Vijay Antony's Poetic Action Film "Toofan" First Single 'Toofan La' Released

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ "తుఫాన్" ఫస్ట్ సింగిల్ 'తుఫాన్ లా' రిలీజ్




వైవిధ్యమైన చిత్రాలతో సౌత్  ఆడియెన్స్ కు దగ్గరైన హీరో విజయ్ ఆంటోనీ "తుఫాన్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్  లో "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. "తుఫాన్" సినిమాను త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. ఈ రోజు "తుఫాన్" ఫస్ట్ సింగిల్ 'తుఫాన్ లా' రిలీజ్ చేశారు.


'తుఫాన్ లా' పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించారు. హైమత్ మహమ్మద్ పాడారు. విజయ్ ఆంటోనీ, అచ్చు రాజమణి సంగీతాన్ని అందించారు. ' ఈ వాన నీలో ఈ క్షణం ఓ హోరై కురిసెనా.. పదే పదే ఆవేదనే నిన్నే వేధించెనా...నువ్వు నువ్వుగానే ఉన్న నీలో ఏదో యుద్ధమా..మాటలాడకున్న గుండెలోన ఇంత శబ్దమా..ఈ నిప్పు వానలే మరింత రాలేనురా, ఆ నొప్పె రేగుతూ ప్రళయాన్ని దాటేనురా, నిన్ను కాల్చుతున్న జ్వాలలన్నీ ఆర్పివేసి రా, తుఫానులా..' అంటూ సాగుతుందీ పాట. హీరో క్యారెక్టరైజేషన్ లోని సంఘర్షణను వివరిస్తూ ఈ పాటను రూపకల్పన చేశారు.



నటీనటులు - విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు


టెక్నికల్ టీమ్


కాస్ట్యూమ్స్ - షిమోనా స్టాలిన్

డిజైనర్ - తండోరా చంద్రు

యాక్షన్ కొరియోగ్రాఫర్ - సుప్రీమ్ సుందర్

ఆర్ట్ డైరెక్టర్ - అరుముగస్వామి

ఎడిటింగ్ - ప్రవీణ్ కేఎల్

మ్యూజిక్ - అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ

డైలాగ్ రైటర్ - భాష్య శ్రీ

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

నిర్మాతలు - కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా

రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ - విజయ్ మిల్టన్ 

Post a Comment

Previous Post Next Post