Speed 220 Censor Completed

 సెన్సార్ పూర్తి చేసుకున్న స్పీడ్220 చిత్రం.. త్వరలో రిలీజ్ డేట్



విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి కొండమూరి సమర్పణలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ స్పీడ్220. ఈ చిత్రానికి హర్ష బెజగం కథ-కథనం-దర్శకత్వం అందించారు. హేమంత్, గణేష్ ఇద్దరు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ సాంగ్ విడుదల అయింది. టాలీవుడ్ టాప్ సింగర్ గీతామాధురి ఆలపించిన ఈ పాటకు ప్రముఖ డాన్సర్ స్నేహ గుప్తా స్టెప్డ్ వేసింది. బెజవాడలో బాలా కుమారి అనే స్పెషల్ సాంగ్ యూట్యూబ్ లో ఎంత సంచలనమైన విజయం సాధించిందో మనకు తెలుసు. ఈ స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాను ఊపియడంతో ఈ చిత్రంపై యావత్ సినిమా ప్రేక్షకులకు మంచి అభిప్రాయం ఏర్పడింది.


దీంతో స్పీడ్ 220 చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది, దీనికి సంబంధించిన అప్డేట్ కోసం మూవీ లవర్స్ ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తున్నారు. వారందరి కోసం చిత్ర యూనిట్ తాజాగా అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న స్పీడ్ 220 చిత్రం తాజాగా సెన్సార్ సైతం కంప్లీట్ చేసుకోందని మేకర్స్ వెల్లడించారు. సెన్సార్ సభ్యుల చేత మంచి ప్రశంసలు అందుకుందని.. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. 


స్పీడ్ 220 చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా అన్ని హంగులతో తీర్చిదిద్దినట్లు మేకర్స్ తెలిపారు. చిత్రం నిర్మాణంలో ఎక్కడా తగ్గకుండా.. ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా చిత్ర నిర్మాతలు సినిమాను గ్రాండ్ గా రూపొందించారు. స్పీడ్ 220 చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రేక్షకులకు అతిత్వరలో ప్రకటించడానికి చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు.


చిత్రం: స్పీడ్220

నిర్మాత: ఫణి కొండమూరి, మందపల్లి బ్రదర్స్ & దుర్గ 

హీరోలు: హేమంత్, గణేష్

హీరోయిన్స్: ప్రీతీ సుందర్, జాహ్నవి శర్మ

డ్యాన్సర్: స్నేహ గుప్తా

కొరియోగ్రాఫర్ : అషేర్ మామిడి

మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ మోపూరి

సింగర్ : గీతమాధురి

డీఓపీ : క్రాంతి కుమార్ కొణిదెన

పీఆర్ఓ : హరీష్, దినేష్

కథ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్ : హర్ష బెజగం

Post a Comment

Previous Post Next Post