ETV Win Announces Exciting New Original Starring Shanmukh Jaswanth

 షణ్ముఖ్ జస్వంత్ తో ఎక్సయిటింగ్ న్యూ ఒరిజినల్‌ని అనౌన్స్ చేసిన ETV విన్



ట్రెమండస్ సక్సెస్ ని కొనసాగిస్తూ ETV విన్ హై-క్యాలిటీ కంటెంట్ రిచ్ ఒరిజినల్ కంటెంట్‌ను రూపొందిస్తోంది. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్లాట్‌ఫారమ్ తన నెక్స్ట్ ఒరిజినల్ ని అనౌన్స్ చేసింది.  


ఈ న్యూ ప్రాజెక్ట్ ఆడియన్స్ కు ఎంగేజింగ్ ఎంటర్ టైన్మెంట్ ఎక్స్ పీరియన్స్ అందజేస్తుందని ప్రామిస్ చేస్తుంది. యునిక్ స్టొరీ లైన్, షణ్ముఖ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఈ ప్రాజెక్ట్ ఒరిజినల్ కంటెంట్ ETV విన్ లైనప్‌కు ఒక అద్భుతమైన యాడ్ అన్ గా మారడానికి సిద్ధంగా ఉంది. షణ్ముఖ్ కు జోడిగా మలయాళీ హీరోయిన్ అనఘా అజిత్ నటిస్తోంది.


ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. నటీనటులు, టీమ్ మెంబర్స్, పరిశ్రమలోని సన్నిహితులు లాంచింగ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.


వివేక్ ఆత్రేయ స్క్రిప్ట్ హ్యాండోవర్ చేయగా, ప్రవీణ్ కాండ్రేగుల క్లాప్ ఇచ్చారు, బెక్కెం వేణుగోపాల్  కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్ కు సుబ్బు కె, అవినాష్ వర్మ గౌరవ దర్శకత్వం వహించారు.


నటీనటులు: షణ్ముఖ్ జస్వంత్, అనఘ అజిత్, ఆమని, ఆర్జే శరణ్


క్రూ డీటెయిల్స్ :

దర్శకత్వం: పవన్ సుంకర

నిర్మాత: శ్రీధర్ మారిసా

బ్యానర్: శ్రీ అక్కియన్ ఆర్ట్స్

షో రన్నర్: భరత్ నరేన్

ప్రొడక్షన్ డిజైన్: మిధునాస్ కల్చర్

ఎడిటర్: నరేష్ అడుప

సంగీతం: కృష్ణ చేతన్

డివోపీ: అనూష్ కుమార్

కాస్ట్యూమ్ డిజైన్: ప్రియాంక సూరంపూడి

లిరిక్స్: సురేష్ బనిశెట్టి

Post a Comment

Previous Post Next Post