New Swift Car Launched by Sonia Singh in Pavan Motors Serilingampally

 శేరిలింగంపల్లి లోని పవన్ మోటార్స్‌ లో సరి కొత్త ది ఎపిక్ న్యూ స్విఫ్ట్ కార్ ను ప్రారంభించిన సినీనటి సోనియా సింగ్



హైదరాబాద్: శేరిలింగంపల్లి లోని పవన్ మోటార్స్‌ షోరూమ్‌లో మారుతి యెక్క సరికొత్త స్విఫ్ట్‌ కారును సినీనటి సోనియా సింగ్ చేతుల మీదుగా మరియు మారుతి సుజుకి రీజినల్ మేనేజర్ బిక్రమ్ సటాపతి, పవన్ మోటార్స్ ఎమ్.డి చంద్ర పవన్ రెడ్డి కలిసి మార్కెట్లోకి విడుదల చేశారు.


ఈ సందర్భంగా సినీనటి సోనియా సింగ్ మీడియాతో మాట్లాడుతూ మారుతి కార్లు బెస్ట్‌ మేంటనెన్స్‌ ఫ్రీ కార్లని,ఎక్కువ మైలేజ్‌ను కూడా ఇస్తాయని,తనకు మారుతీ కార్లంటె ఇష్టమని తెలిపారు.



పవన్ మోటార్స్ మానేజింగ్‌ డైరెక్టర్ చంద్ర పవన్ మాట్లాడుతూ.. ఇక్కడ  శేరిలింగంపల్లి లోని మా పవన్ మోటార్స్ షోరూమ్‌లో ఈ కొత్త స్విఫ్ట్‌ని మార్కెట్లోకి విడుదల చేయడం సంతోషంగా ఉందని,కొత్త స్విఫ్ట్‌ ఇప్పుడు మరింత సేఫ్టీతో వచ్చిందని,ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్‌ స్టాండర్డ్‌గా అందిస్తున్నారని,మైలేజ్‌లో కూడా దిబెస్ట్‌ అని..మానువల్ ట్రాన్స్‌మిషన్‌లో 24.8 kmpl , AMTలో ఏకంగా 25.75 kmpl మైలేజ్‌ దొరుకుతుందని మీడియాకు తెలిపారు.ఇంకా ఇందులో హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌,ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం,రివర్స్‌ కెమెరా పార్కింగ్,ఎ.బి.ఎస్‌ విత్‌ ఈ.బీ.డీ లాంటి ఎడ్వాన్స్‌ ఫీచర్స్‌నిచ్చారు.6 సింగిల్‌ టోన్ మరియు 3 డ్యుయల్‌టోన్‌ కలర్స్‌లతో..మెత్తం 9 వారియంట్స్‌లలో ఇది అందుబాటులో ఉంది.పెట్రోల్‌లో మాత్రమే అందుబాటులో ఉండే కొత్త స్విఫ్ట్‌లో 1197సీసీ నిచ్చారు.దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర 6,49,000. ఇంకా ఈ కార్యక్రమంలో పవన్ మోటార్స్ బిసినెస్ హెడ్ రవి రెడ్డి,షోరూమ్‌ సిబ్బంది మరియు కస్టమర్లు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post