినందుకు సతీమణికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలిపారు. 

శ్రీమతి అనా కొణిదెల గారు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదివారు. అక్కడ ఓరియంటల్ స్టడీస్ లో హానర్స్ పట్టా పొందారు. ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై అధ్యయనానికిగాను తొలుత  డిగ్రీ పొందారు. ఆ అధ్యయనంలో థాయిలాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్ గా ఉంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో ఉండగానే మూడు భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్‌లో శ్రీమతి అనా గారు మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు.

Post a Comment

Previous Post Next Post